👉ట్రంప్ హడావుడికి అమెరికా భారీ మూల్యాన్నిచెల్లిస్తోందా? …*విజ‌య‌న్‌కు రేవంత్‌ జవాబు.. విష‌యం ఇదీ!…👉 ముస్లింలపై వ్యతిరేకతతో యుద్ధాన్ని సమర్థించరాదు – రిటైర్డ్ ఐఎయస్ డాక్టర్ పి.వి. రమేష్ ..*డ్రగ్స్, గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం…జన చైతన్య జీపుయాత్ర… (ప్రకాశం జిల్లా)… 👉 నీటి సంరక్షణ అందరి బాధ్యత- మార్కాపురం శాసనసభ్యులు కందుల

👉 ట్రంప్ హడావుడికి అమెరికా భారీ మూల్యాన్నిచెల్లిస్తోందా? .. ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నయుద్ధం ఆరో వారానికి చేరుకుంది. యుద్ధాలు అగ్రరాజ్యానికి కొత్తేం కాదు. తాను టార్గెట్ చేసుకున్న దేశం.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఒప్పుకోని దేశం అంతు చూసే అలవాటు ఉన్న అమెరికా.. ఇరాన్ సంగతి తేల్చేద్దామనే తొందరలో ట్రంప్ హడావుడికి అమెరికా భారీ మూల్యాన్నిచెల్లిస్తోందా? అన్నదిప్పుడు చర్చ జరుగుతోంది. నాలుగు వారాల కంటే ముందే ఇరాన్ తో యుద్ధాన్నిముగిస్తామని చెప్పినా.. అది కాస్తా ఆరు వారాలకు సాగటం.. మరెంత కాలం సాగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ భారీగా దెబ్బ తీసిందని.. యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన గణాంకాలు భారీగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే.. అందరి చూపు భౌతిక వస్తువులపైనే తప్పించి.. మరో కీలకమైన మానవీయ కోణాన్ని మిస్ అవుతున్న పరిస్థితి. నిజానికి అమెరికా తాను కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా మరో అంశంలో ఆందోళనతో ఉందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వ్యవహారం మీడియా కథనాల్లో పెద్దగా కనిపించకపోవటం గమనార్హం. వైరల్ వీడియో తమతో చేస్తున్న యుద్ధంలో అమెరికాకు చెందిన 19 యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా ఇరాన్ చెబుతోంది. ఇప్పటివరకు అమెరికా కోల్పోయిన యుద్ధ విమానాలు.. వాటి రకాలు.. వాటి ధరల చిట్టా భారీగానే సర్క్యూలేట్ అవుతోంది. అయితే.. ఇక్కడ ఆ జాబితాకు మించిన విషయాలు ఉన్నాయి అదే సమయంలో.. జాబితాలో చెబుతున్నట్లుగా నిజంగానే 19 యుద్ధ విమానాల్ని అమెరికా కోల్పోయిందా? అంటే.. అందుకు పక్కా ఆధారాలు లభించని పరిస్థితి. అసలు ఎన్ని యుద్ధ విమానాల్ని అమెరికా కోల్పోయింది? అన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే..యుద్ధ విమానాలు.. హెలికాఫ్టర్లు.. భారీ డ్రోన్లు (దూరం నుంచి చూసేందుకు యుద్ధ విమానాల మాదిరే ఉంటాయి) మొత్తంగా 25 వరకు ఉంటే.. ఇరాన్ మాత్రం ఈ సంఖ్యను 44కు మించి ఉంటాయని చెబుతోంది. వీటి ఖరీదు విషయానికి వస్తే.. అమెరికా చెప్పే దాని ప్రకారం దగ్గర దగ్గర రూ.30వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు చెబతే.. ఇరాన్ లెక్కల ప్రకారం ఈ నష్టం రూ.40వేల కోట్లు దాటినట్లుగా చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అమెరికాకు ఉన్న భారీ వైమానిక శక్తి ముందు తాజా యుద్ధంలో కోల్పోయినవి చాలా తక్కువ. అంకెల్లో చెప్పాల్సి వస్తే..అమెరికా మద్ద ఉన్న అన్ని సైనిక విమానాలు కలిపి సుమారు 13 వేల వరకు ఉంటాయి. కేవలం యుద్ధ విమానాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే..2800 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ చెప్పిన దాని ప్రకారం.. 19 యుద్ధ విమానాలు అంటే 0.67 శాతం నష్టపోయినట్లు. అదే.. అమెరికా అంగీకరించిన 8 యుద్ధ విమానాల లెక్కను చూస్తే.. 0.28 శాతమే కనిపిస్తుంది. అంటే.. మొత్తంగా అమెరికా తన మొత్తం ఫైటర్ జెట్టలో ఒక శాతం కంటే తక్కువే కోల్పోయిందని చెప్పాలి.
