👉రైతు రుణమాఫీ ప్రతిపాదన లేదు: కేంద్రం క్లారిటీ
రైతు రుణమాఫీకి సంబంధించి కేంద్రం వద్ద ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
రుణమాఫీ కంటే, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, పి ఎం కిసాన్ నిధులు, తక్కువ వడ్డీ లోన్ల వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యం అని అన్నారు. అలాగే, పూచీకత్తు లేని లోన్ల పరిమితిని రూ. 2 లక్షలకు పెంచామని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రుణమాఫీ అవుతుందని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.
👉నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్…?*

తెలంగాణ: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న(సోమవారం) అసెంబ్లీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి,పి సి సి చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.ఎ ఐ సి సి ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
👉కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు*
TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.
👉కర్ణాటక బెలగావిలో భారీ సైబర్ మోసం..!*
*సీబీఐ అధికారుల పేరుతో వీడియో కాల్ చేసి, వృద్ధుడి దగ్గర రూ.15.45 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.*
*నెల రోజులుగా వాట్సాప్ కాల్ ద్వారా ఒత్తిళ్లు.*
*మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.*
👉దిగొచ్చిన చమురు ధరలు*
ఇరాన్‌పై దాడులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దిగి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 13 శాతం మేర పతనమై 96 డాలర్ల స్థాయికి చేరింది. అంటే ఒక్క ప్రకటనతో 17 డాలర్ల మేర దిగొచ్చింది. అలాగే, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సైతం 13 డాలర్లు క్షీణించి 85 డాలర్ల స్థాయికి చేరింది.
👉 మాగంటి గోపినాథ్ కుటుంబంలో మరో విషాదం
హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయన పెద్ద కుమార్తె అక్షర పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. రెండో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం బాధితులకు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
👉సూర్యాపేటలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.!*
నిరుద్యోగులకు వల వేసి రూ 1.85 కోట్లు వసూలు చేసిన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం..
హైదరాబాద్ లోని డీఎంఈ కార్యాలయంలో పనిచేస్తున్న వాణి అనే మహిళతో కలిసి బాధితులను నమ్మించిన నిందితుడు.
సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన నాగమణి అనే స్టాఫ్ నర్స్‌ను హైదరాబాద్‌లోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద కలిసిన రఘురామ్..
ఆ సమయంలో నాగమణితో పరిచయం పెంచుకొని సూర్యాపేట జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది నిరుద్యోగులను కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను.. నాగమణినీ బురిడీ కొట్టించారు. ఒక్కొక్కరి నుండి 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా 60 మంది నుండి రూ.1 కోటి 85 లక్షలు వసూలు.. ఆ డబ్బుతో ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసిన రఘురాం.బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు..
👉వాహన్ పోర్టల్ షురూ.. ఇక ఆన్లైన్లోనే ఆర్టీఏ సేవలు
తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పింది. బండ్ల రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ బదిలీ సహా 52 రకాల సేవలు ఇక ఆన్లైన్లోనే సులభంగా పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు వాహనాల బదిలీకి ఎన్బీసీలు అవసరం లేదు. రెండో బండిపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్ను ప్రభుత్వం నేటి నుంచి పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆన్లైన్ విధానంతో ప్రజలకు పారదర్శకమైన సేవలు వేగంగా అందనున్నాయి.
👉అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందన
యుద్ధంలో మరోసారి ట్రంప్ వెనక్కి తగ్గారు-ఇరాన్
మా హెచ్చరికలతో ట్రంప్ భయపడ్డారు…అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు…ట్రంప్ వ్యాఖ్యలను నమ్మడానికి లేదు…సమయం చూసి ట్రంప్ దాడి చేయడానికి చూస్తున్నారు-ఇరాన్
👉 క్యూ నెట్ ఎంఎల్ఎం మోసం బట్టబయలు.. 30 మంది అరెస్ట్….
