👉ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా నియామకంపై అభినందనలు తెలిపారు. ఇవాళ సాయంత్రం లోక్ భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

👉బిజెపి దెబ్బకు కుదేలవుతున్న ప్రాంతీయ పార్టీలు…దేశంలో బీజేపీ ఎదుగుతోంది…
ఆ ఎదుగుదల కూడా శరవేగంగా ఉంది. 2014 ముందు వరకూ బీజేపీ చాలా సమస్యలు రాజకీయంగా ఎదుర్కొంది. అయితే 2014లో నరేంద్ర మోడీ వంటి చరిష్మా టిక్ లీడర్ అధికారంలోకి రావడంతో బీజేపీ జోరు పెరిగింది. నాటి నుంచి బీజేపీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రముఖ స్థానం అందుకుంటూ చాలా జోరుగా ఎగబాకుతోంది. మూడుసార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక బీజేపీ కాంగ్రెస్ తో తన పోరుని మొదలెట్టి ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేసింది. ఇక సిద్ధాంత బద్ధమైన వైరంతో ఉన్న వామపక్షాలు కూడా బీజేపీతో పోటీ పడలేక నీరసించి పోయాయి. బీజేపీ జాతీయ రాజకీయాల్లో వెలుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ త్రిపురలలో అధికారం కామ్రేడ్స్ చేయి జారింది. ఇక కేరళలో కనుక అధికారం పోతే ఎర్రన్నల రాజకీయానికి పూర్తిగా రెడ్ సిగ్నల్ పడినట్లే అని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో మధ్యేవాద పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో కొన్ని జాతీయ పార్టీల నుంచి ముక్కగా బయటపడి ప్రాంతీయంగా శక్తిగా ఎదిగాయి. ఇవే దేశంలో జాతీయ పార్టీలకు పూర్తి మెజారిటీ కేంద్రంలో రాకుండా చేస్తూ ఎక్కడికక్కడ బలపడుతున్నాయి. దీంతో ఒకే దేశం బలమైన కేంద్రం బలమైన జాతీయ పార్టీ అన్న బీజేపీ సిద్ధాంతాలకు ఇక్కడే విఘాతం ఏర్పడింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ తో యుద్ధం చేస్తూనే విపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మీద ఫుల ఫోకస్ పెట్టింది. ఫలితంగా మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలింది శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రెండు ముక్కలు అయింది. యూపీలో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఏమీ కాకుండా పోయింది. బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ బీజేపీతో అంటకాగి పూర్తిగా మమేకం అయిపోయింది. ఆర్జేడీ అయితే తుత్తునియలు అయింది దక్షిణాదిన చూస్తే దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్ బీజేపీకి పక్క వాయిద్యం అయింది. ఏపీలో టీడీపీ జనసేన మిత్రులుగా ఉంటే వైసీపీ పరోక్షంగా సహకారం అందిస్తోంది. తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతోంది. ఇక ఢిల్లీలో ఆప్ ఉంది. జాతీయ పార్టీగ ఎదుగుతూ బీజేపీకి ఇబ్బంది పెడుతోంది. దాంతో ఒక్కసారిగా బీజేపీ ఇచ్చిన స్ట్రోక్ కి ఆప్ కి దిమ్మ దిరిగి బొమ్మ కనిపించినట్లు అయింది. అయితే ప్రజలు మాత్రం బిజెపి ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసగించి మోసపూరిత విధానాలతో గద్దెనెక్కుతుందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
👉అనంతపురం :యల్లనూరు లో బైండోవర్ కేసుల నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురిపై చర్యలు… 14 రోజుల పాటు రిమాండ్ … సబ్ జైలుకు తరలింపు
యల్లనూరు మండలం బొప్పేపల్లి గ్రామానికి చెందిన 6 మంది ట్రబుల్ మాంగర్స్ ను గుర్తించి మంచి ప్రవర్తన కోసం 05.05.2025 తేదీన తహసిల్దార్ వద్ద బైండోవర్ చేయించారుఇందులో భాగంగా… యల్లనూరు మండలం, బొప్పేపల్లి గ్రామానికి చెందిన 1.గండి కోట నారాయణస్వామి,2.పత్తికొండ ఆదినారాయణ, 3.పొగాకుల చైతన్య ,4.కప్పల .నారాయణ స్వామి,5.బండి నారాయణస్వామి,6.కప్పల లక్ష్మి నారాయణ లపై కూడా బైండోవర్ చేయించారు. అయితే… బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి 11.07.2025 తేదీన పై వారు అందరూ యల్లనూరు కూచివారి పల్లి గ్రామము వద్ద క్రిమినల్ కేసులో పాల్గొన్నారు.బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన యల్లనూరు మండల మేజిస్ట్రేట్ రాము సర్ గారు ఈ ఆరుమందికి కి 14 రోజుల పాటు రిమాండ్ విధించారని… దీంతోనే ఈ 6 మందిని తాడిపత్రి సబ్ జైలుకు తరలించామని యల్లనూరు SI N. రామంజినేయ రెడ్డి గారు తెలిపారు
👉తూ.గో జిల్లాలో కలకలం: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్*
తూర్పు గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు:రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు
ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు సమాచారం.
👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు*
పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని పేర్కొంది.
👉 బిజెపిలో చేరిన రాఘవ్ చడ్డా*
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా భాజపాలో చేరారు. ఇటీవలే ఆయన్ను పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. చడ్డాతో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ కూడా భాజపాలో చేరారు. రాజ్యసభలో తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.
