🌟జైపూర్‌లో పూల వర్షం – హిందూ-ముస్లిం ఏక్తా సమితి చొరవ!:🌟 …⭐మోడీ రికార్డులు స‌రే..దేశంలో పెరిగిపోతున్న దారిద్రం నిరుద్యోగం మాటేంటి?⭐ … 👉బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళం…⭐51 Go ను రద్దు చేసి సీనియారిటీ కార్మికులను తొలగించకుండా విధుల్లోకి తీసుకోవాలి : సీపీఐ ఎం ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోపన్న⭐..⭐ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు⭐👉 సైబర్ నేరగాళ్ల వలలో ఏపీ జనసేన ఎమ్మెల్యే …⭐వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఆధార్ డౌన్‌లోడ్: UIDAI కొత్త సేవ⭐👉జర్నలిస్టు,డిపార్ట్మెంట్ పేరిట అర్ధరాత్రి వసూళ్ల దందా*

🌟జైపూర్‌లో పూల వర్షం – హిందూ-ముస్లిం ఏక్తా సమితి చొరవ!:🌟 ఈద్ ప్రార్థనల వేళ విరిసిన మత సామరస్యం! ఈ సామరస్యం కేవలం ఒక వైపు నుంచే కాకుండా, రెండు వర్గాల నుంచి కనిపిస్తుండడం విశేషం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, మన దేశం నుంచి వినిపిస్తున్న ఈ ‘శాంతి మంత్రం’ ఎంతో ఊరటనిస్తోంది. మతం ఏదైనా, మనిషిలోని మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే ఇలాంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం మన దేశ గంగా-జమునా తెహజీబ్ (సామరస్య సంస్కృతి)కి అద్దం పడుతోంది. రాజకీయ విశ్లేషణలు, కొన్ని వివాదాస్పద కథనాలు ఈ బంధాన్ని విడదీయాలని చూస్తున్నా, సామాన్య ప్రజల మధ్య ఉన్న ఈ ‘సోదర భావం’ మాత్రం చెక్కుచెదరలేదని జైపూర్ ఘటన నిరూపించింది.
ఈద్ పర్వదినాన రాజస్థాన్ గడ్డపై ఆవిష్కృతమైన ఈ అద్భుతమైన మత సామరస్య దృశ్యాలపై లోతైన విశ్లేషణ ఇక్కడ ఉంది.
జైపూర్‌లో పూల వర్షం పింక్ సిటీ జైపూర్‌లో ఈరోజు ఈద్ ప్రార్థనల సందర్భంగా ఒక అపురూప దృశ్యం కనిపించింది. ఈద్గా వద్ద నమాజ్ పూర్తి చేసుకొనిని వస్తున్న ముస్లింలపై హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు ‘హిందూ-ముస్లిం ఏక్తా సమితి’ ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకోవడం, హిందువులు స్వయంగా పూలు చల్లడం చూస్తుంటే.. భారత్ అంటే కేవలం ఒక దేశం కాదు, అదొక గొప్ప భావోద్వేగం అని అర్థమవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండి, లక్షలాది మంది నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.రామ నవమి నుంచి ఈద్ వరకు ఈ సామరస్యం కేవలం ఒక వైపు నుంచే కాకుండా, రెండు వర్గాల నుంచి కనిపిస్తుండడం విశేషం. జైపూర్ ఘటనతో పాటు, గతంలో రామ నవమి ఊరేగింపుల సమయంలో ముస్లింలు హిందూ భక్తులపై పూల వర్షం కురిపించిన పాత వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక పండుగకు మరొకరు మద్దతుగా నిలవడం, ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకోవడం అనేది భారతదేశపు అసలైన ఆత్మకు నిదర్శనం.సోషల్ మీడియాలో సాధారణంగా కనిపించే ద్వేషపూరిత పోస్టుల కంటే,ఇలాంటి ‘వెల్‌బీయింగ్’ స్ఫూర్తితో కూడిన వీడియోలు ప్రజల్లో సానుకూలతను నింపుతున్నాయి.
