👉 కేరళ – తెలంగాణ మధ్య రాజుకున్న నిప్పు…???
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేరళలోని ఎల్‌డీఎఫ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలను పట్టించుకోవడంలేదని.. బీజేపీతో అంటకాగుతున్న సీఎం విజయన్.. రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు. కేరళలో నిరుద్యోగం ప్రబలుతోందని.. పాలన కూడా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు విజయన్ సూటిగా బదులిస్తూ.. సెగ పెంచేశారు.

*మీరు మాదగ్గర నేర్చుకుంటున్నారు!
కేరళలో జరుగుతున్న పాలనను అధ్యయనం చేసేందుకు ఇటీవల తెలంగాణ అధికారులు తిరువనంతపురం వచ్చి.. రెండు రోజుల పాటు అధ్యయనం చేశారని సీఎం విజయన్ ప్రస్తావించారు. `మీకు పాలన చేతనైతే.. మా దగ్గరకు ఎందుకు వచ్చారు“ అని నిలదీశారు. ముఖ్యంగా భూముల రికార్డుల సేకరణ, భద్రత వంటి అంశాలపై గత ఏడాది తెలంగాణ అధికారులు కేరళకు వెళ్లారు. ఈ విషయాన్ని విజయన్ ప్రస్తావిస్తూ.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
*పేదలపై బుల్‌డోజర్!
పేదలను గాలికి వదిలేస్తున్నారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను అంతే తీవ్రంగా విజయన్ తిప్పికొట్టారు. “పేదల ఇళ్లపైకి మీరు బుల్ డోజర్లు పంపిస్తున్నారు.(మూసీ ప్రక్షాళనలో భాగంగా.. హైడ్రా చర్యలు) మీరు మాకు చెబుతున్నారు. పేదలను ఎలా ట్రీట్ చేయాలో మీ నుంచి మేం నేర్చుకోవాలా?“ అని వ్యాఖ్యానించారు. “తెలంగాణలో పేదలకు నిలువ నీడ తీసేస్తున్న ఒకాయన.. మనకు పాఠాలు చెప్పేందుకు వచ్చారు.“ అని ఎద్దేవా చేశారు. కేరల అన్నిరంగాల్లోనూ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
*అవినీతిలో మీరే ముందు!
ఇక, కేరళలో అవినీతి పెరిగిపోయిందన్న రేవంత్ వ్యాఖ్యలను కూడా కేరళ సీఎం తిప్పికొట్టారు. “ఎవరి లెక్కలు ఏంటో చెబుతా“ అంటూ.. ఆయన నీతి ఆయోగ్ గణాంకాలను వెల్లడించారు. దేశంలో అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని నీతి ఆయోగే చెప్పిందన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ 1వ స్థానంలో ఉంటే.. తెలంగాణ 6వ స్థానంలో ఉందన్నారు. దీనిని బట్టి ఎవరి రాష్ట్రంలో ఎవరు అవినీతి చేస్తున్నారో తెలియడం లేదా? అని ప్రశ్నించారు.
*తెలంగాణే పేదరికానికి కేరాఫ్..
కేరళలో పేదరికం పెరుగుతోందని.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైనా విజయన్ మండిపడ్డారు. కేరళలో పేదరికం 0.55 శాతమని.. అదే తెలంగాణలో 5.88 శాతంగా ఉందన్నారు. ఇది రేవంత్‌కు మచ్చగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా కేరళలో అక్షరాస్యత 95.3 శాతం ఉండగా, తెలంగాణలో 76.9 శాతం వద్దే ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. కేవలం కొందరి ప్రోద్బలంతో రాజకీయ విమర్శలు చేసేందుకు మాత్రమే రేవంత్ వచ్చారని వ్యాఖ్యానించారు. నిజాలు తెలుసుకుంటే.. ఆయన ఎల్ డీఎఫ్ తరఫునే ప్రచారం చేస్తారని విజయన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
👉 కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి,కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.

