👉కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన.. ఘటనలో 9 మంది భక్తులు మృతి, 13 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం..గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున చికిత్స ఖర్చులు..ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.
శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని…. దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని తెలిపింది.ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
👉ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషాద ఘటనతో కాశీబుగ్గ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
👉పలాస సిహెచ్ సి కి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి లోకేష్..మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, అచ్చెన్న..క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న లోకేష్.క్షతగాత్రులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన లోకేష్.

👉విపత్తులో విస్తృత సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన ప్రభుత్వ శాఖల సిబ్బందిని గౌరవించుకోవడం చాలా సంతోషకరం… అమరావతి..
మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో హాం మంత్రి అనిత కలిసి పాల్గొనడం జరిగింది. విపత్తు సమయంలో ఉత్తమ సేవలందించిన 175 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమొంటోలను అందించారు.
👉 రియాజ్ ఎన్కౌంటర్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ..రియాజ్ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేసే క్రమంలో ఒక బండి జప్తు చేయగా, అందులో అతనికి 3 లక్షల రూపాయలు దొరికాయి… అవి ఫేక్ నోట్లు అని తెలియక రియాజ్ అవ్వి ఖర్చు చేశాడు..ఈ గొడవలో కానిస్టేబుల్ ప్రమోద్ మధ్యవర్తిగా దిగి, లంచం డిమాండ్ చేశాడు. దీని వెనుక ఫేక్ నోట్ల కుంభకోణం ఉందని, రాజకీయ నాయకుల అండతో నడుస్తుందని కచ్చితంగా చెప్పగలము..రియాజ్ చనిపోయిన తర్వాత, అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు…అతని భార్య, తల్లిపై పోలీసులు లైంగిక దాడి చేశారు..ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి.. దీనిపై కచ్చితంగా సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలి.
👉కన్నబిడ్డ శవాన్ని కొనుక్కున్న తండ్రి..😱😱😱!!*బెంగుళూరు..ఇదేమి దేశం, ఇదేమి సమాజం. నిన్నటి నుండి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక వ్యధాభరితమైన వార్త గుండెలను కలిచి వేస్తుంది. ఒక అత్యున్నత అధికారి శివకుమార్. ప్రతిభావంతురాలైన కూతురు అక్షయ. ఏ శాపవశాత్తో ఆ చదువుల తల్లి మరణించింది. రిటైరైన తండ్రి కృంగిపోయాడు. కానీ, మిగిలిన కార్యక్రమాలు చేసి, కూతురుకి తలకొరవి పెట్టాల్సి వచ్చినందుకు కుమిలి కుమిలి ఏడ్చాడు. .కానీ, కూతురు శవానికి పోస్ట్ మార్టమ్ చేయాలంటే, పోలీసు స్టేషన్ అధికారి ఎఫ్ఐఆర్ కట్టి, ఆ రిపోర్టు ఇవ్వాలి. అందుకు ఆ తండ్రిని బెంగుళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ లంచం అడిగాడు. తండ్రి నిశ్చేష్టుడై పోయాడు. కూతురు శవానికి కొంత ధర చెల్లించాల్సి వచ్చినందుకు చింతించాడు. తర్వాత అంబులెన్స్ కు పోస్ట్ మార్టానికి, మున్సిపల్ డెత్ సర్టిఫికేట్ కు, చివరకు కూతురు శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసిన శ్మశానంలో కూడా లంచం చెల్లించ వలసి వచ్చింది. ఆ తతంగమంతా చూసిన అతనికి బ్రతకడం మీద ఆశ చచ్చిపోయి ఉంటుంది. ఒక వంద, ఒక వెయ్యి, రెండు వేల రూపాయల కోసం, ఇంత నీచానికి ఒడిగడతారా?
❇️రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు*
❇️ సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌ను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
❇️ ఆ సమయంలో లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు. అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించ వచ్చు. అలాగే లోయర్ బెర్త్ లభ్యమైతేనే బుక్ చేయమనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
❇️రిజర్వ్ కోచ్‌లలో నిద్ర వేళలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్ణయించారు
👉 చాక్లెట్ల ఆశ చూపి కోనసీమలో 6వ తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ 52ఏళ్ల వ్యక్తి😱😱
కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో 6వ తరగతి బాలికపై వరుసకు బంధువయ్యే వెంకటసత్యకృష్ణ అనే 52ఏళ్ల వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల అతడు బాలిక ఇంటికొచ్చి చాక్లెట్లు ఇచ్చి వెళ్లడాన్ని తల్లి గమనించి కుమార్తెను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఐ.పోలవరం హైస్కూల్ విద్యాకమిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు. గతంలోనూ ఇతను పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది
👉 నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వరకు నిర్ణయం తీసుకోకపోతే, ఈ నెల 3వ తేదీ (సోమవారం) నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. బంద్ సమయంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. బకాయిలపై గత 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి, రూ.1200 కోట్లు అడిగితే, కేవలం రూ.300 కోట్లు ఇచ్చారని పేర్కొంది
👉 ఈదుల వారి వివహ మహోత్సవంలో పాల్గొన్న మాజి మంత్రి ఆదిమూలపు,మాజి ఎమ్మెల్యే అన్నా*
*గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం పాలకవీడు గ్రామంలో ఈదుల రాజశేఖరరెడ్డి,సుజాత దంపతుల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధూవరులయిన లయ,ప్రతాప్ రెడ్డి లను ఆశీర్వదించిన మాజి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్,గిద్దలూరు మాజి శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు…
*చిలకల వారి వివహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట పట్టణంలోని దర్గా కొండ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు చిలకల రమణారెడ్డి,లక్ష్మీ దంపతుల కుమారుడు వివాహ మహోత్సవానికి హాజరయి నూతన వధూవరులు అయిన హరీష్ కుమార్ రెడ్డి,జాహ్నవి రెడ్డిలను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు…
*వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
👉ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*

