టిడిపి వైసిపి ముసుగులు తొలిగాయి వైఎస్ షర్మిల…పొలిటిక‌ల్ టాక్‌:😲😲😲… 👉ఈసీకి షాక్‌: బీహార్‌లో ఇద్ద‌రు పాక్ పౌరుల‌కు ఓటు హ‌క్కు!😱😱😱…👉ఋణ వసూళ్ల కు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం రద్దు చేయాలి ..బ్యాంక్ లు సైతం ప్రైవేట్ కిరాయి ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గుచేటు .. ఏ రుణమైనా కోర్టు ద్వారానే వసూలు చేసుకునే విధంగా ప్రభుత్వ చర్యలు అమలు చేయాలి .. వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల నుండి ఋణ గ్రస్తులకు రక్షణ కల్పించాలి .. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు..మేడా శ్రీనివాస్ డిమాండ్ ..**కంభం లో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర..

👉 టిడిపి వైసిపి ముసుగులు తొలిగాయి…పొలిటిక‌ల్ టాక్‌:😲😲😲   ఎవ‌రి .. ముసుగు తొల‌గించాలి ??? అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము వ‌ర‌కు, నాటి ఉప‌రాష్ట్ర‌ప‌తి నుంచి నేటి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వ‌ర‌కు కూడా వైసీపీ క్లియ‌ర్‌గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వైసీపీపై ఆమె ఇప్ప‌టి వ‌రకు అనేక ఆరోప‌ణ‌లు చేశారు. కానీ, ఇవి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం.. అన్న‌పై ఉన్న ఆస్తుల కోపం కావ‌డంతో ఎవ‌రూ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. విమ‌ర్శ‌లు కూడా చేయ‌లేదు.*** కానీ, తాజా గా వైసీపీ ముసుగు తొల‌గింద‌ని.. ఎన్డీయేకు, మోడీకి వైసీపీ మ‌ద్ద‌తు దార‌ని ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. వైసీపీ ముసుగు తొల‌గింద‌ని కూడా వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. ఎవ‌రికో ఒక‌రికి మ‌ద్ద‌తు త‌ప్ప‌దు. పైగా కేంద్రంలో మోడీ వచ్చిన త‌ర్వాత‌.. దా దాపు దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందు కే.. ఏపీలో వైసీపీ పైకి చెప్ప‌క‌పోయినా.. 2014 నుంచే ఒక స్ప‌ష్ట‌మైన స్టాండ్ తీసుకుంది. కాంగ్రెస్ యేత‌ర కూట‌మికి మ‌ద్ద‌తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు ద్రోహం చేసింద‌ని, అందుకే.. తాము ఎన్డీయేకు మ‌ద్దతిస్తు న్నామ‌ని.. తాజాగా వైసీపీ ప్ర‌క‌టించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము వ‌ర‌కు, నాటి ఉప‌రాష్ట్ర‌ప‌తి నుంచి నేటి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వ‌ర‌కు కూడా వైసీపీ క్లియ‌ర్‌గానే ఉంది. ఇక‌, పార్ల‌మెంటు లోనూ ఒక్క వ‌క్ఫ్ బిల్లుకు త‌ప్ప‌.. ఇత‌ర అన్ని బిల్లుల‌కు జ‌గ‌న్ పార్టీ మ‌ద్ద‌తు తెలుపుతూనే ఉంది. సో.. పైకి చెప్పినా.. చెప్ప‌క‌పోయినా.. వైసీపీ స్టాండ్‌-సిట్‌-అనేది ఏ పార్టీతోనో.. ఏ కూట‌మితోనో.. అర్ధ‌మ‌వుతూనే ఉం ది. ఈ క్ర‌మంలో వైసీపీపై షర్మిల చేస్తున్న వ్యాఖ్య‌ల్లో పెద్ద‌గా ప‌స క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