హైదరాబాద్ సిటీ పోలీసులు క్యూ నెట్ (QNet) మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) మోసం కేసును బట్టబయలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం (పాత సీపీ ఆఫీస్)లో జరిగిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
👉 విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు…
విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే అనుమానంతో ముగ్గురు యువకులను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటకు చెందిన ఇద్దరు 21 ఏళ్ల యువకులతో పాటు భవానీపురానికి చెందిన 20 ఏళ్ల యువకుడిని అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలపై కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు నిరంతర నిఘా చేపట్టారు.
ఈ నిఘాలో భాగంగా సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులకు, ఈ ముగ్గురు యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ యువకులు విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి? వీరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సోషల్ మీడియా ఖాతాల్లోని లింకులు ఎక్కడివి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది.
👉 మాగంటి గోపినాథ్ కుటుంబంలో మరో విషాదం
హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆయన పెద్ద కుమార్తె అక్షర పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. రెండో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం బాధితులకు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
👉ఇరాన్ ఆఖరి అస్త్రం..”డర్టీ బాంబ్”…దీని ప్రభావం ఎంత?.. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగాయి. ఇరాన్ తో ఇజ్రాయెల్ , అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతీకార దాడులు 22వ రోజుకు చేరుకున్నా శాంతి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ పోరులో ఇరాన్ తన మనుగడ కోసం “డర్టీ బాంబ్” అనే ప్రమాదకరమైన ఆయుధాన్ని తన ‘లాస్ట్ ఆప్షన్’గా వాడుతుందా? అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏమిటీ డర్టీ బాంబ్? దీని ప్రభావం ఎంత? డర్టీ బాంబ్ అనేది సాంప్రదాయ అణు బాంబు వంటిది కాదు. ఇది ఒక ‘రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్’. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను లేదా పదార్థాలను కలిపి దీనిని తయారు చేస్తారు. అణు బాంబులా ఇది నగరాన్ని ఒక్కసారిగా బూడిద చేయదు. కానీ, పేలుడు జరిగిన తర్వాత కిలోమీటర్ల మేర రేడియోధార్మిక ధూళిని గాలిలోకి విడుదల చేస్తుంది. ఇది గాలి, నీరు , నేలను విషపూరితం చేస్తుంది. దీనివల్ల తక్షణ ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. ఒక ప్రాంతంలో డర్టీ బాంబ్ పేలితే ఆ ప్రాంతాన్ని రేడియేషన్ రహితం చేయడం అసాధ్యం లేదా అత్యంత ఖర్చుతో కూడుకున్న పని.. దీనివల్ల వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు దశాబ్దాల పాటు నిర్జన ప్రదేశాలుగా మారిపోతాయి. ఇరాన్ వద్ద ఉన్న సామర్థ్యం ఏమిటి? అణు బాంబు తయారీకి దాదాపు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం కాగా డర్టీ బాంబ్‌కు అంత కఠినమైన ప్రమాణాలు అవసరం లేదు. కేవలం 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉన్నా ఈ బాంబును రూపొందించవచ్చు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 450 కిలోల మేర 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. యుద్ధం తీవ్రస్థాయికి చేరి ఇజ్రాయెల్ దాడుల వల్ల దేశ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావిస్తే ఇరాన్ ఈ “డర్టీ బాంబ్” అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంటే అది కేవలం యుద్ధ క్షేత్రానికే పరిమితం కాదు. గల్ఫ్ ప్రాంతంలోని కీలకమైన చమురు రవాణా మార్గాలు హోర్ముజ్ జలసంధి వంటివి రేడియోధార్మిక ముప్పుకు గురైతే, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. నైతిక , మతపరమైన పరిమితులు అయితే ఇరాన్ ఈ అడుగు వేస్తుందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకత్వం గతంలోనే ‘అణ్వాయుధాలు లేదా సామూహిక వినాశకర ఆయుధాల తయారీ ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధం’ అని ఫత్వా జారీ చేసింది. కానీ దేశ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు మతపరమైన పరిమితుల కంటే వ్యూహాత్మక అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ముందున్న సవాలు ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ అణు కేంద్రాలపై నిఘాను పెంచాలని కోరుతున్నాయి. యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించకపోతే “డర్టీ బాంబ్” భయం కేవలం ఊహగానే మిగిలిపోకుండా వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే అది ఆధునిక మానవ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.

