⭐ఫస్ట్ టైం ట్రంప్ భయపడ్డాడా!!!..వెనక్కి తగ్గాడా?…👉 *కీచక అర్చకుడు….* మచిలీపట్నం…👉 కందుకూరు, తాడిపత్రి లో ముస్లిం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ* .. .👉ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పై మాజీమంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు…👉 కచ్చితంగా మాకంటూ ఒకరోజు వస్తుంది. వచ్చిన రోజు మేమంటే ఏంటో చూపిస్తాం.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి…👉ఘోరం.. ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం* ..👉మేడ్చల్ జిల్లాలో సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య*..👉హైదరాబాద్‌లో కల్తీ పనీర్ రాకెట్ బస్టు – 6 మంది అరెస్ట్…

⭐⭐ఫస్ట్ టైం ట్రంప్ భయపడ్డాడా!!!..వెనక్కి తగ్గాడా?🤨 మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చడం గమనార్హం. ఆయన మాటల్లో మునుపటి దూకుడు కంటే పరిస్థితులను చక్కదిద్దే “రాజనీతిక వ్యూహం” ఎక్కువగా కనిపిస్తోంది.

** ట్రంప్ వెనక్కి తగ్గాడా? లేక ఇది వ్యూహాత్మక విరామమా? సాధారణంగా దాడుల విషయంలో చాలా కఠినంగా ఉండే ట్రంప్, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరిగిన వెంటనే “అమెరికాకు దీనితో సంబంధం లేదు” అని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ తన కోపంతో ఈ దాడి చేసిందని, అమెరికాకు గానీ, ఖతర్‌కు గానీ ముందస్తు సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది ట్రంప్ భయపడి వెనక్కి తగ్గడం అని కొందరు విమర్శిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ‘బ్యాలెన్సింగ్ యాక్ట్’ అర్థమవుతుంది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభంపై భయం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనేది ఇరాన్ , ఖతర్ దేశాలు ఉమ్మడిగా పంచుకునే అతిపెద్ద సహజ వాయువు నిధి. ఒకవేళ ఇరాన్ ప్రతీకారంగా ఖతర్‌పై దాడులు చేస్తే, ప్రపంచ గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, అలాగే ప్రపంచ దేశాల ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే “ఇజ్రాయెల్ ఇకపై అక్కడ దాడులు చేయదు” అని ఇరాన్‌కు భరోసా ఇవ్వడం ద్వారా ట్రంప్ తక్షణ ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నించారు. ఖతర్ – అమెరికా సంబంధాలు… ఖతర్ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌లో ఖతర్‌కు వాటా ఉండటంతో ఇరాన్‌పై దాడులు జరిగితే ఖతర్ కూడా నష్టపోతుంది. తన మిత్రదేశాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇరాన్ ప్రతీకారం తీర్చుకోకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ఈ ‘నో-టాక్’ హామీని అస్త్రంగా వాడారు. హెచ్చరికతో కూడిన శాంతి మంత్రం ట్రంప్ కేవలం హామీ ఇచ్చి వదిలేయలేదు, తనదైన శైలిలో హెచ్చరికను కూడా జోడించారు. “ఒకవేళ ఇరాన్ గనుక ఖతర్‌పై దాడులకు దిగితే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌ను అమెరికా పూర్తిగా ‘ధ్వంసం’ చేస్తుంది” అని అల్టిమేటం జారీ చేశారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులను ఆపుతామని చెబుతూనే, మరోవైపు ఇరాన్ తన పరిధి దాటితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. గ్యాస్ ఫీల్డ్ గనుక ధ్వంసమైతే ఇరాన్ ఆర్థికంగా దశాబ్దాల వెనక్కి పోతుంది. ఈ భయాన్ని ఇరాన్ పాలకుల్లో కలిగించడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశం.
