👉భారత్ నరకం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. భారత్, చైనా మహోన్నత నాగరికతకు పుట్టిల్లు,అలాంటి నాగరికతలతోపాటు ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్థుడు అయిన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం అంటూ తిప్పికొట్టింది. 
భారత్ దేశాన్ని నరకంతో పోలుస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ చేసిన పాడ్ కాస్ట్ ను అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో రీపోస్టు చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండగా, భారత్ లోని ఇరాన్ ఎంబసీలు వరుసగా కౌంటర్ లు ఇస్తున్నాయి.. శావేజ్ పాడ్ కాస్ట్ ను ట్రంప్ రీపోస్టు చేయడాన్ని ముందుగా హైదరాబాద్ లోని ఇరాన్ కాన్సులేట్ ఖండించింది. భారత్, చైనా వందల ఏళ్ల క్రితమే గొప్ప నాగరికతతో వెల్లివిరిశాయని గుర్తు చేసింది.ఇరాన్ లో పౌరులను అంతం చేస్తానన్న ట్రంప్ ప్రగల్భాలు పలికే యుద్ధ నేరగాడని మండిపడింది. రోజుకొక మాట మార్చే ట్రంప్ కు మానవత్వం మచ్చుకైనా లేదని, అతడి వ్యాఖ్యలు జాత్యహంకారానికి నిదర్శనమని హైదరాబాద్ లోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఇక ఇదే అంశంపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఘాటుగా స్పందించింది. భారత్ లోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్ నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకువస్తే బాగుండేది అంటూ ముంబైలోని ఇరాన్ ఎంబసీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. భారత్ కు వచ్చి చూసిన తర్వాత ఆ దేశం కోసం మాట్లాడాలని హితవుపలికింది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను ఈ పోస్టు ద్వారా షేర్ చేసింది. అమెరికాలో అమలులో ఉన్న జన్మతః పౌరసత్వ చట్టాన్ని ట్రంప్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్, చైనా నరక కూపాలు అంటూ శావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో రీపోస్టు చేశారు. భారత్, చైనా నుంచి అమెరికాకు వలస వెళ్లేవారిని ‘గ్యాంగ్ స్టర్స్ విత్ ల్యాప్ టాప్స్’గా అభివర్ణిస్తూ రాజకీయ విశ్లేషకుడు శావేజ్ చేసిన పాడ్ కాస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో మైఖేల్ శావేజ్ పలు జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వలస వచ్చిన భారతీయులు, చైనీయులు ఈ దేశానికి నష్టం, మాఫియా కుటుంబాలన్నీ కలిపి చేసిన నష్టంకన్నా ఎక్కువ అని ఆరోపించారు. ‘‘నా ఉద్దేశంలో వాళ్లంతా గ్యాంగస్టర్స్ విత్ ల్యాప్ టాప్స్. మనల్ని నిలువునా దోచుకున్నారు. మనల్ని రెండో తరగతి పౌరుల్లా చూశారు. మూడో ప్రపంచ దేశాలు పైచేయి సాధించేలా చేశారు. మన జెండా కాలరాశారు’’ అంటూ శావేజ్ విమర్శలు చేశాడు. దీనిని ట్రంప్ రీపోస్టు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియా, చైనా నుంచి చాలా మంది తమకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేలా చేయడం కోసమే తొమ్మిదో నెలలో అమెరికా వస్తున్నారని శావేజ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ వైఖరిని సమర్థిస్తున్నట్లు ఉండటంతో ఆయన ఆ వీడియో పాడ్ కాస్ట్ ను రీపోస్టు చేశారని చెబుతున్నారు. కాగా, శావేజ్ వీడియోను ట్రంప్ రీపోస్టు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధ్యక్ష కార్యాలయం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. భారత్ చాలా గొప్పదేశమని ట్రంప్ అన్నారని, ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ద్వారా ప్రకటన చేసింది. కాగా, శావేజ్ పాడ్ కాస్ట్ ను అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలుగా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించవని, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేసింది.
👉అనంతపురం జిల్లా..ఆర్థిక నేరాల కేసులో
బీజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్. రిమాండ్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదు…100 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు… ఫైనాన్షియర్లను మోసగించిన
కేసులో బీజేపీ నాయకురాలు సుమతి సురతాని, ఆమె భర్త వల్లెపు శ్రీనివాసులును అనంతపురం పోలీసులు అరెస్ట్.
