👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*
* లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్‌, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీయేకు ఇది చీకటి రోజు అని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్‌సభలో ఓడిపోయిందని విమర్శించారు.
👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వేదికగా నిప్పులు చెరిగారు.. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసిందని విమర్శించారు. *ఎన్ డిఏ సర్కార్ నిజాయితీగా మహిళా బిల్లును తేలేదని* సీఎం రేవంత్ ఆరోపించారు.
*మహిళా బిల్లు మాటున డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని* కేంద్రం తీరును దుయ్యబట్టారు. *మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థంగా అడ్డుకుందని* సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. *ఇది రాజకీయ విధానాలకు ఓటమి కాదని, బీజేపీ విధానాలకు ఓటమి* అని సీఎం రేవంత్ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ గతంలో కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. *దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని* ఆయన చెప్పారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు ఎన్ డిఏ ప్రభుత్వం కుట్ర పన్నిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిన్న సవరణలతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని సీఎం సూచించారు. *రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరిగిందని, బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే కచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మార్చేవారని* సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
వైయస్ జగన్ ఫ్యామిలీపై బుదరజల్లే ఉద్దేశంతో think andhra అనే ఒక యూట్యూబ్ ఛానల్, M9 news ఓ తప్పుడు కథనం ప్రసారం.
ఈ రెండు ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నగరంలో 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు గొల్ల మధు శేఖర్, కర్నూలు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు అశోక్ కుమార్ రాయల్, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు భాస్కర్ యాదవ్ ఫిర్యాదు.
👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను*
ఆ దాడి వెనుక ఉన్న చంద్రబాబు, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు..దాడికి తెగబడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకూ నా పోరాటం ఆగదు…అంబటి రాంబాబు,మాజీ మంత్రి
👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా..*పల్నాడు జిల్లా
మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు!
చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును కాజేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ రసీదులు సృష్టించి ఏకంగా రూ.34 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.
👉 పశ్చిమ గోదావరి: ఇంట్లో రూ.2.27 కోట్ల నగదు స్వాధీనం!
నరసాపురంలోభారీ స్థాయిలో నగదు తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల సందర్భంగా ఏకంగా ₹2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఆయన మీడియాకు వివరాలు వివరించారు.
మొదట్లో కేవలం ₹20 లక్షలు మాత్రమే వస్తాయని భావించినప్పటికీ, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.
దీని గురించి ప్రశ్నించగా, *ఘంటా జాన్ బాబు* సరైన సమాధానం ఇవ్వలేదు, మరియు వారు ఆ నగదును ఐటీ విభాగానికి అప్పగిస్తున్నారని సీఐ వెల్లడించారు••£
👉ఎస్టీ కేటగిరిలో టాపర్..! ప్రతిభతో జీవన స్థితిగతిని మార్చుకోగలిగిన విజయం సాధించింది..!*
ఏం లాభం..! ఇలా ఉద్యోగంలో చేరి అలా అవినీతి తెరతీసింది.. ప్రతిభ మట్టిలో కలిసిపోయింది.. డబ్బుయావ రెండేళ్లలోనే పరువు తీసేలా చేసింది..!
నవ సమాజం డబ్బు పిచ్చిలో సర్వం కోల్పోతోంది..!
ఇక్కడ తెలంగాణలో కూడా ఓ అధికారి ప్రొబేషన్ లో ఏసీబీ కి పట్టుబడ్డాడు..!
పోలీస్ శాఖలో అయితే ఇంకా ఎక్కువ బరితెగింపు..వచ్చి రాగానే ఎక్కడ నుండి ఏం వస్తుంది అనే లెక్కలు వేస్తున్నారని సీనియర్ హోమ్ గార్డులు.. కానిస్టేబుళ్లు చెబుతున్నారు..!
*ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి*
కుల రిజర్వేషన్ వల్ల పీజీ సీటు వచ్చిందని వేధిస్తూ కావాలనే అధిక డ్యూటీలు వేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న గిరిజన పీజీ విద్యార్థి…ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో మూడు నెలలుగా పీజీ క్వార్టర్స్‌లో ఉంటున్న జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెందిన కాట్రావత్ సురేష్ నాయక్ అనే మెడికో…
అయితే తనకు రిజర్వేషన్ వల్లనే పీజీ సీటు వచ్చిందని తరచూ సీనియర్లు వేధిస్తున్నారని, కావాలనే అధిక డ్యూటీలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తల్లి నాగమణికి చెప్పి బాధపడిన సురేష్ నాయక్ …
నాగమణి సోదరుడు రవి హాస్టల్ వద్దకు చేరుకుని సురేష్‌కు ధైర్యం చెప్పి, ర్యాగింగ్ చేస్తున్న వారిని కలిసి మాట్లాడతానని చెప్పగా, నేనే చూసుకుంటాను మీరు రాకండి అని సురేష్ నాయక్ తెలిపినట్లు సమాచారం…
గురువారం ఉదయం 7:30 గంటలకు డ్యూటీకి వెళ్తున్నానని తల్లికి చెప్పినా, 9 గంటలవుతున్నా తలుపు తెరవకపోవడంతో, గది వద్దకు వచ్చి చూసిన స్నేహితురాలు అమూల్య…
తలుపు తీసి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ నాయక్‌ను, అతని చుట్టూ నిద్ర మాత్రలు, చేతికి మత్తు ఇంజెక్షన్ గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు…
తమ కొడుకు మరణానికి సీనియర్లే కారణమని మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు…
పీజీ పూర్తయ్యాక తండాలోని పేదలకు ఉచిత వైద్యం చేస్తానని చెప్పాడని మృతదేహం వద్ద విలపించిన సురేష్ నాయక్ తల్లి నాగమణి…నిందితులపై హత్యకేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు.
👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… మార్కాపురం జిల్లా రాచర్ల…
రాచర్లలోని ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకొని, విద్యారంగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి రాచర్ల గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడం విశేషంగా నిలిచింది.ద్వితీయ సంవత్సరం 94% పాస్ శాతం, ప్రథమ సంవత్సరం 86.59% పాస్ శాతం సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
మొత్తం 65 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 61 మంది ఉత్తీర్ణత సాధించి 94% పాస్ శాతం నమోదు చేశారు.
-MPC లో 27 మంది హాజరై 26 మంది ఉత్తీర్ణులై 97% పాస్ శాతం, గరిష్ట మార్కులు 947 /1000 వై అనూష, టి సింధు 920/1000 సాధించారు. BiPC లో 32 మంది హాజరై 31 మంది ఉత్తీర్ణులై 97% పాస్ శాతం, గరిష్ట మార్కులు 973/1000 బి పుష్పలత, 967 /1000వై అలేఖ్య, 963 /1000 షేక్ ఆషియా భాను సాధించారు.
CEC లో 6 మంది హాజరై 4 మంది ఉత్తీర్ణులై, గరిష్ట మార్కులు 953 /1000 షేక్ ఆషియా సాధించారు.
ప్రథమ సంవత్సరం ఫలితాలు:
మొత్తం 97 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 84 మంది ఉత్తీర్ణులై 86.59% పాస్ శాతం నమోదు చేశారు.MPC లో 29 మంది హాజరై 28 మంది ఉత్తీర్ణులై 97% పాస్ శాతం, గరిష్ట మార్కులు 454/470 సిహెచ్ రామాంజనేయులు,443/470 వి మనోవిజయ్, 443/470 బి అక్షయ, 439 /470 కే శశి హాసిని, కే .క్రిషిత సాధించారు.MEC లో 8 మంది హాజరై అందరూ ఉత్తీర్ణులై 100% పాస్ శాతం, రాష్ట్రస్థాయిలో గరిష్ట మార్కులు 491/500 షేక్ సుహానా 442/500 హెచ్ మహాలక్ష్మి438/500 షేక్ ముబినా సాధించారు. BiPC లో 32 మంది హాజరై 25 మంది ఉత్తీర్ణులై 78% పాస్ శాతం, గరిష్ట మార్కులు 440/455 పి లావణ్య, 420/455 జి వైష్ణవి, 418/455 పి నాగేశ్వరి సాధించారు.
