👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉రాఘవ్ చద్దా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ సీర రమేష్ కుమార్ …
బీజేపీని గుండాల పార్టీ అన్నారు…బీజేపీని చదువు సంధ్యా లేని వారి పార్టీ అన్నారబీజేపీని అవినీతిపరుల వాషింగ్ మెషిన్ పార్టీ అన్నారు…

“నేను సామాన్యుల గొంతు అవుతాను” అన్నారు…
“నన్ను కొనగలిగే పార్టీ కానీ వ్యక్తి కానీ ఇంకా పుట్టలేదు” అన్నారు…ఆఖరికి ఈ రోజు ఇంకో ఆరుగురు రాజ్యసభ సభ్యులతో కలిసి అదే బీజేపీలో చేరడం చూస్తే … దేశ ప్రజలకు అర్థమైంది మీరు మాటమీద నిలబడని వ్యక్తి అని!
రాబోయే పంజాబ్ ఎన్నికలలో ప్రజలు తప్పక మీకు బుద్ధి చెబుతారు,మీరు ఘోర పరాభవం చూస్తారని హెచ్చరించారు.
👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్

శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు…పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్…అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం…ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్
అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన
శక్తి యాప్, పోలీసుల అప్రమత్తత ఓ యువతిని అర్ధరాత్రి ఆపద నుంచి సురక్షితంగా బయటపడేశాయి. అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ బారి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినిని కాపాడిన మంగళగిరి గ్రామీణ పోలీసులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. మహిళల భద్రతకు టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నంబూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి బెంగళూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆటో డ్రైవర్ బొమ్మనపల్లి ఫణీంద్రకుమార్ వాహనం వేగాన్ని తగ్గించి, అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతి, వెంటనే తన ఫోన్‌లోని శక్తి యాప్ ద్వారా ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.
అలర్ట్ అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు, ఎస్సై వెంకట్ నేతృత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. యాప్ ద్వారా వచ్చిన లైవ్ లొకేషన్ ఆధారంగా ఆటోను కాజా సమీపంలో అడ్డగించి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. యువతిని సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “అర్ధరాత్రి యువతిని కాపాడిన మంగళగిరి పోలీసులకు అభినందనలు. శక్తి యాప్ ద్వారా సమాచారం రాగానే వేగంగా స్పందించి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. సోదరీమణులారా, మీ ఫోన్లలో శక్తి యాప్‌ను తప్పక ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రాణాలను కాపాడుతుంది” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై గుంటూరు డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
👉అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌*
*ఇరాన్‌ అణు కలలను వీడే వరకు కీలక హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంలోనే ఉంటుందని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్పష్టం చేశారు. ఆ జలసంధిని అమెరికా నేవీ ఉక్కుకవచంలా బంధించిందన్నారు. అవసరమైనంతకాలం ఆ దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. హర్మూజ్‌లో ఏ నౌకా ప్రయాణించదని, దానిపై తమ పూర్తి నియంత్రణ ఉందన్నారు. అంతర్జాతీయ స్థిరత్వం కోసమే ఈ ప్రమాదకర ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారు.*
👉భారతదేశం 15 దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో తీవ్రమైన గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధానికి ముందు, భారతదేశం తన ఎల్‌పిజిలో 90 శాతాన్ని గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం ఆ దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి, గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుండి కూడా ఎల్‌పిజిని దిగుమతి చేసుకుంటున్నారు..
👉 మా బండినే ఆపుతారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళలపై, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి.. మహిళలు అని చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు. మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో హల్చల్ సృష్టిస్తుంది.
👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామిఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చకుండా, సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ప్రజలు
👉అన్నా అన్నందుకు సెలూన్ వ్యక్తిపై ఎస్ఐ దాడి*
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం
స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై దాడి
ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన ఎస్ఐ
👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*
*ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా*
*ఈగల్‌ను ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నాం: డీజీపీ*
*ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు*
*గ్రేహౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్….గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం**గంజాయి జీరో కల్టివేషన్ కోసం కఠిన చర్యలు…ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఏపీ ముందంజ*
*ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు…లక్ష్యం 200 కేసులకు పెంపు…హ్యాబిచువల్ నేరస్తులపై కఠిన చర్యలు*డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు…డ్రగ్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి*
👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్*
*మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్స్ వినియోగం*
*డ్రోన్స్, సాటిలైట్స్‌తో గంజాయి నిర్మూలన*
*డార్క్ వెబ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా….డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్*
*డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదం: డీజీపీ*
*డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు….ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్‌లపై ప్రత్యేక దృష్టి 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదన.*
[రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ మహోనియా హాస్పిటల్‌లో దారుణం.*
మృతురాలిపై చికిత్స కొనసాగించారన్న ఆరోపణలు.
మృతురాలిపై చికిత్స పేరుతో డబ్బుల దందా..? రంగారెడ్డి జిల్లాలో సంచలనం.డబ్బులు తీసుకున్న తర్వాతే మరణం వెల్లడించిన సిబ్బంది…కుటుంబ సభ్యుల ఆగ్రహం, విచారణకు ఆదేశాలు.ప్రైవేట్ హాస్పిటల్‌పై తీవ్ర ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో ఉన్న మహోనియా హాస్పిటల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.‘చనిపోయిన తర్వాత కూడా చికిత్స’ చేశారంటూ ఆరోపణలు.
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కట్టెల దివ్య ఇప్పటికే మృతి చెందినప్పటికీ చికిత్స కొనసాగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు.
చికిత్స పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి… చివరికి గాంధీ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పగానే “అప్పటికే మృతి చెందింది” అని చెప్పడం తీవ్ర అనుమానాలకు దారితీసింది….చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకం
మృతురాలికి 3 ఏళ్ల పాప ఉండటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
అధికారుల స్పందన:
అబ్దుల్లాపూర్ మెట్టు మండల మెడికల్ అధికారి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రధాన అంశం:డబ్బుల కోసం మృతదేహంపైనే చికిత్స చేశారా..?ప్రైవేట్ హాస్పిటల్స్‌పై పర్యవేక్షణ లోపిస్తున్నదా..?
👉రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..కడప జిల్లా.
వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్..
ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనను వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు..
పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది..
పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది..
చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది..మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది..పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ‘లీసా గిల్’ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. చండీగడ్కు చెందిన జస్టిస్ లీసా గిల్, 1990లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి, 2014లో పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు..
👉 కృష్ణా జిల్లా లో…పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు…వెలుగులోకి సంచలన విషయాలు!* కృష్ణా జిల్లా పెనమలూరులో పిల్లల కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నాపర్ల నుంచి పోలీసులు మరో బాలుడిని రక్షించారు.బాలుడిని కొనుగోలు చేసిన ఇద్దరితో కలిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటివరకు ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయగా.. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ఇప్పటివరకు ఆరుగురు పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు. మరో ముగ్గురిని త్వరలో రెస్క్యూ చేస్తామని పోలీసులు తెలిపారు.
👉విజయవాడ ఇంద్రకీలాద్రిపై దారుణం చోటు చేసుకుంది. అయ్యప్పమాల ధారణలో ఉన్న గొల్లపూడికి చెందిన బ్రహ్మం అనే దివ్యాంగుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు భిక్షాటన చేస్తున్నందుకు బ్రహ్మంపై దాడి చేసినట్లు తెలిసింది. కర్రలతో వాతలు వచ్చేలా బ్రహ్మం వీపుపై కొట్టారు. దాంతో బాధితుడు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేయడంతో తోటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..