👉 ఇరాన్‌లో ఇంకా ఏమి సాధించాలి? – ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రశ్న…!…👉అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం….👉పేర్ని నానిపై కేసు నమోదు*….👉పరువు హత్య*…*ప్రేమపెళ్లి చేసుకున్న కుమార్తెను చంపిన తండ్రి…👉 దాహమని నీళ్లడిగి.. మెడపై కత్తిపెట్టి..»ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అత్యాచారం… .

👉 ఇరాన్‌లో ఇంకా ఏమి సాధించాలి? – ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రశ్న…!!!..అమెరికాకు ఎదురు తిరుగుతున్న మిత్ర దేశాలు…!!!

ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల ఉద్దేశం ఏమిటి? అక్కడ ఇంకా సాధించాల్సింది ఏముంది? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంలో స్పష్టత లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యాలు నెరవేరలేదా? నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అల్బనీస్ ప్రసంగిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, మిత్రదేశాలు చేపట్టిన చర్యలపై తన గళాన్ని వినిపించారు. ప్రారంభంలో ఈ చర్యలకు ఆస్ట్రేలియా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఈ పోరాటం మొదలైందని ఆయన వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకోవడం… ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించి, పొరుగు దేశాలకు ముప్పు కలగకుండా చూడటం…
అయితే ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే ఈ ప్రాథమిక లక్ష్యాలు ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని అల్బనీస్ అభిప్రాయపడ్డారు. “లక్ష్యాలు నెరవేరినప్పుడు కూడా యుద్ధాన్ని పొడిగించడంలో అర్థం ఏమిటి? ఇంకా అక్కడ సాధించాల్సింది ఏముంది?” అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థపై యుద్ధ మేఘాల ప్రభావం యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని అల్బనీస్ హెచ్చరించారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధాల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్యులపై భారం పడుతోంది. వాణిజ్య మార్గాల్లో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. “మేము ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా దాని తాలూకు ఆర్థిక భారాన్ని ఆస్ట్రేలియా ప్రజలు మోయాల్సి వస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయ లోపంపై అసంతృప్తి మిత్రదేశాల మధ్య ఉండాల్సిన కనీస సమాచారం కూడా లేకపోవడంపై ప్రధాని అల్బనీస్ విస్మయం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభానికి ముందు తమ దేశాన్ని ఎవరూ సంప్రదించలేదని.. ఇది మిత్రదేశాల మధ్య ఉండాల్సిన దౌత్యపరమైన సమన్వయ లోపాన్ని సూచిస్తోందని ఆయన సూటిగా విమర్శించారు. వ్యూహం లేని యుద్ధం ఎప్పుడూ ప్రమాదకరమేనని.. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో ఉండటం అంతర్జాతీయ భద్రతకు మంచిది కాదని పేర్కొన్నారు. దౌత్యమే ఏకైక మార్గం పశ్చిమాసియాలో శాంతి నెలకొనడమే తమ ప్రాధాన్యతని అల్బనీస్ స్పష్టం చేశారు. రాబోయే నెలలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత క్లిష్టంగా ఉండబోతున్నాయని..ఇలాంటి సమయంలో దూకుడు కంటే దౌత్యపరమైన చర్చలే పరిష్కారం చూపుతాయని ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం లక్ష్యాలపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం వల్ల ప్రపంచ స్థిరత్వం దెబ్బతింటుందని.. అన్ని దేశాలు సమన్వయంతో ఒక శాంతియుత ముగింపు వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు. మొత్తానికి అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న ఆస్ట్రేలియా నుండే ఇలాంటి ప్రశ్నలు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్బనీస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు అమెరికాను, అటు ఇజ్రాయెల్‌ను పునరాలోచనలో పడేస్తాయో లేదో వేచి చూడాలి.

