👉చిత్తూరు జిల్లా వి.కోటలో హత్యకు గురైన ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…*జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నినాదాలు. మార్కాపురం జిల్లా పొదిలి…

చిత్తూరు జిల్లా వి.కోటలో ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు నిరసనగా బుధవారం మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సంయుక్తంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని ఒంగోలు-నంద్యాల ప్రధాన రహదారిపై విశ్వనాధపురం నుండి పోలీస్ సర్కిల్ ఆఫీస్, పెద బస్టాండ్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సిఐటియు మార్కాపురం జిల్లా ఉపాధ్యక్షులు నర్రా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా ఉన్న మీడియాపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజాలను ప్రజలకు తెలియజేసే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం రక్షణకల్పించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్యకు కారకుడైన రౌడీషీటర్లు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు సర్కిల్ కార్యాలయానికి చేరుకుని పొదిలి సీఐ రాజేష్ కుమార్, ఎస్సై రాజేష్, రెవెన్యూ కార్యాలయంలో తహాసిల్దార్ ఎం వి కృష్ణారెడ్డికి వినతిపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన శిక్షలు విధించాలని, బాధిత జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండల జర్నలిస్టులు వడ్డే వేణు,మువ్వా వెంకటేశ్వర రెడ్డి,హబీబు,రామకోటి రెడ్డి, పీవీ కొండయ్య, రమణారెడ్డి,చప్పిడి శీను,పిచ్చయ్య, శ్రీనివాసులు, పరమేశ్వరరావు, రాధాకృష్ణ,బాజీ, సుబ్బారావు, మందగిరి, కూడా పాల్గొన్నారు.
👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా…ఎర్ర జెండాకు రెడ్ సిగ్నల్ పడుతుందా???


దేశంలో 2026 రాజకీయ ప్రత్యేకత ఏమిటి అంటే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లలో ఐదవ వంతు. ఇరవై శాతం సీట్లు అని కూడా చెప్పాలి. అందుకే ఈ ఎన్నికలను మినీ సమరం అని కూడా విశ్లేషకులు అభివర్ణించారు. ఇక ఈ అయిదు రాష్ట్రాలలో విభిన్న పార్టీలు అధికారంలో ఉంటూ మరోసారి ప్రజా తీర్పు కోరాయి. వాటి జాతకాలను జనాలు తేల్చేశారు. ఈవీఎంలలో అవి నిక్షిప్తం అయి ఉన్నాయి. మే 4న ఫలితాలు వస్తాయి. ఈలోగా ఎగ్జిట్ పోల్స్ సంబరం మొదలైంది వాటి ఫలితాలను చూసి కూడా ఘాటైన విశ్లేషణలు చేస్తున్నారు.
* బీజేపీకి లాభమే : ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎటు నుంచి ఏమైనా బీజేపీకి రాజకీయ లాభమే అని చెబుతున్నారు. అది ఎలా అంటే అస్సాంలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే పాండిచ్చేరిలో కూడా ఎన్డీయే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశాయి. నిజానికి ఈ రెండు తప్ప బీజేపీ చేతిలో మిగిలిన మూడు రాష్ట్రాలు లేవు. కేరళలో ఒక్క ఎమ్మెల్యే 2016 లో ఉంటే 2021 లో అది కూడా లేకుండా పోయింది. తమిళనాడులో మూడు ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 78 మంది గెలిచారు. ఇది ఎన్నికల ముందు సినారియో.
*బలం పెరిగినట్లేనా : ఇక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దాని బట్టి చూస్తే తమిళనాడులో మూడు ఎమ్మెల్యే సీట్లూ బీజేపీకి మరోసారి దక్కుతాయని అంటున్నారు వస్తే ఒకటి రెండు రావచ్చు అని ఉంది. సో అక్కడ రాజకీయంగా బలం పెరిగినట్లే అని అంటున్నారు. అలాగే కేరళలో ఈసారి ఖాతా బీజేపీ తెరుస్తుంది అని అంటున్నారు. కనీసం మూడు సీట్లు అయినా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దాంతో అక్కడ కూడా బీజేపీకి పొలిటికల్ గా ప్లస్ అవుతుంది అని అంటున్నారు.
