👉 దోర్నాల మండలం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తో కలిసి పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరియు వెలిగొండ ప్రాజెక్ట్ అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాంత ప్రజల కలల ప్రాజెక్ట్ అని, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

⭐ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ పనులు ఆలస్యమయ్యాయని, కానీ ఇప్పుడు వేగంగా పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు.పూర్తి కాని ప్రాజెక్ట్‌ను పూర్తయినట్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజలను మోసం చేసే రాజకీయాలు కాదు, పనులు చేసి చూపించే పాలన మాది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో సాగు నీరు, తాగునీరు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పారు.
👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 అత్యధికం ఎక్కడంటే? ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ.. చిన్న మాటలో చెప్పాలంటే ‘‘సర్’. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నానటమే కాదు.. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
⭐ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ.. చిన్న మాటలో చెప్పాలంటే ‘‘సర్’. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నానటమే కాదు.. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియ అనంతరం అక్కడి ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91 లక్షల మంది ఓటర్లు అవుట్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనప్పటికీ దాడి డేటా ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరు చివరి నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్’ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 90.83 లక్షల ఓటర్లను తొలగించారు. 60.06 లక్ష్ల ఓటర్లను డౌట్.. పెండింగ్ జాబితాలో చేర్చారు. న్యాయాధికారుల పరిశీలన తర్వాత 27.16 లక్షల ఓట్లు తీసేశారు. మిగిలిన 32.68 లక్షల ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించి జాబితాతాల్లో పేర్లను పునరుద్ధరించారు.ఇప్పుడు 27.16 లక్షల మంది ఓటర్ల పరిస్థితి ఏమిటి? అన్నది గందరగోళంగా మారింది.
⭐దీనికి ముందు అసలు సర్ అంటే ఏంటి? ఆ ప్రక్రియలో ఏం చేస్తారన్నది చూస్తే.. ఈ అంశంపై వచ్చే విమర్శలు.. ఆరోపణల వెనుకున్న విషయాలు ఏమిటన్న దానిపై కాస్తంత అవగాహన వచ్చే వీలుంది. ‘సర్’ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు స్టార్ట్ చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రాంగా దీన్ని చెప్పాలి. సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా సవరణ కంటే మరింత విస్త్రతమైనదిగా చెబుతారు. అదే సమయంలో కచ్ఛితమైనదన్నది మరో వాదన. తొలుత బూత్ స్థాయిలో అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటరల్ వివరాలు సరి చూస్తారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరుల పేర్ల జాబితాలో చేరుస్తారు. అదే సమయంలో జాబితాలో కంటే ఎక్కువసార్లు ఉన్న పేర్లను.. మరణించిన వారి పేర్లను.. శాశ్వితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లను తొలగిస్తారు. ఓటర్ల పేర్లు.. చిరునామా.. ఇతర సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుతారు. ఒక వేళ ఏమైనా అభ్యంతరాలు.. ఫిర్యాదులు ఉంటే న్యాయాధికారులు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచేందుకు.. అనర్హులను తొలగించి జాబితాను స్వచ్చంగా ఉంచేందుకు ఈ సర్ ప్రక్రియను చేపడుతున్నారు. ఇక.. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున తీసేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఉంది కాబట్టి.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఉన్న వారి ఓటర్లను గంపగుత్తగా తీసేస్తున్నారన్నది వివాదం. ఇందుకు తగ్గట్లే బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. మతువా.. రాజ్ బంశీ ఇతర మైనార్టీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లుగా ఆమె మండిపడుతున్నారు. తాజాగా నాదియా జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె మైనార్టీలు ఎక్కువగా ఉండే ముర్షాదాబాద్.. మాల్దా.. ఉత్తర దీనాజ్ పూర్ జిల్లాల్లో కొన్ని వర్గాల ఓట్లను ఎంచుకొని మరీ ఎక్కువగా తొలగించినట్లు ఆరోపించారు.
⭐తాను సుప్రీంకోర్టు వెళ్లిన తర్వాతే సందేహాలు ఉన్నట్లుగా పేర్కొంటూ పక్కన పెట్టిన 60 లక్షల ఓట్లలో 32 లక్షల ఓట్లను పునరుద్ధరించినట్లుగా పేరకొన్నారు. ముఖ్యమంత్రి మమత మాటలు ఇలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం తుది డేటాను చూస్తే ముస్లిం ప్రాబల్య జిల్లాగా పేరున్న ముర్షీదాబాద్లో అత్యధికంగా 11.01 లక్షల పేర్లు జ్యూడీషియల్ స్క్రూటీనీకి పంపగా వీటిల్లో 4.55 లక్షల ఓట్లను న్యాయాధికారుల పరిశీలన తర్వాత తొలగించారు. బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లు.. మాల్దాలో 2.39 లక్షలు.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు.. పూర్వ వర్ధమాన్ జిల్లాలో 2.09 లక్షలు.. నాదియా జిల్లాలో 2.98 లక్షల ఓట్లను తీసేశారు. నాదియా.. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో మతువా వర్గీయుల జనాభా ఎక్కువ. మొత్తంగా పశ్చిమ బెంగాల్ లో చేపట్టిన సర్ ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా.. రాజకీయ వివాదంగా మారింది. రానున్న రోజుల్లో ఇదో పెద్ద అంశంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*
పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.
మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సీఐ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ భాష మరియు సిబ్బంది కలసి పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టాకిందపల్లి గ్రామ పొలాలలో పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు మరియు రూ.10010/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.
👉 వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు..పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు…

పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. గతంలో ఇలాంటి ప్రమాదకర జలాశయాల్లోకి వెళ్లి పలువురు మృత్యువాత పడి కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చిన సంఘటనలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.
ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సరదాగా వెళ్లిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ, వారు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత రాకపోతే కలిగే ప్రమాదాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.జలాశయాలు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో ఈత కొట్టేముందు, ఈత తెలిసిన వారు కూడా నీటి లోతును కర్రల సాయంతో ముందుగా పరిశీలించుకోవాలన్నారు. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే ఈతకు వెళ్లకూడదని, విహారయాత్రలు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే స్నానం చేయాలని, లోపలికి వెళ్లరాదని, ఈత రాకపోయినా స్నేహితులు బలవంతం చేయకూడదని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. చెరువులు, బావులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నీటి లోతును తెలియజేసే సూచనలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే చిన్నారులు ఈతకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించిన వెంటనే డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.
👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం..మార్కాపురం ఎమ్మెల్యే కందుల…
మంగళవారం మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన ” స్వర్ణాంధ్ర 2047- మార్కాపురం నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రిచ్ ” లో ఆయన పాల్గొని నియోజకవర్గ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ 2026- 27 వార్షిక బడ్జెట్లో మార్కాపురం నియోజకవర్గానికి 679 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని దానిలో సూపర్ సిక్స్ పథకాలకు సుమారు 317 కోట్ల రూపాయలు, డిపార్ట్మెంట్ల వారీగా అభివృద్ధి కోసం 364 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి కేటాయించడం జరిగిందని గతంలో ఈ విధంగా ఎప్పుడు కేటాయించలేదని ఈ నియోజకవర్గ బడ్జెట్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేసి నియోజకవర్గాన్ని సంక్షేమం మరియు అభివృద్ధి బాటలో తీసుకువెళతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…
Recent Posts