👉ఈసీకి షాక్‌: బీహార్‌లో ఇద్ద‌రు పాక్ పౌరుల‌కు ఓటు హ‌క్కు!😱😱😱 `ఓట్ అధికార్ యాత్ర‌` పేరుతో 13 వేల కిలో మీట‌ర్లు, 22 జిల్లాల్లో క‌వ‌ర్ చేసేలా యాత్ర‌ను ప్ర‌స్తుతం కొన‌సా గిస్తున్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి పార్టీలు నిప్పులు చెరు గుతున్న విష‌యం తెలిసిందే. బ‌తికి ఉన్న‌వారి ఓట్లు తీసేస్తున్నార‌ని, చ‌చ్చిపోయిన వారి ఓట్లు ఉంచుతు న్నార‌ని.. ఒకే వ్య‌క్తికి నాలుగు చోట్ల ఎన్నికల గుర్తింపు కార్డులు ఇచ్చార‌ని, `జీరో` డోర్ నెంబ‌రుతో వేలాది ఓట్లు ఇచ్చార‌ని ఇలా.. అనేక అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఇండియా కూట‌మి ఆరోపిస్తోంది. అంతేకాదు.. బీహార్‌లో అయితే.. 65 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించ‌డంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పెద్ద ఉద్య‌మ‌మే చేస్తున్నారు. `ఓట్ అధికార్ యాత్ర‌` పేరుతో 13 వేల కిలో మీట‌ర్లు, 22 జిల్లాల్లో క‌వ‌ర్ చేసేలా యాత్ర‌ను ప్ర‌స్తుతం కొన‌సా గిస్తున్నారు. ఓట్ల‌ను చోరీ చేస్తున్నార‌ని, త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారిని చేరుస్తూ.. కాంగ్రెస్‌, ఇత‌ర ఇండియా కూట‌మి పార్టీల‌కు అనుకూలంగా ఉన్నార‌ని భావిస్తున్న ఓటర్ల‌ను తొల‌గిస్తున్నార‌ని రాహుల్‌గాం ధీ స‌హా ఇత‌ర ప‌క్షాల నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. *అయితే.. దీనికి స‌మాధానం చెప్ప‌ని ఎన్నికల సంఘం.. ఎదురు ఆరోప‌ణ‌లు సంధించింది.. అఫిడ‌విట్లు కోరింది. కుద‌ర‌క‌పోతే.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా బీహార్‌లో సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఇద్ద‌రు పాకిస్థాన్ పౌరుల‌కు ఇక్క‌డ ఓటు హ‌క్కు క‌ల్పించారు. పోనీ.. వారేమ‌న్నా.. పాక్ వ‌దిలేసి వ‌చ్చి ఉంటున్నారా? అంటే.. లేదు. ఒక‌రు 3 మాసాల వీసాపై 1956లో వ‌చ్చి దొంగ‌చాటుగా ఇక్క‌డే ఉంటున్నారు. మ‌రొక‌రు మూడేళ్ల వీసాపై వైద్యం కోసం ఇటీవ‌ల‌ వ‌చ్చారు. కానీ, వీరి వివ‌రాలు ప‌రిశీలించ‌కుండానే గుడ్డిగా ఎన్నిక‌ల సంఘం వీరికి ఓటు హ‌క్కు క‌ల్పించింది. తాజాగా ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో వెలుగు చూడ‌గానే కేంద్ర హోం శాఖ హుటాహుటిన స్పందించింది.

👉ఋణ వసూళ్ల కు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం రద్దు చేయాలి ..బ్యాంక్ లు సైతం ప్రైవేట్ కిరాయి ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గుచేటు .. ఏ రుణమైనా కోర్టు ద్వారానే వసూలు చేసుకునే విధంగా ప్రభుత్వ చర్యలు అమలు చేయాలి .. వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల నుండి ఋణ గ్రస్తులకు రక్షణ కల్పించాలి .. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు..మేడా శ్రీనివాస్ డిమాండ్ ..

ఋణ లావాదేవీలకు సంబందించి న్యాయవాది ధ్రువీకరణ తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ..

ఋణాల వసూలుకు కిరాయి మూకలతో దాడులు దౌర్జన్యాలు జరిపిస్తున్నారు . ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వ్యక్తులను ఋణాలు వసూలుకు ఉపాధి ముసుగులో దాదా గిరికి కిరాయి సైన్యాన్ని ప్రోత్సహస్తున్నట్టుగా వుంది. తద్వారా వడ్డీ వ్యాపారస్తులు ఘోరమైన దౌర్జన్యాలతో ఋణ గ్రస్తులను వేదిస్తున్నారు . హింసిస్తున్నారు . కొన్ని పరిస్థితుల్లో దాడులు చేస్తు కుటుంబంలో పిల్లలను , వృద్ధులను భయబ్రాంతులకు గురించేస్తున్నారు . వడ్డీ వ్యాపారస్తులు దౌర్జన్యాలపై పోలీస్ లకు ఫిర్యాదులు చేస్తున్నా బాధితులకు ఏ విధమైన రక్షణ లేకపోతుంది . న్యాయం జరగకుంటుంది . ప్రతి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ల్లోను , వడ్డీ వ్యాపార కర్యాలయాల్లోను ఋణ గ్రస్తులను బెదిరించటానికి ఒక రకమైన కిరాయి మూకలను బాహటంగానే పెంచి పోషిస్తున్నారు . వారి వేధింపులు , చేష్టలు చాలా వికృతంగా ఉంటుంటాయి . బాధితుల ఘోషకు ఎవ్వరు అండగా నిలవక పోగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారు . ప్రజల జీవన అవసరాలు పైన పరిస్థితుల పైన ప్రభుత్వం ఒక ప్రత్యేక పర్యవేక్షణ జరిపించి ఋణ వసూళ్లకు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం ప్రోత్సహించ కుండా తక్షణమే ఆ తరహా ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు ..

