⭐అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తా: సీఎం రేవంత్

తెలంగాణ : హైడ్రా పునరుద్ధరించిన కూకట్‌పల్లి నల్ల చెరువును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎంగా మీ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. నాడు ఎంపీగా కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నా నిధులు లేక చేయలేకపోయాని, ఇప్పుడు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాని తెలిపారు.చెరువుల పునరుద్ధరణ వల్ల పేదలకు నష్టం కలిగి ఉండవచ్చన్నారు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలు ఉంటే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.
👉పోలీస్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ …
తెలంగాణ : పోలీస్ వ్యవస్థను కాలానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కోసం 25 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
👉 పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ …
తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో AI వినియోగాన్ని పరిశీలించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
⭐లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్: కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు*
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం 2026, మార్చి 16కు విచారణను వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం (మార్చి 9) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రయల్ తీర్పు ఉందని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో స్పెషల్ కోర్టు పొరబడిందని తెలిపారు.
మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను చూడకుండా, విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. సీబీఐపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది.
ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఈడీ కేసులో విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అలాగే.. కేజ్రీవాల్, కవిత సహా 23 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం 2026, మార్చి 16కు విచారణను వాయిదా వేసింది….
👉ఏపీలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం*
ఏపీలో ఏప్రిల్ నెల నుంచి సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, అలాగే మార్చి నెలలో కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత మొదట మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత కొంత వ్యవధి ఇచ్చి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు సమాచారం.
👉రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి..
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు …గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాలు బతికేవారు, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు..అసలు సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారో అర్థం కావడంలేదు..అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించి, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని అడుగుతా –కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
👉 ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల లో ఏసీబీ అధికారులు దాడులు…గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కృష్ణ మోహన్ రావు ఇంట్లో అధికారులు, బంధువులు ఇళ్ళల్లో ఏకకాలంలో సోదాలు..పలు రికార్డులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ…ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో కృష్ణ మోహన్ రావుపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు
ఈ క్రమంలో చీరాలలోని ఆయనకు చెందిన ఇంటిని అధికారులు జల్లెడపట్టిన వైనం…అయితే అధికారి కృష్ణ మోహన్ రావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది..
👉నెల్లూరు జిల్లా, ముత్తుకూరు CI, SI లపై సస్పెన్షన్ వేటు… విధుల్లో అలసత్వం వహించిన కారణంగా సీఐ రవి నాయక్,ఎస్ ఐ ప్రసాద్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసిన, గుంటూరు రేంజి IG సర్వ శ్రేష్ఠి త్రిపాటి…ఫోక్సో కేసులో పర్యవేక్షణ,నిందితుడు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సస్పెన్షన్ వేటు విధించినట్లు సమాచారం….
👉విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి!*ప్రైవేట్ వ్యక్తులు విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు…
మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇవ్వగా, మేఘన ఫుడ్స్ గుజరాత్‌లోని కన్హాన్ డెయిరీ నుండి నెయ్యిని సేకరించి తెలంగాణలో విక్రయిస్తున్నారని.. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక ఇచ్చిందని తెలిపిన గుత్తా అమిత్ రెడ్డి…
విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ మార్కెట్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని అంచనా..తెలంగాణ విజయ డెయిరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని మండిపడ్డ చైర్మన్…
దీని బదులుగా APDDCFకు కేవలం చిన్న రాయల్టీ అంటే లీటర్ పాలు అమ్మకాలపై ఫెడరేషన్‌కు రూ.1 మాత్రమే వస్తుందని.. రైతులకు, కో-ఆపరేటివ్స్‌కు పెద్దగా లాభం లేదు..దీని వల్ల తెలంగాణ, ఏపీ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని తెలిపిన చైర్మన్
డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని, ఈ విషయమై ఏపీ డెయిరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేసిన అమిత్ రెడ్డి.
👉డబ్బు కోసం ఎంత కు తెగించింనాదో….
ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం…కట్టుకున్న భర్తను సైతం లేపేసిన లేపేసిన శాడిస్ట్ భార్య!*తెలంగాణ
ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన భార్య అతడి పేరుపై రూ.66 లక్షలకు బీమా చేయించింది.
ఆ తర్వాత ఆ డబ్బుల కోసం భర్తను దారుణంగా చంపించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రవి మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి భార్య ప్రశాంతి.. భర్త ఎలాగూ చనిపోతాడనే ఆలోచనతో ఓ పథకం వేసింది. గత ఏడాది జులైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరు మీద రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.
అయితే, నెలలు గడుస్తున్న కొద్దీ రవి ఆరోగ్యం మెరుగుపడటంతో ప్రశాంతిలో అసహనం పెరిగింది. బీమా డబ్బుల కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేస్తే వచ్చే బీమా డబ్బులో సగం ఇస్తానని వారికి ఆశ చూపింది.
పథకం ప్రకారం ఈ నెల 2వ తేదీన రవికి ఫుల్లుగా మద్యం తాగించి వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనపై అనుమానంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో అసలు నిజాన్ని బయటపెట్టారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ప్రశాంతితో పాటు మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
👉సాంబార్‌పై గొడవ… మహిళ మృతి*
బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది.
బెంగుళూరుకు చెందిన 27 ఏళ్ల కావ్యకు ఐదేళ్ల క్రితం రంగస్వామితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బిడ్డ కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేసిన సాంబార్‌ను ఫ్రిజ్‌లో పెట్టి ప్రతిరోజూ వేడి చేసి పెడుతోందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ విషయం పై ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో బాత్రూమ్‌లోకి వెళ్లి పొలాల కోసం తెచ్చి పెట్టిన పురుగుల మందు తాగింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
👉జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు*
మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరతానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై జగన్ ‘పేటీఎం బ్యాచ్’తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలవక ముందే నెగెటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. “నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని ఆపలేరు” అని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
🚨 కల్తీ గుడ్ల మోసం బట్టబయలు*
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లో వేలాది కల్తీ / నకిలీ గుడ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఈ ఘటన గత సంవత్సరం నవంబర్‌లో జరిగినప్పటికీ, ఇలాంటి ఆహార కల్తీ మోసాలు ఇప్పటికీ దేశంలోని అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం.
* ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి..ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
👉విశాఖ:*విశాఖ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు స్కెచ్*
తూర్పు గోదావరి జిల్లా నుంచి పోర్టుకు తరలిస్తున్న ముఠా…మూడు లారీల్లో 103 టన్నుల రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కు యత్నం…పక్కా సమాచారంతో రంగంలోకి దిగి మూడు లారీలు, రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విశాఖ పౌర సరఫరాల శాఖ అధికారులు
👉రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు*
తెలంగాణ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్‌ఐలు బాబునాయక్, ప్రమోద్ ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటున్న ఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
👉 లంచం తీసుకుంటూ దొరికిపోయిన జీఎస్టీ అధికారులు:
నాసిక్ కు చెందిన వ్యాపారస్తుడు ఒకతనిని 1.25 కోట్ల లంచం డిమాండ్ చేసిన జిఎస్టీ అధికారులు, 20 లక్షలు ముందస్తు సొమ్ముగా అందుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు., వ్యాపారస్తుడు ఏసీబీ కి ఇచ్చిన సమాచారం మేరకు ట్రాప్ వేసి జీఎస్టీ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసారు.,
👉 అలాంటి వీడియోలు ఫోన్లో సేవ్ చేసుకున్నా నేరమే:కర్ణాటక హైకోర్టు*
బెంగళూరు :
చైల్డ్ పోర్నోగ్రఫీ పై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలకవ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు,ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B,పోక్సో యాక్ట్ ని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది.అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది.అశ్లీల వీడియోలను ఫోన్లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది.

