👉”పిక్చర్ అభి బాకీ హై”… పోస్టుతో మరోసారి రాఘవ్ చడ్డా నిప్పులు …👉వారం వ్యవధిలో ఇరువురు సిఐ ల పై వేటు*…👉11 లక్షల డీల్ వివాదం: చాముండేశ్వరి హత్య కేసులో ‘గబ్బర్ సింగ్’గా పేరుగాంచిన సీఐ వెంకటరమణ సస్పెండ్*…👉 ఉప్పల్ స్టేడియంలో స్టేడియంలో దుమ్ముతో నిండిన సీట్లు.. ప్రేక్షకుల ఇబ్బందులు..👉జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..👉ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య! (మార్కాపురం జిల్లా)…⭐ ప్రైవేటు ఆసుపత్రులలో పెరిగిపోతున్న అక్రమాలు ..తట్టుకోలేక రాజీనామా చేసిన డాక్టర్…

👉LPGపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!*
*వినియోగదారులకు అందుబాటులో 5 కిలోల సిలిండర్లు.*
*LPG సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దు.*
*బ్లాక్‌లో అమ్మేవారిపై కఠిన చర్యలు..!*

👉 హైదరాబాద్‌లో భారీ స్థాయి మటన్ మాఫియా….
కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వందల టన్నుల కుళ్ళిన మాంసం..170 బస్తాల్లో కుళ్ళిన పొట్టేలు, బీఫ్ తలలు.. వీటితోనే హెడ్ కర్రీ చేసేది..10 టన్నుల. కుళ్ళిన మటన్…మంగళహాట్ కేంద్రంగా ఈ కుళ్ళిన మటన్ మాఫియా…. హైదరాబాద్‌లో భారీ ఎత్తున వ్యాపారం చేస్తోంది.ఈ మటన్ నిలువ కేంద్రాలపై పోలీస్, కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. కుళ్ళిన మాంసం వాసన రాకుండా రసాయనాలు వాడుతున్నట్టు తేలింది.
ఈ మాఫియా కింగ్ అఫ్రోజ్ అనే వ్యక్తి అని తేల్చారు.
నలుగురిని అరెస్ట్ చేశారు.
👉⭐పిక్చర్ అభి బాకీ హై⭐ పోస్టుతో మరోసారి రాఘవ్ చడ్డా నిప్పులు ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురించి చేసిన ఘాటు విమర్శలతో రాఘవ్ చడ్డా మరింతగా ఫైర్ కావటం.. ధురంధర్ మూవీ డైలాగ్ తో ఒక్కసారి వైరల్ గా మారారు. వేలాది కోట్ల రూపాయిల అవినీతి అంశాల్ని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. దేశంలోని కోట్లాది మంది సామాన్యులు తమ రోజువారీ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యల్ని ప్రస్తావించే నాయకుడు ఒకడు ఉంటే.. అతన్ని అభిమానించకుండా ఎందుకు ఉంటారు? దీనికి తోడు క్లీన్ చిట్ వ్యక్తిత్వం ఉండటం మరింత ప్లస్ గా మారుతుంది.

