👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉జగన్ అంటే …. లోకేష్ ఏం చెప్పారంటే ? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో టీడీపీ యువ నేత మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో టీడీపీ యువ నేత మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశారు.

జగన్ గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించకండి, ఆయనను లైట్ తీస్కోండి అని పార్టీ క్యాడర్ కి కూడా సందేశం ఇచ్చేశారు ఎందుకంటే జగన్ కి లేనిది నిలకడ తనం అని కూడా కామెంట్స్ చేశారు. ఆయన ఏమి చెబుతారో కూడా దాని మీద సైతం నిలబడరని లోకేష్ కామెంట్స్ చేశారు. సీరియస్ వద్దు అంటూ : జగన్ అంటే ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు ఆయన మాటలు కూడా అంతే అని హితబోధ చేయడం విశేషం. మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ గురించి ఆయన తీరు గురించి కూడా తన పార్టీ వారికి విడమరచి చెప్పడం విశేషం. జగన్ అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు దూరంగానే ఉంటున్నారని గుర్తు చేస్తూ చురకలు అంటించారు.
అంతా గందరగోళం : నిన్న మావిగాన్ అన్నారు, నేడు మళ్ళీ మూడు రాజధానులు అని ఆయనే అంటున్నారు అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఒకే నోటితో ఎన్నో మాటలు చెప్పడం జగన్ కే చెల్లిందని నిందించారు ఆయనకు మాట నిలకడ అన్నదే ఉండదని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ ఇంటికి ఎపుడూ జనాలు వెళ్ళలేరని ఎందుకంటే ఆయన ఇంటి చుట్టూ 30 అడుగుల ఇనుప కంచె ఏర్పాటు చేసుకుని జనాలకు దూరంగా ఉంటారని లోకేష్ విమర్శించారు అదే 2019లో టీడీపీ ఓటమి పాలు అయినప్పటికీ చంద్రబాబు నిత్యం జనాల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. వెంటనే జనం లోకి వచ్చి ప్రజా సమస్యల మీద ఉద్యమించారు అని లోకేష్ చెపుకొచ్చారు ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకుని అర్ధం చేసుకుని ముందుకు సాగే నాయకత్వం చంద్రబాబుది అని లోకేష్ చెప్పారు. కొత్త వారికి చాన్స్ : తెలుగుదేశం పార్టీ ప్రతీ టెర్మ్ లో 33 శాతం మంది కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకుంది అని లోకేష్ చెప్పారు గ్రామ స్థాయి కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో మెంబర్ కావాలన్నదే పార్టీ లక్ష్యం అని లోకేష్ చెప్పారు పార్టీ సభ్యత్వం అంటే ఆధార్ కార్డు లాంటిదే అని లోకేష్ చెప్పారు. ఆ నంబర్ కనుక కొడితే ఎక్కడ ఏ నాయకుడు ఎంత మేర పనిచేశారో తెలిసిపోతుందని లోకేష్ చెప్పారు. సామాన్య కార్యకర్తలతో అధినేత పార్టీ ఆవిర్భవం దినోత్సవం వేళ గడిపారు అని గుర్తు చేసిన లోకేష్ దటీజ్ టీడీపీ అన్నారు. మొత్తానికి వైసీపీకి టీడీపీకి మధ్య తేడా ఏమిటో ఆయన స్పష్టంగా చెబుతూ జగన్ కి లైట్ తీస్కో అని క్యాడర్ కి సందేశం ఇచ్చారు.
👉భీకర యుద్ధం ,లెబనాన్ రాజధాని బీరుట్ మీద ఇజ్రాయిల్ అతి కిరాతకమైన దాడి😲😲😲
ప్రపంచపటం నుండి లెబనాన్ ని చెరిపేయాలని ఇజ్రాయిల్ నిర్ణయించుకుంది…కాల్పుల విరమణను అతిక్రమించి ఇజ్రాయిల్ బీరుట్ మీద చేసిన దాడి అతి భయంకరమైనది…
ఈ దాడుల ఫలితంగా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది, ఆసుపత్రులు కిక్కిరిపోయాయి, ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు… లెబనాన్ వ్యాప్తంగా 1,500 మందికి పైగా మరణించగా, 130 మంది పిల్లలు చనిపోయారు, 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు…
ఇజ్రాయెల్ సైనికులు లె‌బనాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాలను నాశనం చేశారు…
👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!!!
