👉టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక వాఖ్యలు.. అమరావతి: దాదాపు 35 మంది ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించా.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే.. నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా-సీఎం చంద్రబాబు.. ప్రజాప్రతినిధులు తప్పులు చేసుకుంటూ వెళ్లటం సరికాదు.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంటే ఉపేక్షించను.. సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జ్ మంత్రులు,ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలి-కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారు.
👉చెత్త పన్ను వేయటం తెలుసు కానీ, చెత్త ఎత్తటం తెలియదా ???…గత వైసీపీ ప్రభుత్వం, చెత్త మీద పన్ను వేశారు , చెత్త ఎత్తకుండా వెళ్ళిపోయారు. 85 మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తకుండా వదిలేసి వెళ్లారు. ఇప్పటికే ఈ చెత్త తొలగింపు మొదలు పెట్టాం.అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల లో ఈ చెత్త మొత్తం తొలగిస్తాం అన్నారు …. సీఎం చంద్రబాబు..
👉వైఎస్ జగన్పై షర్మిల ఫైర్… ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వైసీపీ మద్దతును షర్మిల తప్పుబట్టారు. తెలుగు ప్రజలకు జగన్ ద్రోహం చేశారని, కేసుల భయంతోనే బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ విమర్శించారు. TDP, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అయితే, వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు అని ఎద్దేవా చేశారు.
👉సీఐపై కేసు నమోదు….. ఆలస్యంగా వెలుగులోకి.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సి ఐ..మదనపల్లి…. అన్నమయ్య జిల్లా.
బాధితుడు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టులో ప్రైవేటు కేసు..
మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా విధులు.
కలికిరికి చెందిన ఓ మహిళతో వివాహం చేసుకున్న కొంతకాలానికే కుటుంబంలో గొడవలు.
గొడవల నేపథ్యంలో మహిళ మదనపల్లె డిఎస్పి కార్యాలయానికి రావడంతో పరిచయం పెంచుకున్న సీఐ రెండో వివాహం..ఆలస్యంగా తెలుసుకున్న మహిళ భర్త పవన్ కుమార్..సీఐపై చర్యలు తీసుకోవాలంటూ పీఎంఓ కు ఫిర్యాదు చేసిన బాధితుడు..పీ ఎం ఓ కార్యాలయం నుండి డిజిపి కార్యాలయానికి సమాచారం.
అధికారుల ఆదేశాలతో ఈ ఏడాది జూన్ నెలలో సీఐపై కేసు నమోదు..సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం కావడంతో తల్లి కులం రిజర్వేషన్ తో ఉద్యోగం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు .
కడప జిల్లా సింహాద్రిపురం కు చెందిన సురేష్ కుమార్ పై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నంద్యాల సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ సురేష్ కుమార్ సెలవు పై వెళ్లినట్లు సమాచారం.