ఇప్పుడు చెప్పేదంతా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా గురించి. ఆయను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో.. ఆయన తన రియాక్షన్ ను సోషల్ మీడియా పోస్టులతో తెలుపుతున్నారు.ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురించి చేసిన ఘాటు విమర్శలతో రాఘవ్ చడ్డా మరింతగా ఫైర్ కావటం..ధురంధర్ మూవీ డైలాగ్ తో ఒక్కసారి వైరల్ గా మారారు.వేలాది కోట్ల రూపాయిల అవినీతి అంశాల్ని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. దేశంలోని కోట్లాది మంది సామాన్యులు తమ రోజువారీ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యల్ని ప్రస్తావించే నాయకుడు ఒకడు ఉంటే.. అతన్ని అభిమానించకుండా ఎందుకు ఉంటారు? దీనికి తోడు క్లీన్ చిట్ వ్యక్తిత్వం ఉండటం మరింత ప్లస్ గా మారుతుంది. ఇప్పుడు చెప్పేదంతా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా గురించి. ఆయను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో.. ఆయన తన రియాక్షన్ ను సోషల్ మీడియా పోస్టులతో తెలుపుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురించి చేసిన ఘాటు విమర్శలతో రాఘవ్ చడ్డా మరింతగా ఫైర్ కావటం.. ధురంధర్ మూవీ డైలాగ్ తో ఒక్కసారి వైరల్ గా మారారు…
తాజాగా ఆయన ఒక పోస్టును పెట్టారు. ఆయన్నుపార్టీ పదవి నుంచి తప్పించటం తీవ్ర వివాదస్పదంగా మారింది. పంజాబ్ సమస్యల్ని పార్లమెంట్ లో లేవనెత్తకుండా మౌనం వహిస్తున్నారని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది.తనపై చేస్తున్న విమర్శలపై ఆయన మరోసారి స్పందించారు.ఆదివారం మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో ఎక్స్ లో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో కు క్యాప్షన్ గా పిక్చర్ అభి బాకీ హై (ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలి ఉంది అన్న అర్థం వచ్చేలా) అంటూ చేసిన పోస్టు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
ఆయన పోస్టు చేసిన మూడు నిమిషాల వీడియోలో..తన పార్టీ తనపై చేస్తున్న విమర్శలకు సమాధానాలు ఇస్తున్నట్లుగా చెప్పాలి. పార్లమెంటులో పంజాబ్ సమస్యలను తాను లేవనెత్తటంలో విఫలమయ్యారన్న ఆరోపణల్ని ఖండించేలా.. తానుఎంపీగా పంజాబ్ కోసం చేసిన పనుల్ని చూపించారు. అంతేకాదు.. తన వీడియోలో రైతులకు కనీస మద్దతుధర చట్టపరమైన గ్యారెంటీ కల్పించాలన్న డిమాండ్, పాకిస్తాన్ లో నన్ కానా సాహిబ్ కు కారిడార్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన.. పంజాబ్ లో పడిపోతున్న భూగర్భ జలాల స్థాయిపై ఆందోళన.. అమరవీరుడు భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కోరటం లాంటి అంశాలతో పాటు.. ‘‘పంజాబ్ నాకు కేవలం మాటలు చెప్పే అంశం కాదు. అది నా ఇల్లు. నా బాధ్యత. నా మట్టి.. నా ఆత్మ’’ అంటూ భావోద్వేగంగా పేర్కొన్న ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటమే కాదు.. వేలాది కొద్దీ లైకులు.. రీపోస్టులు రావటం గమనార్హం. మిడిల్ క్లాస్ హీరోగా కొందరు అభివర్ణిస్తుంటే.. పార్టీ అంతర్గత విభేదాల ప్రతిరూపంగా పేర్కొన్నారు. శనివారం ఆయన చేసిన పోస్టులో ధురంధర్ మూవీలోని ‘నేను గాయపడ్డాను.. అందుకే ప్రమాదకరంగా మారాను’ అన్న డైలాగ్ ఇప్పుడు మీమ్స్ లోనూ.. చర్చల్లోనూ హాట్ టాపిక్ గా మారటం గమనార్హం. తమపై విరుచుకుపడుతున్న రాఘవ్ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సైతం పెద్ద ఎత్తున విమర్శించటం మొదలు పెట్టారు. రాఘవ్ చడ్డా బీజేపీకి భయపుడుతున్నారంటూ ఢిల్లీ ఆమ్ ఆద్మీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ పేర్కొంటే.. రాఘవ్ చడ్డా గతంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీని విమర్శిస్తూ చేసిన పోస్టులను తన టైమ్ లైన్ నుంచి తొలగించారని.. ఆయన వాషింగ్ మెషీన్ వ్యూహంగా ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరే ముందు తాను చేసిన విమర్శలు కనిపించకుండా ఉండేలా.. క్లీన్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. పార్లమెంట్ లో కీలక జాతీయ సమస్యలపై పోరాడకుండా.. ఎయిర్ పోర్టులో సమోసా ధరల లాంటి చిన్న అంశాలపై మాట్లాడుతూ.. సాఫ్ట్ పీఆర్ చేసుకుంటున్నట్లుగా మండిపడుతున్నారు. నిజమే.. పెద్ద పెద్ద సమస్యల మీద మాట్లాడినంతనే మార్పు రాదు. కానీ.. సమోసాల గురించో.. మరో అంశం మీదనో మాట్లాడిన వెంటనే మార్పులు వచ్చాయి కదా? ఆ విషయాన్ని ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు గుర్తించదు? ప్రజలు తమ తరఫు మాట్లడే గొంతుకలా రాఘవ్ ను చూస్తున్నారన్న విషయాన్ని ఆమ్ ఆద్మీ ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి.