CEC లో 28 మంది హాజరై 23 మంది ఉత్తీర్ణులై 82% పాస్ శాతం నమోదు చేశారు. గరిష్ట మార్కులతో 485/500 బి రక్షిత, 456/500 ఎం శ్రీదేవి, 442/500 కే సుమిత్ర మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విద్యార్థులను వేదికపై ఘనంగా సన్మానించగా, వారి తల్లిదండ్రులను కూడా గౌరవించి సత్కరించారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాలతో నిండింది.
ఈ సందర్భంగా విద్యార్థులు,తల్లిదండ్రులు తో రాచర్ల మండలంలో ర్యాలీ నిర్వహించి విజయోత్సాహాన్ని ప్రజలతో పంచుకున్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా , ఎంఈఓ గిరిధర్ శర్మ , కళాశాల ప్రిన్సిపాల్ పోలా మురళి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను
👉హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన గిద్దలూరు పోలీసులు …
మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణం లో ని హిజ్రాలకు అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది.గిద్దలూరు మండలం లోని ప్రజలను హిజ్రాలు బెదిరించి డబ్బులు వాసులు చేస్తే సహించమని చట్టపరంగా వారి పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు
సమాజం లో హిజ్రాలు గౌరవంగా బ్రతకాలని అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య అన్నారు
👉హైదరాబాద్‌లో జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*
రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యాసంస్థలు మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ క్లాసులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో మొదటి స్థానం సాధించినందుకు ఈ అవార్డును హైదరాబాద్‌లోని నోవోటెల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్వీకరించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయానికి ఉపాధ్యాయుల అంకితభావం,విద్యార్థుల ప్రతిభ, తల్లితండ్రుల విశ్వాసం ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆధునిక బోధనా విధానాలు మరియు స్మార్ట్ క్లాస్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. సంస్థపై విశ్వాసం ఉంచి సహకరించిన తల్లితండ్రులకు, నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయులకు, ప్రతిభ చాటిన విద్యార్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలతో ముందుకు సాగుతూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..*
*ఆకాష్ నాయక్ పేర ఉన్న బులెరో వాహనంలో 25 క్వింటాళ్ల “రేషన్ బియ్యం” పట్టివేత*
*ఆకాష్ సోదరుడు సంతోష్ చేత నిర్వాకం*
*ఇతర రాష్ట్రాలకు రేషన్ తరలిస్తున్న వైనం*
విద్యార్థులకు సన్న బియ్యం సక్రమంగా అందడం లేదని.. నూకలు వస్తున్నాయని అరిచి గోల చేసే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేత ఆకాష్ నాయక్ పై అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేసు నమోదయింది. తన పేరున ఉన్న బొలెరో వాహనాన్ని అతని సోదరుడు వాడుతున్నట్లు గుర్తించిన ఎస్వోటీ పోలీసులు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేసిన సంఘటన జిల్లేడు చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
షాద్ నగర్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేత ఆకాష్ నాయక్ పేరిట ఉన్న బొలెరో వాహనం నంబర్ టీజీ 07వి 4847 లో డ్రైవర్ పాత్లావత్ సంతోష్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు గ్రామస్తుల వద్ద కొనుగోలు చేసి వాటిని మహారాష్ట్రలు విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. 40 కేజీల రేషన్ బియ్యం 56 సంచులు మొత్తం ఇసోటి పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. అదేవిధంగా వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులైన ఉన్నాయని పోలీసులు ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో పోలీసులు ఈ అక్రమ బియ్యాన్ని వెంటనే సిస్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్ సంతోష్ ఆకాష్ నాయక్ కు సోదరుడు. అయితే విద్యార్థి సంఘం నాయకుడు ఆకాష్ నాయక్ ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణా తరలింపు కేసులో చిక్కుకోవడంతో సంచలనం రేకర్తిస్తుంది. విద్యార్థుల హక్కుల కోసం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం పోరాడే ఆకాష్ నాయక్ ఇలా రేషన్ బియ్యం అక్రమంగా తరలించే కేసులో బుక్ కావడంతో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ఈ వ్యవహారం పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటినుండి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేక కారణాలతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు..
