👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..! ఇజ్రాయెల్‌లో యూదుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా జెరూసలేం వంటి చోట్ల క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై కొందరు తీవ్రవాద యూదులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇప్పటికే ఉద్రిక్తతలు తారా స్థాయిలో ఉన్న తరుణంలో, ఇజ్రాయెల్ సైనికుడు ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేయడం ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’గా మారింది. మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు యుద్ధాన్ని మరో ప్రమాదకరమైన మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
ఇజ్రాయెల్ జవాను చర్యపై ప్రపంచవ్యాప్త నిరసన.. యుద్ధ క్షేత్రంలో సైనికులు కేవలం ప్రాణాలకే కాదు.., అక్కడి సంస్కృతి, మతపరమైన కట్టడాలు, నిర్మాణాలను కూడా రక్షణగా ఉండాలి. కానీ, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన ఒక సైనికుడు ఏసుక్రీస్తు విగ్రహాన్ని సుత్తితో పగలగొడుతున్న దృశ్యాలు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రాథమికంగా యూదుల దేశం కావడం, లెబనాన్‌లో క్రైస్తవ జనాభా గణనీయంగా ఉండడంతో ఈ ఘటన మతపరమైన ఘర్షణలకు దారితీస్తుందేమోనన్న భయం నెలకుంది. వైరల్ ఫోటోతో ఐడీఎఫ్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలో, ఒక సైనికుడు పూర్తి సైనిక దుస్తుల్లో ఉండి, చర్చి లేదంటే ప్రార్థనా స్థలానికి వెలుపల ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మొదట ఇది ఫేక్ న్యూస్ కావచ్చని భావించినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా స్పందిస్తూ.. ఆ ఫోటోలో ఉన్నది తమ సైనికుడేనని ధ్రువీకరించింది. సైనికుడి ప్రవర్తన తమ నైతిక విలువలకి విరుద్ధమని, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మతపరమైన సెంటిమెంట్ క్రైస్తవ మతానికి కేంద్రమైన వాటికన్ నుంచి మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంస్థలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. యుద్ధంలో ప్రత్యర్థి సైన్యాన్ని ఎదుర్కోవాలి కానీ, పౌర చిహ్నాలను, దైవ విగ్రహాలను ధ్వంసం చేయడం యుద్ధ నేరం కిందకు వస్తుందని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు. ఇలాంటి ఘటనల వల్ల ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల ఉన్న సానుకూలత తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమెరికాలోని క్రైస్తవ మితవాద గ్రూపులు ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
** లెబనాన్ సామాజిక సమీకరణాలు.. లెబనాన్ ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఉండే దేశం. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడ పురాతనమైన చర్చిలు, క్రైస్తవ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇజ్రాయెల్ కావాలనే ఇలాంటి చర్యల ద్వారా లెబనాన్‌లోని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని అక్కడి స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. చర్చిలు, విగ్రహాలు సామాన్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే కేంద్రాలు. వాటిపై దాడులు చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆసక్తికరంగా టీవీకే ప్రచారం యూదు వర్సెస్ క్రైస్తవ వివాదమా? ఇజ్రాయెల్‌లో యూదుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా జెరూసలేం వంటి చోట్ల క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై కొందరు తీవ్రవాద యూదులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సైనికుడు నేరుగా యుద్ధ భూమిలో ఇలాంటి పని చేయడం, ఇజ్రాయెల్ సైన్యంలోని మతపరమైన తీవ్రవాదాన్ని ఎత్తిచూపుతోందని విమర్శలు వస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం భూభాగాల కోసం జరిగేది మాత్రమే కాదు, అది విలువల కోసం కూడా జరగాలి. ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల ఇజ్రాయెల్‌కు యుద్ధంలో వచ్చే లాభం ఏమీ లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. ఐడీఎఫ్ చేపట్టిన విచారణలో నిందితుడికి కఠిన శిక్ష పడితే తప్ప, ఇజ్రాయెల్ తన ప్రతిష్టను కాపాడుకోవడం కష్టం. ఆయుధాలతో యుద్ధం గెలవచ్చు కానీ, ద్వేషంతో మనసులు గెలవలేరు అనే సత్యాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్.. వరుస ప్రమాదాలతో కీలక నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు టావెల్స్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు ఒక దేశం, ఒకే విధానం పేరిట పర్మిట్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు టావెల్స్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు ఒక దేశం, ఒకే విధానం పేరిట పర్మిట్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కడ తిరుగుతాయో అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివుంటుందని తేల్చిచెప్పింది. ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ట్రావెల్స్ కి బ్రేకులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కేంద్రం బస్సు పర్మిట్ల జారీ విధానాన్ని మార్చింది.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దేశం – ఒకే విధానం అమలులోకి తెచ్చింది.
