👉ఈ యుద్ధం వల్ల 3 సి ప్రయోజనమేంటి..అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ..
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయో ప్రశ్నించుకోవాలని అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. తమపై దాడుల నేపథ్యంలో అమెరికా ప్రజలను ఉద్దేశించి పెజెష్కియాన్ ఓ బహిరంగ లేఖ రాశారు. అమెరికన్లతో గానీ, ఇతర దేశాలతో గాని తమకు శత్రుత్వం లేదన్నారు. వక్రీకరణలు, కల్పిత కథనాల వెల్లువను దాటి చూడాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రత్వం లేదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అనేక సార్లు అమెరికా తమను నియంత్రించాలని చూసినప్పటికీ, ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. ప్రస్తుతం తమపై చేస్తున్న దాడులను ధైర్యంగా, దృఢంగా తిప్పికొడుతున్నామన్నారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. పరిపాలనలో దానిని పక్కన పెట్టారన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజల ప్రయోజనాలు ఎలా నెరవేరుతున్నాయని ప్రశ్నించారు ‘అమాయక పిల్లలపై సామూహిక హత్యాకాండ, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధ సౌకర్యాల విధ్వంసం, ఒక దేశాన్ని రాతియుగానికి నెట్టేస్తామని బాంబులు వేయడం.. వీటి వల్ల అమెరికన్లకు కలిగే లాభమేంటి? ప్రపంచ స్థాయిలో అమెరికా ప్రతిష్టను మరింత దెబ్బతీయడం తప్ప మరే ఇతర ప్రయోజనానికైనా ఈ విధ్వంసాలు ఉపయోగపడతాయా?’ అని ప్రశ్నించారు. అమెరికా -ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు..
👉కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో కత్తులు, కట్టెలతో 5 గురు యువకుల వీరంగం..!!*
దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్కాకుల బాబు, సాంబారు రాజశేఖర్.లక్కాకుల బాబు పరిస్థితి విషమం, తిరుపతి స్విమ్స్ కి తరలింపు.దాడి చేసి ఇంట్లో తాళాలు వేసుకున్న యువకులు.పోలీసులు వచ్చినా డోర్ తీయకుండా పోలీసులను బెదిరిస్తున్న యువకులు.ఎట్టకేలకు 108 కు కాల్ చేసి ముగ్గురిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
👉అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న ‘సికాడా’ కొవిడ్ వేరియంట్.. భారత్‌కూ ముప్పేనా?*
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో కొత్త సబ్-వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన BA.3.2 అనే ఈ వేరియంట్‌కు ‘సికాడా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. తొలిసారిగా 2024 చివర్లో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్, క్రమంగా 23 దేశాలకు పాకింది.
*ఏమిటీ ‘సికాడా’ వేరియంట్?
గతంలో 2022లో కనిపించిన BA.3 వేరియంట్ నుంచే ‘సికాడా’ పుట్టుకొచ్చింది. చాలాకాలం పాటు ఎలాంటి ఉనికి లేకుండా ఉండి, హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. దీని స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 కొత్త మ్యూటేషన్లు ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మార్పుల వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం దీనికి ఉండవచ్చని అమెరికా సీడీసీ పేర్కొంది. అయినప్పటికీ, ఇది తీవ్రమైన
👉అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి..
బహ్రెయిన్ లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పై క్షిపణులతో దాడి చేసిన IRGC
దాడిలో సర్వర్లు దెబ్బతినడంతో సేవలకు అంతరాయం
అమెరికన్ వాణిజ్య సంస్థలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న ఇరాన్.
👉ఒరాకిల్ కంపెనీ లో బారీగా ఉద్యోగాల కోత😱
❇️ఒకేసారి 30 వేల మందిపై వేటు
❇️భారత్‌లోనే సుమారు 12 వేల మందికి ఉద్వాసన
❇️ఉన్నట్టుండి తీసేయడంపై ఉద్యోగుల తీవ్ర ఆవేదన
❇️ఈ నెలలో మరిన్ని కోతలు
❇️భవిష్యత్తు చీకటైందంటూ భావోద్వేగ పోస్టులు
⭐ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్యా బాధితుడు: ట్రంప్*
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోరుపారేసుకున్నారు. వ్యక్తిగత విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెక్రాన్ భార్య అతనిని చాలా దారుణంగా చూస్తుందని, ఆయన దవడ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని ఎగతాళి చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్ ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా మాట్లాడిన ఓ వీడియో లీక్ కావడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది.
👉పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. ఇదే న్యాయం???
రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది.ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీస్తున్న నాయకులను ఇలా పదవుల నుండి తొలగించడం ఆప్ పార్టీ కి సబబు కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, రాఘవ్ చద్దా 2023 నుంచి రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు.
👉ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్.. సీఎం సీరియస్ వార్నింగ్! పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరుడికి కాంట్రాక్టు ఉద్యోగంలో నియమించే విషయమై పల్నాడు జిల్లా ఎప్పీ ఆఫీసులో ఎమ్మెల్యే రచ్చ చేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా ఎమ్మెల్యే వినిపించుకోకుండా గొడవ చేశారని ముఖ్యమంత్రికి నివేదిక అందిందని అంటున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేలా ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహరించారని భావిస్తూ, ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్ టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఒక చిన్న ఉద్యోగం విషయంలో ఎమ్మెల్యే అలా ప్రవర్తించడం సరికాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లడం, ఎస్పీతో గొడవ పెట్టుకోవడమే కాకుండా, ఐజీ స్థాయి అధికారి వచ్చి వివరణ ఇస్తున్నా లెక్క చేయకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంగానే భావిస్తూ అరవింద బాబుకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎస్పీ కార్యాలయంలో రచ్చకు దిగిన ఎమ్మెల్యే అరవిందబాబుతో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రయత్నించినా,ఎమ్మెల్యే లెక్క చేయలేదన్న సమాచారంతో సీఎం చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.ఈ పరిణామాలతో షాక్ కు గురైన ఎమ్మెల్యే అరవిందబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.అయితే అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఫోన్ లో వివరణ తీసుకునేందుకు పల్లా సైతం అంగీకరించలేదని,పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.