👉తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి చేసిన గొర్ల కాపర్లు..కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుశ్చర్ల సత్యనారాయణ.సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో 15 ఏళ్లుగా కష్టపడి వేలాది మొక్కలను నాటి అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దిన పర్యావరణవేత్త, జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయ
ఎందరో విద్యార్ధులు, పర్యావరణ వేత్తలు పరిశోధనలు చేస్తున్న ఈ అటవీ ప్రాంతంలో, చెట్లను నరికి గేదెలను, గొర్లను మేపుతున్న బయ్య గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు గోర్లను మేపుతుండగా అక్కడికి వెళ్లి అడ్డుకున్న సత్యనారాయణపై కుటుంబ సభ్యులతో కలిసి కర్రలతో దారుణంగా దాడి చేసిన గొర్ల కాపర్లు…
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తనపై దాడి చేసిన గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనూషలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యనారాయణ
సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
*విజయవాడ క్రైమ్*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ …విజయవాడలో నలుగురు నకిలీ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పటమటలోని ఓ షాప్ వద్దకు గొల్లపూడికి చెందిన నలుగురు నకిలీ అధికారాలు వెళ్లారు..
తాము క్రైమ్ గ్రీవలెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చామని దుకాణంలో తనిఖీలు చేయాలి..
సరకుల నాణ్యత సరిగా లేదని, బరువు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయంటూ హడావుడి సృష్టించి నగదు డిమాండ్ చేశారు… బాధితుడు అనుమానం తో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు…
👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం
ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి అంగీకారం
ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశం
దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విలీనం పై సుదీర్ఘంగా చర్చ..ఆర్టీసీ విలీనానికి సంబంధించి మంత్రులు, అధికారులు, కార్మిక నాయకులతో కలిసి అధికారిక కమిటీ
👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నిందితులకు జైలులోనే మరికొన్ని రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
👉ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్… పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులు!
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకారం
పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులను పంపనున్న అధ్యక్షుడు ట్రంప్..ఇరాన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని వైట్‌హౌస్ వెల్లడి
ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ చర్చల కోసం పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులను పంపనున్నట్లు వైట్‌హౌస్ శుక్రవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ వివరాలను వెల్లడించారు. ఇరాన్ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని, వారు నేరుగా చర్చలు జరపాలని కోరుకుంటున్నారని తెలిపారు. “దౌత్యానికి అవకాశం ఇవ్వడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే ప్రత్యేక రాయబారులు స్టీవ్ వాఫ్, జారెడ్ కుష్నర్‌లను పాకిస్థాన్‌కు పంపాలని నిర్ణయించారు. వారు రేపు ఇస్లామాబాద్‌కు బయలుదేరి ఇరాన్ ప్రతినిధులతో సమావేశమవుతారు” అని లెవిట్ వివరించారు.
చర్చలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు. అవసరమైతే ఉపాధ్యక్షుడు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, చర్చలకు ముందు ఇరాన్ ఏదైనా నిర్దిష్ట ప్రతిపాదన పంపిందా అనే దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు.
ఇదే సమయంలో, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపును కూడా లెవిట్ ధ్రువీకరించారు. ఇది ప్రపంచానికి, అమెరికాకు దక్కిన మరో విజయమని, ట్రంప్ నాయకత్వంలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక నిర్వహణపై విచారణ కొనసాగుతోందని, దానిని ఇన్‌స్పెక్టర్ జనరల్ విభాగానికి బదిలీ చేసినట్లు లెవిట్ స్పష్టం చేశారు.
👉విజయవాడ.. ఏలూరు.*బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??
మైలవరం ఎమ్మెల్యే అనుచరులు, దెందులూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మిల మధ్య ఘర్షణ..ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పోలీసుల సాక్షిగా మహిళా నాయకురాలి పై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు..?
* ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు కార్పోరేషన్ చైర్ పర్సన్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మి పై దాడికి యత్నం..
👉అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..*
*ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!*
*విజయవాడ* వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పని చేస్తున్న ఒక సాదాసీదా ఉద్యోగి ఇంట కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడటం నగరంలో సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

*సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు*
అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు నివాసంతో పాటు అతని సోదరులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.
బంగారం, వెండి: 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 గోల్డ్ బిస్కెట్లు, సుమారు 7.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.ఒక ఖరీదైన బహుళ అంతస్తుల భవనం, నగర శివార్లలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు.కేవలం అటెండర్ హోదాలో ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో విచారించగా.. శ్రీనివాసరావు అధికారుల పేరు చెప్పి వ్యాపారులను బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువలెత్తాయి. అక్రమ సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న శ్రీనివాసరావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
[బాల్యవివాహాన్ని ఆపడానికి వెళ్ళి, పెళ్ళి కూతురుకు బదులు ఆమె చెల్లిని తీసుకెళ్లిన అధికారులు
వారు వెళ్ళిన కాసేపటికే జరిగిపోయిన పెళ్లి
గద్వాల మండల కేంద్రంలో ఘటన
బయటపట్ట ఐసీడీఎస్, పోలీస్ అధికారుల నిర్వాకం
అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మైనర్ అయిన పెళ్లి కూతురును అక్కడి నుండి తప్పించిన పెద్దలు..
కనీసం పెళ్లి పత్రికలో పేరు, ఆధార్ కార్డులో ఫోటోను చూడకుండా అక్కడే ఉన్న పెళ్లి కూతురు చెల్లెలైన మైనర్ బాలికను తీసుకొని వెళ్ళిన అధికారులు
అధికారులు వెళ్లిన వెంటనే మైనర్ బాలికకు ఓ గుడిలో పెళ్లి చేసిన పెద్దలు..చట్టం ముందే బలైపోయిన బాలిక జీవితం
విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