*బెంగాల్ లో సైతం : ఇక బెంగాల్ లో బీజేపీ ఓడితే వంద సీట్లు గెలిస్తే 150 నుంచి 160 సీట్లు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇవే తీరున ఫలితాలు వస్తే మాత్రం బీజేపీకి రాజకీయంగా కలసి వచ్చినట్లే అని అంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ కోటానే బీజేపీ బద్ధలు కొట్టి గెలిచింది అంటే బీజేపీకి రాజకీయంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంబరమే అని అంటున్నారు బీజేపీ కోరిక కూడా అదే. బెంగాల్ ని కొట్టాలని. ఈసారి ఊపు చూస్తే అది కూడా జరిగే వీలుదని అంటున్నారు. బీజేపీకి కూడా ఒక అంచనా ఉంది. తమిళనాడు కేరళలలో ఫలితాలు పెద్దగా అధికారం వైపుగా సాగవని. కానీ బెంగాల్ లో అలా లేదు. ఈసారి కొట్టి తీరుతామని కసితో బీజేపీ బరిలోకి దిగింది దాంతో బెంగాల్ గెలిస్తే కనుక బీజేపీని ఎవరూ ఆపలేరనే అంటున్నారు.
గత ఏడాది బీహార్. ఈ ఏడాది బెంగాల్ ఇదీ బీజేపీ టార్గెట్. దాంతో బెంగాల్ ని బీజేపీ గెలిస్తే ఈ మొత్తం మినీ ఎన్నికల సమరంలో జాక్ పాట్ కొట్టిన పార్టీగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బీజేపీయే నిలుస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో 2027లో జరిగే గుజరాత్ ఉత్తర ప్రదేశ్ లను ఇదే దూకుడుతో మరోసారి బీజేపీ గెలిచేందుకు కూడా కొండంత బలం దక్కుతుంది. ఇక దేశ రాజకీయాల్లో మధ్యే వాద పార్టీలకు బలమైన ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీ చెక్ పెట్టేసినట్లే అని కూడా చెబుతున్నారు. సో ఒక్క బెంగాల్ ఫలితంతో బీజేపీ రాజకీయ పరుగు ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు. మరి బెంగాల్ లడ్డూ బీజేపీకి దక్కుతుందా లేదా అన్నది మే 4న తేలిపోతుంది.
*దేశంలో మినీ పోల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే ఈ ఎన్నికల ఫలితాల మీద ఒక స్పష్టత అయితే వచ్చింది. దేశంలో మిశ్రమ ఫలితాలు వస్తాయని కూడా అర్ధం అయింది. కాంగ్రెస్ బీజేపీ తో పాటు డీఎంకేకు కూడా అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీకి బెంగాల్ లో సగానికి సగం చాన్స్ ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వామపక్షాలకు దేశంలో మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. 2016 నుంచి అక్కడ వామపక్షాల నాయకత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బరిలోకి దిగినా ఎల్డీఎఫ్ కి అక్కడ ఈసారి చేదు ఫలితాలు వస్తాయని అంటున్నారు. వరుసగా కూలుతున్నాయి : ఇక చూస్తే దేశంలో ఒకనాడు ప్రబలంగా కనిపించిన వామపక్ష వైభవం కాస్తా ఇపుడు తగ్గుముఖం పడుతూ మరింతగా వెనక్కి పోతోంది. పశ్చిమ బెంగాల్ లో అప్రతిహతంగా వామపక్షాలు అధికారాన్ని చలాయించాయి. ఇపుడు చూస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకార్మ్ 4 శాతం ఓటు షేర్ దక్కుతోంది. సీట్లు ఏవీ దక్కే చాన్స్ లేదు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోరు సాగుతోఅంది. త్రిపురలో అయితే బీజేపీకి అధికారాన్ని వదిలిపెట్టి వామపక్షాలు విపక్షంలోకి వచ్చేశాయి. దాంతో ఇక మిగిలింది కేరళ మాత్రమే. అయితే ఇపుడు కేరళ కూడా టాటా చెబుతోంది. దాంతో వామపక్షాల పరిస్థితి ఏమిటి అన్న చర్చ ముందుకు వస్తోంది.
*ప్రధాని పదవికి : ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం దేశంలో వామపక్షాలు బలంగా ఉండేవి. తృతీయ ఫ్రంట్ రూపకల్పనలో చురుకైన పాత్ర పోషించాయి. ఆనాడు ప్రధాని పదవికి కూడా వామపక్ష అభ్యర్ధిని పరిశీలించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ సీఎం గా ఉన్న జ్యోతీ బసుని ప్రధానిగా ఎన్నుకోవాలని ఒక దశలో అంతా భావించారు. కానీ సీపీఎం వద్దనుకుంది. అది వేరే కధ. కానీ చెప్పొచ్చేది ఏంటి అంటే వామపక్షాల బలం అంతలా ఉండేదని కనీసంగా యాభై నుంచి అరవై మంది దాకా ఎంపీలు ఉండేవారు. మొత్తం దేశంలోని ఎంపీలలో ఆ సంఖ్య పదవ వంతు కంటే ఎక్కువ. ఆ విధంగా ప్రతిభావంతమైన పాత్రను వామపక్షాలు పోషించాయి. కానీ నానాటికీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. ఇపుడు కేరళను కూడా నిలబెట్టుకోకపోతే ఇంతే సంగతులు అని అంటున్నారు.