⭐సామాజిక ప్రగతికి పునాది⭐ మత సామరస్యం అనేది కేవలం మాటలకే పరిమితం కాదు, ఇది దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అత్యంత కీలకం. హిందూ, ముస్లిం వర్గాలు కలిసి పనిచేసినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది, తద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాజకీయంగా ఎన్ని విభిన్న కథనాలు వినిపించినా, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న ఈ ‘బ్రదర్ బాండింగ్’ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతోంది. జైపూర్ వంటి దృశ్యాలు పెట్టుబడిదారులకు మరియు పర్యాటకులకు భారత్ పట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి. Also Read – హైదరాబాద్ ఐటీ రంగానికి గ్రహణం? గణాంకాలు చెబుతున్న చేదు నిజం ధీటైన జవాబు! తరచుగా కొన్ని రాజకీయ శక్తులు ఓట్ల వేటలో భాగంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటాయి. కానీ, సామాన్యులు తమ రోజువారీ జీవితంలో చూపే ఇలాంటి ఐకమత్యం ఆ కుట్రలను తిప్పికొడుతోంది. జైపూర్‌లో పూల వర్షం కురిపిస్తున్న ఆ దృశ్యం, విద్వేషం కంటే ప్రేమే గొప్పదని నిరూపించింది. భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో, ఇటువంటి సానుకూల చర్యలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో మతపరమైన ఉద్రిక్తతలు, యుద్ధాలు జరుగుతున్న తరుణంలో, భారత్ నుంచి వెలువడిన ఈ ‘శాంతి విజువల్స్’ ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. మనుషుల మధ్య గోడలు కట్టడం కంటే, పూల వంతెనలు నిర్మించడం ఎంత అందంగా ఉంటుందో జైపూర్ ప్రజలు నిరూపించారు. ఇలాంటి హృదయాన్ని హత్తుకునే దృశ్యాలు కేవలం పండుగలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతిరోజూ మన జీవనశైలిలో భాగం కావాలని ఆశిద్దాం.

⭐మోడీ రికార్డులు స‌రే..దేశంలో పెరిగిపోతున్న దారిద్రం నిరుద్యోగం మాటేంటి?⭐ అది.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యం. ఆదివారం భారీ ఎత్తున దానిని అలంక‌రించారు. దేశ విదేశీ పుష్పాల‌ను కూడా తీసుకువ‌చ్చి కనుల పండువ‌గా అలంక‌రించి.. స్వాగ‌త తోర‌ణాలు కూడా ఏర్పాటు చేశారు. : అది.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యం. ఆదివారం భారీ ఎత్తున దానిని అలంక‌రించారు. దేశ విదేశీ పుష్పాల‌ను కూడా తీసుకువ‌చ్చి కనుల పండువ‌గా అలంక‌రించి.. స్వాగ‌త తోర‌ణాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, నింగినంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కటౌట్లు.. బారులు తీరాయి. ఈ దారి పొడ‌వునా పోలీసుల ను మోహ‌రించారు. ఎక్క‌డా సాధార‌ణ ప్ర‌జ‌లు రాకుండా బారికేడ్లు పెట్టారు. కేవ‌లం పాస్ ఉన్న వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించారు. ఇవ‌న్నీ.. ప్ర‌ధానిని ఆదివారం భారీగా స‌త్క‌రించేందుకు చేసిన ఏర్పాట్లు…