అప్పటివరకు మద్దతు ఇస్తున్న వారు సైతం.. ఇప్పుడు తల పట్టుకున్నట్లుగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ తీరును బలంగా సమర్థించేవారు సైతం ఇప్పుడు లెబనాన్ పై ఆ దేశం చేస్తున్న దాడుల్ని తప్పు పడుతున్నారు. అప్పటివరకు మద్దతు ఇస్తున్న వారు సైతం.. ఇప్పుడు తల పట్టుకున్నట్లుగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ తీరును బలంగా సమర్థించేవారు సైతం ఇప్పుడు లెబనాన్ పై ఆ దేశం చేస్తున్న దాడుల్ని తప్పు పడుతున్నారు. దీనికి కారణం హోర్మూజ్ జలసంధి ప్రపంచంలోని పలు దేశాలకు ప్రాణవాయువుగా మారటమే. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం అంతకంతకూ తీవ్రత పెరగటమే కాదు.. హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో.. భారీ ఎత్తున వాణిజ్య నౌకలు.. ముడి చమురు.. గ్యాస్ నౌకలన్ని నిలిచిపోవటంతో.. పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ – అమెరికాకు మధ్య కాల్పుల విరమణ జరిగితే.. ఇజ్రాయెల్ ఆటోమేటిక్ గా దాన్ని ఫాలో అవుతుందన్న అంచనాలకు భిన్నంగా.. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ మిత్రదేశం.. లెబనాన్ పై దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన దాడుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి దూరం జరిగిన ఇరాన్.. వెంటనే హోర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. షెడ్యూల్ ప్రకారం పాకస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఇరాన్ – అమెరికా ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరగనున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ‘టోల్’ బాంబ్ లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తాము హోర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఇదంతా చూసినప్పుడు.. ఆ ఇజ్రాయెల్ ను ఎవరైనా కాస్త ఆపండ్రా అన్నట్లుగా మారింది. తన ఎజెండాలో భాగంగా ముందుకెళుతున్న ఇజ్రాయెల్ తీరుతో ప్రపంచ దేశాలు సతమతమవుతున్న పరిస్థితి. కాల్పుల ఒప్పందం మీద ఇజ్రాయెల్ మొదట్నించి అసంత్రప్తిగా ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే.. ఇరాన్ తో కాల్పుల ఒప్పందం జరిగినా.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పై భారీ ఎత్తున దాడులు నిర్వహించిన తీరు చూస్తే.. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని మరింత సున్నితంగా మార్చేలా ఇజ్రాయెల్ వ్యవహరించిందన్న భావన కలుగక మానదు. లెబనాన్ పై జరిగిన దాడులకు నిరసనగా హోర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ? కేరళ రాష్ట్రానికి ఈ నెల 9న ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఎన్నికల్లో విజేత ఎవరు కాబోయే సీఎం ఎవరు అన్నది కేరళ రాష్ట్ర ప్రజలు నిర్ణయించనున్నారు.కేరళ రాష్ట్రానికి ఈ నెల 9న ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఎన్నికల్లో విజేత ఎవరు కాబోయే సీఎం ఎవరు అన్నది కేరళ రాష్ట్ర ప్రజలు నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే కేరళ కామ్రేడ్స్ కి ఒక విధంగా కంచుకోట. ఇప్పటికి ఏడు దశాబ్దాల నుంచి కమ్యూనిస్టులు అక్కడ పాగా వేస్తూ వస్తున్నారు. అనేక దఫాలుగా వారు గెలిచి ప్రభుత్వాలను నడుపుతున్నారు.ఇక కేరళ తరువాతనే దేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా కామ్రేడ్స్ గెలుచుకున్నారు. అందులో పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటివి ఉన్నాయి. అయితే బెంగాల్ 2011 నుంచి పోయింది. త్రిపుర కూడా బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే రాష్ట్రం. అదే కేరళం. అక్కడ కూడా ఎర్ర కోట గెలవకపోతే కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952 నుంచి రాజ్యాంగ రచన తరువాత ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అలా రెండవ ఎన్నికలు 1957లో జరిగినపుడే కేరళలో తొలిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు అయింది. అలా ఈఎం ఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కేరళలో ఎర్రన్నల పాలన స్టార్ట్ అయింది. అయితే 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూల్చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ మీదట చూస్తే ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మరో ఎన్నికలో కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. ఇది ఆనవాయితీగా మారుతోంది.