*ఋణ వసూళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ లైన బ్యాంకులు కూడా లోను రికవరీలకు ప్రైవేట్ ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గు మాలిన చర్యగా బావించాలి . చట్ట నిబంధనలకూడా వ్యతిరేకంగా ప్రైవేట్ గుండాలను ఉపాధి ముసుగులో ప్రభుత్వం ప్రోత్సహించటం బాదాకరం . బ్యాంకులు అధికారికంగా గురించిన ఋణ వసూళ్ల ప్రభుత్వ ఏజెన్సీల మంటు ఋణగ్రస్తులను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు . వీరి వీధిపులలో పసి పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం కొన్ని సందర్బాలలో తీవ్రంగా నష్ట పోతున్నారు . గాయ పడుతున్నారు . చట్ట బద్ధమైన హక్కులు కానరాని విధంగా ఋణ వసూళ్లకు ప్రైవేట్ ఏజెన్సీలు తెగబడుతున్నాయి . రికవరీ మూకల దాడుల్లో గాయపడిన బాధితులకు పోలీస్ లు సైతం రక్షణ కల్పించలేని విధంగా ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నారు . న్యాయం అందక, రక్షణ దొరకక ప్రైవేట్ ఏజెన్సీ దాడులకు బాధితులు తలాగ్గాల్సి వస్తుంది . కొన్ని ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . ఈ మధ్య వడ్డీ వ్యారస్తులు, కార్పొరేట్, ప్రైవేట్ , ప్రభుత్వం నియమించు కుంటున్న ప్రైవేట్ ఏజెన్సీలు సాంకేతిక పరిజ్ఞానంతో ఋణగ్రస్తుడు పరిచయస్తులకు , బందువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తు అసభ్య కరంగా మాట్లాడుతున్నారు .

**కొన్ని ప్రైవేట్ ఏజెన్సీల దౌర్జన్య మూకలు ఫోన్లు చేసి మీ అమ్మాయి ఫోటోలను నగ్నంగా చిత్రికరించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తాం అని బెదిరిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు . కాలయాపనకు , వివాదాలకు తావు లేకుండా ఏ ఋణాన్నైనా చట్ట బద్దంగా వసూలు కాబడే విధంగా ఒక బలమైన ప్రభుత్వ వ్యవస్థను అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలి . ఋణ గ్రస్తులు , ఋణ దారుల మధ్య ఏర్పడే వివాదాలు 6 నెలలు దాటకుండా తీర్పులు వెలువడే విధంగా చట్ట సవరణలు జరిపి శాంతి భద్రతలకు ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలి . ఏ విధమైన ఋణ లావాదేవీలు కైనా ప్రాదిమిక రోజు నుండి 10 ఏళ్లు అనుభవం గల న్యాయవాది ధ్రువీకరణను తప్పనిసరి చేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను అమల్లోకి తేవాలి . తద్వారా ఋణ బాధితులు , ఋణ దారులు మధ్య సమస్యలు సర్దుమణుగుతాయి . ప్రస్తుత వడ్డీ వ్యాపారస్తుల దాడులు, దౌర్జ్యలకు ప్రభుత్వాల అసమర్థతే ప్రధాన కారణంగా బావించాలి . ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి కాల్ మణి కేసులు బాధితులను కాపాడలేక పొగా వడ్డీ వ్యాపారస్తులకు అండగా నిలుస్తు బాధితులను వెక్కిరిస్తున్నట్టుగా వుంది . వేధింపులు ఆగవు , చట్టాలు రక్షించవు , పాలకుల అసమర్ధత బాదితులను నిత్యం వేదిస్తూనే వుంటున్నాయి . మెరుగైన సంస్కరణలతో చట్ట పరమైన హక్కులు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వ చర్యలు కాబడే విధంగా పాలనా విధానాలు అమలు కాబడాలని , వడ్డీ వ్యాపారస్తులు , ప్రైవేట్, కార్పొరేట్ ఋణ వేధింపుల నుండి మానసిక ఒత్తిడిలకు గురవుతున్న బాధితులకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అండగా నిలుస్తుందని  శ్రీనివాస్ బాధితులకు భరోసా ఇచ్చారు .సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాధ్, దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్, కారుమూరి యుగంధర్, మాసా అప్పాయమ్మ , నాగూరు అన్నపూర్ణ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, వాడపల్లి జ్యోతిష్ , డి వి వి ఎస్ ఎన్ మూర్తి యాదవ్, వల్లి శ్రీనివాసరావు , బత్తెన శివన్నారాయణ , జవ్వాది మోహన్ , కాకర ప్రసాద్, మాసా కమల, చల్లా సాంబశివరావు , చల్లా అఖిల్ , గెద్దాడ సుందరి,తదితరులు పాల్గొన్నారు .

🌟కంభంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర..స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం కంభం సీఐ కె మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సైకిల్ పై పట్టణ వీధులలో సైక్లింగ్ చేస్తూ పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల ఆవశ్యకత గురించి వివరించారు కార్యక్రమంలో కంభం ఎస్సై బి నరసింహారావు తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..