👉ఫామ్‌హౌస్ వివాదం: ఎంపీ పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు.. 👉షర్మిల షాకింగ్ కామెంట్స్.. బాబాయ్ హత్యకు అసలు కారణం ఇదే.. 👉ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!…👉అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనం.!…👉తాడిపత్రిలో నవవధువు ఆత్మహత్య*… 👉ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి*

👉ఫామ్‌హౌస్ వివాదం: ఎంపీ పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు.. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?”*
అమరావతి: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఫామ్‌హౌస్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని నమ్మి అవకాశమిస్తే.. ఇలాంటి పనులతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
*పార్టీ క్రమశిక్షణే ముఖ్యం*
మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా? గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నాను. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు” అని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం.
*అసలేం జరిగింది?*
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఒక పార్టీపై పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు నిందితులకు పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల ఫలితాలు: మొత్తం 11 మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. వీరిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఎంపీ వివరణ: ఈ ఘటనపై ఎంపీ స్పందిస్తూ.. తాను డిన్నర్ పార్టీకి హాజరైన మాట వాస్తవమేనని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు.
*పార్టీలో చర్చాంశనీయం*
యువ నాయకుడిగా గుర్తింపు పొందిన పుట్టా మహేష్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం టీడీపీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యక్తిగత తప్పిదాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
👉షర్మిల షాకింగ్ కామెంట్స్.. బాబాయ్ హత్యకు అసలు కారణం ఇదే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందని షర్మిల ఆరోపించారు. కడప ఎంపీ పదవికి అవినాశ్ రెడ్డి సరైన వ్యక్తి కాదని బాబాయ్ వివేకానందరెడ్డి తనతో స్వయంగా చెప్పారని షర్మిల వివరించారు. బాబాయ్ ఎంత చెప్పినా, అవినాశ్ కే జగన్ టికెట్ ఇచ్చారన్నారు. బాబాయ్ బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డేనని ఎంపీ అవినాశ్ భావించారని షర్మిల వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా షర్మిల విశాఖ జిల్లాలో పర్యటించారు. వివేకా హత్యపై పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి ఏడో వర్థంతి రెండు రోజుల క్రితమే ముగిసింది. అయినా ఈ హత్య కేసుపై పెద్దగా పురోగతి లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు సంస్థ సరిగా వ్యవహరించలేదని, ఇంకా కొందరి పాత్రపై అనుమానాలను నివృత్తి చేయలేదని వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగించమని ఆమె చేస్తున్న న్యాయపోరాటం విఫలయత్నమే అవుతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుపై షర్మిల మరోసారి నోరు విప్పడం సంచలనంగా మారింది. వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, తన సోదరి వైఎస్ సునీత చేస్తున్న పోరాటానికి తొలి నుంచి షర్మిల మద్దతు చెబుతున్నారు. ఈ విషయమై పలుమార్లు బహిరంగంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి టార్గెట్ గా షర్మిల తరచూ చేస్తున్న విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. వివేకాను హత్య చేసిన వారిని తాను అన్నా అని పిలిచిన వారే కాపాడుతున్నారని గతంలో షర్మిల ఆరోపించారు. పరోక్షంగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు. * ఇక తాజాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పేరు ప్రస్తావిస్తూ షర్మిల చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. కడప ఎంపీ టికెట్ కోసమే హత్య జరిగిందంటూ షర్మిల వ్యాఖ్యానించడంతో వైసీపీని మాజీ సీఎం జగన్ ను మరోమారు ఈ వ్యవహారంలోకి షర్మిల లాగారాని చెబుతున్నారు. హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారని, సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని ఆమె గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. తన చిన్నాన్న కుమార్తె సునీతారెడ్డి పోరాటానికి మద్దతుగా ఉంటానని, న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత సునీత ఆందోళన వ్యక్తం చేయడం, ఇప్పుడు షర్మిల కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నట్లు మాట్లాడటం రాజకీయ ప్రాధాన్యాంశంగా చెబుతున్నారు. నిందితులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఆలోచనతో షర్మిల ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
👉ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!

తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార డీఎంకేను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా, ఇప్పుడు నటి త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం.. డీఎంకే కూటమికి 5 శాతం ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ, విజయ్ పార్టీ దాదాపు 12 శాతం ఓట్లను చీల్చే అవకాశం ఉందని తేలింది. ఈ ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు కాబట్టి, విజయ్‌ను తమ వైపు తిప్పుకోవాలని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ, ఆయన తాజా చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ చిక్కులు, రూ.120 కోట్ల ఓటీటీ ఒప్పందం రద్దు కావడం వంటివి ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విజయ్‌కు అత్యంత సన్నిహితురాలైన త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత వారం ఆమె ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, ఆ తర్వాతే విజయ్‌కు సంబంధించిన కేసుల్లో కదలిక వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటకు రావడం, ఆగిపోయిన సినిమాకు సెన్సార్ బోర్డు పునఃపరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక త్రిష మంత్రాంగం ఉందనే వాదన వినిపిస్తోంది. కేవలం ఎన్డీఏకే కాకుండా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి కుమారుడితోనూ త్రిష సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.
👉కరీంనగర్ టూ టౌన్ ఎస్సై భార్య ఆత్మహత్య*😱😱😱
తెలంగాణ : కరీంనగర్లో విషాదం చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మంగళవారం గన్నేరు పప్పు దంచుకుని తాగడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ దివ్య చనిపోయింది. మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనం.!!!
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.మృతులను తండ్రి రాజశేఖర్ (54), కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా అల్లుడు ప్రవీణ్ వారిద్దరినీ చంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
👉ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి*
ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరోవైపు దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు భవనంపై నుంచి దూకి తప్పించుకున్నారు.
👉తాడిపత్రిలో నవవధువు ఆత్మహత్య*
తాడిపత్రి పట్టణం జీవీపీ కాలనీలో లక్ష్మీ ప్రసన్న (30) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆమెకు గత నెలలో కర్ణాటకకు చెందని విజయ్ వివాహమైంది. రేపు అత్తగారింటికి వెళ్లాల్సి ఉన్న క్రమంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. గతంలోనూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. తండ్రి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్