👉నేటి నుండి ఏపీలో ‘ఆరోగ్య శ్రీ’ సేవలు బంద్*..👉 దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ కులాల వారుగా పరిగణించ రాదoటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలి: సిపిఐ, కాంగ్రెస్ ,ప్రజా సంఘాల డిమాండ్..👉బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు* ..👉వారణాసి గంగా ఘాట్‌లో దారుణం:😱…👉పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల…👉 సెంచూరియన్ ‘తో స్కిల్ డెవలప్మెంట్.. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు …👉నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి…విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం*..*క్రికెట్ బెట్టింగ్ అరికట్టడంపై కట్టుదిట్టమైన చర్యలు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు..

👉నేటి నుండి ఏపీలో ‘ఆరోగ్య శ్రీ’ సేవలు బంద్*
ఆరోగ్యశ్రీ నిలిపేస్తున్న ప్రకటించిన ఆషా
బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటన!!!
రూ.3 వేల కోట్లు ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం..చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు బంద్…గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని హామీ..గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం…మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించక‌పోవ‌డంతో బంద్‌కు పిలుపు.
👉వారణాసి గంగా ఘాట్‌లో దారుణం:😱😱😱
*మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన*
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.గంగానదిలో కదులుతున్న పడవపై ఇద్దరు మహిళల బట్టలు లాగుతూ, వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణ…ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
👉 దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ కులాల వారుగా పరిగణించ రాదoటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 31న ఉదయం విజయవాడలోని దాసరి భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ సెక్రెటరి కె.రామకృష్ణ లతోపాటు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, బహుజన దళిత సంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్షణరెడ్డి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీల జాతీయనేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణకు కృషి చేయాలని కోరారు. కుల వివక్ష చూపించే వారి విచక్షణ మారకుండా కుల వివక్షతకు గురి అయ్యేవారు ఏ మతానికి మారినా కుల వివక్షత అంతం కాదన్నారు.
👉బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు*
కరీంనగర్, మార్చి 31: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి హంగామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్‌లో నమోదైన కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ కేసుపై సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. ఏప్రిల్ 4న హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టంగా పేర్కొంది.
సమ్మక్క-సాలరమ్మ జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఆందోళన చేశారు. దీంతో వారందరినీ హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. దాదాపు 20 మందికి నోటీసులు అందజేశారు. సీఐడీ నోటీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే సీఐడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు..
⭐సత్యసాయి జిల్లా⭐
లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గుడిబండ తహశీల్దార్ శ్రీధర్..షేక్ సద్దాం అనే రైతు నుంచి కార్యాలయంలోనే 20 వేల రూపాయలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన తహశీల్దార్.రాయపురం గ్రామానికి చెందిన 4 ఎకరాల భూమికి సంబంధించి పాసు పుస్తకాలు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేసిన తహశీల్దార్ శ్రీధర్.
20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో విచారణ.
👉ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు..*
*వీడియో షేర్ చేసిన ట్రంప్..*
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పంచుకున్నారు. అయితే దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
ఇస్ఫహాన్‌లో ఇరాన్ ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. ఇస్ఫహాన్‌పై వరుస దాడులు జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నట్టు పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇస్ఫహాన్‌లోని ఓ భూగర్భ కేంద్రంలో సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్టు వార్తలు వస్తున్నాయి.ఆ యురేనియం నిల్వల లక్ష్యంగానే తాజా దాడులు జరిగినట్టు సమాచారం. కాగా, తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై భారీగా దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాతో ఒప్పందానికి అంగీకరించేది లేదని ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దాడులకు దిగినట్టు తెలుస్తోంది..
👉👉 సెంచూరియన్ ‘తో స్కిల్ డెవలప్మెంట్..
అవగాహన ఒప్పందం చేసుకున్న జిల్లా యంత్రాంగం*
ఒంగోలు.. జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్.పి.రాజాబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం (ఎం.వో.యు) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత గల గనులు,ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రో కార్బన్, సోలార్, డ్రోన్స్ రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు సహ వ్యవస్థాపకులైన ప్రొఫెసర్ డి.ఎన్.రావు, యూనివర్సిటీ ప్రతినిధి జె.ఎన్.రావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, తదితరులు పాల్గొన్నారు.
👉మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ చేపట్టి వార్డులలో మురుగు కాలువల పూడికతీత కార్యక్రమం చేపట్టాలని ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లి టార్గెట్ పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది పని చేయాలని అన్నారు.ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉 మార్కాపురం జిల్లా రాచర్ల… మండలంలోని శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ,గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వామివారి ఆశీస్సులు పొందారు.
*బేస్తవారపేట మరియు కంభం పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు..
*పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ…సిబ్బంది పని తీరుపై ఆరా*
*పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి..*నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి*…*విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం*..*క్రికెట్ బెట్టింగ్ అరికట్టడంపై కట్టుదిట్టమైన చర్యలు జిల్లా ఎస్పీ వీ హర్షవర్ధన్ రాజు..

పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కంభం మరియు బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను మంగళవారం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ,ఫిర్యాదుల స్వీకరణ విధానం, రికార్డ్స్ మరియు తదితర అంశాలను పరిశీలించారు. కంభం పోలీస్ స్టేషన్ లో మొక్కల నాటి, ఆవరణ పరిశుభ్రంగా, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పెండింగ్ కేసులలో విచారణ త్వరగతిన పూర్తి చేయాలని, కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు. నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
నేరాలు కట్టడికి గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించేటట్లు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న సిబ్బందిని తరచూ అప్రమత్తంగా చెయ్యాలని, డయల్-112 ఫిర్యాదులు రాగానే వెంటనే స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారుల పట్ల,మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను పటిష్టంగా అమలు చేయడంతో శారీరక నేరాలు మరియు గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ప్రతిరోజూ వాహనాలను తనిఖీ చేస్తున్నామని, ముఖ్యంగా బస్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి ఫిట్‌నెస్, డ్రైవర్ లైసెన్స్, ఎగ్జిట్ డోర్స్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, బస్సులో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గుర్తించినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి తెలియజేసి తగిన చర్యలు తీసుకొని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రయాణికులు డ్రైవర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు,ప్రజలకు సూచించారు.
ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన అరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు, మరికొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, క్రికెట్‌ను వినోదం కోసమే ఆస్వాదించాలని సూచిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఆయన వెంట మార్కాపురం డిఎస్పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్ బి ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, కంభం సీఐ కె.మల్లికార్జున్ రావు, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, బివిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి, కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.
👉మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన యం.ఆర్. మానవ హక్కుల & యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యులు*

*మార్కాపురం జిల్లా యం.ఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన యం.ఆర్.హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ లక్ష్మీ నారాయణ,మార్కాపురం జిల్లా చైర్మన్ కిరణ్ కుమార్ అండ్ సభ్యులు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్