👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్!!!
* హర్మూజ్‌ను అమెరికా దిగ్బంధించడంతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. మళ్లీ సైనిక చర్య చేపట్టడం, యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడంతో పోలిస్తే ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తేనే ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ట్రంప్ భావిస్తున్నారని ఆ కథనాలు పేర్కొన్నాయి.
👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా*
* ఏపీ వ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరింది. 4,345 బంకుల్లో కొత్తగా 47 మినహా అన్నింటా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశారు. మూడు జిల్లాల్లో మాత్రమే పదికిపైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లో మూతపడిన బంకులకు స్టాక్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు.
👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. 
భారత్ చేతికి రహస్యాలు! అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించాలన్న భారత్ ప్రయత్నాల్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించాలన్న భారత్ ప్రయత్నాల్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా పిలవబడే సలీమ్ డోలాను తుర్కియే నుండి భారత్‌కు రప్పించడం అనేది సామాన్య విషయం కాదు. ఇది భారత గూఢచారి సంస్థల దౌత్యనీతికి మరియు పట్టుదలకు నిదర్శనం. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తాజాగా ఒక భారీ విజయాన్ని అందుకుంది. దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి-కంపెనీ’ విదేశాల్లో నిర్వహించే మాదకద్రవ్యాల వ్యాపారానికి గుండెకాయ వంటి సలీమ్ డోలాను ఇస్తాంబుల్‌లో అదుపులోకి తీసుకొని, భారత్‌కు తీసుకురావడం అంతర్జాతీయ నేర ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న డోలాను చూస్తుంటే, డ్రగ్ మాఫియా పతనం మొదలైందని అర్థం చేసుకోవచ్చు.
సలీమ్ డోలా ఎవరు? ‘డీ’లో పాత్ర.. సలీమ్ డోలా కేవలం స్మగ్లర్ మాత్రమే కాదు.., ఒక వ్యూహకర్త. ఏడాదికి సుమారు రూ. 5,000 కోట్ల విలువైన డ్రగ్స్ వ్యాపారాన్ని డోలా పర్యవేక్షిస్తున్నాడని అధికారుల అంచనా. ఈ సొమ్మును డీ-కంపెనీ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వాడుతున్నట్లు సమాచారం. దుబాయ్, పాకిస్తాన్, తుర్కియే, ఐరోపా దేశాల మధ్య డ్రగ్స్ రవాణా చేసే సిండికేట్‌ను ఇతను నడిపిస్తున్నాడు. సింథటిక్ డ్రగ్స్ నుంచి హెరాయిన్ వరకు అన్ని రకాల మాదకద్రవ్యాలను భారత్‌లోకి పంపడంలో ఇతను కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆపరేషన్ ఇస్తాంబుల్ డోలాను పట్టుకోవడం కోసం భారత్ దర్యాప్తు సంస్థలు కొన్ని నెలలుగా స్కెచ్ వేస్తున్నాయి. దుబాయ్‌లో సలీమ్ సోహైల్ షేక్ అరెస్ట్ అవ్వడం ఈ నెట్‌వర్క్ గుట్టు విప్పడానికి మొదటి మెట్టు అయ్యింది. గతేడాది జూన్‌లో డోలా కుమారుడు తాహెర్ యూఏఈలో దొరకడం మరో మలుపు. తాహెర్‌ను భారత్‌కు రప్పించి విచారించడంతో, సలీమ్ డోలా తుర్కియేలో తలదాచుకున్నాడనే పక్కా సమాచారం లభించింది. భారత ప్రభుత్వం తుర్కియే అధికారులతో దౌత్యపరంగా చర్చలు జరిపి, రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా అతడిని అప్పగించేలా ఒప్పించింది.
