👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కంటే బలప్రదర్శనకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. “ఇరాన్ మా ప్రతిపాదనలకు తలొగ్గకపోతే యుద్ధమే శరణ్యం” అన్న రీతిలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు.. ట్రంప్ అల్టిమేటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ దూకుడును ప్రదర్శిస్తూ ఇరాన్‌కు డెడ్ లైన్ విధించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే బాంబుల వర్షం తప్పదని హెచ్చరించారు. “రేపు సాయంత్రం లోపు మా ప్రతిపాదనలకు అంగీకరించకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తాం” అని స్పష్టం చేయడంతో అగ్రరాజ్యం మరో యుద్ధానికి సిద్ధమవుతోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. Also Read – పతనం అంచునుంచి శాసించే స్థాయికి.. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ గ్రేట్ కంబ్యాక్ స్టోరి! సీజ్‌ఫైర్‌కు స్వస్తి.. క్షిపణులకు సిద్ధం! ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ గడువును పొడిగించే ఆలోచన లేదని ట్రంప్ ఖరాకండిగా చెప్పారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం తనకు ఇష్టం లేదని.. ఒప్పందం కుదరని పక్షంలో సైనిక చర్యే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. “అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంది. మా మిలిటరీ ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. సీజ్‌ఫైర్‌ను పొడిగించే ప్రసక్తే లేదు.” అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. * నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా ట్రంప్ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్, అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెబుతోంది. “బెదిరింపులతో ఒప్పందాలు కుదరవు, గౌరవప్రదమైన చర్చలు మాత్రమే పరిష్కారం చూపుతాయి” అని ఇరాన్ నాయకత్వం ప్రతిస్పందిస్తోంది. అయితే ట్రంప్ ఇచ్చిన 24 గంటల గడువు ముగిస్తే ఏం జరుగుతుందో అన్న భయం గల్ఫ్ దేశాలను పట్టిపీడిస్తోంది. అంతర్జాతీయ ఆందోళనలు.. ఆర్థిక ప్రభావం ఈ ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మొదలైతే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఐరోపా దేశాలు మాత్రం ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. యుద్ధం ఎవరికీ మేలు చేయదని.. సంయమనం పాటించాలని అవి కోరుతున్నాయి. రాబోయే 24 గంటలే కీలకం అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే తమ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకలు, క్షిపణి వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఇరాన్ కూడా తన వైమానిక దాడుల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకుంది. ట్రంప్ హెచ్చరించినట్లుగా రేపు సాయంత్రం లోపు చర్చల్లో పురోగతి లేకపోతే, అగ్రరాజ్యం మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు శ్వాస బిగబట్టి రేపటి గడువు కోసం ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ వ్యూహం ఇరాన్‌ను లొంగదీసుకుంటుందా లేక సుదీర్ఘ యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.
👉మేం ఏంటో చూపిస్తాం: మాజీ ఎమ్మెల్యే వర్మ*
జనసేన నేతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాము ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు.
తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం పిఠాపురంలో పుట్టి పెరిగాం. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు వీళ్లకు లాగా.
టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్‌కు 80 వేల మెజార్జీ ఇచ్చాం.
మేం ఏంటో చూపిస్తాం’ అంటూ వర్మ అన్నారు.
👉షాద్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట*
*నేడు బస్సులు బంద్ – ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు*
*ఆర్టీసీ డిపోలో ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు*
షాద్ నగర్ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. కార్మికులు సమస్యలను ముగించి డిపోలో తెల్లవారుజామునుండే బంద్ పాటించారు. ముందస్తు చర్యగా పోలీసులు డిపోలో మోహరించారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు షాద్ నగర్ లో ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు..
👉వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు.*
వికారాబాద్ జిల్లా, మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఓ-1 బి. సరోజ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ఏఓ-2 హెచ్. రాణి, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌లపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేయబడింది. గతంలో 16-03-2026న, వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ నెం. 13/2026, బీఎన్ఎస్ సెక్షన్ 85, 351 (2) కింద ఫిర్యాదిదారునికి మరియు అతని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడానికి, ఏఓ-1 మరియు ఏఓ-2 రూ.60,000/- లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదిదారుని అభ్యర్థన మేరకు, వారు ఆ లంచాన్ని రూ.40,000/-కు తగ్గించారు. 23.03.2026న, వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఏఓ-1 సమక్షంలో ఫిర్యాదిదారుడు ఏఓ-2కు రూ.20,000/- లంచంగా చెల్లించారు.
