👉 వరంగల్ లో కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు😲…👉 జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం..మార్కాపురం నూతన కలెక్టర్ విజయ సునీత👉క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు… జీవితాలు నాశనం చేసుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ…👉మార్కాపురం జిల్లా ఏపీ రైతు సంఘం మొదటి మహాసభలను జయప్రదం చేయండి..👉సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్*👉రోడ్డు ప్రమాదంలో ఎస్సైకి కానిస్టేబుల్ కి గాయాలు..👉విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై*

👉 వరంగల్ లో కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు😲
వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీస్ పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు చేశారు. మిర్చి తొడిమలతో కల్తీ కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు కృష్ణమూర్తి, మౌనికతో కలిసి సీఐ సురేశ్ ఈ తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు••
👉తాడేపల్లి : మార్చి 28 — గిద్దలూరు నియోజకవర్గం, రాచర్ల మండలం, పుల్లల చెరువు గ్రామంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి వారి ఆలయంలో నిర్వహించబడనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చరిత్ర మరియు విశిష్టతను ప్రతిబింబించే డాక్యుమెంటరీని మరియు పోస్టర్ ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.

*ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ:* నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి వారి ఆలయం ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్ట స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు.స్వయంభుగా వెలసిన ఈ స్వామివారు భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని, ముఖ్యంగా ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ప్రత్యేకత కలిగిన క్షేత్రమని తెలిపారు. ఆలయ చరిత్ర ఎంతో పురాతనమై భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణనిచ్చేదిగా ఉందన్నారు.ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆలయ వైభవం, సంప్రదాయాలు,విశేషాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరుతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 5 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న అంకురార్పణ మరియు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని,అదే రోజు రాత్రి శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 3 మరియు 4 తేదీలలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఏప్రిల్ 4న తెప్పోత్సవం మరియు సాయంత్రం రథోత్సవం వైభవంగా జరుగుతాయని, ఏప్రిల్ 5న చక్రస్నానం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని మంత్రి ఆనం వివరించారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు,మార్కాపురం ముత్తుముల అశోక్ రెడ్డి,కందుల నారాయణ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య,ఒంగోలు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పానకాల రావు,అధికారులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
👉 ప్రకాశం మార్కాపురం జిల్లా….అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం..నూతన కలెక్టర్ విజయ సునీత వెల్లడి…నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని నూతన కలెక్టర్ ఎం విజయ సునీత వెల్లడించారు. మార్కాపురం కలెక్టరేట్లో శనివారం ఆమె నూతనంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి నీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మార్కాపురం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు చొరవ చూపుతామన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వివరించారు. అంతకుముందు ఆమె మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రజలు నిర్వహించారు. కలెక్టరేట్ వచ్చిన ఆమెకు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ముందుగా స్వాగతం పలికారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆమెకు పుష్ప గుచ్చాలు అందజేసి అభినందన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తో కలిసి నూతన కలెక్టరేట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోగనుల శాఖ ఏడి రవికుమార్, డి ఎం హెచ్ ఓ వాణిశ్రీ, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జెడి బాలాజీ నాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ జన్నెమ్మ,సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లాకు నూతనంగా నియమితులైన మొదటి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా నూతన కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాల్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి నాయకులు పత్రికాముఖంగా కోరారు.
👉క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు… జీవితాలు నాశనం చేసుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు,

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్రికెట్ బెట్టింగ్ లపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా..
అమాయక ప్రజలను, యువతను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ప్రలోభపెడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిఘాఉంచినట్లు తెలిపారు.యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని, ఇది ఆర్థికంగా మరియు సామాజికంగా జీవితాలను నాశనం చేస్తుందని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి మోసపూరితంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.
వినోదం కోసం మాత్రమే క్రికెట్ మ్యాచ్‌లు చూడాలని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపకూడదని సూచించారు. బెట్టింగ్ యాప్‌లలో బాల్-టు-బాల్ పందేలు వేసే అవకాశం ఉండటంతో, ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అత్యాశకు పోకుండా యువత జాగ్రత్తగా ఉండాలని, శ్రమించకుండా వచ్చే డబ్బు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు.పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, యువత చదువుపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా ఉన్నతంగా జీవించాలని సూచించారు. బెట్టింగ్ కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు.అమాయకులను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిఘా ఏర్పాటు చేసి, ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 112 కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
👉మార్కాపురం జిల్లా ఏపీ రైతు సంఘం మొదటి మహాసభలను జయప్రదం చేయండి.. ఏపీ ..మార్కాపురం

2026 మే నెల 5, 6వ తేదీలలో జరుగు రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. మార్కాపురం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి మొదటి మహాసభలు మార్కాపురంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలు జయప్రదం చేసేందుకు రైతులు, ఉద్యమ శ్రేయోభిలాషులు తోడ్పాటున అందించి జయప్రదం చేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు అత్యంత తీవ్రంగా వెనుకబడ్డాయని, నిత్యం కరువు కాటకాలతో వెనుకబడిన మార్కాపురం జిల్లా వరప్రసాద్ని అయిన శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ను పూర్తి చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. 2026వ సంవత్సరం జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వ మాట నిలబెట్టుకోవాలని,గతంలో లాగా వాయిదాల పర్వానికి తెరదించకూడదని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలలో మార్కాపురం జిల్లాలోని 21 మండలాల నుండి రైతు సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతున్నారని, ఈ మహాసభలకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఆల్ ఇండియా కిసాన్ సభ అఖిలభారత నాయకులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలియజేశారు.కరపత్రం ఆవిష్కరించిన వారిలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘం నాయకులు రామకృష్ణ, పెద్దదోర్నాల మండలం రైతు సంఘం కార్యదర్శి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, మార్కాపురం మండల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓర్సు అడవయ్య, గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తర్లపాడు మండల రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జవాజి రాజు సిఐటియు మార్కాపురం మండల కార్యదర్శి జె నాగరాజు తదితరులు మహాసభ కరపత్రం ఆవిష్కరించిన వారిలో ఉన్నారు.
👉సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్*
అక్రమంగా ఎల్ఈడి లైట్లు వాహనాలకు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య వాహనదారులను హెచ్చరించారు.శనివారం కొమరోలు బీసీ కాలనీలో ఎస్సైలు,నాగరాజు,కోటేశ్వరరావు లతో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిలో కొన్నిటికి జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు.రోడ్డు ప్రమాదాలు,దొంగతనాల నివారణ పై సీఐ అవగాహన కల్పించారు.అవసరమైన ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ ప్రజలకు సూచించారు.ఇక సైబర్ నేరాలు, ఓటిపి ఫ్రాడ్స్,హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించి మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉండాలన్నారు.
👉రోడ్డు ప్రమాదంలో ఎస్సైకి కానిస్టేబుల్ కి గాయాలు..
టంగుటూరు …టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో పోలీసు వాహనం లారీని వెనకనుంచి ఢీకొట్టింది.అదే సమయంలో మరో లారీ పోలీస్ జీప్ ని వెనకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్ఐ నాగమల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
👉విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై* *విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు…*
*పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం* భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు..విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు, విద్యార్థినులు ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.
మహిళల భద్రతకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం పోలీసులు ముందుండి పనిచేస్తారని మహిళా ఎస్సై అమూల్య చర్య ద్వారా స్పష్టమైంది.స్థానికులు ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని అభినందిస్తూ, ఇటువంటి చర్యలు సమాజంలో భద్రతను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సంఘటన ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, ఇకపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్