ఎందుకు? దేశంలో సుదీర్ఘ‌కాలం అధికారిక ఉన్న‌త‌ ప‌ద‌విలో ఉన్న ఏకైక నాయ‌కుడిగా మోడీ రికార్డు సృష్టించ‌డ‌మే. 2001లో ఏ ముహూర్తాన ఆయ‌న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యారో తెలియ‌దు కానీ.. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న ఉన్న‌త ప‌ద‌వుల్లోనే ఉన్నారు. 2014 మే వ‌ర‌కు.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా.. ఇక‌, ఆ త‌ర్వాత నేటి వ‌ర‌కు మోడీ భార‌త ప్ర‌ధాన మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది దేశంలో ఏ ఒక్క‌రికీ అంద‌ని రికార్డు. భ‌విష్య‌త్తులో ఎవ‌రైనా అందుకుంటారా? అంటే..క‌నుచూపు మేర‌లోనూ ఎవ‌రూ క‌నిపించ‌నంత రికార్డు!. మొత్తంగా 8,931 రోజులు(25 సంవ‌త్స‌రాలుగా) ఆయ‌న ప్ర‌భుత్వాధినేతగా ఉన్నారు. అందుకే ఘ‌న స‌త్కారం.. భారీ ఏర్పాట్లు!!. క‌ట్ చేస్తే.. మోడీ సాధించిన రికార్డు ఎలా ఉన్నా.. బీజేపీ సంబ‌రాలు ఎలా ఉన్నా..దేశంలో రెండు కీల‌క స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉన్నాయి. 1) ఆక‌లి కేక‌లు: దేశంలో 8 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఒక పూట తిండి దొర‌క‌డ‌మే.. క‌ష్టంగా మారింద‌ని.. ఈ నెల ప్రారంభంలో అంత‌ర్జాతీయ `జ‌ర్న‌ల్` త‌న నివేదిక‌లో ఆధార స‌హితంగా వివ‌రించింది. 8 కోట్ల మంది అంటే.. దాదాపు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు స‌మానం. ఒక‌వైపు.. విక‌సిత భార‌త్ అంటూనే.. పేద‌ల ఆక‌లిని తీర్చ‌లేక‌పోవ‌డం.. ఏ రికార్డులు సాధించి ఏం ప్రయోజ‌నం అన్న‌ది మోడీ ఆలోచ‌న చేసుకోవాలి.
2) నిరుద్యోగం: నేడు దేశ‌వ్యాప్తంగా నిరుద్యోగం ప్ర‌బ‌లుతోంది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ లో స‌ఫాయి(రోడ్డు ఊడ‌వ‌డం, మురుగు కాల్వ‌లు శుభ్రం చేయ‌డం) ప‌నుల‌కు సంబంధించి 32 మంది కావాలంటూ నోటిఫికేష‌న్ జారీ చేస్తే.. అనేక నిబంధ‌న‌లు పెడితే.. అన్ని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వ‌చ్చిన అప్లికేష‌న్లు 2302 అంటే అతిశ‌యోక్తి కాదు.. ఆశ్చ‌ర్యం కాదు. వీరిలో బీటెక్ చేసిన వారు.. సాధార‌ణ డిగ్రీ ఉన్న‌వారు వంద‌ల మంది ఉన్నారు. వివాదాల నేప‌థ్యంలో చివ‌ర‌కు ఆ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసుకున్నారు.ఈ ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా ఉంది. రాజ‌మండ్రి, విజ‌య‌వాడ మునిసిప‌ల్ ప‌నుల‌కు కూడా ఇలానే నోటిఫికేష‌న్ ఇస్తే.. వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ ద‌ర‌ఖాస్తుల విక్ర‌యం ద్వారా… రెండు కార్పొరేష‌న్ల‌కు కోటి రూపాయ‌ల చొప్పున ఆదాయం స‌మ‌కూరింద‌ట‌.సో.. నిరుద్యోగం ఎలా ఉంద‌ని చెప్ప‌డానికి ఇవి తార్కాణాలు. మ‌రి మోడీ ఏం చేసిన‌ట్టు? అనేది ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.🌟 “స‌త్కారాలు.. స‌న్మానాల‌కు ఇది స‌మ‌య‌మ‌ని నేను అనుకోను. ఎందుకంటే.. ఈ దేశంలో ఆక‌లి కేక‌లు వినిపించ‌ని రోజునే నేను వాటిని అర్హుడిని“ అని దివంగ‌త లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చేసిన వ్యాఖ్య‌లు..ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం.🌟
⭐ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీనిప్రారంభించిన సిఎం రేవంత్..⭐
*సిద్దిపేట జిల్లా:నంగునూరు మండలం,నర్మెట గ్రామంలో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ ఫాం కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు.సుమారు రూ.300 కోట్ల వ్యయంతో మలేషియా సాంకేతికతతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులకు ‘రైతు భరోసా’ నిధులను కూడా విడుదల చేశారు.ఈ కర్మాగారం ద్వారా వేలాది మంది రైతులకు మేలు కలగడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యవసాయాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.
