గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

గిద్దలూరు అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ నాయకులే..

మీ ఇంటి బిడ్డగా ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటా..

రాబోయే ఎన్నికల్లో ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తాను

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అప్పటి వైసీపీ నాయకులు అడ్డుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుండి పైపు లైను ద్వారా నీరు అందించానని, అదే విధంగా పేద ప్రజలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాలను మంజూరు చేశానని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పెన్షన్లు అందించానని, సగిలేరు వాగు మరమ్మత్తులకు నిధులను మంజూరు చేశానని, ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించానని, పట్టణంలో ప్రతీ వీధికి వంద శాతం సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలకు నిధులను మంజూరు చేయిస్తే ప్రజలకు మేలు చేసే అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ పాలకులు కాదా అని ప్రశ్నించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఏ రోజు అయినా గిద్దలూరు అభివృద్ధి పై దృష్టి పెట్టారా అని, గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి, దద్దమ్మ పాలకులకు కనిపించలేదా అన్నారు.. నేను మీ ఇంటి బిడ్డను ఎల్లవేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చిన మీ ముందుంటానని, గతంలో మీ మద్దతుతో శాసనసభ్యునిగా ఎన్నికై నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అందరూ నన్ను ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదంతో గెలుపొంది గిద్దలూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు..

కార్యక్రమంలో 5వ వార్డు స్థానిక టీడీపీ నాయకులు జిల్లెల్ల సంపత్ కుమార్ రెడ్డి, బచ్చనబోయిన సతీష్ కుమార్, యల్లా రంగసాయి, దప్పిలి నిరంజన్ రెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, పసుపుల ప్రసాద్, కాశయ్య, ఠాగూర్, నీరజ, మరియు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, ప్రధాన కార్యదర్శి పందీటి రజిని బాబు, గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, దప్పిలి భాస్కర్ రెడ్డి, పాలుగుళ్ళ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్లు బిల్లా రమేష్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్, రాష్ట్ర బీసీ కార్యదర్శి బైలడుగు బాలయ్య యాదవ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా, పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్, కార్యదర్శి సుండీ వెంకట రమణ, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు, మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా, TNTUC అధ్యక్షులు ఉలాపు బాలచెన్నయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర నాయక్, టీడీపీ సర్పంచులు పసుపుల మల్లీశ్వరయ్య, కడియం శేషగిరి, కర్ణాటి రామసుబ్బారెడ్డి, పందనబోయిన భూపాల్, పట్టణ రైతు అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటప్ప, రాష్ట్ర కాపుసంఘం జేఏసీ కన్వీనర్ దుత్తా బాల ఈశ్వరయ్య, బొజ్జా రంగనాధ్, అబ్బు ఓబయ్య, మోడీగారి కృష్ణ, బీసీ నాయకులు ఓ. వెంకటయ్య యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, పందిళ్ళపల్లి శ్రీనివాసులు, పాముల వెంకట రమణ, కుసుమాల మహానంది యాదవ్, మండ్ల శ్రీనివాసులు, వేములపాటి చంటి, ముద్దార్స్ శ్రీనివాసులు, బాబాయ్, గిద్దలూరు మద్దిలేటి, పిడతల రవితేజ, గులాం గోవింద్, వాసం పెంచలయ్య, కంచర్ల కిరణ్, వడ్లమాను సుబ్బారాయుడు, మండ్ల రంగనాయకులు, గోళ్ళ అంకయ్య, చక్రీ యాదవ్, చిలకల రమణ, రంగనాయకులు, వైశ్య నాయకులు ఆరవీటి సుబ్రహ్మణ్యం, సీవీఎస్ రమేష్, జిలకర సత్యం, శివపురం మురళీ, మహేష్, సీవీఎన్ ప్రసాద్, మైనార్టీ నాయకులు షేక్ జాఫర్, జి.ఎం వలి, నాగూర్ వలి, జానీ, నాయబ్ ఖాజా, ఎస్సి నాయకులు బాలవీరయ్య, ఇజ్రాయేలు, రాబర్ట్, చిన్న, పార్లమెంట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ఇస్లావత్ అశోక్ నాయక్, గోడి ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి, మహిళా నేతలు బొంతా లక్ష్మీదేవి, దూదేకుల ఫాతిమా, చిటికెన లలిత, వెళుతుర్ల మల్లీశ్వరి, పీక్కిలి రమ, నంద్యాల లక్ష్మి, మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*