👉అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం*

ప్రపంచరాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా భారత్-రష్యా సంబంధాలు మాత్రం చెక్కుచెదరవని మరోసారి స్పష్టమైంది. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంతురోవ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు._
ఈ సందర్భంగా ఆర్థిక సహకారం, కనెక్టివిటీ మార్గాలు, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు లోతుగా చర్చించారు. 2025 డిసెంబరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన “ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం” రోడ్‌మ్యాప్ అమలుపై మాంతురోవ్ ప్రధానికి వివరించారు._
ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశానికి అవసరమైన ఎరువులు, ముడి చమురు మరియు ఎల్‌పీజీ సరఫరాలో రష్యా అగ్రగామిగా నిలుస్తోంది. వాణిజ్య రంగంలో సాధించిన పురోగతిని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే ఎరువుల సరఫరాలో రష్యా అందిస్తున్న సహకారాన్ని మాంతురోవ్ ప్రధానికి వివరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించి, ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరింత సమతుల్యం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రూపొందుతున్నాయి.
*కనెక్టివిటీ: కొత్త వాణిజ్య మార్గాల అన్వేషణ*
ఈ భేటీలో ప్రధానంగా ‘కనెక్టివిటీ’ అంశం చర్చకు వచ్చింది. సాంప్రదాయ మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించి, లాజిస్టిక్స్ ఖర్చులను ఆదా చేసేందుకు ప్రత్యామ్నాయ కారిడార్ల నిర్మాణంపై ఇరు పక్షాలు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC) మరియు చెన్నై-వ్లాదివోస్టోక్ ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే భారత్-రష్యాల మధ్య రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది.
*అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు!*2026లో మోదీ రష్యా పర్యటన?*
గత ఏడాది పుతిన్ పర్యటనను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య నిరంతర ఉన్నత స్థాయి సంభాషణలు కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2026లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశం ఉందని, ఆ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరో శిఖరానికి చేరుతాయని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన రంగంలోనే కాకుండా పారిశ్రామిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలను పెంచడానికి కూడా ఈ సమావేశం పునాది వేసింది.మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల మధ్య, రష్యా వంటి దీర్ఘకాలిక భాగస్వామితో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటుకుంటోంది. క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
👉పేర్ని నానిపై కేసు నమోదు*
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని అధికారులు నిన్న కూల్చివేశారు. దీంతో తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న పేర్ని నాని అధికారులపై చిందులు తొక్కారు. అధికారులపై తీవ్ర బెదిరింపులకు దిగారు. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
👉పరువు హత్య*…*ప్రేమపెళ్లి చేసుకున్న కుమార్తెను చంపిన తండ్రి*😲😲😲
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి చౌడేశ్వరి ని ఆమె తండ్రి చంద్ర శీను హత్య చేసాడు*
*నాగరాజు అనే వాన్ని ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి*
*5 రోజుల తర్వాత భర్త నాగరాజు ఇంటికి పంపిస్తానని ఒప్పందం చేసుకున్న తండ్రి చౌడేశ్వరిని ఇంటికి తీసుకువచ్చి చంపాడు*
*పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చౌడేశ్వరి ది హత్య అని తేలటం తో తండ్రి ని అదుపులోకి తీసుకొని విచారణ చేయటం తో విషయం బయట పడింది*
*రెండు రోజుల్లో గవర్నమెంట్ టీచర్ తో ఎంగేజ్మెంట్ ఉండగా నాగరాజు తో లేచి పోయి పెళ్లి చేసుకోవటం తో పరువు పోయిందని కూతురిని హత్య చేసినట్టు ఒప్పుకున్న తండ్రి..*మేనల్లుడు సహాయంతో చంపేసినట్లు ఒప్పుకున్న నిందితుడు*
👉 దాహమని నీళ్లడిగి.. మెడపై కత్తిపెట్టి..»ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అత్యాచారం… జననాంగంలోకి ఇనుప చువ్వతో చిత్రహింసలు..పల్నాడు జిల్లా మాచర్ల నియోజవర్గం.. మాచర్లలో అమానుష ఘటన
ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల కామాంధుడు కర్కశంగా ప్రవర్తించాడు.
దాహంగా ఉందంటూ తలుపుకొట్టి. నీరు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశిం చాడు.
మెడపై కత్తి పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమె జననాంగంలోకి ఇనుప చువ్వ నెట్టి చిత్రహింసలకు గురి చేశాడు.
మాచర్లలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ కథనం ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన మహిళ మాచర్ల పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు.
ఏడాది కాలంగా స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటున్నారు.ఈ నేపథ్యంలో.. గురువారం సాయంత్రం 50 యేళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి దాహంగా ఉందంటూ ఆమె ఇంటి తలుపుకొట్టాడు.ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆ ఉద్యోగిని.. నీరు తెచ్చేందుకు తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా..ఆ ఆగంతుకుడు ఆమె వెనకాలే ఇంట్లోకి జొరపడి గొంతుపై కత్తిపెట్టాడు. చంపేస్తానంటూ బెదిరించి, ఆమె చేతులను వెనక్కి కట్టి నగ్నంగా చేసి అత్చారానికి పాల్పడ్డాడు.
అతని బారి నుంచి తప్పించు కునేందుకు తనకు ఎయిడ్స్ ఉందనడంతో కోపోద్రిక్తుడై ఆమె జననాంగంలోకి ఇనుప చువ్వను చొప్పించి వెళ్లి పోయాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి తేరుకొని కేకలు వేయగా స్థానికులు ఆమెను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చారు.ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరు గైన చికిత్స నిమిత్తం వైద్యులు నరసరావుపేటకు రిఫర్ చేశారు. పోలీసులు బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా స్పందించారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫోన్ ద్వారా విషయం చెప్పి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలికి అండగా ఉంటామన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసే కూటమి ప్రభుత్వంలో వారికి హాని చేయాలని చూసే ఏ ఒక్క రినీ వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్