అంతవరకు బస్సు ఏ రాష్ట్రంలో తిరిగితే అక్కడే రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సివుండేది. ఈ కారణంగా దేశంలో రకరకాల పన్ను విధానాలు అమలు అవుతున్నాయని కేంద్రం భావించి ఒకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆలిండియా పర్మిట్ జారీ చేసి బస్సు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా దేశం మొత్తం తిరగవచ్చు అన్న వెసులుబాటు కల్పించింది. ఆలిండియా పర్మిట్ కు రూ.2 లక్షలు వసూలు కేంద్రం వసూలు చేసి అందులో సగం రాష్ట్రాలకు పంచుతామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. అయితే కేంద్ర విధానం బస్సు ఆపరేటర్లకు వరంగా మారింది. దేశంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటుతో నిబంధనలు కఠినంగా ఉండే తెలుగు రాష్ట్రాలను కాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లకు మొగ్గుచూపాయి. అదేసమయంలో ఆలిండియా పర్మిట్లకు డబ్బు చెల్లించి తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహించేవి. తెలుగు రాష్ట్రాల్లో త్రైమాసిక ఫీజు రూ.90 వేలు ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఫీజు ఏడాదికి రూ.50 వేలే ఉండటం వల్ల బస్సు ఆపరేటర్లు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి రాష్ట్రంలో సర్వీసులు నడిపేవారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంతో అంగీకరించాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో నమోదైన బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సివుండటం, ఈ విషయంలో ఆ రాష్ట్రాలు సీరియస్ గా లేకపోవడంతో ఆపరేటర్లు భద్రతను గాలికొదిలేసి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. బస్సు సీటింగ్ సరిగా లేకపోవడం, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, అత్యవసర డోర్లు సరిగా నిర్వహించకపోవడంతో ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. ప్రధానంగా నాగాలాండ్, అరుణాచలప్రదేశ్, లక్షదీప్, డయ్యూడామన్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ఏపీ-తెలంగాణ మధ్య సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని చెబుతున్నారు.*ఇటీవల కర్నూలు, మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ప్రమాదాలపై లోతుగా విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.*ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు అన్నింటి నుంచి ఇదే విధమైన లేఖలు ప్రభుత్వానికి వెళ్లడంతో ఒకే దేశం – ఒకే విధానం అన్న నిబంధనను పూర్తిగా తొలగించింది. పాతవిధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ పక్కాగా తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివుండటమే కాకుండా, ఫిట్ నెస్ సర్టిఫికెట్లను కూడా ఇక్కడే పొందాల్సివుంటుంది. దీనివల్ల పక్కాగా నిబంధనలు అమలు చేసి బస్సు ప్రమాదాలు తగ్గేలా చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