* భయం కాదు, బాధ్యత! ట్రంప్ ఇరాన్ జనరల్ సులేమానీని హతమార్చినప్పుడు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు, ప్రపంచం మరో పెద్ద యుద్ధాన్ని భరించలేని స్థితిలో ఉంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల మధ్య మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను “వ్యూహాత్మక వెనకడుగు” గా చూడాలి. అంటే యుద్ధాన్ని పూర్తిగా ఆపడం కంటే, అది తన నియంత్రణలో ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్‌ను దెబ్బకొట్టడం కంటే, ఆ దేశాన్ని ఆర్థికంగా లొంగదీసుకోవడమే మేలని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పడం, ఆయనలో వచ్చిన మార్పు కంటే అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి పన్నిన పకడ్బందీ ప్లాన్ లాగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఉద్రిక్తతలను చల్లబరిచినప్పటికీ, ఇరాన్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ నిజంగానే ట్రంప్ మాట విని దాడులు ఆపుతుందా? లేక ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా ఈ సంక్షోభంలో తాను ‘కీలక మధ్యవర్తి’ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు.
👉 *కీచక అర్చకుడు….* మచిలీపట్నం:
ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక యువతి అనారోగ్యం తో ఉంది. ఆ యువతికి నీరసం, వికారంగా ఉన్న పెద్దగా పట్టించుకోలేదు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షల నిర్వహించి ఆ యువతిని గర్భవతిగా నిర్ధారించారు. యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి, పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో తల్లిదండ్రులు బాధపడుతూ ఆ యువతని నిలదీశారు. యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
మచిలీపట్నం లక్ష్మణాపురం దగ్గరలో ఉన్న రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు రామాలయంలో పూజలు చేస్తూ దేవుని స్మరిస్తూ ఉంటాడు. భక్తులు అందరూ ఆ పూజారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు కానీ ఆయనలో ఉన్న కీచక బుద్ధిని ఎవ్వరు గమనించలేదు. భక్తిశ్రద్ధలతో ఉండాల్సిన అర్చకుడు బరితెగించాడు. అర్చకుడి నీచపు బుద్ధి అర్చక వృత్తికే కళంకం తెచ్చింది. 45 ఏళ్ల అర్చకుడు, తన భార్య ,పిల్లలతో మచిలీపట్నం నిజాంపేట లో ఉంటున్నాడు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి అర్చకుని కుటుంబంతో సన్నిహితంగా ఉంటుంది. అర్చకుడు భార్య ఆ యువతిని తన కుటుంబంలో ఒకరిగా, ఇంటి మనిషిగా చూసుకుంటుంది. కానీ అర్చకుడు మాత్రం వక్రబుద్ధితోనే చూశాడు. దీనిని భార్య ఏమాత్రం గ్రహించలేదు. అర్చకుడు ఆ యువతి ఒంటరిగా ఉన్న సమయం చూసి లైంగికంగా వేధించటం మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతని బలవంతం పెట్టేవాడు. అర్చకుని కామ కోరికను యువతి ఒప్పుకోకపోవడంతో యువతని బెదిరించి వశపరచుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే యువతి అంతు చూస్తానన్నాడు. ప్రతిరోజు రామాలయంలో దేవునికి పూజలు చేసి పాపానికి పాల్పడుతున్న ఆ పూజారి ఆటకు దేవుడు ముగింపు పలికాడు. అర్చకుడు యువతితో శారీరక వాంఛ తీర్చుకొని గర్భం దాల్చడం బయటపడింది. దీనితో తల్లిదండ్రులు అర్చకుడు పై మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేసిన పోలీసులు కీచక అర్చకుడు పై ఫోక్సో కేసు నమోదు చేశారు.