👉 ఏసీబీ – ట్రాప్ – డోర్నకల్ పోలీస్ సీఐ పట్టివేత*
*డోర్నకల్ మండల కేంద్రంలో ఏసీబీ ట్రాప్… సీఐ రాజేష్ కుమార్ పట్టివేత…*
*మహబూబాబాద్ కు చెందిన భూక్యా హోంజీ కుమారుడి వద్ద లంచం తీసుకుంటు పట్టుబడిన సీఐ. కానిస్టేబుల్ రవి*
*డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో అవినీతిపై ఎన్నో సార్లు ఆ పోలీస్ అధికారిపై పిర్యాదు చేసిన పట్టుంచుకోలేదని బాధితుడి ఆవేదన..*డోర్నకల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లు అవినీతికి అడ్డాలుగా మారాయి…
👉ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని డిగ్రీ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో ఎదో ఒకటి అమలు చేయాలి..-విద్యాశాఖ మంత్రి వర్యులకు తలిదండ్రుల లేఖ.. విద్యార్థులను గందరగోళ పరిచి విద్య భవిష్యత్తు పట్ల నిర్లక్ష్య వ్యవహరిస్తూ.. ఉన్నత విద్య అడ్మిషన్ ల కోసం జరిగే పరీక్షలు, కౌన్సిలింగ్ ల నిర్వహణ.. ఉన్నత విద్య సిలబస్ విధాన నిర్ణయం నిర్వహణ లోపాలతో రాష్ట్రంలో ఉన్నత విద్య ను బ్రష్టు పట్టించిన ఉన్నత విద్యా మండలి ని ప్రక్షాళన చేయాలి.. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శిఖరం నరహరి, రాష్ట్ర అధ్యక్షులు మలిరెడ్డి కోటారెడ్డి రాష్ట్ర కార్యదర్శి జీ.ఈశ్వరయ్య , రాష్ట్ర కమిటీ నాయకులు డాక్టర్ వి. భాస్కర్,దాసరి విజయ్ కుమార్ ,ఉడుతా రాజశేఖర్ యాదవ్,పి. కోటేశ్వరరావు,రావూరి రమేష్. డిమాండ్ చేశారు.
ఉన్నత విద్యా మండలి వ్యవహారం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…రాష్ట్రంలో డిగ్రీ నోటిఫికేషన్ విడుదల రెండు మాసాలు ఆలస్యం…మరో వంక సిలబస్ నిర్ణయంలో గత మూడు సంవత్సరాల లో రెండుసార్లు మార్పు చేస్తూ గందరగోళం.. సెప్టెంబర్ ఒకటి నుండి క్లాసులు ప్రారంభం అని ప్రకటన చేసింది వివిధ కళాశాలలకు నిర్ణయించిన కోర్సుల సిలబస్ నిర్ణయం. విద్యా ప్రణాళిక ఇవ్వకపోవడం దారుణం.
-నేటికీ కళాశాలల అఫిలియేషన్ నోటిఫికేషన్ పర్యవేక్షణ నిర్ధారణ అనుమతి మంజూరు చేయకపోవడం విచారకరం అన్నారు.నేడు అడ్మిషన్ల విధానంలో ఆఫ్లైన్ ఆన్లైన్ అడ్మిషన్ లంటూ ఆప్షన్ లంటూ విద్యార్థుల విద్యా భవిష్యత్తుతో చెలగాటమాడుతూ. ప్రైవేటు విద్యాసంస్థల అనుకూలంగా ఉన్నత విద్యా మండలి తల తిక్క విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి..
-కొత్త విధానంలో ఆఫ్లైన్, ఆన్‌లైన్ రెండు రూపాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ విధానంలో పెట్టుకున్న ఆప్షన్లను మాత్రమే మార్చుకోగలరు. అయితే ఈ విధానంలో విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఏదైనా కాలేజీకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత దానిని మార్చుకోవడం సాధ్యం కాదు. పైగా ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఆఫ్‌లైన్ దరఖాస్తుకే తొలి ప్రాధాన్యత లభిస్తుంది. దీనివల్ల ఆఫ్‌లైన్ విధానం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేలా కనిపిస్తోంది. అలాగే ఒక కాలేజీకి వెళ్లి అక్కడి లాగిన్ నుంచి మరో కాలేజీకి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. ఇటువంటి గందరగోళ విధానాలకు స్వస్తి పలకాలని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆఫ్లైన్ న్ లేదా ఆన్లైన్ విధానాలు ఏదో ఒకటి నిర్వహించాలని,
-ఉన్నత విద్యా మండలి ని సంస్కరించాలని విద్యార్థుల విద్యా భవిష్యత్తును దెబ్బతీస్తున్న విధానాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మా పిల్లల విద్య భవిష్యత్తును కాపాడాలని విద్యార్థి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
👉ఆర్ఎస్ఏఎస్టీఎఫ్* ( *RSASTF* )
* కడప అటవీ డివిజన్ పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు…* 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం..* బాడుగకు కార్లు ఇచ్చే వారికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక..