ఇక ఎస్పీ కార్యాలయంలో రచ్చకు దిగిన ఎమ్మెల్యే అరవిందబాబుతో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రయత్నించినా, ఎమ్మెల్యే లెక్క చేయలేదన్న సమాచారంతో సీఎం చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ పరిణామాలతో షాక్ కు గురైన ఎమ్మెల్యే అరవిందబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఫోన్ లో వివరణ తీసుకునేందుకు పల్లా సైతం అంగీకరించలేదని, పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.**ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై బుధవారమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మైండ్ కంట్రోల్ లో లేకపోవడం వల్లే ఇలాంటి ప్రవర్తనకు కారణమవుతోందని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం ఓ బహిరంగ సభలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఓ ఆఫీసుపై పడ్డాడు. ఎవరైనా మైండ్ కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అరవింద బాబు ప్రవర్తనపైనే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగడంతో ఆయన నష్టనివారణకు దిగినట్లు చెబుతున్నారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే అరవింద బాబు విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. గతంలోనూ ఎమ్మెల్యేపై ఇటువంటి ఫిర్యాదులు ఉండటంతో అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
⭐ఐడియా ఒక్కటే ..లక్షలు సొంతం: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే సరికొత్త పద్ధతులను కనిపెట్టడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. భూమిలో సులభంగా కలిసిపోయే బయో డీగ్రేడబుల్ ప్యాకేజింగ్ వస్తువులను తయారు చేసే ఐడియా మీ దగ్గర ఉంటే, దాన్ని ప్రదర్శించి నగదు సొంతం చేసుకోవచ్చు. ఇందులో మొదటి బహుమతి గెలుచుకున్న వారికి రూ. 10 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 7 లక్షలు, మరియు మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల నగదు బహుమతులు అందజేస్తారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రభుత్వ గుర్తింపు కూడా లభిస్తుంది. భారీ బహుమతులతో పాటు బంపర్ ఆఫర్: ఈ ‘బయోప్యాకథాన్ 2026’ కేవలం బహుమతులకే పరిమితం కాదు. విజేతలుగా నిలిచిన వారికి ప్రముఖ పరిశ్రమలతో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అంటే మీ ఐడియాను ఒక పెద్ద వ్యాపారంగా మార్చుకోవడానికి ప్రభుత్వం మరియు పెద్ద కంపెనీలు సహకరిస్తాయన్నమాట. మీ దగ్గర ఉన్న చిన్న ఆలోచన రేపు దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ సమస్యకు పెద్ద పరిష్కారంగా మారవచ్చు. యువత, స్టార్టప్స్ మరియు పర్యావరణ ప్రేమికులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ఏప్రిల్ 24, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా తమ ఐడియాలను పంపవచ్చు. మీ ఐడియా ఎంత కొత్తగా ఉంది, అది పర్యావరణానికి ఎంతవరకు మేలు చేస్తుంది మరియు దాన్ని తక్కువ ఖర్చుతో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లవచ్చు అనే అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. కాబట్టి మీ దగ్గర ఉన్న పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ఏదైనా క్రియేటివ్ ఆలోచనతో రంగంలోకి దిగండి. పర్యావరణ రక్షణలో భాగస్వాములు అవ్వండి: ప్లాస్టిక్ మహమ్మారి నుంచి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇలాంటి పోటీలు మనలోని సృజనాత్మకతను బయటకు తీయడమే కాకుండా, సమాజానికి మేలు చేసేలా ప్రోత్సహిస్తాయి.ఇక పది లక్షల రూపాయలు గెలుచుకోవడంతో పాటు పర్యావరణ యోధులుగా గుర్తింపు పొందడం నిజంగా గర్వకారణం. ఇంకెందుకు ఆలస్యం? మీ మెదడుకు పదును పెట్టండి, అద్భుతమైన ఐడియాతో ఏప్రిల్ 24 లోపు అప్లై చేసేయండి. విజేతగా నిలిచి లక్షాధికారి అవ్వండి!
⭐మాజి ఎమ్మెల్యే పిన్నెలిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్ పై విడుదలైన సందర్భంగా ఈరోజు మాచర్ల లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు…*
👉ఈ యుద్ధం వల్ల 3 సి ప్రయోజనమేంటి..అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ…👉ఒరాకిల్ కంపెనీ లో బారీగా ఉద్యోగాల కోత😱…👉అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న ‘సికాడా’ కొవిడ్ వేరియంట్.. భారత్‌కూ ముప్పేనా?*..👉పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. ఇదే న్యాయం???…👉ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్.. సీఎం సీరియస్ వార్నింగ్! …⭐ఐడియా ఒక్కటే ..లక్షలు సొంతం…👉కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో కత్తులు, కట్టెలతో 5 గురు యువకుల వీరంగం..!⭐మాజి ఎమ్మెల్యే పిన్నెలిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా
Recent Posts