👉ఎం.ఆర్ మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ*
*షేక్ షహేన్షా సహకారంతో 12 రకాల వస్తువులను ఒక కిట్టు పేదలకు పంపిణీ*
*యం.ఆర్.హ్యూమన్ రైట్స్. కందుకూరు డివిజన్ కమిటీ కి ధన్యవాదములు*
*కందుకూరు డివిజన్* ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు టౌన్ లో ఎం ఆర్ మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముస్లిం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు షేక్ షహేన్షా సహకారంతో 12 రకాల వస్తువులను ఒక కిట్టుగా తయారుచేసి 15 కుటుంబాలకు అందజేశారు. *యం.ఆర్.మానవ హక్కుల & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి.మల్లికార్జున రెడ్డి, జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య* అనుమతితో ఈ కార్యక్రమం కందుకూరు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అయిన షేక్ సలాం ఇంటి వద్ద జరిగినది. ఈ సందర్భంగా కందుకూరు డివిజన్ ప్రెసిడెంట్ అయినా ఎస్ డి గౌస్ బాషా మాట్లాడుతూ పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేయుటకు ముందుకు వచ్చిన షేక్ షాహిన్షా కు ధన్యవాదములు తెలుపుతూ వారికి వారి కుటుంబానికి దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని ఇంకా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ ఇంకా ఎవరైనా పేదలకు సహాయం చేయదలచిన వారు ముందుకు వస్తే మా అసోసియేషన్ తరపున మేము సహకరించడానికి ముందుంటామని తెలియజేయడం జరిగినది ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ సభ్యులైన మనోహర్ ఆర్ మాధవి మరియు షేక్ మౌలాభి పాల్గొన్నారు.
⭐⭐ఎంఎల్ఏ జె సి అష్మిత్ రెడ్డి,జెసి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో టైలర్స్ కాలనీలో 2వేల కుటుంబాలకు పండుగ అవసరాల పంపిణీ.*
తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు హజీ బాషా ( టాటా హజీ) ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకుని 2వేల కుటుంబాలకు పండుగ అవసరాల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బియ్యం, బెల్లం, కందిపప్పు, నెయ్యి, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు టాటా హాజీ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు రజాక్, వక్ఫ్ బోర్డ్ సెక్రెటరీ ఫారూఖ్ (బియ్యం ఫారూఖ్) పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా, జాన్సన్, కొండల్ సీనా, మౌలా షఫీ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక నాయకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పండుగ సమయంలో అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
👉 నూరుల్ ఇస్లామిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తాడిపత్రి ప్రభుత్వ ఖాజీ సయ్యద్ హయాత్ భాషా ఖాదిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరుల్ ఇస్లామిక్ అరబిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అభివృద్ధిపై కీలక వివరాలు వెల్లడించారు.మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్కూల్ అభివృద్ధికి అందిస్తున్న సహాయాన్ని అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించగా, ఇటీవల 16వ తేదీన జరిగిన ఫాతియా కార్యక్రమంలో మరింత సహాయం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మొత్తం రూ.40 లక్షల వరకు సహాయం చేస్తానని తెలిపారు. అందులో స్వయంగా రూ.10 లక్షలు అందజేస్తానని, మిగిలిన నిధులు సమీకరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే మిగతా రూ.30 లక్షలను కూడా తనవంతుగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అదేవిధంగా భవిష్యత్తులో మున్సిపల్ ప్లానింగ్ పరంగా కూడా పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అందిస్తున్న ఈ సహాయానికి నూరుల్ ఇస్లామిక్ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్టాంప్ రైటర్ రఫీ, రోషన్ తదితరులు పాల్గొన్నారు.
⭐⭐ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఉగాది పర్వదినం తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని తెలిపారు. పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే సంవత్సరంలో జరిగే గ్రహగతులు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులు, ప్రజల ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలుగుతుందని అన్నారు. రైతులు దేశానికి వెన్నెముకలుగా ఉన్నారని పేర్కొంటూ, ఈ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ప్రజలందరూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం మరియు గిద్దలూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హాజరైన వారికి పంచాంగ పుస్తకాలు , ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.
