👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు.
se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి తెలిపారు. మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియచేశారు.
👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం.. ప్రపంచానికి చమురు సెగ పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అంతర్జాతీయ రాజకీయ యవనికపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరిన్ని కనుగొనండి హెడ్‌ఫోన్‌లు స్మార్ట్ టీవీలు నాని సినిమా సమీక్ష విమర్శకుల సంఘం విశ్లేషణల విశ్వసనీయత పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అంతర్జాతీయ రాజకీయ యవనికపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఎగుమతులపై కఠినతరమైన ఆంక్షలను విధిస్తూ ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. ఈ నిర్ణయం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను కుదిపేస్తోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
👉ఆంక్షల పర్వం.. స్కాట్ బెసెంట్ ప్రకటన అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం నాడు అధికారికంగా ఈ కొత్త ఆంక్షలను ప్రకటించారు. గత కొంతకాలంగా రష్యా, ఇరాన్ చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న కొంత ‘మెతక’ వైఖరి లేదా సడలింపులను ఇకపై కొనసాగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. “ఇరాన్ తన అక్రమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి.. ప్రాంతీయ అస్థిరతను సృష్టించడానికి చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడుకుంటోంది. ఆ ఆదాయ వనరులను తుడిచిపెట్టడమే మా తక్షణ ప్రాధాన్యత” అని బెసెంట్ పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఓఫాక్) ఈసారి అత్యంత పకడ్బందీగా జాబితాను రూపొందించింది. ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన రాజకీయ సలహాదారు కుమారుడు మహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీ నిర్వహిస్తున్న భారీ వ్యాపార నెట్‌వర్క్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ నెట్‌వర్క్ అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ‘షాడో బ్యాంకింగ్’ తరహాలో వ్యవహరిస్తూ ఇరాన్ చమురును వివిధ దేశాలకు అక్రమంగా తరలిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది… నౌకాయానంపై నిఘా.. మిత్రదేశాలకు హెచ్చరిక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకల కదలికలపై అమెరికా తన పర్యవేక్షణను ముమ్మరం చేసింది. సాటిలైట్ నిఘాతో పాటు సముద్ర మార్గంలో గస్తీని పెంచింది. ఇదే సమయంలో అమెరికా ఒక కఠినమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. ఇరాన్‌తో చమురు వ్యాపారం చేసే దేశాలు ముఖ్యంగా చైనాకు చెందిన బ్యాంకులు ఈ ఆంక్షల పరిధిలోకి వస్తాయని.. అక్రమ లావాదేవీలకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ ఎదురుదాడి.. ఎగుమతుల నిలిపివేత అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా ఇరాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇరాన్ జాతీయ పెట్రోకెమికల్ సంస్థ (ఎన్.పీఎస్) దేశంలోని అన్ని పెట్రోకెమికల్ ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శత్రు దాడుల వల్ల ఇంధన నిల్వలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించి, దేశీయ అవసరాల కోసం చమురును నిల్వ ఉంచాలని ఇరాన్ నిర్ణయించింది. ఇప్పటికే ఓడరేవులకు చేరుకున్న, ఎగుమతికి సిద్ధంగా ఉన్న సరుకును కూడా వెనక్కి మళ్లించాలని కంపెనీలకు కఠిన ఆదేశాలు వెళ్లాయి. ఇది ప్రపంచ మార్కెట్‌లో ఒక్కసారిగా సరఫరా లోటును సృష్టించనుంది. ప్రపంచ మార్కెట్లపై ప్రభావం.. విశ్లేషకుల హెచ్చరిక ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై పెను ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సరఫరా గొలుసులో అంతరాయం కలగడం వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలపై భారం మోపుతుంది.ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా ప్రత్యక్ష పోరుకు దారితీస్తే హర్మూజ్ జలసంధి మూతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం నిలిచిపోతుంది. మొత్తం మీద అమెరికా తీసుకున్న ఈ ఆర్థిక అస్త్రం పశ్చిమాసియాలో మంటలను మరింత రాజేస్తోంది. ఇరాన్ తన పంథాను మార్చుకుంటుందా లేక పట్టుదలకు పోయి అంతర్జాతీయ మార్కెట్‌ను సంక్షోభంలోకి నెడుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