👉వారం వ్యవధిలో ఇరువురు సిఐ ల పై వేటు*,
దారి తప్పుతున్న సిఐ లపై ఉన్నతాధికారుల చర్యలు పట్ల ప్రజలు హర్షం*.
*పల్నాడు*:- జిల్లా లో పలువురు పోలిస్ సిబ్బంది పనితీరు పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో ఇరువురు సిఐ లపై బదిలీ వేటు పడింది.
పల్నాడు లోని దాచేపల్లి సిఐ గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ ను వారం క్రితం ఉన్నతాధికారులు విఆర్ కు బదిలీ చేసారు. మాచర్ల లో విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక సిఐ పై బదిలీ వేటు పడగా, పరువు హత్య కేసులో నిర్లక్ష్యంతో పాటు నగదు వసూళ్ల చేసినట్లు ఆరోపణలతో మరో సిఐ సస్పెండ్ అయ్యారు.శాఖ పరువు పోయే విధంగా విధి నిర్వహణ చేస్తున్న సిఐ లపై ఉన్నతాధికారులు బదిలీ, సస్పెండ్ వేటు నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
👉11 లక్షల డీల్ వివాదం: చాముండేశ్వరి హత్య కేసులో ‘గబ్బర్ సింగ్’గా పేరుగాంచిన సీఐ వెంకటరమణ సస్పెండ్*
పల్నాడు జిల్లా: చాముండేశ్వరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువతి చాముండేశ్వరి వ్యవహారంలో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో మాచర్ల టౌన్ సీఐ తురక వెంకటరమణను జిల్లా ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారి, తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకుని యువతిని వారికి అప్పగించినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఏమైంది ఈ ఘటనలో?
చాముండేశ్వరి అనే యువతి నాగరాజు అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఆమె మాచర్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రక్షణ కోరింది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న సీఐ వెంకటరమణ బాధితురాలికి సహాయం చేయాల్సిన స్థానంలో ఆమె తల్లిదండ్రులతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.
చాముండేశ్వరిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు సుమారు 11 లక్షల రూపాయల డీల్ జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఆ డబ్బు పంపకాల విషయంలో పోలీసుల మధ్యే వివాదం తలెత్తడంతో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో సీఐ పాత్ర స్పష్టంగా తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. 2012లో కోట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ ప్రముఖ దినపత్రికలో ఆయనపై “గబ్బర్ సింగ్ వెంకటరమణ” అనే శీర్షిక ప్రచురితమైనట్లు సమాచారం. అప్పటి నుంచి స్థానికంగా ఆయనకు ‘గబ్బర్ సింగ్’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనూ వివాదాస్పద సేవలు..
సీఐ వెంకటరమణపై గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. పలుమార్లు సస్పెన్షన్ ఎదుర్కొన్నప్పటికీ తిరిగి పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరించారని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా చాముండేశ్వరి హత్య కేసులో ఆయన ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ కేసుపై ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. బాధితురాలి మరణానికి కారణమైన పరిస్థితులపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

👉 ఉప్పల్ స్టేడియంలో స్టేడియంలో దుమ్ముతో నిండిన సీట్లు.. ప్రేక్షకుల ఇబ్బందులు
తమతో పాటు తెచ్చుకున్న కర్చీఫ్ లతో స్వయంగా క్లీన్ చేసుకున్న అభిమానులు
స్టేడియంలో ఏర్పాట్లపై ఫ్యాన్స్ అసంతృప్తి
సన్ గ్లాసెస్ అనుమతించకపోవడంతో చేసేదేం లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి లోపలికి వెళ్తున్న ఫ్యాన్స్..
