👉పవన్ కళ్యాణ్ రాకతో నిరాశకు లోనైన రైతులు** కోడూరు :*
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది మా రైతుల సమస్యలు పరిష్కరించి మమ్ములను ఆదుకుంటాడని కొండంత ఆశతో ఎదురుచూసిన కోడూరు మండలం రైతుల ఆశ అడి ఆశ అయినట్ల అయ్యింది పవన్ కళ్యాణ్ రాక…
స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డు పక్కన ఉన్న వరి పొలాలను చూపించి కేవలం ఒకే రైతు కుటుంబం తో మాట్లాడిస్తే మండల సమస్య అంతా తెలుస్తుందా, మా ఓట్ల అయితే కావాలి కానీ మా సమస్యల గురించి పట్టించుకోరా అని మహిళా రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తు స్థానిక నేతలపై అధికారులపై విరుచుకుపడ్డారు.
మరి కొంతమంది రైతులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కనీసం మండల కేంద్రమైన కోడూరు కూడా రాకుండా చేశారని, కోడూరు మండలానికి చెందిన వేలాది ఎకరాలు సముద్ర తీరాన ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడలేదని, ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతున్న వరి పొలాలు గురించి,శిథిలావస్థలో ఉన్న పాలకాయతిప్ప అవుట్ ఫాల్స్ స్ల్యూయిల్స్ గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లిన వారు కూడా ఎవరూ లేరని, ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రైతులను ఆదుకుంటారని ఆశిస్తే ఇలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
👉 తుఫాను దాటికి దెబ్బతిన్న రోడ్లు, వాటి పునర్నిర్మాణానికి అయ్యే వ్యయంపై సమగ్ర నివేదిక రూపొందించండి.. అధికారులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి ఆదేశం.. టంగుటూరు..తూర్పు నాయుడుపాలెం.. తుఫాను దాటికి కొండపి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి డీ.బీ.వి స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….మొంథా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో పాడైపోయిన సిసి రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర రోడ్ల వివరాలు సేకరించి వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. పూర్తిగా దెబ్బతిన్న కల్వర్టుల స్థానంలో కొత్త వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా ఎంత మేర పాడయ్యాయో వివరాలు సేకరించి త్వరితగతిన నివేదిక అందజేయాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారుల్ని ఆదేశించారు.
**అనంతరం ఆయన శిoగరాయకొండ మండలం, పాకల.. ఊళ్ల పాలెం..గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి 25 కేజీల బియ్యం మరియు మత్స్యకారులకు 50 కేజీ ల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ, మండల ప్రత్యేక అధికారి చిరంజీవి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
👉ఏఎంఆర్ కార్పొరేట్ సంస్థ సీనరీజ్ బలవంతపు వసూలుకు నిరసనగా బుధవాడ సెంటర్లో రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు, ట్రాక్టర్ యజమానులు, టిప్పరు, ట్రాలీ డ్రైవర్లు యజమానులు, సైజు రాళ్ల కూలీలు, కంకర మిల్లుల కూలీలు పాల్గొన్నారు.. మర్రి పూడి.. ప్రకాశం జిల్లా..
👉 ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం..మర్రిపూడి మండలం, రాజుపాలెం గ్రామంలో మొంథా తుఫాన్ వలన దెబ్బతిన్న సజ్జ పంటను పరిశీలించి, అధికారులు, రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి . మంత్రి వెంట కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
👉పాత నేరస్థులపై పటిష్ట అనుసరణ.. ఎమ్.ఎస్.సీ.డి పద్దతితో జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టే విధానాలు అనుసరిస్తున్న ప్రకాశం పోలీసు బృందం*
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు పాత నేరస్తులను గుర్తించి, వారి యాక్టివ్ మోనిటరింగ్, పోలీసులు మరియు సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం ద్వారా ఎమ్.ఎస్.సీ.డి (M S C D) పద్దతిని ఉపయోగిస్తూ అది నియమావళి ప్రకారం అమలు చేస్తున్నారు.ఈ విధానంలో రికార్డు చెక్‌లు, స్థాయి పరిశీలనలు, సీఐఅర్/ఆర్కైవ్ సంబంధిత పరిశీలనలు, స్టేడీ వాచ్ మరియు ఫీల్డ్ ఆపరేషన్లు సమకూర్పుగా జరుగుతున్నాయి. పాత నేరస్తులు మళ్ళీ నేరాలకు దూరంగా ఉండేలా, సమాజ భద్రతను సంరక్షించడానికి జిల్లా పోలీస్ బృందం కట్టుబాటుగా పని చేస్తోంది.జిల్లా స్థాయిలో నేరం చేసిన వారు తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితులను నిరసిస్తూ, అవరోధాలను తొలగించి ప్రజల ఆపత్యాన్ని, సౌభ్రాత్యం మరియు భద్రతను రక్షించడమే మా ముఖ్యలక్ష్యం. ఎటువంటి సమాచారం మీకు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 100 నెంబర్‌లో తెలియజేయాలని శాఖ విజ్ఞప్తి చేస్తోంది.మన సొబగు సమాజాన్ని చట్టపరంగా సురక్షితం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, పోలీసుల సూచనలు పాటించి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రజలను కోరుతున్నారు.
