👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తూ అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి హెర్మూజ్ జలసంధి వద్ద ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తూ అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి హెర్మూజ్ జలసంధి వద్ద ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ సైన్యం విధించిన కొత్త నిబంధనలను ధిక్కరించి.. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన థాయ్‌లాండ్‌కు చెందిన ఒక భారీ కార్గో నౌకపై ఇరాన్ నౌకాదళం విరుచుకుపడింది. ఈ దాడిలో నౌక పూర్తిగా పేలిపోయి.. సముద్రం మధ్యలో అగ్నిగుండంగా మారింది. * వివాదానికి అసలు కారణం.. టోల్ ఫీజు పెంపు గత కొంతకాలంగా ఇరాన్ తన ప్రాదేశిక జలాల గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది. ముఖ్యంగా హెర్మూజ్ జలసంధిని దాటే ప్రతి నౌక నుంచి సుమారు 2 మిలియన్ డాలర్ల (దాదాపు ₹16.7 కోట్లు) టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు మూడో వంతు జరుగుతుంది. అయితే ఈ భారీ టోల్ ఫీజును చెల్లించడానికి అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు విముఖత చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఒక కార్గో నౌక ఇరాన్ హెచ్చరికలను లెక్కచేయకుండా టోల్ చెల్లించకుండానే జలసంధిని దాటేందుకు ప్రయత్నించింది. ఇరాన్ రేడార్లలో ఈ విషయం స్పష్టమవడంతో ఆ దేశ నౌకాదళం వెంటనే రంగంలోకి దిగింది. సముద్రం మధ్యలో మంటల బీభత్సం నౌకను ఆపాలని ఇరాన్ సైన్యం పదేపదే హెచ్చరించినప్పటికీ, థాయ్‌లాండ్ నౌక వేగంగా ముందుకు వెళ్లడంతో ఇరాన్ దళాలు క్షిపణులు లేదా భారీ ఫిరంగులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి తీవ్రతకు నౌకలోని ఇంజన్ భాగం భారీగా పేలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే నౌక అంతా మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గాలిలోకి ఎగిసిపడుతున్న నల్లటి పొగ, మంటల ధాటికి నౌక సగానికి పైగా సముద్రంలో మునిగిపోయే స్థితికి చేరుకుంది.
రక్షణ చర్యలు.. గల్లంతైన సిబ్బంది ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు సిబ్బంది సముద్రంలోకి దూకారు. ఆ సమయంలో సమీపంలోనే గస్తీ నిర్వహిస్తున్న ఒమన్ నేవీ అత్యంత వేగంగా స్పందించింది. తమ రక్షణ నౌకలు, హెలికాప్టర్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఒమన్ సైన్యం, మునిగిపోతున్న వారిలో 20 మందిని క్షేమంగా రక్షించగలిగింది. అయితే దురదృష్టవశాత్తు మరో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రక్షించబడిన సిబ్బందికి ఒమన్ తీరప్రాంత ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా ప్రపంచ ఎనర్జీ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. హెర్మూజ్ జలసంధి భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సహా ఐరోపా దేశాలు ఇరాన్ చర్యను తీవ్రంగా ఖండించాయి. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు తన దేశ నౌకపై దాడి జరగడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం అత్యవసరంగా స్పందించింది. ఇరాన్ దౌత్యవేత్తలతో చర్చలు ప్రారంభించిన థాయ్‌లాండ్, భవిష్యత్తులో తమ దేశ నౌకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం థాయ్‌లాండ్ నౌకలకు కొంత రాయితీ లేదా సురక్షిత మార్గాన్ని ఇరాన్ కల్పించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను పెంచుతున్నాయి.ఇరాన్ యొక్క ఈ దూకుడు వైఖరి వల్ల ఇతర దేశాల వాణిజ్య నౌకలు ఇప్పుడు ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జంకుతున్నాయి. రానున్న రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి…
👉*నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*
* ఇరాన్‌తో చర్చలు విఫలమవడంతో.. హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని తాము ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దిగ్బంధనం సోమవారం నుంచే ప్రారంభం అవుతుందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఉదయం 10గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలు) దీన్ని మొదలుపెడతామని పేర్కొంది. ఇరాన్‌కు అక్రమంగా టోల్‌ చెల్లించే నౌకలను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. దిగ్బంధనంలో భాగంగా ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా.. ఇక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలను అడ్డుకోనున్నారు.
👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం…ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పిండు…
ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపారు.
ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మోక్కాల..?
మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి
ప్రభుత్వం ఉందా.. ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది – ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ సమీపంలో జరిగిన అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం మరియు కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు నరసరావుపేట **డీఎస్పీ ఎం. హనుమంతరావు** మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉసర్తి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఇనుప రాడ్డు, బైక్ మరియు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
⭐మృతుడు హరిప్రసాద్ మార్కాపురం బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.నిందితుడైన కోటయ్యకు, హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి మధ్య ఉన్న అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి దారితీసింది. తన భర్త వేధిస్తున్నాడని నాగజ్యోతి చెప్పడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని కోటయ్య పథకం వేశాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు శ్రీనివాసరావు సహాయంతో హరిప్రసాద్‌ను నరసరావుపేటకు పిలిపించి, మద్యం సేవించిన అనంతరం యడవల్లి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి అతి దారుణంగా చంపారు. ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై స్కూటీని నెట్టి నిందితులు పరారయ్యారు.ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును పల్నాడు జిల్లా *ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు,ఎస్ఐ అనిల్ కుమార్ , ఎస్సై లేఖా ప్రియాంక,యడ్లపాడు ఎస్ ఐ టి.శివ రామ కృష్ణ, ఏ ఎస్ ఐ శ్రీనివాస రావు,హెడ్ కానిస్టేబుళ్లు వెంకట రావు, సాంబయ్య నాయక్, దేవ రాజు, కానిస్టేబుళ్లు బోసుబాబు,జాని భాష,రత్న కిషోర్,సుబ్బారావు,నాగేశ్వర రావు జిల్లా యస్.పి.అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించటం జరిగిందని,అదేవిధంగా డీఎస్పీ కూడా అభినందించి రివార్డ్లకు పంపించడం జరిగిందని తెలిపారు.
👉 ఈ నెల 30 వరకూ రేషన్ పంపిణీ!
తెలంగాణ : రాష్ట్రంలో 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరడంతో కొన్ని చోట్ల సర్వర్, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై, తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పెళ్లి పేరుతో రూ.1.5 కోట్ల కట్నం డిమాండ్ చేసి, నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బండారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపులతో బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
హైదరాబాద్‌కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.
మాటలతో నమ్మించి, ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మారు. యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు, తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు. చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం రూ. కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.
అయితే, ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ గదికి పిలిపించిన మధు, ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో అనుమానం వచ్చిన వారు మధు ఉద్యోగం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను FCI ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
👉మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల్, ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బార్లు తిరిగిన జనాలు నెలరోజులైనా గ్యాస్ రావడం లేదు ఇలా ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ప్రజలు గ్యాస్ అధికారులుగా అడుగుతే సర్వర్ డౌన్ అని చెప్తున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగిన గ్యాస్ అధికారులు, అధికారులకు అడుగుతే గ్యాస్ ఏజెన్సీ గోదాంలో తీసుకోమని చెప్తున్నారు బుకింగ్ అయిన 30 డేస్ తర్వాత వస్తుందని చెప్తున్నారు, కొంతమంది స్నానికులతో అడుగుతే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇబ్బంది లేదని చెప్తున్నా ఇక్కడ అధికారులు ప్రజలకు తీర్పుతున్నారు ఇబ్బంది కలిగిస్తున్నారు. నాగోల్ బండ్లగూడ ఉప్పల్ ఇలా ప్రతి ప్రాంతాల్లో ఇదే సమస్య అట …
👉 తాడిపత్రిలో రీల్స్ పిచ్చి.. చివరికి పోలీస్ స్టేషన్ కు. అసలేం జరిగింది..!
తాడిపత్రికి చెందిన కొందరు మైనర్లు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌లపై స్టంట్లు చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి పోలీసులకు చిక్కారు. దీనిపై స్పందించిన సీఐ శివగంగాధర్ రెడ్డి సదరు బైక్‌లను సీజ్ చేసి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు. సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దని తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి హెచ్చరించారు.
👉అన్నమయ్య జిల్లా…బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామాన్ని నిషేధిత జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సదుం మండలంలోని అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె, కంభంవారిపల్లెతో పాటు చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్కేవీబీపేట ఇందిరా కాలనీలోని దేశీ పౌల్ట్రీ ఫారంను వ్యాధిగ్రస్త ప్రాంతాలుగా గుర్తించారు.
ఈ గ్రామాలకు ఒక కిలోమీటరు పరిధిని ఇన్‌ఫెక్టెడ్ జోన్‌గా, 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల నుంచి కోళ్ల రవాణాపై నిషేధం విధించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…