👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

👉పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
👉హర్మూజ్‌లో కంటైనర్‌ నౌకపై దాడి*
హర్మూజ్‌ జలసంధిలో కంటైనర్‌ నౌకపై ఇరాన్‌ ఐఆర్‌జీసీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నౌకకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్రిటన్‌ మిలిటరీకి చెందిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ వెల్లడించింది. ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండో సారి కాల్పుల విరమణ చేసినప్పటికీ శాంతి చర్చలపై ఇంకా సందిగ్ధం వీడడం లేదు. హర్మూజ్‌ను అమెరికా నేవీ దిగ్బంధించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*
👉రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీముడు అజిత్ కుమార్ పరారీ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. అనారోగ్యం నెపంతో జైలు నుంచి బయటకు వచ్చి, పక్కా ప్లాన్‌తో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఈ “టెక్” ఖైదీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ఆన్‌లైన్ మోసాల్లో ఆరితేరిన నేరగాడు. తెనాలిలో నమోదైన కేసులో ఇతను రేపల్లె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మార్చి 27న తనకు ఒంట్లో బాగోలేదని జైలర్ మన్నెం వెంకటేశ్వరావుకు చెప్పడంతో, ఎస్కార్ట్‌తో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే, ఈ ఆసుపత్రి ప్రయాణం వెనుక పెద్ద కథే నడిచింది. తమిళనాడులోని తిరువళ్లూరులో ఉంటున్న అజిత్ సోదరి ఫోన్ పే ఖాతా నుంచి జైలర్ వెంకటేశ్వరావుకు ఫోన్ పే ఖాతాకు రూ. 60,000అందినట్లు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. ఈ డబ్బు అందిన తర్వాతే అజిత్‌ను ఆసుపత్రికి పంపేలా జైలర్ చక్రం తిప్పాడని గుర్తించారు.
మార్చి 28న జీజీహెచ్‌లో ఉన్న అజిత్, తన వద్ద ఉన్న ఎస్కార్ట్ కానిస్టేబుల్‌కు రూ. 500** ఇచ్చి, “నువ్వు వెళ్లి టిఫిన్ చేసి, నాకు కూడా తీసుకురా” అని నమ్మబలికాడు. కానిస్టేబుల్ టిఫిన్ చేసే పనిలో ఉండగా, వాష్ రూమ్‌కు వెళ్తానని చెప్పిన అజిత్, అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చి ఆటో ఎక్కి మాయమయ్యాడు. ఆటో ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
పరారీ వెనుక సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు అవినీతి కూడా ఉందని నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. లంచం తీసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జైలర్ మన్నెం వెంకటేశ్వరావును సస్పెండ్ చేశారు. ఎస్కార్ట్ పోలీసుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది, త్వరలోనే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాంకేతికతను వాడటంలో అజిత్ కుమార్ దిట్ట. ఫోన్లు వాడకపోవడం, తరచూ స్థావరాలు మారుస్తుండటంతో 20 రోజులు గడిచినా అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. ప్రస్తుతం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని, అధికారులనే ప్రలోభపెట్టి ఖైదీ పారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
👉రాజమహేంద్రవరం,*ఎస్‌బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం కేసులో బ్యాంక్ అధికారి అరెస్టు*
2019 సంవత్సరం జూన్ 15 నుండి సెప్టెంబర్ 4 మధ్య కాలంలో కవల వెంకట నరసింహం అనే వ్యక్తి, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సిబ్బందితో కుమ్మక్కై సుమారు రూ.6.87 కోట్ల విలువ గల 25 AABL రుణాలను మోసపూరితంగా పొందిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.No.22/2024 కింద IPC సెక్షన్లు 420, 409, r/w 120-B మరియు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం, 1988 సెక్షన్ 13(2) ప్రకారం సీఐడీ విభాగంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా, ప్రక్కిలంక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్-కమ్-డిప్యూటీ మేనేజర్ (అడ్వాన్స్)గా పనిచేసిన కొవ్వాసి వెంకటరావు దొరను ఈ రోజు (22.04.2026) అరెస్టు చేశారు. ఈ చర్య సీఐడీ ఈఓడబ్ల్యూ ఎస్పీ ఎస్. శ్రీధర్ గారి పర్యవేక్షణలో, కేసు దర్యాప్తు అధికారి అదనపు ఎస్పీ శ్రీమతి అస్మా ఫరీన్ చేత చేపట్టబడింది.
అరెస్టు చేసిన ముద్దాయిని అవినీతి నిరోధక చట్టం కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి, రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా, కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీఐడీ, రీజనల్ ఆఫీసు, రాజమండ్రి. అస్మా ఫరీన్ వెల్లడించారు.
👉తమిళనాడు’ లో ..*రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.*
_*తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల* పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … *అధికారులు తనిఖీలను మరింత కఠినతరం* చేశారు._
_ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … *భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం,* మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు._
_ఇప్పటివరకు పట్టుబడిన *నగదు, వస్తువుల* మొత్తం విలువ … *రూ.1200 కోట్లను* దాటిందని అధికారులు వెల్లడించారు._
ఎన్నికల పర్యవేక్షణ బృందాలు … నేరుగా *రూ.500 కోట్లకు పైగా* విలువైన నగదు, *ఇతర వస్తువులను* స్వాధీనం చేసుకున్నాయి._
👉ప్రకాశం జిల్లా : ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు*
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు TC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని, అట్టి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని DEO రేణుక హెచ్చరించారు.
అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి*
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు..
జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం….
చర్యలు తీసుకోవాలని ఆదేశం
ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని ఆదేశం…
👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.*
మౌలాలిలో డ్రగ్‌ తయారీ కేంద్రంపై అధికారుల దాడులు..
రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌..
ముగ్గురు నిందితుల అరెస్ట్‌.
👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..! ఆసుపత్రి బిల్లులు పెరగడం వల్ల నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ప్రతి ఏటా 15-20 శాతం పెరుగుతున్నాయి.
ఒక మధ్య తరగతి మనిషికి ప్రాణం మీద కంటే ఆసుపత్రి బిల్లు మీద ఎక్కువ భయం కలుగుతున్న నేటి రోజుల్లో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప ఊరటనే చెప్పాలి. ప్రాణం కాపాడుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి సామాన్యుడిని రక్షించడానికి ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు ‘మెడికల్ మాఫియా’కు పగ్గాలు వేసే దిశగా కనిపిస్తోంది. భారతదేశంలో వైద్యం అనేది ఒక సేవా రంగం నుంచి వ్యాపార రంగంగా మారిపోయింది. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక సామాన్యుడు చికిత్స పొందాలంటే, అది వారి జీవితకాల పొదుపు మొత్తాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలో, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసే అడ్డగోలు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం చివరకు ఒక కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురాబోతోంది. వైద్య పరికరాల ధరలపై లాభాల పరిమితిని విధించడం ద్వారా వైద్య ఖర్చులను భారీగా తగ్గించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యం. * ఏమిటీ ‘మెడికల్ మాఫియా’ వివాదం..? చాలా సందర్భాల్లో ఆసుపత్రులు తమకు అతి తక్కువ ధరకే లభించే సిరంజిలు, గ్లౌజులు, కాన్యులాస్ వంటి వాటిపై కూడా వందల రెట్లు ఎక్కువ లాభాన్ని వేసి రోగికి బిల్లు వేస్తుంటాయి. పది రూపాయల వస్తువును వంద రూపాయలకు అమ్మడం, అలాగే పేస్‌ మేకర్లు, స్టెంట్లు వంటి ఖరీదైన పరికరాలపై భారీగా కమీషన్లు వసూలు చేయడం వల్ల బిల్లులు లక్షల్లోకి చేరుతున్నాయి. ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందే చెప్పకపోవడం, బిల్లింగ్‌లో అస్పష్టత ఉండటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు సోషల్ మీడియాలో నిధుల కోసం వేడుకోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. * ప్రభుత్వ ధరల నియంత్రణ ఇలా! ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు బీమా సంస్థలు, ఇతర వాటాదారులతో కలిసి ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మార్జిన్ల పరిమితి: వైద్య పరికరాల కొనుగోలు ధరపై ఆసుపత్రులు ఎంత శాతం వరకు లాభం వేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి రూపాయి కూడా అదనంగా వసూలు చేసేందుకు వీల్లేదు. కేవలం స్టెంట్లు, కవాటాలే కాకుండా.. ప్రతి రోజూ వాడే కాటన్, చేతి తొడుగులు వంటి వాటిని కూడా ఈ నిబంధన పరిధిలోకి తీసుకువస్తారు. యూనిఫాం ప్రైసింగ్: ఆసుపత్రి గుర్తింపు లేదంటే ప్రాంతంతో సంబంధం లేకుండా, ప్రాథమిక వైద్య పరికరాల ధరలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బీమా ప్రీమియంలపై సానుకూల ప్రభావం ఆసుపత్రి బిల్లులు పెరగడం వల్ల నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ప్రతి ఏటా 15-20 శాతం పెరుగుతున్నాయి. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు నియంత్రణలోకి వస్తే, బీమా కంపెనీలకు క్లెయిమ్ ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల సామాన్యులు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా తగ్గే అవకాశం ఉంది లేదా కనీసం స్థిరంగా ఉంటాయి. బిల్లింగ్‌లో పారదర్శకత రావడం వల్ల బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య ఉండే వివాదాలు కూడా తగ్గుతాయి. సవాళ్లు మరియు ఆచరణ ఈ ఫ్రేమ్‌వర్క్‌ అమలు చేయడం అంత సులభమైనది కాదు. ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిర్వహణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన సేవలు అందించాలంటే ఖర్చు తప్పదని వాదించవచ్చు. అయితే, ప్రభుత్వం ‘లాభం ఉండాలి కానీ దోపిడీ ఉండకూడదు’ అనే సూత్రాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం గనుక ఈ కార్యాచరణను కఠినంగా అమలు చేస్తే, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇదొక చారిత్రాత్మక మార్పు అవుతుంది. వైద్యం కోసం అప్పులపాలయ్యే కుటుంబాల సంఖ్య తగ్గుతుంది. ఆసుపత్రికి వెళ్తే ప్రాణం దక్కుతుందనే ధీమాతో పాటు, ఆస్తి మిగులుతుందనే నమ్మకం కూడా సామాన్యుడికి కలగాలి. అప్పుడే ‘అందరికీ ఆరోగ్యం’ అనే లక్ష్యం నెరవేరుతుంది.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!