👉మరో US జెట్ను కూల్చిన ఇరాన్!
ఇప్పటికే అమెరికాకు చెందిన F-35, F-15 జెట్లను కూల్చిన ఇరాన్ తాజాగా మరో యుద్ధవిమానాన్ని (‘A-10 వార్మ్గ్’) కూల్చినట్లు US మీడియా వెల్లడించింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇది క్రాష్ అయినట్లు తెలిపింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కూలిన US జెట్ల పైలట్లను ప్రజలు ప్రాణాలతో పట్టుకొని అధికారులకు అప్పగిస్తే రివార్డ్స్ ఇస్తామని ఓ ఇరాన్ ఛానెల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
👉మరింత భీకరంగా అమెరికా-ఇరాన్ వార్..*వరుసగా అమెరికా యుద్ధ విమానాలను కూల్చేస్తున్న ఇరాన్..!
*గంటల వ్యవధిలోనే F-15, A-10 వార్ థగ్, F-35 కూల్చివేత.. ఓ పైలట్ సేఫ్, మరొకరి కోసం గాలింపు..!*
*ఈ పరిణామం చర్చలకు ఆటంకం కాదన్న ట్రంప్..!*
*మరికొన్ని వారాల్లో యుద్ధం ముగియనుందని.. అమెరికా యుద్ధంలో ఉందన్న ట్రంప్..!*
👉మహారాష్ట్రను కుదిపేస్తున్న ‘కెప్టెన్ బాబా’.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?

మహారాష్ట్రలో ‘కెప్టెన్ బాబా’గా పేరొందిన దొంగస్వామి అశోక్ కారత్ అకృత్యాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జ్యోతిష్యం, పూజల పేరుతో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం, భక్తులను మోసగించి వందల కోట్లు కూడబెట్టడం వంటి తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన అతడిని, నాసిక్ కోర్టు ఏప్రిల్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
కుటుంబ సమస్యలతో తన వద్దకు వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తుమందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లుగా నమ్మించి కిలోకు లక్ష రూపాయలకు, సాధారణ తేనెను పవిత్రమైనదిగా చెప్పి కిలోకు రూ.9 లక్షలకు విక్రయించేవాడు. భక్తులను నమ్మించేందుకు 20 అడుగుల రిమోట్ కంట్రోల్ పామును కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అశోక్ కారత్‌పై 8 అత్యాచారం కేసులు, 2 మోసం కేసులు సహా మొత్తం 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సిట్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు 150కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన కార్యాలయం నుంచి 58 అభ్యంతరకర వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో అశోక్ కారత్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకాన్‌కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కుంభకోణం అమెరికాలోని ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ కన్నా దారుణమైందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అశోక్ కారత్ భార్య కల్పన పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
పదో తరగతి ఫెయిలైన అశోక్ కారత్, మర్చంట్ నేవీలో పనిచేశానని చెప్పుకుంటూ ‘కెప్టెన్ బాబా’గా పేరు తెచ్చుకున్నాడు. అతని వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి రహస్యంగా కెమెరా పెట్టి వీడియోలు తీయడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ ప్రస్తుతం నాసిక్ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
👉 హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పుర, లాల్ దర్వాజా ప్రాంతాలలో చార్మినార్ టాస్క్ ఫోర్స్ జోన్ పోలీసుల దాడులు..ప్రమాదకరమైన కెమికల్స్ తో మామిడి పండ్లను మాగ పెడుతున్న గోదాములపై దాడులు..టన్నులకొద్ది మామిడిపండు స్వాధీనం.
ప్రమాదకరమైన కెమికల్స్ సీజ్ చేసిన పోలీసులు••
👉 ఆఖరికి.. ఐస్ క్యాండీ & లస్సీ కూడా కల్తీనే!
హైదరాబాద్ మెహిదీపట్నంలో కల్తీ ఆహారంపై మరో సంచలన కేసు బయటపడింది.
