👉🏻సరదా కోసం యుద్ధం చేస్తావా? ఓరీ నీ ట్రంప్.. 👉ట్రంప్ మాటకు నో.. తోలుబొమ్మలం కాదని తేల్చేసిన మిత్రదేశాలు…👉పోలీస్ సేవలో విశిష్టత, కళాసేవలో నిస్వార్థత మరియు సమాజానికి అంకితభావం కలిగిన వ్యక్తి పాటిల్ రాజశేఖర్..ఎస్పీ పి.జగదీష్…⭐తండ్రి సంపాదించిన ఆస్తులపై కొడుకుకు హక్కు ఉండదు.. వారసత్వ ఆస్తులపైనే హక్కు.. హైకోర్టు కీలక తీర్పు !!!… 👉పలు కార్యక్రమాలలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల..

👉🏻సరదా కోసం యుద్ధం చేస్తావా? ఓరీ నీ ట్రంప్.. మామూలోడివి కాదు సామీ!!! సాధారణంగా ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ట్రంప్ గారు మాత్రం యుద్ధాన్ని ఏకంగా “ఎంటర్టైన్మెంట్” కిందకు చేర్చేశారు. అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ అనే పేరు ఒక ‘టెలివిజన్ రియాలిటీ షో’ లాంటిది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఇరాన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు అంతర్జాతీయ రాజకీయాలు అంటే ఒక ‘వీడియో గేమ్’ అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై ఇప్పటికే భారీగా దాడులు చేసి అక్కడి చాలా భాగాన్ని నాశనం చేశామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే కేవలం వినోదం కోసం కూడా మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ తమతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారు పెట్టిన షరతులు సరైనవిగా లేవని ట్రంప్ విమర్శించారు.ఇదే సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నారా అని కూడా ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆ ‘వినోదం’ ఏంటో! సాధారణంగా ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఏకంగా “ఎంటర్టైన్మెంట్” కిందకు చేర్చేశారు. “వినోదం కోసం కూడా దాడులు చేస్తాం” అని ఆయన అన్నారంటే ఆయనకు ప్రపంచ పటం ఒక ‘బోర్డ్ గేమ్’ అని అర్థం చేసుకోవాలి. పాపం.. యుద్ధం అంటే ఏంటో తెలిసిన వాళ్లు ఈ మాట విని షాక్ అవుతుంటే ట్రంప్ మాత్రం రిమోట్ కంట్రోల్ పట్టుకుని దాడులను టీవీలో చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. 👉🏻సుప్రీం లీడర్ బతికే ఉన్నారా? ఇక ఆయన ప్రశ్నల సెన్సే ఏంటో ఎవరికీ అర్థం కాదు. “ఇరాన్ సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నారా?” అని అడగడం వెనుక ఏ వ్యూహం ఉందో ఆయనకే తెలియాలి. ఇది ఒక రకమైన ‘మైండ్ గేమ్’ అనుకోవాలా లేక తనదైన శైలిలో కవ్వించడమా? ఆయనకు ఏది సరదా? ఏది రాజకీయం? అన్నది తెలుసుకోవడం సాధారణ రాజకీయ విశ్లేషకులకు అసాధ్యం.
*యుద్ధమా? వ్యాపారమా? ట్రంప్ దృష్టిలో అంతర్జాతీయ సంబంధాలు అంటే ఒక డీల్. ఇరాన్ ఒప్పందం గురించి మాట్లాడుతూ “మాకు నచ్చినట్లు ఉంటేనే ఓకే.. లేదంటే దాడులే” అనడం చూస్తుంటే, ఆయనకు ‘ప్రపంచ శాంతి’ కంటే ‘పవర్’ ఆడే ఆటలో గెలవడమే ముఖ్యమనిపిస్తోంది. ట్రంప్ పాత కాలం నాటి రాజకీయ నాయకులకు, ఇప్పటి టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కలిపేసిన ఒక కొత్త ‘పొలిటికల్ బ్రాండ్’. ఆయన మాటలు వింటుంటే ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఆందోళన చెందాలో అర్థం కాక ప్రపంచం తల పట్టుకుంటోంది. ఏదేమైనా ఆయనకు యుద్ధం అంటే సరదా కావచ్చు కానీ ఆ సరదా వల్ల ప్రపంచం పడే ఇబ్బందులే అసలైన ‘ట్రాజెడీ’!