వీరిపై పలు రాష్ట్రాల్లో ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. ఏపీ, కర్ణాటక, కేరళ, నోయిడా,
ముంబై తదితర ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు సమాచారం.
చెక్ బౌన్స్ (ఎస్ఐ)
కేసుల్లో వీరిని అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు
అనంతపురానికి చెందిన ఈ దంపతులు మొదట చిన్న మొత్తంలో ఫైనాన్షియర్ల నుంచి డబ్బులు తీసుకుని వాటిని వడ్డీతో చెల్లించడం ద్వారా
ఫైనాన్షియర్ల నమ్మకం పొందిన తర్వాత పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని ఎగవేశారని ఆరోపణలు
👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్..!*
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్…విజయవాడలో అరెస్టై..,
రేపల్లె సబ్‌జైలుకు తరలించిన రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్.., ఆసుపత్రి పేరుతో బయటకు వచ్చి, పోలీసులను ప్రలోభపెట్టి పరారీ అయినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. గతంలో కూడా అతను ప్రకాశం జిల్లాలో పరారీ అయినట్లు పోలీసులు వెల్లడించారు.
👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*
ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా…ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్… తాజాగా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం!
కలకలం రేపుతున్న అనంతపురంలో హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. అమాయకులను, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.నిందితులతో నరేందర్ రెడ్డి నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కాల్ డేటా, వాయిస్ రికార్డుల ద్వారా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.ఈ కేసులో ‘కింగ్’ గా పిలవబడే రంగమ్మ నాయుడు (చిన్ని నాయుడమ్మ), రాజేశ్ తో పాటు జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారి అనే ముగ్గురు మహిళలను పోలీసులు ఇప్పటికే జైలుకు పంపారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ మొత్తం భాగోతం బట్టబయలైంది.ఈ ముఠా ఇప్పటివరకు పలువురు ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నరేందర్ రెడ్డి పాత్రపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత, రేపు ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*
అమరావతి..అవినీతి కేసులో సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
వైద్య పరీక్షల కోసం ఆమెను విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శాంతిని ఇటీవల ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
అయితే సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మరోసారి ఆమెను కస్టడీకి తీసుకున్నారు.
👉అనంతపురం : కర్ణాటక బీజేపీ నేత సుమతి అరెస్టు..!*ఏపీ, కర్ణాటకలో రూ.100 కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడిన సుమతి.*
*డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి, వ్యాపారుల నుంచి డబ్బు వసూలు.**చెక్ బౌన్స్ కేసులో సుమతికి రిమాండ్ విధించిన అనంతపురం కోర్టు.*
👉మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు మండలంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద హనుమాన్ స్వాముల ఆందోళన
గ్యాస్ బుక్ చేసి 20 రోజులు అయ్యిన గ్యాస్ ఇవ్వని వైనం
బ్లాక్ మార్కెట్ కు అమ్ముకుంటున్నారంటూ స్వాముల ఆరోపణ…మాకు భిక్ష కోసం ఒక్కగ్యాస్ అయ్యిన ఇవ్వాలంటూ కోరుకుంటున్న కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్న సిబ్బంది
👉ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోస్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీకి డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత..పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం..ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి.చెత్తపై పన్ను వేసి జగన్ ప్రజలను వేధిస్తే సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి 20 నెలల పాలలలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ..
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు.
భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోనీ కేశవ స్వామి పేటలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, పలు సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, మీడియాతో మాట్లాడుతూ, గంగను దీని నుంచి భూమికి దింపిన మహనీయుడు భగీరథుడని, మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు దానిని భగీరథ ప్రయత్నంతో పోల్చడం మనందరికీ ఆనవాయితీ అని అన్నారు. మానవుడు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమిఉండదని నిరూపించిన మహనీయులు మహర్షి భాగీరధుడని, ఆయన పట్టుదలను త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి,ప్రకాశం జిల్లా సాగర /ఉప్పర అధ్యక్షులు జూటూరి శ్రీనివాసులు,ప్రదాన కార్యదర్శి జలశ్రీ మురళీ కృష్ణ ఒంగోలు నగర అధ్యక్షులు రెడ్డి పరమేశ్వరావు, కార్యదర్శి కర్ణాటి వేణు, పాల్గొన్నారు.