👉 ఎల్.పీజీ సరఫరా కష్టమేనా? పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా? పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఆ ప్రాంత సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నాయి. మరిన్ని కనుగొనండి తెలుగు రాజకీయ పుస్తకాలు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు ఫ్యాషన్ ఉపకరణాలు Movies నాని సినిమా సమీక్ష పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఆ ప్రాంత సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీవనాడి వంటి ‘లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్’ (ఎల్.పీ.జీ) సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం.. ఈ గ్యాస్ సరఫరా వ్యవస్థ తిరిగి గాడిలో పడటానికి మరో మూడు నుంచి నాలుగు ఏళ్లు పడుతుందన్న వార్త ఇంధన భద్రతపై ముంచుకొస్తున్న ముప్పును సూచిస్తోంది. పశ్చిమాసియాలో గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు.. నిల్వ సదుపాయాలు యుద్ధ జ్వాలల మధ్య చిక్కుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు ‘మహాద్వారం’ వంటి హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి నెలకొనడం పెను సంక్షోభానికి దారితీస్తోంది. అత్యంత కీలకమైన ఈ జలమార్గం గుండానే ప్రపంచంలోని మెజారిటీ చమురు.. గ్యాస్ రవాణా సాగుతుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడుతోంది. భారత్ పరిస్థితి మరింత సున్నితంగా ఉండటానికి ప్రధాన కారణం మనం దిగుమతులపై చూపుతున్న అమితమైన ఆధారపడటమే. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో 90 శాతం వాటా ఒక్క హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే రావడం గమనార్హం. అంటే పశ్చిమాసియాలో తుమ్మినా మన దేశంలో గ్యాస్ పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. రూబిక్స్ డేటా సైన్సెస్ నివేదిక హెచ్చరించినట్లుగా సరఫరాలో 40 నుంచి 50 శాతం లోటు ఉందంటే అది గృహ వినియోగదారులకే కాక పారిశ్రామిక రంగానికి కూడా గొడ్డలిపెట్టు వంటిదే. ప్రస్తుత సంక్షోభం మనకు ఒక గట్టి హెచ్చరిక…కేవలం ఒకే ప్రాంతంపై లేదా ఒకే సరఫరా మార్గంపై ఆధారపడటం ఎంతటి ప్రమాదకరమో ఇప్పుడు స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వ్యూహాలను యుద్ధ ప్రాతిపదికన మార్చుకోవాలి. రష్యా, అమెరికా లేదా ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతులను విభిన్నీకరించడం తక్షణ అవసరం. అలాగే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ‘బయో గ్యాస్’, ‘గ్రీన్ హైడ్రోజన్’ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రజలను,పరిశ్రమలను మళ్లించడంలో ప్రభుత్వం ఏమాత్రం జాప్యం చేయకూడదు.
👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు నిచ్చారు.
గురువారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం,తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆధ్వర్యంలో ‘స్వీయ గణన’ కింద తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జనగణన-2027 ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజుల పాటు షెడ్యూల్ జారీ చేయడమైనదన్నారు. అందులో భాగంగా గురువారం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆధ్వర్యంలో ‘స్వీయ గణన’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా లోని గ్రామీణ ప్రాంతంలో 2412 బ్లాకులుగా, పట్టణ ప్రాంతంలో 845 బ్లాకులుగా మొత్తం 3255 బ్లాకుల్లో జనగణన కార్యక్రమం జరుగు తుందని, అందుకు గాను క్షేత్ర స్థాయి సిబ్బందిని నియమించడంతో పాటు వీరికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మే 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ఎన్యుమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ జనగణనలో ఎ కుటుంబం మిస్ కాకుండా చూడాలని,ఈ విషయమై ఎన్యుమరేటర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అందుబాటులో వున్న సమయాన్ని ఎన్యుమరేటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.ప్రజలు కూడా ఈ జనగణన కార్యక్రమానికి సహకరించి తమ వివరాలను తెలియచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల తహసిల్దార్ ఆంజనేయులు,జనగణన నమోదు సిబ్బంది పాల్గొన్నారు.

👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు డిమాండ్.. ప్రకాశం జిల్లా కొండేపి
దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితా లో కొనసాగించాలని
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సిపిఎం మండల కమిటీ సమావేశం మండల నాయకులు ముప్పరాజు చిన్న బ్రహ్మయ్య అధ్యక్షతన గురువారం పెరిదేపి లోని యం.ఎస్. విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఇటీవల సుప్రీమ్ కోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీల గుర్తింపు వర్తించదని ప్రకటించడం విచారకరమని అన్నారు. భారత రాజ్యాంగం కుల వివక్ష, అంటరానితనం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించటం జరిగిందన్నారు.వారు మతం మారినంత మాత్రాన వివక్ష, అంటరానితనం పోవని, నేటికి కులాంతర వివాహాలు చేసుకున్న వారు అనేక మంది అమానుషమైన హత్యలకు, దాడులకు గురవుతున్నారని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర వివక్ష కు గురవడమే కాక, దళితుల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి లో కూడా వివక్షత కొనసాగుతున్నదనారు. హిందూమత సనాతన వాదం దళితులను గుడిలోకి ప్రవేశించనీయ నందునే వారు మతం మారుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో ప్రజలందరికీ సమానత్వాన్ని కల్పిస్తుందని అన్నారు. ఈ తీర్పు సమానత్వాన్ని విస్మరిస్తున్నదని అన్నారు.ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. ఏ మతంలోకైనా మారవచ్చు అని రాజ్యాంగం చెప్పినప్పుడు మతం మారితే ఇప్పటివరకు ఉన్న సౌకర్యాలు కోల్పోతారు అనటం రాజ్యాంగానికి విరుద్ధమైన అంశం అని అన్నారు.ఈ విషయం లో రాష్ట్రం లోని ప్రధాన పార్టీలు టిడిపి జనసేన బిజెపి వైసీపీ పార్టీల వైఖరి ఏమిటి తెలుపాలని అన్నారు. ఎన్నికలప్పుడు ఈ పార్టీల నేతలు చెర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించుకుని,నేడు వారికి నష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వదిలేయటం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవుల కు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్ మాట్లాడుతూ పొగాకు కు గత ఏడాది రేటు కూడా రాక పోవడం అన్యాయం అన్నారు. ఏపంట పండించిన రైతు లేకపోవటం తో రైతాంగ అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వాలు రైతే రాజుని చెబుతూ వ్యవసాయ రంగాన్ని, రైతుల జీవితాలను అన్యాయం చేసే విధానాలను అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మల్లెల కొండయ్య,యం.చిన్న పేతురు,లెక్కేపోగు పరిశుద్ద రావు, యం.పి. పేతురు, అంగలకుర్తి సూరి బాబు, ఏ. విశ్రాంత, ఏ. సి. బ్రహ్మయ్య పాల్గొన్నారు.
👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా… మార్కాపురం జిల్లా… మార్కాపురం…
తమకు చెల్లించాల్సిన డి ఏ లు మంజూరు చేయడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి ఎస్ ఎన్ ఎల్) విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ జాతీయ కమిటీ పిలుపు మేరకు గురువారం బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ నాయకులు శ్రీనివాస రెడ్డి, కృష్ణారావు,నిజాముద్దీన్,సిపిఐ నాయకులు అందే నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.
👉 మార్కాపురం జిల్లా.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం మార్కాపురంలోని విఎన్ఆర్ ప్రెస్టేజ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ అపార్ట్మెంట్, ఆదర్శ అపార్ట్మెంట్ నందు ఎల్పిజి సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, కేర్ లెస్ స్మోకింగ్ మొదలగు వాటి గురించి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. నివాస భవనముల నందు జరుగు అగ్ని ప్రమాదాల గురించి అక్కడ నివసిస్తున్న ప్రజలకి అవగాహన కల్పించి,ముందస్తు జాగ్రత్త సూచనలను వారికి వివరించడం జరిగింది. అనుకోకుండా ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వాటి నుంచి ఏ విధంగా తమ ప్రాణాలను కాపాడుకోవాలి మరియు అనుకోకుండా ఎవరైనా భవనముల యందు చిక్కుకుంటే వారిని సురక్షితంగా ఏ విధంగా సురక్షితమైన ప్రాంతాలకు తీసుకురావాలో వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మార్కాపురంలో గల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల నందు పాంప్లెట్లను అక్కడ వారికి అందజేసి అక్కడ పోస్టర్లను అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం అగ్నిమాపక అధికారి రేగలగడ్డ రామకృష్ణ మరియు ఇతర అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగింది.