👉ఘోరం.. ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం*
అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న సభ్య సమాజం తల దించుకునే ఘటన😱😱😱
కుటుంబ సభ్యులు విషయాన్ని గ్రహించేలోపే.. అక్కడి నుంచి నిందితుడి పరార్…
పేరెంట్స్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్
పోక్సో చట్టం కింద కేసు నమోదు.. నిందితుడ్ని కఠిన శిక్ష తప్పదన్న పోలీసులు.
👉మేడ్చల్ జిల్లాలో సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య*
మేడిపల్లి పీఎస్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని
నారపల్లిలోని ప్రైవేట్ హాస్టల్‌లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నందిని..హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు…
నందిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం..ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
👉హైదరాబాద్‌లో కల్తీ పనీర్ రాకెట్ బస్టు – 6 మంది అరెస్ట్…సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు..
మొత్తం 6 హోల్‌సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయ‌గా బ‌య‌ట‌ప‌డ్డ క‌ల్తీ పనీర్, క‌ల్తీ ఖోవా, క‌ల్తీ క్రీమ్, క‌ల్తీ నెయ్యి
మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం
నాసిరకం పనీర్‌ను కిలోకు సుమారు ₹280కి విక్రయం
హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా..
👉తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన*
పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
ఏపీలో కోనసీమ, ప.గో., ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాలకు వర్ష సూచన
అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక.
హైదరాబాద్‌తో సహా తెలంగాణకు 3 రోజులు వర్షసూచన
30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.
👉నెల్లూరు సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి*పిన్నెలికి ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు
98 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.
👉 కచ్చితంగా మాకంటూ ఒకరోజు వస్తుంది.
వచ్చిన రోజు మేమంటే ఏంటో చూపిస్తాం..
ఈరోజుతో 99 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టారు..
మాకు ఇబ్బంది పెట్టిన దాని కన్నా మీరు ఎక్కువ మానసిక శోభ అనుభవిస్తారు.- పిన్నెల్లి
👉హైదరాబాద్‌లో దారుణ ఘటన… అక్కను తమ్ముడే హ*త్య చేసిన షాకింగ్ కేసు*
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సొంత అక్క అని కూడా చూడకుండా తమ్ముడే కిరాతకంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
బాటసింగారానికి చెందిన నీల అనే మహిళ భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ప్రవర్తనపై అనుమానాలతో తమ్ముడు పప్పు రామ్ తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో… చివరికి దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. గత నెల 28న నీలను హ*త్య చేసి… మృతదేహాన్ని ముక్కలుగా చంపి… సమీపంలోని మజీద్‌పురా చెరువులో పడేశాడు..ఇక్కడితో ఆగలేదు… ఏమీ తెలియనట్టు నటిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి… “అక్క కనిపించడం లేదు” అంటూ డ్రామా ఆడాడు.
* విచారణలో పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అసలు నిజం బయటపడింది.నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా చెరువులో గాలింపు జరిపి… నీల శరీర భాగాలను పోలీసులు వెలికితీశారు.
👉 ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
ఈ ఘటన… కుటుంబ బంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో చూపిస్తోంది. చిన్న గొడవలు… ఇంత పెద్ద విషాదాలకు దారి తీస్తున్నాయి
👉విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పై మాజీమంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు….* ఎంపీ అంటే మట్టి పేకాట అని వాళ్ళ ఎమ్మెల్యే నే చెప్పాడు….ఆ స్థాయికి ఎంపీ అవినీతి చేరింది…స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అంటే అర్ధాన్ని మార్చేశారు….కేవలం దోచుకోవడానికి మాత్రమే ప్రజా ప్రతినిధులు గా మారారు….వారికి ప్రజా సమస్యలు అంటే అర్థం తెలియదు…..రైతు సమస్యలు వాళ్ళ కంటికి కనబడవు…నిన్న వచ్చిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది…_స్థానికంగా ఒక ప్రజా ప్రతినిధి అయిన వచ్చి రైతుల కష్టాలు చూశాడా…..కొటికలపూడి గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన పంట పనులు పరిశీలించిన జోగి రమేష్_

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్