వీటి ఖరీదు విషయానికి వస్తే.. అమెరికా చెప్పే దాని ప్రకారం దగ్గర దగ్గర రూ.30వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు చెబతే.. ఇరాన్ లెక్కల ప్రకారం ఈ నష్టం రూ.40వేల కోట్లు దాటినట్లుగా చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అమెరికాకు ఉన్న భారీ వైమానిక శక్తి ముందు తాజా యుద్ధంలో కోల్పోయినవి చాలా తక్కువ. అంకెల్లో చెప్పాల్సి వస్తే..అమెరికా మద్ద ఉన్న అన్ని సైనిక విమానాలు కలిపి సుమారు 13 వేల వరకు ఉంటాయి. కేవలం యుద్ధ విమానాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే..2800 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ చెప్పిన దాని ప్రకారం.. 19 యుద్ధ విమానాలు అంటే 0.67 శాతం నష్టపోయినట్లు. అదే.. అమెరికా అంగీకరించిన 8 యుద్ధ విమానాల లెక్కను చూస్తే.. 0.28 శాతమే కనిపిస్తుంది. అంటే.. మొత్తంగా అమెరికా తన మొత్తం ఫైటర్ జెట్టలో ఒక శాతం కంటే తక్కువే కోల్పోయిందని చెప్పాలి. నిజానికి అమెరికా తాను కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా.. మరణించిన పైలట్ల సంఖ్య మీదనే ఎక్కువ ఆందోళనతో ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. యుద్ధ విమానాన్ని కాస్త ఎక్కువ ఖర్చు చేస్తే తయారు చేయటం పెద్ద కష్టం కాదు. కానీ.. అత్యంత నైపుణ్యంతో ఉండే ఒక్కో వార్ పైలెట్ నష్టపోతే జరిగే నష్టం అపారం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ లాంటి దేశం కూల్చివేసిందన్నది అమెరికా సైనిక అధిపత్యం మీద పడే మచ్చగా చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తాజా యుద్ధంలో అమెరికా 12 నుంచి 15 మంది పైలట్లను కోల్పోయినట్లుగా చెబుతున్నారు. ఇరవైకు మించి గాయపడినట్లుగా తెలుస్తోంది. ఒక పైలట్ ను తయారు చేయటానికి రెండు.. మూడేళ్ల సమయం పడుతుంది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. గడిచిన ఇరవై.. పాతికేళ్ల వ్యవధిలో అమెరికా ఒక దేశం మీద యుద్ధం చేసే క్రమంలో కేవలం ఐదు వారాల వ్యవధిలో ఇంతమంది వాయుసేన పైలట్లను కోల్పోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా.. అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.. తన అమ్ములపొదిలోని అత్యుత్తమ పైలట్లను కోల్పోవటంగా చెబుతున్నారు.
👉విజ‌య‌న్‌కు రేవంత్‌ జవాబు.. విష‌యం ఇదీ! కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కాంగ్రెస్ త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్‌గా అక్క‌డ ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. కేర‌ళ సీఎం విజ‌య‌న్‌పై ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.
కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కాంగ్రెస్ త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్‌గా అక్క‌డ ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. కేర‌ళ సీఎం విజ‌య‌న్‌పై ఇటీవ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి ప్ర‌తిగా.. విజ‌యన్ కూడా ఘాటు వ్యాఖ్య‌ల‌తో రేవంత్ రెడ్డిని కార్న‌ర్ చేశారు.“మాద‌గ్గ‌ర నేర్చుకుని.. మాకే పాఠాలు చెబుతారా?“ అంటూ తెలంగాణ స‌ర్కారుపై విజ‌యన్ విరుచుకుప‌డ్డారు. అంతేకాదు..పేద‌రికం, మ‌ద్యం, వెనుక‌బాటు త‌నం, అప్పులు.. అవినీతి ఇలా అన్నింటిలోనూ తెలంగాణ‌లోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ‌మే ముందుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విజ‌య‌న్‌ను ఘాటు స‌మాధానం ఇస్తూ..