👉 ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లకు వచ్చే అభిమానులకు పోలీసుల కీలక సూచనలు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై నిషేధం విధించారు.
సెల్ఫీ స్టిక్స్, ఇయర్‌ఫోన్ బడ్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు వంటి వస్తువులను స్టేడియంలోకి అనుమతించరు. అభిమానులు ఈ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సాఫీగా మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు సహకరించండి.
👉కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..!*
తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..!
నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..!
వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!
👉నాన్న జాగ్రత్త..!* అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఓ టీచర్ చేతిమీది రాత..! ఆత్మహత్యకు ముందు తండ్రి గురించి ఆందోళన..!
చేతిపై రాసుకుని, ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య!
ఏపీలోని మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో హృదయ విదారక ఘటన..!
పామూరులో టీచర్‌గా పని చేస్తోన్న మాధవి(24) అనే యువతి ఆత్మహత్య
నాగూర్ భాష అనే వ్యక్తితో పరిచయం పెరిగి సన్నిహిత సంబంధం..! ఈ క్రమంలో అతనికి ఇదివరకే పెళ్లయిందని తెలుసుకుని మాధవి దూరం పెడుతుండడంతో.. తమ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన యువకుడు..!చనిపోవడానికి ముందు ‘నాన్న జాగ్రత్త’ అని చేతిపై రాసుకుని ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య..!
నాగూర్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు..!!

⭐⭐ ప్రైవేటు ఆసుపత్రులలో పెరిగిపోతున్న అక్రమాలు తట్టుకోలేక రాజీనామా చేసిన డాక్టర్…
డాక్టర్ గా మంచి పేరు ఉన్న ఓ డాక్టర్ ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో ఉద్యోగం ప్రారంభించింది. ప్రొఫెషనల్ వాతావరణం, మంచి జీతం ఉంటుందని ఆశించింది. కానీ ఆమె మొదటి రోజే చూసిన విషయాలు ఆమెను పూర్తిగా షాక్‌కు గురి చేశాయి.
ఆ హాస్పిటల్ యజమాని అయిన గైనకాలజిస్ట్, అవసరం లేకపోయినా చాలా మంది పేషెంట్లను అడ్మిట్ చేయాలని ఇంకా వారిని ఎక్కువ రోజులు ICU లో ఉంచాలని స్టాఫ్‌కి సూచించినట్లు తెలుస్తోంది. లక్ష్యం ఒక్కటే… హాస్పిటల్ ఆదాయం పెంచడం.ఈ పరిస్థితిని చూసిన ఆ డాక్టర్, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. “డబ్బు కోసం రోగుల ఆరోగ్యంతో ఆటలు ఆడలేను” అని ఆమె స్పష్టం చేసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వైద్య రంగంపై పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా నెటిజన్లు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ, “ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సంఘటన ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తోంది.వైద్యం కేవలం వ్యాపారంగా మారిపోతుందా?
👉ప్రేమ వివాహం చేసుకున్న భార్యను 8 నెలల్లోనే హత్య చేసిన భర్త…*
శుక్రవారం రాత్రి గొడవ – గొంతు నులిమి హత్య. మహబూబ్నగర్ జిల్లాలో దారుణ ఘటన.
మృతురాలు శ్రీదేవి (21) – నర్సింగ్ పూర్తి చేసిన యువతి.
కుటుంబాన్ని ఎదిరించి గ్రామానికి చెందిన చందుతో పెళ్లి.
పెళ్లి తర్వాత భర్త మద్యం సేవించి వేధింపులు.
ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరించిన భార్య.
మృతదేహాన్ని గోనె సంచిలో వేసి పొలానికి తరలింపు.
ఆత్మహత్యగా నాటకం – చెట్టుకు ఉరేసుకున్నట్లు డ్రామా.
సోదరుడికి ఫోన్ చేసి తప్పుడు సమాచారం. గ్రామస్థులు రాగానే నిందితుడు పరారీ.పోస్టుమార్టం లో హత్యగా నిర్ధారణ.అంత్యక్రియలు నిలిపివేస్తూ గ్రామస్థుల ఆందోళన. పోలీసులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలు నిర్వహణ. నిందితుడు లొంగి నేరం అంగీకారం.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్