👉 ‘అలియా ఐస్ క్రీమ్ పార్లర్’ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు…
👉 అపరిశుభ్ర వాతావరణంలో తయారీ గుట్టు రట్టు
👉 హానికర రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ బయటపడింది..నిందితుడు ముషారఫుద్దీన్ (24) అరెస్ట్…రూ. 5 లక్షల విలువైన సామాగ్రి స్వాధీనం
.. జాగ్రత్త ప్రజలారా!
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పరిశుభ్రత ఉన్న చోట్లే ఆహారం కొనండి••
👉అమరావతి : నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఇచ్చిన వివరణను సీఎం చంద్రబాబు ముందుంచిన టీడీపీ అధిష్ఠానం.*
*ఎమ్మెల్యే వివరణపై చర్చ సందర్భంగా,కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!*
*కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేను.. గీత దాటి ప్రవర్తించే వారిని ఇక భరించేది లేదు..!*
*పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేసేస్తా..!**: సీఎం చంద్రబాబు*
👉మహారాష్ట్రను కుదిపేస్తున్న ‘కెప్టెన్ బాబా’.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?😲😲😲మహారాష్ట్రలో ‘కెప్టెన్ బాబా’గా పేరొందిన దొంగస్వామి అశోక్ కారత్ అకృత్యాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జ్యోతిష్యం, పూజల పేరుతో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం, భక్తులను మోసగించి వందల కోట్లు కూడబెట్టడం వంటి తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన అతడిని, నాసిక్ కోర్టు ఏప్రిల్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
కుటుంబ సమస్యలతో తన వద్దకు వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తుమందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లుగా నమ్మించి కిలోకు లక్ష రూపాయలకు, సాధారణ తేనెను పవిత్రమైనదిగా చెప్పి కిలోకు రూ.9 లక్షలకు విక్రయించేవాడు. భక్తులను నమ్మించేందుకు 20 అడుగుల రిమోట్ కంట్రోల్ పామును కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అశోక్ కారత్‌పై 8 అత్యాచారం కేసులు, 2 మోసం కేసులు సహా మొత్తం 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సిట్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు 150కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన కార్యాలయం నుంచి 58 అభ్యంతరకర వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో అశోక్ కారత్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకాన్‌కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కుంభకోణం అమెరికాలోని ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ కన్నా దారుణమైందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అశోక్ కారత్ భార్య కల్పన పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
పదో తరగతి ఫెయిలైన అశోక్ కారత్, మర్చంట్ నేవీలో పనిచేశానని చెప్పుకుంటూ ‘కెప్టెన్ బాబా’గా పేరు తెచ్చుకున్నాడు. అతని వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి రహస్యంగా కెమెరా పెట్టి వీడియోలు తీయడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ ప్రస్తుతం నాసిక్ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
👉సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం..!
భవనంపై నుండి దూకిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని బి. మైను (21)..బాధిత విద్యార్థిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా గుర్తింపు..!
ఫోన్ మాట్లాడుకుంటూ భవనం పైనుండి దూకేసిన విద్యార్థిని..తీవ్ర గాయాలైన మైనును హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం..!
ఆస్పత్రిలో విద్యార్థిని పరిస్థితి విషమం..!
ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు..!
👉 కేరళ – తెలంగాణ మధ్య రాజుకున్న నిప్పు…?… సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం…👉కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!*..👉 కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతిలో ఎన్టీఆర్ విగ్రహం…👉మరింత భీకరంగా అమెరికా-ఇరాన్ వార్…👉మహారాష్ట్రను కుదిపేస్తున్న ‘కెప్టెన్ బాబా’.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?…👉ప్రమాదకరమైన కెమికల్స్ తో మామిడి పండ్లను మాగ పెడుతున్న గోదాములపై దాడులు…👉కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం..!
Recent Posts