* గెలుపు పై వామపక్షాల ధీమా : అయితే ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం లేదని వామపక్ష నాయకులు అంటున్నారు. తాము తప్పకుండా గెలిచి తీరుతామని కూడా చెబుతున్నారు.మే 4న వచ్చే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని హ్యాట్రిక్ విజయం తమదేనని ఎల్ డీఎఫ్ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి ఆ ధీమా వెనక ఉన్న ధైర్యం ఏమిటో. నిజంగా కేరళలో మూడవసారి ఎల్డీఎఫ్ గెలిస్తే అది రికార్డే అవుతుంది.
👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

చరిత్రలోకి వెళితే.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే… హిస్టరీ రిపీట్ కానుందా? ఉమ్మడి ఏపీలో వైఎస్ కు తిరిగులేని అధికారాన్ని కట్టబెట్టే విషయంలో తెలీయకుండానే తన పార్టీ కారణంగా చిరు చేసినట్లే.. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పుణ్యమా అని డీఎంకే అధినేత స్టాలిన్ కు జరగనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు పక్కా అన్నట్లుగా నిన్న విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేయటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ ప్రభావం పక్కాగా ఉంటుందని.. ఎన్నికల ఫలితాల్లో ఆయన కీలకభూమిక పోషిస్తారన్న అంచనాకు తగ్గట్లే.. జరగనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఫలితాలు విజయ్ కు కాకుండా అధికార డీఎంకేకు మరోసారి పవర్ ను కట్టబెట్టేలా చేయటంలో విజయ్ కీలకభూమిక పోషించనున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
విషయం తెలుసుకొని క్షమాపణలు..
చరిత్రలోకి వెళితే.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. 2009 ఎన్నికల నాటికి వైఎస్ కు విజయం సాధ్యం కాదన్నట్లుగా ర్చ జరిగింది. దీనికి కారణం విపక్ష టీడీపీతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావటం.. ప్రజారాజ్యం పేరుతో సామాజిక మార్పు నినాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.
దీంతో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ దెబ్బకు నాటి కాంగ్రెస్ సర్కారుకు ఓటమి షాక్ తప్పదన్నట్లుగా కొందరు అంచనా వేశారు. కానీ.. ఎగ్జిట్ ఫలితాల్లో వైఎస్ మరోసారి అధికారాన్ని చేపడతారన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంచుమించు అప్పట్లో చిరు పోషించిన పాత్రనే తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పోషిస్తున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బీజేపీతో జత కట్టిన అన్నాడీఎంకేకు నిరాశ తప్పదని.. అదే సమయంలో కూటమిలో చేరేందుకు ససేమిరా అన్న విజయ్.. ప్రజారాజ్యం పార్టీతో చిరుకు ఎలాంటి ఫలితం ఎదురైందో.. అలాంటి పరిస్థితే విజయ్ కు తప్పదన్నఅంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ వాదనలో నిజం ఉందన్నట్లుగా తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తమిళనాడు ఎన్నికల్లో రెండంకెల సీట్లు రావొచ్చని… మూడో స్థానానికే పరిమితమవుతారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అధికారాన్ని చేపట్టాలంటే వారికి 118 స్థానాల మేజిక్ ఫిగర్ ను సొంతం చేసుకోవాలి. బుధవారం సాయంత్రం విడుదలైన మెజార్టీ సర్వేలను చూస్తే.. డీఎంకే అధికారానికి వస్తున్నట్లుగా అంచనా వేశాయి. ఒక్క ఎన్డీటీవీ – యాక్సిస్ మై ఇండియా కలిసి నిర్వహించిన సర్వే మాత్రం విజయ్ పార్టీ (టీవీకే) అందరి కంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్న అంచనాను వ్యక్తం చేసింది. మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం డీఎంకే మరోసారి పవర్ చేతికి వస్తుందని.. అందుకు విజయ్ పార్టీ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. అంతిమంగా డీఎంకేకు మేలు జరిగినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఈ వాదనలో నిజం ఎంత? అన్నది తేలాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.