👉 కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణహత్యకు గురైన వైకాపా నాయకుడు. స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా, దాదాపు రూ.100 కోట్ల విలువైన 145 ఆస్తిపత్రాలు లభ్యమ య్యాయి. వాటిలో ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్డీ డ్లతో పాటు ఆస్తుల క్రయ, విక్రయాల ఒప్పం దపత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు విశ్లే షిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల నేప థ్యంలోనే పెద్ద దస్తగిరిని హత్యచేశారని, ఈ హత్యలో కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్, వైకాపా నాయకుడు బండి
నిత్యానందరెడ్డి ప్రదాన కుట్రదారనిపోలీసులు నిగ్గుతేల్చారు. నిత్యానందరెడ్డి, దస్తగిరి మధ్య భారీగా ఆర్థిక, స్థిరాస్తి లావాదేవీలున్నా యని గుర్తించారు. తొలుత ఈ హత్యను రౌడీగ్యాం గెల మధ్య ఘర్షణగా భావించారు. అయితే దస్తగి రితో పాటు హత్యచేసిన గ్యాంగ్తోనూ నిత్యానందరె డ్డికి సంబంధాలున్నట్లు ఆధారాలు లభించటంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిం చారు. తాము నిత్యానందరెడ్డి నిర్వహిస్తున్న వ్యవస్థీ కృత క్రిమినల్ నెట్వర్క్ పనిచేస్తున్నామని, తమ నాయకుడు ఆయనేనని వారు వాంగ్మూలమిచ్చారు. మరోవైపు కాల్ డీటెయిల్ రికార్డులు పరిశీలించగా.. నిందితులంతా హత్యకు ముందు. తర్వాత నిత్యానంద రెడ్డితో సంప్రదింపుల్లో ఉన్నట్లు తేలింది. హత్య చేసిన మూడు గంటల తర్వాత ముగ్గురు నిందితులు నిత్యా నందరెడ్డిని కలవగా, అతనే వారికి ఆశ్రయమిచ్చినట్లు వెల్లడైంది. ఈ హత్య వెనుక మరికొందరు పెద్దలు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే వారి పేర్లు బయటకు రావచ్చని తెలుస్తోంది
నిత్యానందరెడ్డి పై లుకౌట్ సర్క్యులర్..!!
పెద్ద దస్తగిరి హత్య కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొనగా.. నిత్యానందరెడ్డిని 13వ నింది తుడు (ఏ-13)గా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీ సులు లుకౌట్ సర్క్యులర్ జారీచేశారు. మిగతా నింది తుల్లో 11 మందిని అరెస్టుచేసి.. ఆదివారం కడప స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయాధికారి వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు.
* ఏ1: పేరం రవి (చెన్నూరు). ఏ2. పేరం రాజు (చెన్నూరు), ఏశి: అవ్వారి వెంకటేశ్ అలియాస్ వెంకీ (ఆలంఖాన్పల్లె), ఏ4. తిరుపతి వెంకటసురేంద్ర (ఆలంఖాన్పల్లె), ఏ5: వనపర్తి వెంకట మనోహర్ (ఆలంఖాన్పల్లె), ఏ6: లేవాకు ఉపేంద్రరెడ్డి (వల్లూరు మండలం, చిన్నలేబాక), ఏ7: గంధం విజయకుమార్ (అలంభాన్పల్లె), ఏరి: హరిగోపుల శివప్రసాద్ (అలంఖా న్పల్లె), ఏరి, ఆదిమూలపు వెంకట నరేంద్ర (ముత్తరా. సుఫలై కడప), ఏ10. గొడుగునూరు రాంగోపాల వర్మ (పక్కీర్పల్లె, కడప), ఏ11: పెయ్యాల శివ మండలం) అరెస్టయ్యారు.
* ఈ కేసులో నిందితులైన పేరం రాజుపై 11, పేరం రవి పై 7, లేవాకు ఉపేంద్రరెడ్డిపై 4, అవ్వారి వెంకటే ్ప 7. పెయ్యల శివపై 2, తిరుపతి వెంకటసురేంద్రపై 3 క్రిమినల్ కేసులున్నాయి. ముఠా నాయకుడైన నిత్యా నందరెడ్డిపై 5 కేసులున్నాయి. వీటిలో హత్య, హత్యా యత్నం, దాడులు తదితర నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నింది తుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేర నియంత్రణ కింద బీఎన్ఎస్ సెక్షన్111(1) ను కూడా జోడించారు.