ఫిర్యాదుదారుడు డిమాండ్ చేసిన లంచం మొత్తాన్ని సమకూర్చలేకపోయినప్పటికీ, నిందితులైన అధికారులు దానిని డిమాండ్ చేస్తూనే ఉండటంతో, ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం, నిందితులైన అధికారులపై కేసు నమోదు చేయబడింది.ఈ కేసు దర్యాప్తులో ఉంది, మరియు చట్టపరమైన ప్రక్రియ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
1064 ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి (టోల్ ఫ్రీ నంబర్)
ఏదైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేసిన పక్షంలో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, అనగా 1064ను సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), మరియు ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా సంప్రదించవచ్చు. తెలంగాణ ఏసీబీని సంప్రదించడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ఏసీబీ క్యూఆర్ కోడ్ కూడా ప్రదర్శించబడుతుంది. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
జాయింట్ డైరెక్టర్ (సి/జెడ్), అవినీతి నిరోధక బ్యూరో, తెలంగాణ, హైదరాబాద్.
👉వైసీపీ పార్టీ నేత…అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*గుంటూరు జిల్లా…
వైసీపీ మాజీ మంత్రిఅంబటి రాంబాబుకు షాక్ తగిలింది.
ఈ నెల 18న అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేపట్టారంటూ అంబటిపై మరో కేసు నమోదైంది.
ట్రాఫిక్ సమస్యలకు ఆయనే కారణమయ్యారని ఆరోపణలున్నాయి.
ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
👉హైదరాబాద్‌లో డిఫెన్స్ మద్యం పట్టివేత…
డిఫెన్స్ ప్రీమియర్ లిక్కర్ బడాబాబులకు విక్రయం…
బెంగళూరు, హర్యానా నుంచి లిక్కర్ దిగుమతి…
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్‌రెడ్డి అరెస్ట్…
రూ.10 లక్షల విలువ చేసే డిఫెన్స్ మద్యం సీజ్…
👉 పోలీసులే కరెక్ట్ … ప్రజా కోర్టులో … పోలీసుల పై ప్రశంసలు వెల్లవ ||*పెద్దవడుగూరు, లాఠీ ఛార్జ్ గురుంచి:*
*” పోలీసులకు మద్దతుగా ప్రజలు … శభాష్ అనంతపురం జిల్లా పోలీస్ “*
▪️పెద్దవడుగూరు ఎస్ఐకు మద్దతుగా రైతుల ధర్నా.
▪️వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ అదుపులోకి తీసుకుని కొట్టగా, ఆ దృశ్యాలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు సిద్ధమవుతుండటంతో ఎస్ఐకి మద్దతుగా నిలుస్తూ.
▪️ఎస్ఐపై చర్యలు తీసుకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన రైతులు.
▪️పశువుల దాణా 28 గడ్డి వాములు తగలబెట్టాడు, సిసి ఫుటేజ్ లో అడ్డంగా దొరికిపోయాడు అలాంటి వారి పై కులం పేరుతో రాజకీయాలు.
*▪️” దళితుడిని కొడతారా అని కులం కార్డుతో రాజకీయాలు వద్దు అంటు సొంత గ్రామ ప్రజలే ఆగ్రహం “* తప్పని పరిస్థితుల్లో లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది … అదికూడా ప్రజా క్షేత్రంలోనే చేసాము అంటున్న పోలీసులు.
👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో*
*వైఎస్సార్సీపీ సదస్సు*సదస్సు నిర్వహణపై*
*’బూచేపల్లి’, ‘అన్నా’ *సన్నాహక సమావేశం*
*రాయలసీమ జిల్లాలు,పూర్వపు రాయలసీమలో అంతర్భాగమైన మార్కాపురం జిల్లా ప్రాంతపు రైతాంగం మరియు ప్రజల అవసరాలు,ప్రయోజనాల దృష్ట్యా కృష్ణా జలాల వినియోగ ఆవశ్యకతపై,’రాయలసీమ ఎత్తిపోతల పథకం & వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై సమగ్రంగా చర్చించేందుకు వైఎస్సార్సీపీ నడుం బిగించింది.*
*విస్తృత స్థాయిలో మే నెల 4వతేది సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సదస్సుకు వేదికగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని “సౌజన్య ఫంక్షన్ హాల్” ను నిర్ణయించారు.*రాష్ట్ర స్థాయిలో నాయకులు,మేధావులు,నిపుణులు,రైతు నాయకులు పాల్గొననున్న ఈ సదస్సును విజవంతం చేసేందుకు*
*ప్రకాశం – మార్కాపురం ఉమ్మడి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు,దర్శి శాసనసభ్యులు*
*డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి,గిద్దలూరు మాజీ* *ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నా రాంబాబు మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.*
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత వర ప్రదాయని వెలుగొండ ప్రాజెక్ట్ పనులను వేగవంతంగా చేయాల్సివుందని వారన్నారు.*
*పూర్తి కరవు పీడిత ప్రాంతాల కోసం నిర్దేశించిన వెలుగొండ ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకం సాగకపోతే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి అన్యాయం జరుగుతుందన్నారు.*వైఎస్సార్సీపీ ఎమ్యెల్యేలు,ఇంఛార్జీలు,మేధావులు,నిపుణులు,నాయకులు పాల్గొంటున్న*ఈ సదస్సు విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులను,క్రియాశీలక కార్యకర్తలను సన్నాహపరిచారు.*
👉 సూర్య అగ్ని సోలార్ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
పొదిలి పట్టణం నందు దుగ్గెంపుడి శ్రీనివాసరెడ్డి గారు నూతనంగా ప్రారంభించిన సూర్య అగ్ని సోలార్ నూతన ప్రారంభోత్సవం లో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు….*
👉వెండిదండి వెంకటేశ్వరరెడ్డి ను పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామం నందు వెండిదండి వెంకటేశ్వరరెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స అనంతరం వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు వెంకటేశ్వరరెడ్డి గారిని పరామర్శించడం జరిగింది…*
👉గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి… జిల్లా కలెక్టర్ విజయ సునీత గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్నీ విభాగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని శాఖలు అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల ధార- జలహారతి కార్యక్రమ పనులను వేగవతం చేయాలన్నారు. త్వరిత గతిన పనులను గుర్తించి నియోజకవర్గంలోని 176 చెరువులను జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులను పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఇక్కడ అధికంగా ఉన్నాయని, మ్యూటేషన్స్ సరిగా జరగడం లేదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తహసిల్దార్లు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు శ్రద్ద వహించాలన్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలోని ఆయకట్టు మొత్తానికి నీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా గిద్దలూరు నియోజకవర్గం లో 60 వేల ఎకరాలకు సాగునీరు అందబోతుందని వివరించారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలు లేకుండా 11,22 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ల ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆ గ్రామం వారికే పంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్ఈ అబూతలిం, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
👉రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఆక్టోపస్ ఆపరేషన్*
– 32 మంది బ్యాంకు అధికారులు సహా 52 మంది అరెస్ట్
– భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు
– బ్యాంకు అధికారుల అండదండలతో సైబర్ మోసాలు
– రూ.150 కోట్ల మేర మోసాలు.. 850 కేసులతో సంబంధాలు
– సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన బ్యాంక్ అధికారులు
– బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, IDFC, ఇండస్, కర్ణాటక, కరూర్, HDFC బ్యాంక్ మేనేజర్లు అరెస్టు
👉లైంగిక వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య… పోలీస్ విభాగంలో కలకలం*
వరంగల్ టౌన్, ఏప్రిల్ 21 : లైంగిక వేధింపులు భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
మట్టెవాడ సీఐ తెలిపిన వివరాల ప్రకారం, భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాదు సంగీత (33) అనే మహిళా కానిస్టేబుల్, వరంగల్ మట్టెవాడ బొడ్రాయి ప్రాంతంలో తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. మంగళవారం ఆమె అత్తగారి ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త, ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖలో, శ్రీధర్ అనే కానిస్టేబుల్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంగీత పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఆత్మహత్య ప్రేరణతో పాటు ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఎస్హెచ్ఓ తెలిపారు.
👉లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి చేప*
తన ఫ్యామిలీ బర్త్ సర్టిఫికెట్ల కోసం.. గతేడాది జులైలో నారాయణపేట తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి…స్థానిక తహశీల్దార్ తన పని పూర్తి చేని ఆర్డీవోకి పంపగా.. అప్పటి నుంచి ఆర్డీవో కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆ వ్యక్తి…చివరికి.. ఐదు బర్త్ సర్టిఫికెట్లకు గాను రూ. 25 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్డీవో రామచంద్రనాయక్ …బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. ప్లాన్ ప్రకారం రూ.25 వేలు తీసుకుంటుండగా రామచంద్రనాయక్‌ను పట్టుకున్న అధికారులు

