👉కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి…👉ఉద్యమకారులు లేకపోతే సీఎంలు,మంత్రులు ఉండేవారా?: నిప్పులు చెరిగిన విజయశాంతి*… 👉బంజారాహిల్స్ లో అక్రమ గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్…👉 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్సై …బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు (నాగర్ కర్నూల్)👉 4.1 కేజీల గంజాయి పట్టువేత (గోల్కొండ)..👉ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు..జాగ్రత్తగా ఉండాలని హెచ్బరికలు*…👉జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పోలీసులు..**మీకోసం కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు*..👉పల్నాడులో అతిసార పంజా…👉విధులు నిర్వహించని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటయ్య ని సస్పెండ్ చెయ్యాలి. ఎస్ఎఫ్ఐ …👉చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు*…**పీ4లో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపికైన వారికి ఘన సన్మానం…👉మార్కాపురం జిల్లా కలెక్టర్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు

👉కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి*
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేసీఆర్‌ విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు.

*ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి..!
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అంటున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు. 50 శాతం సీట్లు పెంచుతున్నామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని.. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుందని విమర్శించారు.
*రాజకీయ పార్టీల సమస్య కాదు..
ఇది పార్టీల సమస్య కాదని.. సౌత్ ఇండియా, ప్రజా సమస్యని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత ప్రజల కోసం లక్ష్మణ్ రాజీనామా చేయాలని.. సౌత్, నార్త్ మధ్య అంతరం పెరగొద్దని హితవుపలికారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని.. అది జరగటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దేశంలో బ్రూటల్ మెజార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. బీజేపీ నాయకులు దీనిపై అవగాహన తెచ్చుకోవాలని హితవుపలికారు. బాగా పని చేస్తున్న సౌత్ ఇండియాను శిక్షించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు తాను కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
*త్వరలో క్యాన్సర్ పరీక్షలు..
రాష్ట్ర ప్రజలందరికీ త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని.. వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని, దాంట్లో కోతలు పెట్టమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పక్కదారి పట్టడం లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో అసెంబ్లీలో అందరికీ మంచి భోజనం పెట్టారన్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని.. తాము మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
*పోలికే లేదు..!
తనకు, కేసీఆర్‌కు పోలిక లేదని.. ఎన్నికల వేళ తాము ఏం చెప్పామో అదే చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదని.. ఆయన ఉండటం వల్లే తనకు పేరొచ్చిందని ఎద్దేవా చేశారు రేవంత్. అన్ని పథకాలు కలిపితేనే ప్రజాపాలన అని, రైతులకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియా సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. రూ.500ల గ్యాస్ విధానంలో ఎలాంటి మార్పులు లేవని గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్రం సెస్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. 34 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రమే సెస్ ఇస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
👉ఉద్యమకారులు లేకపోతే సీఎంలు,మంత్రులు ఉండేవారా?: నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ విజయశాంతి*

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విజ్ఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు.
ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం (ఫస్ట్ ప్రయారిటీ) ఇస్తామని భరోసా కూడా ఇచ్చామని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ విజయశాంతి వివరించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని.. అది కూడా ఇంకా నెరవేరలేదని విజయశాంతి చెప్పారు.ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ఆ బాధ్యతను కాంగ్రెస్‌ నెరవేరిస్తే మరో చరిత్ర అవుతుందని.. పట్టించుకోకుంటే చారిత్రక తప్పిదం అవుతుందని విజయశాంతి పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజయశాంతి సూచించారు..
👉బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ…*