👉*కామారెడ్డిలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ*
*కామారెడ్డి జిల్లా బిచ్‌కుందలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రొహిబిషన్ ,,ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌, సత్యనారాయణ 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు*
*ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదిదారుడి నుండి లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా బిచ్‌కుందలోని తన అద్దె నివాసంలో పట్టుబడ్డాడు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది*
👉*ఏపీ రైతులందరికీ ముఖ్య గమనిక*…
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రీసర్వే పనులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది…
*భూ యజమానులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి గడువు నిర్ణయించింది*….
2027 మార్చి 31 నాటికి ప్రతి రైతుకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలి…*గ్రామ సర్వేయర్లు ఇకపై కేవలం సర్వే పనులకే పరిమితం అవుతారు*…జనగణన విధుల నుండి సర్వేయర్లకు మినహాయింపు ఇచ్చారు…*రైతులు తమ భూ వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు*….
👉*స్నేహితురాలిని బెదిరించి.. అసభ్య వీడియోలు రికార్డు చేసి..*
* తనతో అసభ్యకరంగా వీడియో కాల్స్‌ మాట్లాడాలని స్నేహితురాలిని బెదిరించి… ఆ వీడియోలను స్నేహితులకు షేర్‌ చేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థిపై తాడికొండ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
తన స్నేహితురాలిని బెదిరించి అసభ్యకర వీడియో కాల్స్ మాట్లాడించి, వాటిని స్క్రీన్ రికార్డు చేసి స్నేహితులకు షేర్ చేసిన ఇంజినీరింగ్ విద్యార్థిపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
**వివరాలు:**
తాడికొండ మండలం మోతడక ప్రాంతంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలానికి చెందిన యువతి (బీటెక్ రెండో ఏడాది)కు తన స్నేహితురాలి ద్వారా నడిపాలెం ప్రాంతంలోని మరో ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న **ఖమ్రుద్దీన్** అనే విద్యార్థి పరిచయం అయ్యాడు.
అతడు తరచూ కాల్స్ చేసి మాట్లాడేవాడు. ఈ క్రమంలో తనతో అసభ్యకరంగా వీడియో కాల్స్ మాట్లాడాలని ఒత్తిడి చేసి, బెదిరింపులకు పాల్పడేవాడు. భయపడిన యువతి పలుమార్లు అతడు చెప్పినట్లు వీడియో కాల్స్‌లో మాట్లాడింది. అతడు వీటిని స్క్రీన్ రికార్డు చేశాడు.
కొన్నాళ్లు యువతి అతణ్ణి దూరం పెట్టడంతో కక్షపెంచుకున్న ఖమ్రుద్దీన్ ఆ వీడియోలను ఆమె కళాశాలలోని ఇద్దరు యువకులు మరియు ఒక యువతికి పంపాడు. వారు ఆ వీడియోలను ఇతర విద్యార్థులకు షేర్ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వాసు ఈ విషయం తెలిపారు
👉 బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు
* ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.
