👉ట్రంప్ స్వస్థలంలో భారీ షాక్.. ఫ్లోరిడాలో డెమోక్రాట్ సంచలన విజయం… 👉భారత్‌ నౌకలకు హర్మూజ్‌లో అనుమతి: ప్రకటించిన ఇరాన్‌*…👉7గురు ఉగ్రవాదులు పట్టుబడినారట… వెనుక ఎవరున్నారో ?…👉ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం…టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైన బస్సు, 13 మంది సజీవ దహనం…18 మందికి పైగా తీవ్ర గాయాలు …👉 విజయవాడ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత… 8 మంది అరెస్ట్…👉పేకాట ఆడుతు పట్టుబడ్డ జైపూర్ ఎంపిడిఓ గుర్రం సత్యనారాయణ..👉 శ్రీ శివలక్ష్మీచెన్నకేశవ స్వామి భూముల వివాదంపై జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు… 👉 పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన ‘నయారా’

👉ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం…టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైన బస్సు, 13 మంది సజీవ దహనం…18 మందికి పైగా తీవ్ర గాయాలు 😲😲😲

మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు, లారీ
ప్రమాదంలో 13 మంది సజీవ దహనం… 18 మందికి పైగా తీవ్ర గాయాలు… బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..
👉13 మంది ప్రాణాలు తీసిన హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ డొక్కు బస్సు..జగిత్యాల నుండి నిన్న సాయత్రం 5–30 కు బయలుదేరిన బస్సు.. మొత్తం 41 మంది తో వెళ్తున్న బస్, జగిత్యాలలో ఇద్దరు, కోరుట్లలో 6 గురు బస్ ఎక్కిన ప్రయాణీకులు..ఏపీ లోని మార్కాపురం కు వెళుతుండగా మధ్యలో పని చేయని బస్ సెన్సార్లు., బస్ ఆగిపోవడంతో సుమారు గంట సేపు మరమ్మతులు చేసుకుని అనంతరం తిరిగి బయలుదేరిన బస్సు …బస్ లోని స్టీరింగ్ పట్టివేయడంతో ప్రమాదం జరిగిందని తెలిపిన బస్ సెకండ్ డ్రైవర్..,గంట సేపయితే గమ్య స్థానం చేరుతుందనగా జరిగిన ప్రమాదం..మృతుల్లో ఎక్కువ శాతం సెమీ స్లీపర్ లో పడుకున్న ప్రయాణికులు కావడం, బస్ అద్దాల వద్ద ఉన్న ఇనుప చువ్వలు ఉండడంతో తప్పించుకోలేకపోయిన ప్రయాణికులు..
ఈ ఘటనకు పీఎం మోడీ, సీఎం లు రేవంత్ చంద్రబాబు ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు
*బస్సులో బయటపడ్డ గ్యాస్ సిలిండర్ !!!
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ బయటపడటం కలకలం రేపింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు బస్సును తనిఖీ చేయగా ఈ సిలిండర్ లభ్యమైంది. అయితే, ఈ సిలిండర్ పేలిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. సిలిండర్ ఆకారం చూస్తే మంటల్లో కాలిపోయి నల్లగా మారినట్లుగా ఉందని, పేలినట్లుగా కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు
👉భారత్‌ నౌకలకు హర్మూజ్‌లో అనుమతి: ప్రకటించిన ఇరాన్‌*
* పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని భారత్‌ కోసం ఇరాన్‌ తెరిచింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వెల్లడించారు. భారత్‌తో సహా మిత్రదేశాలైన రష్యా, చైనా, ఇరాక్‌, పాకిస్థాన్‌ నౌకలు హర్మూజ్‌ గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది.
👉ట్రంప్ స్వస్థలంలో భారీ షాక్.. ఫ్లోరిడాలో డెమోక్రాట్ సంచలన విజయం… అమెరికా రాజకీయాల్లో ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
రిపబ్లికన్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహిత ప్రాంతంగా భావించే ఫ్లోరిడా గడ్డపై డెమోక్రాట్లు విజయభేరి మోగించారు. రాబోయే మధ్యంతర ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించిన ఈ ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిపై డెమోక్రాట్ అభ్యర్థి ఎమిలీ గ్రెగరీ సంచలన విజయం సాధించడం ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ నివాసం ఉన్న చోటే పరాజయం ఈ ఎన్నిక ఫలితం రిపబ్లికన్లకు కేవలం ఒక సీటు కోల్పోవడం మాత్రమే కాదు.. అది ఒక పెద్ద నైతిక పరాజయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం మార్-ఎ-లాగో ఉన్న నియోజకవర్గంలోనే డెమోక్రాట్లు గెలుపొందడం గమనార్హం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో ట్రంప్ ఏకంగా 11 శాతం మెజారిటీ సాధించారు. అటువంటి పట్టున్న చోట ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించిన రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మేపుల్స్‌ను గ్రెగరీ ఓడించడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఈ స్థానాన్ని రిపబ్లికన్ నాయకుడు మైక్ కరూసో 19 శాతం భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. ఆయన రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు భారీగా చీలి డెమోక్రాట్ల వైపు మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడి పట్టుకున్న ఎమిలీ గ్రెగరీ విజయం అనంతరం ఎమిలీ గ్రెగరీ మాట్లాడుతూ ప్రజలు కేవలం రాజకీయ విమర్శల కంటే తమ దైనందిన సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం.. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. కేవలం పార్టీ సిద్ధాంతాల కంటే స్థానిక నాయకత్వంపై ప్రజలు మొగ్గు చూపారు. డెమోక్రాటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నిక్కీ ఫ్రైడ్ ఈ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “అధిక ధరలు, అవినీతి, రిపబ్లికన్ల రాజకీయ గందరగోళంతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ ఫలితం నవంబర్ మధ్యంతర ఎన్నికలకు ఒక ట్రైలర్ మాత్రమే” అని ధీమా వ్యక్తం చేశారు. రెట్టింపు దెబ్బ.. సెనేట్ స్థానం కూడా కైవసం రిపబ్లికన్లకు షాక్ కేవలం ఒక స్థానానికే పరిమితం కాలేదు. ఫ్లోరిడా రాష్ట్ర సెనేట్ ఉప ఎన్నికలో కూడా డెమోక్రాట్ అభ్యర్థి బ్రియన్ నాథన్ విజయం సాధించి.. రిపబ్లికన్ల నుంచి ఆ సీటును లాగేసుకున్నారు. ఒకేసారి రెండు కీలక స్థానాల్లో డెమోక్రాట్లు గెలవడం ఫ్లోరిడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం మరోవైపు ఇరాన్ యుద్ధం అమెరికా దేశీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా సెనేట్‌లో జరిగిన విచారణలో సెనేటర్ జీన్ షాహీన్ ఆందోళనకర విషయాలను వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా తన ఆయుధ నిల్వలను వేగంగా కోల్పోతోందని దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అత్యవసర అధికారాలతో మిడిల్ ఈస్ట్‌కు తరలించడం వల్ల దేశ రక్షణ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆమె హెచ్చరించారు. యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక భారం సామాన్య ఓటరును రిపబ్లికన్లకు దూరం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలకు హెచ్చరిక ఈ ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి.. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి హెచ్చరిక వంటివి. తన సొంత గడ్డపై, తన ప్రభావం బలంగా ఉన్న చోటే ఓటమి ఎదురవ్వడం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఇదే ఊపును కొనసాగిస్తారా లేదా రిపబ్లికన్లు పుంజుకుంటారా అనేది వేచి చూడాలి.
👉7గురు ఉగ్రవాదులు పట్టుబడినారట … వెనుక ఎవరున్నారు ???
భారతదేశం లో 5 రాష్ట్రల్లో ఎన్నికలు జరగనున్న నేపద్యం లో మార్చి 13నా ఢిల్లీ, కొలకత్తా, లక్నో లో నేషనల్
ఇన్విస్టికేషన్ అధికారులు అమెరికా, ఉక్రైన్ నుండి వచ్చిన 7గురు ఉగ్రవాదులు భారతదేశం లో బాంబు దాడులు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశారు
కానీ ఆ ఉగ్రవాదులను పట్టుకున్న విషయాన్ని ఇప్పటి వరకు ఏ మీడియా లో చూపించక పోవటానికి దేనికి సంకేతం దీని మీద ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయక పోవటం ఏంటి అనేది నేడు దేశ ప్రజలకు సమాధానం లేని ప్రశ్న గా మిగిలిపోయింది
*వాళ్ళను రప్పించింది ఎవరు ???
వాళ్ళతో దాడులు చేయటానికి ప్రణాళిక చేసింది ఎవరు ఒక వేల ఆ దాడులు జరిగితే 5రాష్ట్రల్లో ఎన్నికల లాభం పొంద వచ్చా, ఆ నిందా ఎవరి పైన అయినా వేయవచ్చా ఎలక్టన్స్ ప్రతిసారి ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు*
👉 విజయవాడ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత…
పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో గంజాయి తరలింపు
60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయి తరలిస్తున్న 8 మంది ఒడిశా వాసులు అరెస్ట్
👉పేకాట ఆడుతు పట్టుబడ్డ జైపూర్ ఎంపిడిఓ గుర్రం సత్యనారాయణ..
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ జన్నారం మండల కేంద్రంలో పేకాట ఆడుతు పట్టుబడ్డాడు. ఇతని జల్సాలకు క్రింది స్థాయి ఉద్యోగులను పలు రకాలుగా ఇబ్బంది పెట్టెవారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతని పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు… ఈ అవినీతి ఉద్యోగి పైనా చర్యలు ఉంటాయా లేవా అని వేసి చూడాలి?
👉 శ్రీ శివలక్ష్మీచెన్నకేశవ స్వామి భూముల వివాదం పై
జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. *యాడికి… శ్రీ శివలక్ష్మీచెన్నకేశవ స్వామి భూముల రికార్డులు.బ్రిటిష్ కాలం నాటి రికార్డులు మా దగ్గర ఉన్నాయి.*
*అక్రమ దారులు వారి రికార్డులను తీసుకురండి అది స్వామివారి భూమి కాకపోతే వారికి క్షమాపణ చెప్తాం*
*స్వామి భూమి ఆక్రమణ చేసి ఉంటే రండి మాట్లాడుకుందాం ప్రతి సమస్యకు ఒక సంధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.*
*మహాభారత యుద్ధంలో మధ్య వ్యక్తి సంధి చేసే ప్రయత్నాలు చేసిన ఆలనాటి కృష్ణుడు. అయినా నేను మాత్రం చివరి అవకాశం ఇస్తున్న సమావేశానికి రండి.
*స్వామికి మంచి జరగాలంటే యుద్ధం జరగాల్సిందే సంచలన కామెంట్ చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి*

👉 పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన ‘నయారా’
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ కంపెనీ కస్టమర్లకు షాకిచ్చింది. లీటర్ పెట్రోల్పై రూ.5.30, డీజిల్పై రూ.3 పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 6,967 పెట్రోల్ పంప్లు ఉన్నాయి. రేట్ల పెంపు తర్వాత హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 107.46కు చేరింది.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్