👉బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళం…*
TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం హఠాత్తుగా సెలవులు ప్రకటించింది. ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతుండగానే అసాధారణ సెలవులు అంటూ ప్రకటన జారీ చేసింది. అయితే, అసాధారణ పరిస్థితులపై యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. వెంటనే హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….
⭐ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు⭐
అమరావతి :
ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల ఘన వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు, విజయవాడ ప్లాంట్ అప్ గ్రేడ్ కు రూ.59.85 కోట్లు మంజూరు చేసింది.ఒక్కో ప్లాంట్ రోజుకు 25 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈనిర్ణయం వల్ల నగరాల్లో వ్యర్థాల సమస్య తగ్గడమే కాకుండా పర్యావరణహిత ఇంధనం అందుబాటులోకి రానుంది.
👉మహిళ దారుణ హత్య..😱😱😱
షాద్ నగర్ పట్టణ శివార్లలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. రంగారెడ్డి గూడా గ్రామానికి చెందిన శోభ అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.ఈ కేసును కె . సీతారాం దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.అనుమానితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది.ఈ సంఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
👉 సైబర్ నేరగాళ్ల వలలో ఏపీ జనసేన ఎమ్మెల్యే!!! …
తన ఫోనుకు వచ్చిన ఆర్టీఏ చలాన్ లింక్ ఓపెన్ చేయడంతో, తన బ్యాంకు ఖాతా నుండి రూ.12 లక్షలు కోల్పోయిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు..
మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే
⭐వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఆధార్ డౌన్‌లోడ్: UIDAI కొత్త సేవ⭐
భారత ప్రభుత్వానికి చెందిన UIDAI, MyGov వాట్సాప్ ద్వారా ఇ-ఆధార్‌ను క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించాయి.
దీనికి మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి, యాక్టివ్ డిజిలాకర్ ఖాతా ఉండాలి, 12 అంకెల ఆధార్ నంబర్ తెలిసి ఉండాలి. MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ +91-90131-51515 ను సేవ్ చేసుకుని, ‘Hi’ అని పంపి, ‘డిజిలాకర్ సేవలు’ ఎంచుకుని, ఆధార్ నంబర్, OTP ధృవీకరణ తర్వాత ఇ-ఆధార్ PDF రూపంలో పొందవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం కాగా, చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది
👉 మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. తాడిపత్రిలో వింత ఘటన..😲😲😲
అనంతపురం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్ కొనుగోలు చేశాడు. దానిని సుమారు 20 సార్లు ఉడికించినా ఉడకకపోవడంతో విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతను వండిన వంట పాత్రతో సహా తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు అతనికి సర్ది చెప్పడంతో ఆ వ్యక్తి వెనుతిరిగాడు.