* హైటెక్ టెక్నాలజీతో నేరస్తులపై కఠిన చర్యలు… తీసుకుంటున్నారు…* నేరం చేస్తే తప్పించుకోలేరు… * పట్టుబడిన వారందరికీ డ్రగ్ టెస్టులు…* బెట్టింగ్ నెట్‌వర్క్‌ల మూలాల నిర్మూలన… “యువత అప్రమత్తంగా ఉండాలి చట్టాన్ని గౌరవించండి” — నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు..
👉మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు చేపట్టిన నిరసన నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, డాక్టర్ మేరుగు నాగార్జున
కస్టడీలో తనను హింసించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, తన ఇల్లు, ఆఫీసు మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన ఒక్కరోజు నిరసన దీక్షకు మద్దతుగా,…,నిరసన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త, బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ మేరుగు నాగార్జున
👉పోలీస్ స్టేషన్ లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*
ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎఆర్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. ఎఆర్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని అందువలన మనసు ప్రశాంతతతో కూడి ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించొచ్చు. మన చుట్టూ ఉంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. నీరు జీవానికి అత్యంత ముఖ్యమైన వనరని, ప్రతి చుక్కను వృథా కాకుండా మితంగా వినియోగించాలని, చెట్లు నాటడం ద్వారా నీటి నిల్వలు పెరుగుతాయని తెలిపారు. నీరు లేకపోతే జీవం అసాధ్యమన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు.స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, (SASA) ప్రతిజ్ఞ ను కూడా చేశారు.

​👉 నకిలీ రసీదులతో నయా దందా: పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను, కుళాయి పన్ను తదితర పన్నులు చెల్లించడానికి వచ్చిన అమాయక ప్రజలకు మున్సిపల్ సిబ్బంది నకిలీ రసీదులు చేతిలో పెట్టారు. వసూలైన నగదును ఖజానాకు జమ చేయకుండా రూ.34 లక్షల వరకు పక్కదారి పట్టించారు.
​⭐ మాజీ కమిషనర్‌పై యాక్షన్: ఈ భారీ స్కామ్‌కు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపల్ కమిషనర్ రవీంద్రతో పాటు ఈ అవినీతిలో భాగస్వాములైన తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
​⭐ విజిలెన్స్ ఎంట్రీ.. సస్పెన్షన్ల పర్వం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతి వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అధికారుల అక్రమాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, కూటమి ప్రభుత్వం ఇప్పటికే సదరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
​⭐ ప్రధాన నిందితురాలు గంగాభవాని: ఈ స్కామ్‌లో మాజీ మంత్రికి సమీప బంధువు అయిన ‘గంగాభవాని’ ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీలో కేవలం ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన ఆమె.. ఏకంగా పన్నుల వసూళ్లలో కీలక పాత్ర పోషించి నిధులు స్వాహా చేసినట్లు తేలింది. ఈమెపై గతంలోనే పోలీస్ కేసు కూడా నమోదు కావడం గమనార్హం.
​⭐ భయంతో రూ.12 లక్షలు వెనక్కి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఈ అవినీతి వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ (TDP) కౌన్సిలర్లు పదేపదే నిలదీయడంతో సదరు ఉద్యోగిని దిగివచ్చారు. విచారణలో దొరికిపోతామన్న భయంతో.. స్వాహా చేసిన నిధుల్లోంచి సుమారు రూ.12 లక్షల వరకు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమ చేయడం ఈ స్కామ్‌కు అద్దం పడుతోంది.
అధికారం అండ ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా సాగిన ఈ దందా.. విజిలెన్స్ ఎంట్రీతో పేకమేడలా కూలిపోయింది. ప్రజల సొమ్మును దోచుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. అయితే, వెనక్కి ఇచ్చిన రూ.12 లక్షలు పోనూ.. మిగిలిన రూ.22 లక్షల రికవరీ ఎప్పుడు జరుగుతుంది? ఈ కుంభకోణంలో తెరవెనుక ఇంకెవరి పాత్ర ఉందన్నది ఇప్పుడు చిలకలూరిపేట పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…