👉 *ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేత*

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు హ్యాట్స్, వాటర్ బాటిల్స్, కూలింగ్ గ్లాసెస్, నెక్ బ్యాండ్స్, బ్యాగులతో కూడిన సమ్మర్ కిట్లను పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అస్త్రం యాప్ మరియు ఏఐ టూల్స్ వినియోగంతో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. గత సంవత్సరం తో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందని, ఇంకా తగ్గించేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.హెల్మెట్ వినియోగంపై అవగాహన వల్ల ప్రస్తుతం 85% మంది వాడుతున్నారని, హెల్మెట్ క్లిప్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు కొత్త సిగ్నల్స్ ఏర్పాటు, పెండింగ్ చలానాల చెల్లింపుకు సులభ మార్గాలు, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, వేసవిలో తరచూ నీరు, మజ్జిగ, ORS తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ను అభినందించారు.విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసించి, సమ్మర్ కిట్ల అందజేతకు సహకరించిన దాతలను సత్కరించారు.
👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు…లాడ్జీలు, బస్టాండ్‌లలో పోలీసుల తనిఖీలు…చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు ..లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి..శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సూచనలతో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో కందుకూరు టౌన్ ఎస్సై నాగరాజు, కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణ, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కందుకూరు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానిత ప్రదేశాలు, అనుమానిత వ్యక్తుల గృహాలు, పార్సెల్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలైన RTC బస్టాండ్ మరియు ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించి, అక్కడ ఉన్న అనుమానిత వ్యక్తులు మరియు వస్తువులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పట్టణంలోని లాడ్జీలను తనిఖీ చేసి, లాడ్జ్ యజమానులకు బస చేసే వ్యక్తుల ఆధార్ కార్డులు మరియు ఇతర వివరాలను నమోదు చేసే విధంగా సరైన రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రికార్డులు నిర్వహించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు బస చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తదుపరి, కందుకూరు పట్టణానికి వచ్చే ప్రధాన మార్గాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా లేదా సరైన పత్రాలు లేని వాహనదారులపై చర్యలు తీసుకొని రూ. 25,000/- జరిమానా విధించారు.ఈ సందర్భంగా కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా మాట్లాడుతూ, కందుకూరు పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినప్పుడు లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వెంటనే పోలీసులకు,డయల్ -112 సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని ప్రజలకు తెలియజేసినారు.
👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..
2026 ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో కంభం లోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ప్రతిభను కనబరిచినారు.. ఫస్ట్ ఇయర్ లో కే శరణ్య 470 కి గాను 459 మార్కులు( ఎంపీసీ ),పి వైష్ణవి 450 కి 435 మార్కులు (బైపిసి),
సిహెచ్ విఎస్ నీలిమ ( సీఈసీ) 500 మార్కులకు 458 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ బైపిసి లో ఎం రియాజ్ 962 ఎస్ పి రాహుల్ (సెకండ్ సిఈసి) 942 మార్కులు సాధించారు. వీరికి కళాశాల కరస్పాండెంట్ సిహెచ్ రాంభూపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ కె.వి కుమార్ సంజీవరెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.
👉ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ మార్కాపురం జిల్లా… కంభం… జిల్లా ఇంచార్జి జిల్లా వ్యవసాయ అధికారి డి.బాలాజీ నాయక్ కంభం మండలంలోని ఎరువుల దుకాణాల్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వారికి తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మార్పీ ధరలు మించి ఎరువులు మరియు పురుగుమందులు అమ్మరాదని హెచ్చరించారు. యూరియా అన్ని రైతుసేవ కేంద్రాలలో అందుబాటులో ఉందని, ఎండాకారు పైర్లు వేసిన రైతులు పంట వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులకు తెలియజేసి యూరియా తీసుకోవాలని, ఎరువుల కొరత లేదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దరవీడు మరియు కంభం మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…