⭐51 Go ను రద్దు చేసి సీనియారిటీ కార్మికులను తొలగించకుండా విధుల్లోకి తీసుకోవాలి⭐..సీపీఐ ఎం ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కా.గోపన్న ఆధ్వర్యంలో మహబూబాబాద్ .. కొత్తగూడ మండల కేంద్రం లోని కా,, పాలడుగు కృష్ణ స్మారక భవనంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ సంస్థ అయిన అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) లో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయితీ మున్సిపాల్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,iftu జిల్లా కార్యవర్గ సభ్యులు కా,, గుగిల్ల వెంకన్న మరియు గ్రామ పంచాయితీ కార్మికులు ఈ శ్రీనివాస్ మండల కార్యదర్శి,పి జాంపయ్య,వి పాపయ్య,బి అశోక్, ఈ సందీఫ్ వి కృష్ణ ప్రసాద్, జడి వెంకటేష్ కారోబార్, కే నాగేశ్వరరావు, టీ ప్రవీణ్ కుమార్, గుండె శ్రీను తదితర కార్మికులకు సీపీఐ ఎం ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోపన్న ఆధ్వర్యంలో YK గ్రూపు నుండి చేరారు. గోపన్న మాట్లాడుతూ.. సామాజిక భద్రత,ఉపాధి, ఉద్యోగ భద్రతల కోసం ఐక్యంగా పోరాడాలి. 8గంటల పని దినం పరిరక్షణకు ఉద్యమించాలి. కనీస వేతనం, సమన పనికి సమనవేతననికై పోరాడాలి. 51 Go ను రద్దు చేయాలి.సీనియారిటీ కార్మికులను తొలగించకుండా విధుల్లోకి తీసుకోవాలని మండల ఎంపిడిఓ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు కా,, పసునూరి రాజ మల్లు, AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి కా,, సిద్ద బోయిన జీవన్, AIKMS జిల్లా నాయకులు కా,, జిట్టబోయిన రామ చంద్రు,pyl జిల్లా నాయకులు కా,, వాళ్లపు సాంబ రాజు, చల్లా మహేందర్, కాసార్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
👉జర్నలిస్టు,డిపార్ట్మెంట్ పేరిట అర్ధరాత్రి వసూళ్ల దందా*
*జర్నలిస్ట్ అవతారం ఎత్తిన కేటుగాళ్లు😱😱😱
*అర్ధరాత్రి రోడ్లపై వాహనాలు నిలిపి డబ్బులు డిమాండ్*
*20వేలు ఇస్తే లారీ వదులుతా లేదంటే సీజ్ చేస్తాం_*
*టిప్పర్ లారీని దొంగిలించి మరి డబ్బులు డిమాండ్*
*షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో “నలుగురు” కిలాడిల హల్చల్*
*టిప్పర్ లారీ కోసం గాలింపు చేపట్టగా విట్యాల వద్ద వాహనం వదిలి వెళ్లిన ఘనులు*
*డబ్బుల కోసం బెదిరించిన ఆడియోలు*
అర్ధరాత్రి సమయం చూసుకొని నలుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్, జర్నలిస్టుల అవతారం ఎత్తి లారీలను నిలిపి పక్కాగా దోచుకునేందుకు స్కెచ్ వేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో లారీని ఎత్తుకెళ్లి డబ్బులు తమ అకౌంట్ కు వేసే వరకు వదిలే ప్రసక్తే లేదని అవసరమైతే వాహనాన్ని సీజ్ చేస్తామంటూ కేటుగాళ్లు హెచ్చరించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామ శివారులో రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ లారీని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి వాహనాన్ని నిలిపారు. డిపార్ట్మెంట్ నుండి వచ్చాం అంటూ ఆ తర్వాత పైనుండి మాకు ఆర్డర్స్ ఉన్నాయి తను ఆంధ్రజ్యోతి షాద్ నగర్ విలేకరిని అంటూ ఈ కేటుగాళ్లు హల్చల్ సృష్టించారు. టిప్పర్ వాహనం నెంబర్ టిఎస్ 07 యుఎల్ 3031 లో డ్రైవర్ గంగ, మేనేజర్ గోపాల్ నాయక్ ను అటకాయించి రాత్రివేళ వాహనం తిరగకూడదని బండిని సీస్ చేస్తున్నామని తమకు పైనుండి ఆర్డర్ ఉందని డ్రైవర్ మేనేజర్లను బెదిరించారు. ఎందుకు ఆపుతున్నారని చెప్పగా మా ప్రాంతంలో మీరు ఇల్లీగల్ దంద చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది అంటూ బెదిరించారు. వెంటనే మేనేజర్ గోపాల్ నాయక్ తమ యజమానికి సమాచారం అందజేశారు. ఎవరో రోడ్డుపై టిప్పర్ ను అటకాయించి బెదిరిస్తున్నారని పేర్కొనగా వారితో మాట్లాడించామని యజమాని కోరారు. దీంతో టిప్పర్ యజమాని ఫోన్లో మాట్లాడగా సదరు వ్యక్తులు డిపార్ట్మెంట్ అని మరోసారి ఆంధ్రజ్యోతి విలేకరిని అంటూ బెదిరించారు. తను షాబాద్ చంద్రశేఖర్ అంటూ మరొకరు వెంకటేష్ అని పేరు చెప్పారు.
