👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్! పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రంగప్రవేశం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది…
ఇరాన్ అధ్యక్షుడితో కీలక భేటీ పరిస్థితులు చేయిదాటిపోతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొరవ తీసుకున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్‌తో పుతిన్ సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులను వారు సమగ్రంగా సమీక్షించారు. యుద్ధం వల్ల ఎవరూ ప్రయోజనం పొందలేరని.. చర్చలే ఏకైక మార్గమని పుతిన్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా మధ్యవర్తిగా వ్యవహరించి, అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి సిద్ధమని పుతిన్ ప్రతిపాదించారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ పెరుగుతున్న సైనిక కదలికల పట్ల ఇద్దరు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ ప్రతిపాదనపై ఇరాన్ అధ్యక్షుడు పెజష్కియాన్ సానుకూలంగా స్పందించారు. చర్చలకు తమ దేశం ఎప్పుడూ సిద్ధమేనని, అయితే తమ సార్వభౌమత్వానికి లేదా భద్రతకు భంగం కలిగితే మాత్రం ఊరుకోబోమని గట్టిగా సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే దాని ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. ఒకవేళ యుద్ధ వాతావరణం నెలకొంటే చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అంతర్జాతీయ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రష్యా వంటి అగ్రరాజ్యం జోక్యం చేసుకోవడం ప్రపంచ దేశాలకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. రష్యాకు ఇప్పటికే ఇరాన్‌తో బలమైన రక్షణ, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే అమెరికాతో కూడా సంక్లిష్టమైనప్పటికీ దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పుతిన్ మధ్యవర్తిత్వం ఇక్కడ కీలకం కానుంది. శాంతి దిశగా అడుగులు పడతాయా? ప్రస్తుతానికి పుతిన్ జోక్యం ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అయితే రష్యా ప్రతిపాదనపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికా తన ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గి ఇరాన్ కూడా కొంత మెత్తబడితేనే ఈ సంక్షోభం సద్దుమణుగుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరగకపోతే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ప్రమాదం ఉందని
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పుతిన్ ఎంట్రీతో పశ్చిమాసియా రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. ఇది శాంతికి దారితీస్తుందో లేక కొత్త కూటముల ఏర్పాటుకు పునాది వేస్తుందో వేచి చూడాలి.
👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… ఒంగోలు నగరంలోని సాయి ITA ఫంక్షన్ హల్ నందు ఆదివారం తీకనం సురేష్ కుమారుల పంచల వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ,ఎ ఎంసి చైర్మన్ వెంకటరావు, PDCC బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య పాల్గొన్నారు.


👉 ఒంగోలు పెళ్లూరు దగ్గరలోని పేస్ కాలేజీలో ఆదివారం జరిగిన PACE FESTINO 2K26 fest కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ రమణ రెడ్డి . పాల్గొన్నారు.
👉రాసలీలలు… లంచాలు వసూళ్లు…..!!!*పదిహేను రోజుల్లో… పరువు మొత్తం పోయా…😱😱😱

*పల్నాడు*:- జిల్లా లో పలువురు పోలిస్ అధికారులు, సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి…జిల్లా లో పదిహేను రోజుల్లో కొందరి సిబ్బంది వల్ల శాఖా పరువు పోతుందని పలువురు పోలిస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేషన్ కు వచ్చిన మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐ పై బదిలీ వేటు పడగా, పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సిఐ సస్పెండ్ అయ్యాడు… బాద్యులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు… ఇవి ముగిసే లోపే ఎ ఎస్ ఐ రాసలీలల వీడియో హాల్ చల్ తో 15 రోజుల్లో పలువురు వల్ల పరువు పోతుందని పలువురు అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*
మాదక ద్రవ్యాల నిర్మూలన,శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు అధ్వర్యంలో ఒంగోలు టు టౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు,కొత్తపట్నం ఎస్సై సుధాకర్ మరియు 7 మంది ఎస్సైలు , 50 మంది పోలీస్ సిబ్బంది కొత్తపట్నంలోని మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పత్రాలు లేని 26 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమానితులను మొబైల్ చెక్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిస అయితే వ్యక్తి ఆర్థికంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి తన చర్యలపై నియంత్రణ కోల్పోయి అనేక అనర్థాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
అలాగే క్రికెట్ ఆన్‌లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్‌లలో పాల్గొని లక్షల రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారని, యువత వీటి నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి మోసాలు చేసే వ్యక్తులు సమాజంలో పెరుగుతున్నారని, అలాంటి వారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా కొత్తపట్నంలోని గంగమ్మ కాలనీ పాలెం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.
👉కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… మార్కాపురం జిల్లా కంభం …

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం కంభం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కంభం గ్రామపంచాయతీ సిబ్బందితోపాటు టిడిపి నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు,కేతం శ్రీనివాసులు,తోట శ్రీనివాసులు, ఓ.మాధవ,డి జిలాని షేక్ రహిమాన్ (స్వీట్స్),షేక్ జీలాని(ఫ్రూట్స్),రవికుమార్,రజాక్ భాష, నలబుల వెంకటేశ్వర్లు,ఉల్లిగడ్డల రహీం తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…