సుదీర్ఘ‌లేఖ‌ను సంధించారు. దీనిలో ప‌లు విష‌యాలు ఆయ‌న ప్ర‌స్తావించారు. ముఖ్యంగా తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల నుంచి అక్ష‌రాస్య‌త‌, ప్రాజెక్టులు, అవినీతి, అక్ర‌మాలు.. ఇలా అన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. దీనిలో గ‌ణాంకాలు కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ యంలో ఆర్థిక వృద్ధి విష‌యంలో తెలంగాణ ఏవిధంగా ముందుకు సాగుతోంది? అనే వివ‌రాలు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌.. హైద‌రాబాద్ అభివృద్ధి, మూసీప్ర‌క్షాళ‌న‌, పేద‌లకు ఇళ్లు(విజ‌య‌న్‌.. పేద‌ల‌కు గూడు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు స్పంద‌న‌), రైతు భ‌రోసా(రైతుల ఆత్మ‌హ‌త్య‌ల విమ‌ర్శ‌ల‌పై స్పంద‌న‌) వంటి అంశాల‌ను వివ‌రించారు. “విజ‌య‌న్‌పై అపార గౌర‌వం ఉంది.“ అంటూనే సూటిగా సుత్తిలేకుండా లేఖ‌లో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రైజింగ్‌.. హైద‌రాబాద్ అభివృద్ధి, మూసీప్ర‌క్షాళ‌న‌, పేద‌లకు ఇళ్లు(విజ‌య‌న్‌.. పేద‌ల‌కు గూడు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు స్పంద‌న‌), రైతు భ‌రోసా(రైతుల ఆత్మ‌హ‌త్య‌ల విమ‌ర్శ‌ల‌పై స్పంద‌న‌) వంటి అంశాల‌ను వివ‌రించారు. “విజ‌య‌న్‌పై అపార గౌర‌వం ఉంది.“ అంటూనే సూటిగా సుత్తిలేకుండా లేఖ‌లో విరుచుకుపడ్డారు. రేవంత్ లేఖ‌లో ముఖ్యాంశాలు.. 1) 2024-25 లో తెలంగాణ రాష్ట్ర త‌ల‌స‌రి వృద్ధి 10.1 శాతంగా ఉంది. ఇది జాతీయ జీడీపీ 9.9 శాతం కంటే ఎక్కువ. దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 2) తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి ఏడాదే 20,617 కోట్ల రూపాయ‌ల‌ మేర రైతు రుణాలను మాఫీ చేశాం. 25.36 లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశాం. 3) రైతు భరోసాను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నాం..3) రైతు భరోసాను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నాం…ప్రతి ఏటా
ఎకరాకు 12 వేల రూపాయ‌లు ఇస్తున్నాం… రెండేళ్ల‌లో 69 ల‌క్ష‌ల‌. 70 వేల మంది రైతులకు 25,279 కోట్ల రూపాయ‌లు అందించాం. 4) రైతుల‌కు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 5) రైతులకు 5 లక్షల రూపాయ‌ల మేర‌కు బీమా క‌ల్పిస్తున్నాం. 14 ల‌క్ష‌ల 91 వేల మందికి ల‌బ్ధి క‌లుగుతోంది. 6) రైజింగ్ తెలంగాణ‌లో 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాం. 7) మూసీ ప్ర‌క్షాళ‌న‌తో న‌ష్ట‌పోతున్న పేద‌ల‌కు వేరే చోట ఇందిర‌మ్మ ఇళ్లు కేటాయిస్తున్నాం. 8) అవినీతికి తావులేని వాట్సాప్ పాల‌న‌ను ప్రారంభించాం(ఇటీవ‌లే ప్రారంభించారు). 9) ప్రాజెక్టుల నిర్మాణానికి.. పెట్టుబ‌డుల‌కు పెద్ద‌పీట వేస్తున్నామని సవివరంగా వివరించారు.
👉DYFI యాంటీ డ్రగ్స్ ఫోరమ్ డ్రగ్స్, గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం…జన చైతన్య జీపుయాత్ర… ప్రకాశం జిల్లా అద్దంకి …
DYFI.SFI.AIDWA.PNM. UTF.JVV ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం జిల్లా అద్దంకి లో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె.వి పిచ్చయ్య అధ్యక్షతన ప్రారంభమైన యాత్ర …అద్దంకిలో జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ప్రజా వైద్యశాల డాక్టర్ యలగాని హనుమంతరావు, పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు..వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య యాత్రకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చంద్, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీర,డివైఎఫ్ఐ ప్రజానాట్య మండలి నాయకులు సుజాత, యాంటీ డ్రగ్స్ ఫోరం నాయకులు వినోద్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు ప్రశాంత్.ఆకాష్ డివైఎఫ్ఐ నాయకులు బాజీ తదితరులు పాల్గొన్నారు.