భారత్‌కు ప్రయోజనాలు.. సలీమ్ డోలా కస్టడీలోకి రావడం వల్ల దర్యాప్తు సంస్థలకు అనేక విషయాలు తెలియనున్నాయి. పాకిస్తాన్‌లో దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉంటున్నాడు? అతడికి సహకరిస్తున్న స్థానిక శక్తులు ఏంటి? అనే అంశాలపై డోలా నోరు విప్పే అవకాశం ఉంది. సముద్ర మార్గం, వాయు మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్ ఏయే పాయింట్ల నుంచి వస్తుందో తెలిస్తే, సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయవచ్చు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును ఎలా మనీ లాండరింగ్ చేస్తున్నారో కనిపెట్టడం ద్వారా డీ-కంపెనీ ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చు. విదేశాల్లో దాక్కుంటే తమను ఎవరూ ఏమీ చేయలేరని భావించే నేరగాళ్లకు సలీమ్ డోలాను అదుపులోకి తీసుకోవడం బలమైన హెచ్చరిక అనే చెప్పాలి. ముంబయి పోలీసులు, ఎన్సీబీ సంయుక్తంగా చేసే విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల నుంచి దేశాన్ని రక్షించడంలో మైలురాయిగా నిలుస్తుంది.
👉తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు రాబోతున్నాయి.
పార్టీని ఇక మీదట ఆయన తన కనుసన్ననలో నడపబోతున్నారు.తెలుగుదేశం పార్టీకి ఆయన సర్వ సత్తాక అధినాయకుడు కాబోతున్నారు.చంద్రబాబు అధినేతగా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పూర్తి బాధ్యతలను నిర్వహిస్తారు అని అంటున్నారు. దాంతో లోకేష్ పార్టీ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ఈ నెల 29న బుధవారం జరుపుతున్నారు ప్రమాణం చేయించనున్న బాబు : టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఈ కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరగనుంది. లోకేష్ తో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది. ఇందులో కీలక నేతల ప్రమాణం అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనుంది అని అంటున్నారు. ఇక ఈ కమిటీలలో నేతల ఎంపిక అన్నది సామాజికవర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా జరిగింది అని చెబుతున్నారు. అంతే కాదు పార్టీలో సీనియర్లకు చోటు దక్కింది. అలాగే ఉత్సాహవంతులు అయిన జూనియర్లకు కొత్త వారికి కూడా సముచిత స్థానం లభించింది.
* కీలక బాధ్యతలు : నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు ఈ నెల 29 నుంచి చేపట్టనున్నారు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నది లేదు. టీడీపీ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా సృష్టించిన ఈ పదవిలోకి లోకేష్ మొదటిసారి రాబోతున్నారు. ఇక లోకేష్ వయసు కంటే పెద్దది అయిన టీడీపీ బాధ్యతలను ఆయన మోయనుండడం మరో విశేషం. చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు అందేనాటికి ఆయన వయసు 45 ఏళ్ళు. దాదాపుగా టీడీపీ పగ్గాలు అన్నీ లోకేష్ వే అన్నట్లుగా అందుతున్న ఈ పదవిని బాబు కంటే చిన్న వయసులోనే లోకేష్ దక్కించుకుంటున్నారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 14 ఏళ్ళ పాటు నడిపారు. ఆయన తరువాత చంద్రబాబు మూడు దశాబ్దాల పాటు టీడీపీని మొత్తం తన భుజాన వేసుకున్నారు ఇపుడు లోకేష్ పసుపు పార్టీ భారం తాను తీసుకుంటున్నారు.
*మహానాడుతోనే మొదలు : ఇక కేవలం నెల కంటే తక్కువ సమయం టీడీపీ మహానాడుకు ఉంది. లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలి పార్టీ పండుగ అంది. అంతే కాదు అతి పెద్ద టీడీపీ వేడుక కూడా. దానిని లోకేష్ పూర్తిగా తన నాయకత్వ పటిమతో నిర్వహించనున్నారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వ్యూహాలు ఇలా మొత్తం పార్టీ వ్యవహారాలలో లోకేష్ ది అతి ముఖ్య పాత్ర అని అంటున్నారు. 2029 ఎన్నికలు కూడా లోకేష్ కి పెద్ద బాధ్యత కానున్నాయని అంటున్నారు. బాబు సలహా సూచనలతో పార్టీని లోకేష్ నడిపినా భారంలో సింహ భాగం ఆయనదే అని అంటున్నారు. మొత్తానికి పార్టీ పట్టాభిషేకం జరగనుంది. ఇక మిగిలింది ప్రభుత్వ పట్టాభిషేకమే అని అంటున్నారు.
👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు*
పల్నాడు జిల్లా..రెంటచింతల మండలానికి చెందిన ఓ వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం విశాఖలో ఉంటున్న బాధితురాలు ఈ నెల 26న నడికుడి వైపు ప్రయాణిస్తుండగా జనరల్ బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఏసీ బోగీకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం.బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.సంబంధించిన అధికారి తెలియచేశారు
👉రియల్ ఎస్టేట్ వ్యాపారం,చిట్టి లు నడుపుతూ అందరిని నమ్మించి దాదాపుగా 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి (45) అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన వనస్థలిపురం పోలీసులు..ఎల్బీనగర్…!*
నిందితురాలు 1994 సంవత్సర మూలో కొహెడ చెందిన బద్దం జనార్దన్ రెడ్డి వివాహం చేసుకొని హయత్ నగర్ లో ఉన్నది.. ఆ తర్వాత
వనస్థలిపురం లోని కమలా నగర్ లో ఉంటూ బద్దం జ్యోతి రెడ్డి 9 సంవత్సరాల నుండి రియర్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్నవారితో చిట్టి లు నడిపిస్తూ, తెలిసిన వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడి పెట్టించి వారికి లాభాలు కూడా ఇవ్వడంతో తనపై నమ్మకంతో చాలా మంది ఆమె వద్ద చిట్టి లు వేశారు..
2020 సంవత్సరం నుండి దాదాపుగా 20మంది వ్యక్తుల ను నమ్మించి దాదాపుగా 6.5కోట్ల మోసం చేసి పరారయినదని వీరే కాకుండా చాలామంది బాధితుల వద్ద నుండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్టి లు పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణ లో ఒప్పుకున్నదని పోలీసులు తెలిపారు..
నిందితురాలు బద్దం జ్యోతి రెడ్డి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించిన వనస్థలిపురం పోలీసులు..!
👉👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో హత్య చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..,
నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెంకు చెందిన నరసింహ (60) తన భార్య వసంతతో కలిసి బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో నివసిస్తున్నాడు.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో బుధవారం తెల్లవారుజామున కత్తితో మెడపై దాడి చేశారు.
దీంతో వసంతకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉మే వరకు టైమిస్తే రూ.1.5 కోట్లు ఇస్తా!*
* హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్ రికార్డు ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
👉కుడేరు లో పయ్యావుల ప్రవీణ్ అరటి తోటకు నిప్పు
అనంతపురం జిల్లా కూడేరు కదరకుంటకు చెందిన రైతు పయ్యావుల ప్రవీణ్ కు చెందిన అరటి తోటకు నిప్పు పెట్టిన దుండగులు..ఈ సంఘటనలో సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిదయ్యాయి…పూర్తిగా డ్రిప్పు పరికరాలు దగ్ధమయ్యాయి దాదాపు ఆరు లక్షల వరకు పంట నష్టం…
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా న్యాయం చేయాలని కోరుతున్న రైతు పయ్యావుల ప్రవీణ్……
👉లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం**
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో రూ.500 నోట్లు కలకలం రేపాయి. గ్రామ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో, నిర్మానుష్య ప్రాంతంలోని చెత్తలో పెద్ద సంఖ్యలో రూ.500 నోట్లు చిందరవందరగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.సుమారు రూ.30 వేల వరకు విలువైన ఈ నోట్లను చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని దమ్మపేట పోలీసులకు అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నోట్లను పరిశీలించి, అవి **నకిలీ నోట్లు**గా నిర్ధారించారు. పారేసిన ఆ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

*గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు బుధవారం గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం యర్రబాలెం గ్రామంలో నరాల చిన్న కాశిరెడ్డి,లక్ష్మీనారాయణమ్మల కుమారుడు మరియు కి”శే”నరాల కాశిరెడ్డి,కి”శే”శ్రీదేవి ల కుమారుడుల వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వదువరులు అయిన కౌశిక్ కుమార్ రెడ్డి,శిరీష లను మరియు కామేశ్వర్ రెడ్డి,సునీతలను ఆశీర్వదించినారు.
👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*
Recent Posts