పదేళ్ళుగా అధికారం : ఇక కేరళలో 2016 నుంచి పదేళ్ళుగా కమ్యూనిస్టుల పాలన సాగుతోంది. పినరయి విజయన్ సీఎం గా మేలు అయిన పాలనే అందించారు. అయితే విమర్శలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత ఉంది దాని కంటే మించి బీజేపీతో లోపాయి కారీగా కామ్రేడ్స్ లాలూచీ పడుతున్నారు అన్న కాంగ్రెస్ ఆరోపణలు జనంలోకి వెళ్ళిపోయాయి. దాంతో ఈసారి కేరళలో పెద్ద సంఖ్యలో మైనారిటీలు కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపిస్తున్నారు అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో కామ్రేడ్స్ కి కష్టకాలమే దాపురిస్తుందా అన్న చర్చ సాగుతోంది. మధ్యలో పోటీకి దిగిన బీజేపీ ఎవరి ఓట్లు చీలుస్తుందో అన్న బెంగ కూడా ఉంది అంటున్నారు.
*హామీలతో కాంగ్రెస్ : కాంగ్రెస్ కేరళలో సూపర్ ఫైవ్ హామీలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాలకు వెళ్లే బాలికలందరికీ నెలకు వేయి రూపాయల నగదు సహాయం, ఒక్కో కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు, బలహీన వర్గాలకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్లు, యువత సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు అయిదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి ఆకర్షణీయమైన హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అంతే కాదు పినరయి విజయన్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలను సృష్టించడంలో విఫలం అయిందని, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించింది అని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా ఉంది. రైతులు, మత్స్యకారులు, కార్మికులకు అండగా ఉండడంలోనూ విఫలం చెందిందని కాంగ్రెస్ బాణాలను ఎక్కు పెట్టింది. సర్వే అంచనాలు చూస్తే ఈసారి కమ్యూనిస్టులకు ఎదురుగాలి అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో కమ్యూనిస్టుల ఒకే ఒక్క కోట కూడా కూలిస్తే తమకు తిరుగు లేదని బిజెపి కూడా ఉవ్విళ్లూరుతుంది.. ప్రజలు ప్రలోభాలకు లొంగకపోతే, బిజెపి పాచికలు,కుట్రలు పారకపోతే కామ్రేడ్స్ తిరిగే ఉండదు.. వేచి చూద్దాం…
👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…నిలబడే నిద్రపోతున్నాడు..భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ వినియోగం భ‌యాందోళ‌న‌లు పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ వినియోగం భ‌యాందోళ‌న‌లు పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.

డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ పెరుగుతున్న వేళ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెంగళూరులోని బాగలూరు ప్రాంతంలో నిట్టే కాలేజీ సమీపంలో ఒక వ్యక్తి ఎటువంటి కదలిక లేకుండా, పరిసరాల స్పృహ కోల్పోయి విగ్రహంలా నిలబడి ఉన్న దృశ్యాలు నెట్టింట కలకలం రేపాయి. ఒక మనిషి నిలబడిన చోటే గంటల తరబడి నిశ్చలంగా ఉండిపోవడం చూస్తుంటే, ఇది ప్రమాదకరమైన ‘జాంబీ డ్రగ్’ ప్రభావమేనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయానక పరిస్థితి వెనుక `జైలజైన్` అనే పదార్థం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా జంతువులకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఈ మందును మనుషులు వాడటానికి ఏ దేశంలోనూ అనుమతి లేదు. అయితే విదేశాల్లో దీనిని `ఫెంటానిల్` వంటి ఇతర డ్రగ్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల మనుషులు స్పృహ కోల్పోయి, వింతగా ప్రవర్తిస్తూ ‘జాంబీస్’ లా మారిపోతారని సమాచారం. ఈ మందు ప్రభావంతో శ్వాస నెమ్మదించడం, గుండె వేగం తగ్గడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కేవలం బెంగళూరులోనే కాకుండా, కొద్దిరోజుల క్రితం చండీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక డెలివరీ బాయ్ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు కదలకుండా ఒకే స్థితిలో నిలబడి ఉండటం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న సామాజిక విశ్లేషకులు, నగరం ‘ఉడ్తా బెంగళూరు’గా మారుతోందని విమర్శిస్తున్నారు. పబ్బులు, బార్లు విద్యాసంస్థలకు సమీపంలో ఉండటం వల్లే యువత ఇలాంటి ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలవుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఈ భయానక పరిస్థితి వెనుక `జైలజైన్` అనే పదార్థం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా జంతువులకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఈ మందును మనుషులు వాడటానికి ఏ దేశంలోనూ అనుమతి లేదు. అయితే విదేశాల్లో దీనిని `ఫెంటానిల్` వంటి ఇతర డ్రగ్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల మనుషులు స్పృహ కోల్పోయి, వింతగా ప్రవర్తిస్తూ ‘జాంబీస్’ లా మారిపోతారని సమాచారం. ఈ మందు ప్రభావంతో శ్వాస నెమ్మదించడం, గుండె వేగం తగ్గడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కేవలం బెంగళూరులోనే కాకుండా, కొద్దిరోజుల క్రితం చండీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక డెలివరీ బాయ్ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు కదలకుండా ఒకే స్థితిలో నిలబడి ఉండటం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న సామాజిక విశ్లేషకులు, నగరం ‘ఉడ్తా బెంగళూరు’గా మారుతోందని విమర్శిస్తున్నారు. పబ్బులు, బార్లు విద్యాసంస్థలకు సమీపంలో ఉండటం వల్లే యువత ఇలాంటి ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలవుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం పరంగా చూస్తే… ఈ డ్రగ్ ఒక పెద్ద సవాలుగా మారింది. ఇది సాధారణ ఓపియాయిడ్ కాకపోవడం వల్ల డ్రగ్ ఓవర్ డోస్ అయినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ఇచ్చే `నలోక్సోన్` వంటి మందులు కూడా దీనిపై పనిచేయవు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. చండీగఢ్ బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ల్యాబ్ రిపోర్టులు వస్తే తప్ప ఈ ప‌రిస్థితికి అసలు కారణం డ్రగ్సా లేక మరేదైనా ఆరోగ్య సమస్యనా అనేది స్పష్టమవ్వదు. అయితే ఈ వైరల్ వీడియోలు సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాల పట్ల, ప్రవర్తన పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించేందుకు విద్యాసంస్థల్లో ధ్యానం, విపాసన వంటి నైతిక విలువలను పెంచే కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుకార్లను నమ్మకుండా వాస్తవాలు తెలిసే వరకు వేచి చూడాలని కోరుతూనే.. సమాజం అంతా కలిసి ఈ మహమ్మారిపై పోరాడాలని పిలుపునిస్తున్నారు.
👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*
ఎన్టీఆర్ జిల్లాలోని గుంటుపల్లి హైవేపై ఓ పోలీస్ డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. బైక్ నడుపుతూ నియంత్రణ కోల్పోయిన పోలీస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనను గమనించిన అక్కడి యువకుడు వెంటనే స్పందించి, పోలీసును అడ్డుకొని ప్రశ్నించాడు. విధుల్లో ఉన్న పోలీసులే మద్యం సేవించి వాహనం నడిపితే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని నిలదీశాడు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీసుల ప్రవర్తనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
👉 ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో గంజాయి, డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో విద్యార్ధులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో చైతన్యం కలిగించే ఉద్దేశ్యంతో బుధవారం ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీ ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రకాశం జిల్లా డివైఎఫ్ఐ ఆద్వర్యంలో “జన చైతన్య జీపు యాత్ర” పేరుతో కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…