👉రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా రైతులను భయపెట్టి భూములు లాగేసుకుంటున్నాడు- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి…భూములు ఎందుకు తీసుకుంటున్నారు అని మేము అడిగితే వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు…రేవంత్ రెడ్డి పద్ధతిగా పాలన చేస్తే అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్షానికి మైక్ ఇవ్వడం లేదు? ఎందుకు మేము మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు?..నిజంగా ఈ ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు?ఈ బలవంతపు భూసేకరణపై హౌస్ కమిటీ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు
👉జగన్ తో కమలం దోస్తీ నిజమేనా? బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కొనసాగాలని మాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరో 30 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. 
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నా, కేంద్ర పెద్దలతో జగన్ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలపైనా మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ కు ఈ ఆదివారం గెస్ట్ గా వెళ్లిన మాధవ్ అనేక అంశాలపై కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అంశంపై మాధవ్ వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కొనసాగాలని మాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరో 30 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు మాధవ్ బదులిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జరిగిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ అభిప్రాయపడ్డారు. దీంతో మాజీ సీఎం జగన్ కు బీజేపీ రక్షణగా నిలుస్తుందనే వాదనకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ ను బీజేపీ కాపాడుతుందన్న ప్రచారాన్ని మాధవ్ తోసిపుచ్చారు. ఏపీ లిక్కర్ కేసులో కొందరు ఇప్పటికే దొరికారని, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని మాధవ్ వెల్లడించారు. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని మాధవ్ స్పష్టం చేశారు. అరెస్టు అన్నది కేవలం సమయంతో కూడుకున్నది మాత్రమేనని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జగన్ ను బీజేపీ కాపాడుతుందన్న ప్రచారాన్ని మాధవ్ తోసిపుచ్చారు. ఏపీ లిక్కర్ కేసులో కొందరు ఇప్పటికే దొరికారని, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని మాధవ్ వెల్లడించారు. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని మాధవ్ స్పష్టం చేశారు. అరెస్టు అన్నది కేవలం సమయంతో కూడుకున్నది మాత్రమేనని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, స్థానిక ఎన్నికలలో పార్టీ కేడర్ కు విస్తృత అవకాశాలు కల్పిస్తామని మాధవ్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ విషయంలో మరింత విచారణ జరగాలని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా విచారణలు జరిగినా స్పష్టత రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, డిబేట్ లో మాజీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి.
👉మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలే ఈ సభకు అసలైన అతిథులని పేర్కొన్నారు. అనేక సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ నేడు సగర్వంగా నిలబడిందంటే అది కార్యకర్తల చెమట, క్రమశిక్షణ వల్లే సాధ్యమైందన్నారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని నిజం చేస్తూ సామాన్య కార్యకర్తలను గౌరవించడం టీడీపీ గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారని, సామాన్యులకు రాజకీయ అధికారం కల్పించిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.ఒక సాధారణ కార్మిక నేత బిడ్డనైన తనకు ఈ స్థాయి కల్పించిన పార్టీ టీడీపీయేనని గుర్తుచేసుకుంటూ, కార్యకర్తలే పార్టీకి ఊపిరి అని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, 2029లో విజయపతాకాన్ని ఎగురవేసేలా అందరూ సిద్ధం కావాలని ఆకాంక్షించారు.
👉 గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే!
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న శ్రీ హిందూ అనే విద్యార్థిని, పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనలతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉అనంతపురంలో అర్ధరాత్రి ఎస్పి జగదీష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు.
అనంతపురం పట్టణంలో రాత్రి సమయంలో నేరాల నియంత్రించడానికి ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిరోజు విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు. కారణం లేకుండా అర్ధరాత్రి నగరంలో సంచరిస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. దుకాణాలు ముఖ్యమైన కోడళ్ళలో నిగా పెడుతున్నారు.
👉రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ “ఎసిబి” కి పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు..*
రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పంచాయతీరాజ్ అధికారులు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రం గజపతినగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మెంటాడ గ్రామానికి చెందిన వివిధ పనులకు సంబంధించి సర్పంచ్ రాంబాబు నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ జేఈ గౌతమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు.
👉గ్యాస్ సిలిండర్ రాలేదని ఫినాయిల్ తాగిన మహిళ*
గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న కోపంతో మహాలక్ష్మి అనే మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు
👉 హోటళ్లు బంద్.. తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి
తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొండపైన 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాదంపై ఆధారపడుతున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెల అదనంగా లక్ష మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు సమాచారం. రోజుకు సుమారు 6 టన్నుల గ్యాస్ వాడుతున్నా, హోటళ్ల మూసివేతతో అన్నదాన సత్రాలపై ఒత్తిడి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది.
👉రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో రైతులను భయపెట్టి భూములు లాగేసుకుంటున్నాడు- మాజీ మంత్రి సబితా …👉జగన్ తో కమలం దోస్తీ నిజమేనా? బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు…👉మంగళగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం… 👉 హోటళ్లు బంద్.. తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి.. 👉 చెన్నూరు ( తెలంగాణ) గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య…👉అనంతపురంలో అర్ధరాత్రి ఎస్పి జగదీష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు. 👉లంచం తీసుకుంటూ “ఎసిబి” కి పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు..*👉గ్యాస్ సిలిండర్ రాలేదని ఫినాయిల్ తాగిన మహిళ*
Recent Posts