👉గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో “ఐక్యత దినోత్సవం – ఏక్తా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీస్ అధికారులు కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, పోలీస్ గౌరవ వందనంతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… “భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన కృషి అపూర్వమైనది. స్వాతంత్ర్యం అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలను ఒకే భారతావనిగా విలీనం చేయడం ద్వారా జాతీయ సమైక్యతకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయన దూరదృష్టి, దేశప్రేమ, దృఢ సంకల్పానికి నిదర్శనం.” అని అన్నారు.
“భారతదేశం సమైక్యంగా ఉన్నందునే అనేక యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కోగలిగింది. సమాజంలో కూడా మనం తారతమ్యాలు లేకుండా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సమష్టిగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ‘ఐక్యంగా ఉంటే దృఢంగా ఉంటాము’ అనే సందేశాన్ని మనం ఆచరణలో పెట్టాలి.” అని ఎస్పీ పేర్కొన్నారు.“మనమందరం సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించిన ఐక్యతా సిద్ధాంతాలను ఆచరిస్తూ, భారతదేశ సమగ్రతను కాపాడే దిశగా కృషి చేయాలి.” అని అన్నారు.అనంతరం జిల్లా ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పౌరులకు జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం శాంతికి చిహ్నాలుగా తెలుపు పావురాలను మరియు జాతీయ జెండా రంగుల బెలూన్లను ఆకాశంలోకి ఎగరేసి, స్వేచ్ఛ మరియు ఐక్యత వైపు అందరూ అడుగులు వేయాలని ఎస్పీ , ఇతర పోలీస్ అధికారులు పిలుపు నిచ్చారు.తదనంతరం జిల్లా ఎస్పీ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యత పరుగు (Run for Unity) ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేశారు. ఈ ర్యాలీ కన్నావారి తోట మూడు బొమ్మల సెంటర్ వరకు వెళ్లి, తిరిగి పోలీస్ పరేడ్ మైదానం వద్ద ముగిసింది.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ , అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు , డీఎస్పీలు శ్రీనివాస రెడ్డి , బెల్లం శ్రీనివాస్ ,అబ్దుల్ అజీజ్, అరవింద్, ఏడుకొండల రెడ్డి , సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పౌరులు పాల్గొన్నారు.
👉మొంథా తుఫాను బాధితుడికి తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ చేయూత* తర్లుపాడు.. ప్రకాశం జిల్లా..
మొంథా తుఫాను బీభత్సం కారణంగా సర్వం కోల్పోయి, తీవ్రంగా ప్రభావితమైన ఓ బాధితుడికి ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ మానవతా దృక్పథంతో చేయూతనిచ్చి ఆదుకున్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితుడికి ఆయన స్వయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.మానవత్వంతో స్పందించిన తహసీల్దార్ .. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న గుంటు యేసు అనే బాధితుడి పరిస్థితి తెలుసుకున్న తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆయన స్వయంగా పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతనికి కావాల్సిన సరుకులు 25 కేజీల బియ్యం (రైస్) నిత్యావసర సరుకులు (పప్పులు, నూనె, ఉప్పు వంటివి)కూరగాయలుతహసీల్దార్ కె కె కిషోర్ కుమార్ అందజేశారు తహసీల్దార్ అందించిన ఈ చేయూత, తుఫాను కారణంగా నష్టపోయిన బాధితుడికి తక్షణ ఉపశమనాన్ని కలిగించింది. విపత్కర పరిస్థితుల్లో అధికారి చూపిన ఈ ఔదార్యం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈకార్యక్రమంలో లో రెవిన్యూ సిబ్బంది ఆర్ ఐ శ్రీ చరణ్, వి ఆర్ ఏ లు సిహెచ్ చెన్నయ్య, బి సుబ్బయ్య పాల్గొన్నారు
👉రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్‌పై సస్పెండ్..
శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సీపీ సజ్జనార్..ఆర్థిక నేరస్తుడిని ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా, రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్.. నిందితుల నుంచి తీసుకున్న రూ.2 కోట్లను పై అధికారులకు ఇచ్చినట్టు ఆరోపణలు..శ్రీకాంత్‌తో పాటు అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