ఇంకా రాజు యాదవ్, జగన్ ఇంకా కొందరు ఉన్నారని మర్యాదగా 20,000 రూపాయలు ఇవ్వాలని లేకుంటే వాహనం సీజ్ చేస్తామని తమకు డిపార్ట్మెంట్ నుండి ఆర్డర్ ఉందని బెదిరించారు. ఈ సందర్భంగా యజమానికి ఫోన్ పే నెంబర్ 9505146397 కు డబ్బులు వేయాలని బెదిరించారు. తమ వద్ద ఆన్లైన్ డబ్బులు లేవని మీరు ఎక్కడున్నారు చేతికి డబ్బులు ఇస్తాము మేము కలుస్తామని చాకచక్యంగా చెప్పగా అలా వద్దు ఆన్లైన్లో డబ్బులు వేయమని బెదిరించారు.
*టిప్పర్ లారీని ఎత్తుకెళ్లిన ఘనులు*
టిప్పర్ వాహనం టిఎస్ 07 యుఎల్ 3031ను రాత్రి నలుగురు వ్యక్తులు డబ్బులు ఇవ్వాల్సిందేనని అప్పటివరకు వాహనం సీజ్ చేస్తున్నామని డబ్బులు ఇచ్చి వాహనాన్ని విడిపించుకోవాలని రాత్రి ఒంటిగంట సమయంలో లారీని ఎత్తుకెళ్లారు. ఫోన్లు చేసే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. లారీలోని డ్రైవర్ గంగ మేనేజర్ గోపాల్ నాయక్ ను వారి వెంటే తీసుకెళ్లారు. వారి ఫోన్లను లాక్కున్నారు. జర్నలిస్టులతోనే గేమ్స్ ఆడొద్దు మాతో రౌడీయిజం చేస్తే రేపు పొద్దున హల్చల్ అవుతుంది అంటూ హెచ్చరించారు.
డ్రైవర్ వద్ద ఉన్న 5500 లాక్కున్నారు. చివరాకరికి
లారీని విట్యాల శివర్లలోకి తీసుకువెళ్లి అక్కడ నడి రాత్రి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి పరారయ్యారు.
రెండు గంటల పాటు లారీ డ్రైవర్ మేనేజర్ తో పాటు యజమానిని ముప్పు తిప్పలు పెట్టారు. డ్రైవర్ ఫోన్ గుంజుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి లారీ యజమాని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఎందుకు వాహనాన్ని నిలిపారు ఎందుకు సీజ్ చేస్తున్నారో అర్థమయ్యేలోపే డబ్బులు లాక్కుని అక్కడి నుండి పరారయ్యారనీ బాధితులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు యజమాని తదితరుల సహాయంతో టిప్పర్ వాహనాన్ని కనుగొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారికి సంబంధించిన రెండు బైక్ వాహనాలను రోడ్డుపై ఉన్నప్పుడు వాటిని ఫోటోలు తీశారు. ఈ బైకులు చెట్ల మధ్య పెట్టి వెళ్లిపోయారు. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు ఎన్ని వాహనాలను ఇలా అడ్డగోలుగా అటకాయించి రిపోర్టర్ల పేరిట డిపార్ట్మెంట్ పేరిట తరచూ వసూళ్లకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అదేవిధంగా డబ్బుల కోసం బెదిరించిన ఆడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయి..
👉దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు* *షాద్ నగర్ పట్టణ సీఐ సీతారాం వెల్లడి*
రిపోర్టర్లు మంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు… పట్టణ సిఐ కె సీతారాం తెలిపారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్