👉 ముస్లింలపై వ్యతిరేకతతో యుద్ధాన్ని సమర్థించరాదు – రిటైర్డ్ ఐఎయస్ డాక్టర్ పి.వి. రమేష్ ..గుంటూరు…

ముస్లింల పట్ల వ్యతిరేక భావనతో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న అమానుష దాడులను సమర్థిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం దురదృష్టకరమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.పి.వి. రమేష్ పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు – ప్రపంచ దేశాలపై ప్రభావం అనే అంశంపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ప్రధాన వక్తగా విచ్చేసిన డా.పి.వి.రమేష్ ప్రసంగిస్తూ ప్రపంచంపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి,డాలర్ విలువను బలపరుచుకోవడానికి, అమెరికాలోని ఆయుధ లాబీయింగ్ ను ప్రోత్సహించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇరాన్ పై దాడులని తెలిపారు. ఇరాన్ 5 వేల సంవత్సరాల క్రితమే నాగరికత దేశంగా పేరుగాంచిందని, పాలన వికేంద్రీకరణకు నాంది పలికిందన్నారు. ఇరాన్ ను 31 భాగాలుగా విభజించి వారికి తగిన సైన్యం, ఆయుధాలు అందించడం వలననే అమెరికా, ఇజ్రాయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కో గలుగుతుందన్నారు. ఒకవైపు పాకిస్తాన్ లాంటి దేశం సైతం యుద్ధ నివారణకు మద్య వర్తిత్వం చేస్తుంటే మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న దాడులను భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటికీ ఖండించకపోవడం విచారకరమన్నారు. యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని, ముఖ్యంగా ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్స్, హీలియంల కొరతతో విపరీతంగా పెరిగిన ధరల రీత్యా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇజ్రాయిల్ వద్ద 90 అణు బాంబులు, అమెరికా వద్ద 4 వేలకు పైగా అణు బాంబులు ఉంచుకొని ఇరాన్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని త్వరలో అణుబాంబును వినియోగించినా ఆశ్చర్యపడనక్కర్లేదన్నారు. అమెరికాలో 90 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తున్నారని, 60 శాతం పైగా అమెరికా ప్రజలు యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని వివరించారు. మిత్ర దేశాలుగా ఉన్న నాటో దేశాలు, యూరప్ దేశాలు కూడా ట్రంప్ చర్యలను ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి బలహీన పడటంతో యుద్ధ నివారణకు సత్వర చర్యలు చేపట్ట లేకపోతుందని పేర్కొన్నారు.జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత 18 నెలలుగా డోనాల్డ్ ట్రంప్ వికృత చేష్టలతో వెనిజులా పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణి పట్టుకుని వెళ్లి ఆ దేశ చమురు వనరులను స్వాధీన పరచుకోవడం, ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశ ఖనిజ సంపదను ఆశించడం, గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించాలను కోవడం, కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని తపనపడటం, పనామా కాలువను స్వాధీన పరుచుకోవాలను కోవడం, క్యూబాను ఆక్రమించుకోవాలనుకోవడం, నేడు అణ్వాయుధాలను బూచిగా చూపి ఇరాన్ పై అమానుషంగా దాడులు చేయడాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండించాలన్నారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ ఇజ్రాయిల్ ప్రపంచానికి అణు బాంబు లాంటిదని వారి రాజ్య విస్తరణ కాంక్ష ప్రపంచాన్ని ప్రమాదంలో నెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, మానవత కోశాధికారి టి.వి. సాయిరాం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్ పోలూరి వీరారెడ్డి. వుయ్ ఆర్ విత్ యు చైర్మన్ శిగినం అయ్యప్ప, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కె.వి. చలపతిరావు,రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లా బక్షు,ఎస్. ఆర్. శంకరన్ నిరుపేదల సంఘం అధ్యక్షులు బత్తుల కోటేశ్వరరావు, తెలుగు భాషోద్యమ నేత డాక్టర్ వి. సింగారావు,కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు తదితరులు ప్రసంగించారు.
👉 నీటి సంరక్షణ మన అందరి బాధ్యత- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి…

ఆదివారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి భద్రత నీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలంలోని వేమలకోట చెరువు వద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నీటి సంఘాలు నీటిని ఏరకంగా పొదుపు చేయాలో నేర్చుకోవాలని పాటించాలని అన్నారు.
ఈ ఏడాది అధిక వర్షపాతంతో అత్యంత వెనకబడిన మార్కాపురం జిల్లాలో కూడా సమృద్ధిగా వర్షాలు కురుసాయని వచ్చే సంవత్సరకాలంలో వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసి ప్రతి ఒక్కరికి త్రాగునీరు సాగునీరు అందిస్తామని అన్నారు.వెలుగొండ ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాలని చూస్తున్నారని రేపు ఉదయం కూడా రెండు నెలల కాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోసారి వెలుగొండ ప్రాజెక్టు సందర్శన కోసం విచ్చేస్తున్నారని దీన్ని బట్టి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబట్టుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్