కడప డివిజన్ సీకే దిన్నే మండలం పరిధిలోని అటవీప్రాంతంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని అందులో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం విశేషం. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ శుక్రవారం సాయంత్రం నుంచి సీకే దిన్నే మండలం లోని మద్దిమడుగు ఫారెస్ట్ సెక్షన్ లో స్థానిక అటవీ సిబ్బంది షకీల్ అహ్మద్, నారాయణరెడ్డి తో కూంబింగ్ చేపట్టారు. కోలుములపల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఒక కారు వద్ద కనిపించారు. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా వారు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకో గలిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా 26 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు, కారుతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డిఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ వారిని విచారించగా ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని వచ్చి అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక
కార్లు బాడుగకు ఇచ్చేముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ అన్నారు. ఆ కార్లను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే పక్షంలో కారు యజమాని కూడా భాధ్యుడు అవుతారని, వారిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు.
👉నన్ను అరెస్ట్ చేస్తున్నారంటూ కొన్ని మీడియాలు దుష్ప్రచారం చేయడం బాధాకరం. నేను నీతిగా, న్యాయంగా రాజకీయాలు చేశాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపితే అవినీతి జరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బెల్టు షాపులు పెరిగాయి.
-నారాయణస్వామి మాజీ డిప్యూటీ సీఎం….
👉 తెలంగాణ సచివాలయంలో కిందిస్థాయి అధికారులను వేధింపులకు గురిచేస్తున్న ఉన్నతాధికారులు..
యూజ్‌లెస్ ఫెలో, మైండ్ లేదా అంటూ పలువురు ఐఏఎస్ అధికారులు.. కిందిస్థాయి అధికారులను దుర్భాషలాడుతున్నారని, అవమానకరమైన భాషను ఉపయోగిస్తున్నారని ఇటీవల పలు వార్త పత్రికల్లో రావడంతో విషయం తెలుసుకున్న తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం (TGSOA)..
దీని వల్ల బాధిత అధికారులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై పలువు ఆసుపత్రిలో చేరగా మరికొందరు పదవికి రాజీనామా చేశారని తెలిపిన TGSOA
ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులను హెచ్చరించిన TGSOA…
👉మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామంలో దారుణం,*
*యూరియా కొరతను ఆసరాచేసుకొన్న అక్రమ పెట్టుబడి బడా వ్యాపారి ..*ప్రభుత్వం నియమాలు అతి క్రమించి యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారి.*
*266 /-రూపాయలు బస్తా ధర ఉండగా, ఈ బడా వ్యాపారి ఏకంగా 455/- నుండి 500 /- రూపాయలకు యూరియా విక్రయిస్తున్నాడని అమాయక గిరిజన రైతుల ఆవేదన..*ఈ తతంగమంత సంబంధిత* *అధికారుల కానుసైగల్లోనే జరుగుతుంది అంటూ బాధితుల ఆవేదన…*
👉భారీగా అక్రమాస్తులు*
*డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శైలేంద్రకుమార్ అరెస్టు*విజయవాడ :
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ చల్లరపు శైలేంద్రకుమార్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.
విజయవాడలోని పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గా పనిచేస్తున్న శైలేంద్రకుమార్ అక్రమ ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో అతని ఇళ్లలో, అతని బంధువుల ఇళ్లలో ఏడు చోట్ల రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు అనిశా అధికారులు.
సోదాల్లో ఇళ్లు, స్థలాలు, బంగారం, వెండి నగలు, పెద్దమొత్తంలో నగదు, వాహనాలు గుర్తింపు.
సోదాల అనంతరం శైలేంద్రకుమార్ ను అరెస్టు చేశారు.
నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
👉240 కేజీల గంజాయి స్వాధీనం ఆరుగురు అరెస్ట్*
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలాపూడి నుండి కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తుండగా, అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