హత్యకు సమస్తం
సమకూర్చింది నిత్యానందరెడ్డి..!!
హత్య కేసులో నిందితులైన ఆదిమూలపు వెంక టనరేంద్ర (ఏ-9), రాంగోపాల్వర్మ (ఏ-10)లు నిత్యానందరెడ్డి తరపున వ్యవహారాలు చక్కబెడు తుంటారు. పెద్ద దస్తగిరిని హత్య చేశాక వీరిద్ద రితో పాటు పేరం రాజు (ఏ-2) నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను కలిసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు కుట్ర పన్నడం, నింది తులకు ఆశ్రయం కల్పించడం మొదలు మొత్తం ఘటనలో నిత్యానందరెడ్డిదే ప్రధాన పాత్ర అని, నిందితులకు అవసరమైన డబ్బు, వాహనాలు అన్నీ ఆయనే సమకూర్చారని పోలీసులు గుర్తించారు.
👉 కడప CCS కు ఇన్స్పెక్టర్‌గా డి.హాజీ వలీ బాధ్యతలు స్వీకరణ…
డి. హాజీ వలీ కడప CCS కు ఇన్స్పెక్టర్‌గా రిపోర్ట్…
నంద్యాల DTC నుంచి కడపకు బదిలీ..
CCS-11లో బాధ్యతలు స్వీకరణ..పులివెందుల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌గా గత అనుభవం…ఎస్సైగా లింగాల పోలీస్ స్టేషన్‌లో సేవలు…పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశారు..పోలీస్ శాఖలో విస్తృత అనుభవం కలిగిన అధికారి..కడపలో నేర నియంత్రణపై దృష్టి పెట్టనున్న హాజీ వలీ…
👉 కడప జిల్లా మైదుకూరు పట్టణం లోని లాడ్జిలలో తెల్లవారుజామున ఎస్ఐ కత్తిరమణ తనిఖీలు…
మైదుకూరు పట్టణంలోని వివిధ లాడ్జిలపై సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యజమానులు, సిబ్బందికి సూచించారు.ఆధార్ కార్డు, వ్యక్తుల చిరునామాలు తప్పక నమోదు చేయాలని సూచించారు. .
అసాంఘిక చర్యలకు పాల్పడితే తీవ్రపరిణామాలు ఉంటాయని ఎస్ ఐ రమణ హేచ్చరించారు .
👉జోనల్ కోఆర్డినేటర్ గా నియమించబడ్డ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని చిలకలూరిపేట పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయం నందు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండ్రగుంట శ్రీనివాసరావు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు*
👉పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం గణపవరంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో దారుణ ఘటన*
*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రసాద్ దాస్ పంతులు అనే కార్మికుడు*
ఒకే మిల్లులో పనిచేస్తున్న నిందితుడు ప్రసాద్ దాస్ పంతులు(36) , బాదిత బాలిక కుటుంబం…
ఆదివారం సాయంత్రం బాలికకు మాయ మాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన ప్రసాద్ దాస్
జరిగిన విషయాన్ని తన ( తల్లిదండ్రులు ) కుటుంబ సభ్యులకు తెలిపిన బాలిక…
ప్రసాద్ దాస్ పంతులు కు దేహశుద్ధి చేసి, ఒంటి పై వాతలు పెట్టిన తోటి కార్మికులు…నాదెండ్ల పోలీసులకు సమాచారం అందించిన తోటి కార్మికులు నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
👉పాలు పొంగాయని భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.*కడప తాలూకా ఎస్సై మహమ్మద్ రఫి వివరాల మేరకు.. కడప బాలాజీనగర్కు చెందిన వెంకటసుబ్బయ్య (53), అనురాధ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వెంకటసుబ్బయ్య గతంలో గల్ఫ్ ఉండేవారు. ఇటీవల కడపకు వచ్చి దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేవారు. ఈనేపథ్యంలో ఆదివారం భార్య స్టర్పై పాలు పెట్టడంతో అవి పొంగాయి. దీంతో భర్త నీకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేదంటూ కోపంతో తలను గోడకేసి కొట్టుకునే క్రమంలో చిన్నగాయమైంది. దీంతో భయపడి భార్య బయటికి వచ్చి కూర్చుంది. ఈ సమయంలో భర్త ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నారు. ఆమె కొద్ది సేపటికి ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్కు వేలాడుతుండడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి వెంకటసుబ్బయ్యను ఉరి నుంచి కిందికి దించిన కొద్ది సేపటికే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
👉గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు… గేదెలకు తీవ్ర గాయాలు*
మంచిర్యాల జిల్లా జన్నారం:
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రవాహ ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం.
గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా, మేత కోసం తిరుగుతున్న బర్లలో కొన్ని ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలు బర్లకు తీవ్ర గాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన పశువులను సమీపంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు.
ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యుల్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
👉హనుమకొండలో విద్యార్థినిపై దారుణం..*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి,స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు.బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం.ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…
సామాజిక మాధ్యమాల్లో పలువురు డబ్బులున్న మైనర్ బాలికలను ప్రేమ పేరిట వంచించి.. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ రూ. లక్షలు వసూలు చేస్తున్న కేటుగాడు …తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయిన 20 మందికి పైగా బాలికలు…బాధితుల ఫిర్యాదులతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు ..
ప్రస్తుతం మియాపూర్లో నివాసముంటున్న.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన ఆజాద్ హైదరాబాద్ పరిసరాల్లోని సంపన్నుల ఇళ్లలో వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లల్లోని బాలికలు, యువతుల వివరాలు రాబట్టి.. తర్వాత వారిని అనుసరించి మోసానికి పాల్పడ్డ యువకుడు ..మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిల ప్రొఫైల్స్ ను పరిశీలించి.. డబ్బున్న అమ్మాయిలను ఎంచుకుని, చాటింగ్ చేస్తూ దగ్గరై, ఖరీదైన కార్లు, పబ్ లలో తాను దిగిన ఫొటోలు పంపేవాడు..ప్రేమ అనుకుని నమ్మి వచ్చిన యువతులను లోబరుచుకుని.. వారి ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేసిన ఆజాద్…
ఆ భయంతోనే ఇళ్లల్లో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి అతడికి ఇచ్చిన కొందరు బాలికలు, యువతులు
అయితే ఇటీవల జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన బాలిక(15)కు అర్జున్ పేరుతో ఆజాద్ ఇన్స్టా ద్వారా పరిచయం చేసుకొని.. రాత్రివేళల్లో ఆమె ఇంటికెళ్లి కలవగా, బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు..బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరై.. ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ ఫోన్ల నుంచి నిందితుడితో మాట్లాడిన బాలిక…
అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో ఆజాద్ ఏకాంతంగా గడపగా.. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బాలికను బెదిరించి రూ. లక్షలు కొట్టేసిన డ్రైవర్ భార్య సరస్వతి..మరో వైపు ఆజాద్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన రూ.29 లక్షల నగదును బాలిక చోరీ చేసి.. అందులో ఆజాద్‌కు రూ.13 లక్షలు, సరస్వతికి రూ10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్న కుటుంబసభ్యులు..
నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసగించినట్లు విచారణలో వెల్లడి..
గుంటూరులో కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా దగ్గరై.. గుంటూరు, హైదరాబాద్‌లో పలుమార్లు ఇద్దరూ పబ్లు, హోటళ్లకు తిరిగి.. ఆ ఫొటోలు, వీడియోలు చూపించి ఆమె నుంచి బంగారు గొలుసు కాజేసిన నిందితుడు
👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*

*మార్కాపురం జిల్లా, కంభం పట్టణ స్థానిక సోమా శేషు కుమార్ వారి కుటుంబ ఆధ్వర్యంలో నూతనంగా వి.ఎస్.ఎస్. (VSS) కన్వెన్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. గిద్దలూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో ఇలాంటి కన్వెన్షన్ హాల్స్ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

