టీడీపీ జనసేన : సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్లేనా…???

టీడీపీ జనసేన : సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్లేనా…???

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా ? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా అంటే మూడు గంటల పాటు జరిగిన చర్చలో అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయని అంటున్నారు. రెండు పార్టీలూ ఆశిస్తున్న సీట్లు ఆశావహుల డిమాండ్లు వంటివి ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. ఇక పొత్తు మూలంగా రెండు పార్టీలలోనూ ఆశావహులు పెద్ద సంఖ్యలో త్యాగరాజులు కావాల్సిందే అన్నది కూడా కీలక పాయింట్. వీరికి ఏదో విధంగా నచ్చచెప్పి రెండు పార్టీల విజయం కోసం కృషి చేయాలన్నది కూడా చర్చించారని అంటున్నారు. అదే విధంగా కూటమి విజయమే ముఖ్యమని ఎవరు ఎన్ని సీట్లు అన్నది కాకుండా వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలన్నది ప్రధాన లక్ష్యం కావాలని కూడా భావించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఏపీలో కొత్త రాజకీయం రావాలని కొత్త ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేన అండతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఏపీలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే అరకు, మండపేట సీట్లను టీడీపీ ప్రకటించింది, అలాగే జనసేన కూడా రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించింది. అలా ఇద్దరూ సమానంగానే ఉన్నారు. అయితే అసలు కధ ఇపుడే ఉంది. ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుందని. దానికి కూడా బయట జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ 140 కి తగ్గకుండా పోటీ చేస్తూ ఆ మిగిలినవే ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటు షేర్ ని సాధించింది. టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా నలభై శాతం ఓట్ల షేర్ ని సాధించింది. ఈ రెండు పార్టీలు గత ఓట్ల షేర్ నిష్పత్తిలో సీట్ల పంపిణీ చేసుకంటే 6:1 అన్నట్లుగా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా టీడీపీకి 145 సీట్ల దాకా వస్తాయని అంటున్నారు. జనసేనకు 30 సీట్లు దక్కుతాయని అంటున్నారు. అయితే జనసేన ఓటు షేర్ ఈ ఎన్నికల నాటికి పది శాతం నుంచి ఇంకా పెరిగింది కాబట్టి ఆ లెక్క తీసుకోవాలని మరో వాదన ఉంది. అదే టైం లో టీడీపీ ఓటు బ్యాంక్ కూడా 42 శాతం దాకా పెరిగింది అని అంటున్నారు. మరి ఈ లెక్క చూసుకుంటే 4:1 అన్నట్లుగా కొత్త నిష్పత్తి వస్తుంది. అలా చూసుకుంటే కనుక జనసేనకు 40 దాకా సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఫైర్‌ ఇదే సరైనది అని ఇలా చేస్తేనె గ్రౌండ్ లెవెల్ లో ఓట్ల బదిలీ అన్నది సాధ్యపడుతుంది అని అంటున్నారు. అయితే పాతిక తో మొదలెట్టి ముప్పయి సీట్లు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జనసేనకు ముప్పయి సీట్లు ఇవ్వడం అన్నది కూడా టీడీపీ పరంగా చూస్తే అది పెద్ద పొత్తు గానే చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు పవన్ సీట్ల పంపిణీ పొత్తుల విషయంలో పూర్తి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. అందుకే సుదీర్ఘంగా మూడుగంటల పాటు ఈ రెండు పార్టీల అధినేతలు చర్చించారు. అని తెలుస్తోంది. దానికి సంబంధించే ముందుగా పార్టీ ఆశావహులకు నచ్చ చెప్పిన మీదటనే జాబితాను విడుదల చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఈ రెండు బలమైన పార్టీల వెనక ఉన్న రెండు బలమైన సామాజిక వర్గాల వారికి కూడా నచ్చ చెప్పుకోవాల్సి ఉంది. మొత్తానికి ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అన్నది ప్రకటించడానికి మరో ముహూర్తం ఉందని అంటున్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*