బంజారాహిల్స్‌లో అక్రమ గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్:
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న10 మంది నిందితులను అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ముఖ్య వివరాలు:
అరెస్ట్ అయిన వారు: 10 మంది
స్వాధీనం: 414 గ్యాస్ సిలిండర్లు
సీజ్ చేసిన వాహనాలు: 10 (డీసీఎంలు, బొలెరో, టాటా ఏస్, ఆటోలు)మొత్తం విలువ: ₹21.88 లక్షలు
ప్రధాన నిందితుడు:మొహమ్మద్ అమీర్ – “మెట్రో గ్యాస్ ఏజెన్సీ” నిర్వాహకుడు.
నేర విధానం:శంషాబాద్ కేంద్రంగా వ్యాపారం నడిపిస్తూ…
బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్. సమీపంలోని స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ.అక్కడి నుండి వినియోగదారులకు ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయం.
పోలీసుల చర్యలు:టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యదేందర్ బృందం విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసి నిందితులు, సీజ్ చేసిన వస్తువులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ గ్యాస్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించారు.
👉 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్సై …బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్సై హరిప్రసాద్ రెడ్డి…ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఎస్సై హరిప్రసాద్ రెడ్డి
బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని పట్టుకున్న ఏసీబీ అధికారులు
దీంతో అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న ఎస్సై బాధితులు ..అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు ..చాలామందిని డబ్బులకు పీడించాడని, దారుణంగా కొట్టేవాడని బాధితుల ఆరోపణ …
సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడని.. భూతగాదాలు, సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండుకున్నాడని బాధితులు ఆరోపణ.
👉మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల పలు కేసులను చేదించడంలో, శిక్షలు పడేలా చూడడంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్…*
👉 4.1 కేజీల గంజాయి పట్టువేత..
ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు..
గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి గంజాయి దిగుమతి అయిందన్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహమ్మద్ షఫీ(27) అనే యువకుడి వద్ద 4.1 కేజీల గంజాయిని,ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్క్రూటీని గంజాయిని గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలోకి రూ. పదివేల చొప్పున కొనుగోలు చేసి గల్లీల్లో 10 గ్రాముల గంజాయి పాకెట్ ని రూ. 500 కు అమ్మకాలు జరుపుతూ షఫీ సొమ్ము చేసుకుంటున్నాడు.ఈ కేసులో జాఫర్,, షేక్ అబ్దుల్లా, యాసిన్, సయ్యద్ ఇర్ఫాన్, మహమ్మద్ మోసిన్, జు బేద్, మహమ్మద్ బిన్ అలీ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
👉ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు..జాగ్రత్తగా ఉండాలని హెచ్బరికలు*
ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు అందిస్తోందంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ఒక సందేశం విపరీతంగా వ్యాపిస్తోంది. అయితే ఇది పూర్తిగా నకిలీ అని, సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం దొంగిలించడానికి పన్నిన వల అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశంలో ఉండే లింక్‌ను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే మోసపోవడం ఖాయమని హెచ్చరించింది.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా ఆఫర్ లేదా ప్రకటనపై సందేహం ఉంటే, నేరుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం ఉత్తమమని వారు చెబుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండటమే సైబర్ మోసాల నుంచి రక్షణ అని సూచిస్తున్నారు.
👉ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంగా మీకోసం కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు*
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 21 ఫిర్యాదులు..ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టపరమైన విధానాల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.
సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ సుబ్బారావు, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.. * బాపట్ల జిల్లా కారంచేడు ఎస్ ఐ కి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని స్వర్ణ గ్రామంలో జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
జూద స్థావరం పై నిర్వహించిన దాడిలో 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1950/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పేకాట, కోడి పందాలు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
👉విధులు నిర్వహించని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటయ్య ని సస్పెండ్ చెయ్యాలి. ఎస్ఎఫ్ఐ
పోరుమామిళ్ల మండలంలోని విద్యా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు కీలక పాత్ర పోషించాల్సిన మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించకుండా డుమ్మాలు కొడుతూ బయట షికారులు కొడుతున్నారని సోమవారం పోరుమామిళ్ల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై తగిన శ్రద్ధ లేకపోవడం వంటి అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, పథకాలు పాఠశాల స్థాయికి సక్రమంగా చేరడం లేదు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే, పాఠశాలల్లో మౌలిక వసతుల లోపాలు ఉన్నందున వారికి దృష్టికి తీసుకువెళ్లే సందర్భంలో ఎన్నోసార్లు చెబుదామని వెళ్లిన సందర్భంలో ఆఫీసులకు డుమ్మా కొడుతూ బయట శిఖర్లకు అలవాటు పడుతున్న ఎంఈఓ 1 వెంకటయ్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పోరుమామిళ్ల మండలంలోని సమస్యలు అనేకమార్లు తీసుకువెళ్లిన ఇంతవరకు వాటి పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయడానికి ముందుకు రావట్లేదని వారన్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మండల విద్యాశాఖ అధికారిపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా బాధ్యతాయుతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కోరుతున్నాము.
👉ఒంగోలు…సమాజంలో ఉన్నత స్దానంలో ఉన్న 10 శాతం మంది, పేదరికంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి వెన్నుదన్నుగా నిలిచే కార్యక్రమమే పీ4 అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పీ4 ప్రథమ వార్షికోత్సవం సందర్బంగా సోమవారం రాత్రి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్దాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీ4లో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు. పీ4లో లబ్దిపొందిన వారు తమకు జరిగిన ప్రయోజనం గురించి వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఇప్పటివరకు 79వేల 99 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. మార్గదర్శకులుగా నిలిచిన డీజేఆర్ ట్రస్ట్, మరికొన్ని సంస్దల ప్రతినిధులను సత్కరించడం జరిగిందన్నారు. సమాజంలో అసమాతనలు తొలగించడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అన్నారు.
👉​పల్నాడులో అతిసార పంజా: పోనుగోటివారిపాలెంలో మెడికల్ ఎమర్జెన్సీ.. రంగంలోకి దిగిన జిల్లా DMHO!*
​పల్నాడు: ఈపూరు మండలం పోనుగోటివారిపాలెం గ్రామంలో అతిసార మహమ్మారి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గత వారం రోజులుగా వాంతులు, విరేచనాలతో 15 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
​ఈ పరిస్థితిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (DMHO) రవి తక్షణమే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన 15 మంది వైద్య సిబ్బందిని గ్రామానికి పంపి, బాధితుల కోసం అక్కడే స్థానికంగా మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. DMHO రవి స్వయంగా గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితులకు అక్కడికక్కడే మెరుగైన వైద్యం అందిస్తూ, వ్యాధి అదుపులోకి వచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల సకాల స్పందన పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
👉చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు*
* కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బయట నుంచి తెచ్చిన మందు గుండు సామగ్రిని పోలీస్‌ స్టేషన్‌లో పరిశీలిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
👉మార్కాపురం జిల్లా కలెక్టర్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు*

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ యమ్ విజయ సునీత ను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్