👉ట్రంప్ మాటకు నో.. తోలుబొమ్మలం కాదని తేల్చేసిన మిత్రదేశాలు..
నేనేం అనుకుంటే అదే జరుగుతుంది. అగ్రరాజ్య అధినేత హోదాను ఇష్టారాజ్యంగా వాడేసిన డొనాల్డ్ ట్రంప్ కారణంగా.. ఈ రోజున ప్రపంచంలో అస్థిర పరిస్థితులు మాత్రమే.. ఆర్థిక అనిశ్చితికి కారణమైంది. ప్రపంచం కోరుకోని యుద్ధాన్ని ట్రంప్.. ఇజ్రాయెల్ అధినేతల కారణంగా మొదలు కావటం.. యావత్ ప్రపంచం ఏదో రూపంలో కిందా మీదా పడటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. ఇరాన్ అధీనంలో ఉండే హర్మూజ్ జలసంధి వద్దకు మిత్రులు రావాలని..ఇరాన్ సంగతి చూడాలన్నట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు.. మిత్ర దేశాలు ఎవరూ స్పందించని పరిస్థితి. అంతేనా.. తాము హర్మూజ్ జలసంధి వద్దకు రాలేమన్న విషయాన్ని ఆయా దేశాలు స్పష్టం చేశాయి.
ఇరాన్ యుద్దంతో దెబ్బ తిన్న హర్మూజ్ ను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా.. అక్కడ ఇంధన రవాణాను క్రమబద్ధికరించేందుకు యుద్ధనౌకల్ని మోహరించాలని ట్రంప్ ఏడు మిత్ర దేశాల్ని కోరారు. ఇదిలా ఉండగా.. ఆయన పిలుపును ఏడింటిలో రెండు దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్) రిజెక్టు చేశాయి.తాము ఎలాంటి నౌకల్ని పంపమని తేల్చేశాయి. హర్మూజ్ వద్దకు తాము ఎలాంటి నౌకల్ని పంపటం లేదని ఆస్ట్రేలియా వెల్లడించింది. మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్లను పరిగణలోకి తీసుకోమని జపాన్ స్పష్టం చేసింది.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పశ్చిమాసియాలోని చమురుపై ఆధారపడేన దేశాలు హర్మూజ్ ను సేవ్ చేసేందుకు ముందుకు రావాలని ఒత్తిడి చేసినట్లుగా పేర్కొన్నారు.అయితే..ఆఏడు దేశాల వివరాల్ని మాత్రం వెల్లడించలేదు.అయితే.. ట్రంప్ ప్రకటన తర్వాత స్పందించిన దేశాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలైన జాపాన్, ఆస్ట్రేలియాలు యుద్ధ నౌకల్ని పంపే ప్రణాళికలు ఏమీ లేవని స్పష్టం చేయటం ద్వారా.. షాకిచ్చాయని చెప్పాలి.
ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే ఆర్థికంగా.. సైనిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న యూరోపియన దేశాలు.. ఇరాన్ తో నేరుగా ఘర్షణకు దిగేందుకు సిద్ధంగా లేవని చెబుతన్నారు. నాటో కూటమిని ట్రంప్ హెచ్చరించిన వైనాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. నాటో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆయన వార్నింగ్ నాటో దేశాల మీద ఎలాంటి ప్రబావాన్ని చూపలేదు. ఇది అంతర్జాతీయంగా అమెరికా పట్టు తగ్గుతుందన్న దానికి ఒక సంకేతమన్న చర్చ మొదలైంది.గతంలో అమెరికా పిలుపునిస్తే.. స్పందించే దేశాలు ఇప్పుడు తమ సొంత భద్రత.. ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వటం చూస్తే.. ట్రంప్ తరచూ ప్రస్తావించే అమెరికా ఫస్ట్ పాలసీకి దాని మిత్రదేశాలు ఇస్తున్న కౌంటర్ గా తాజా పరిణామాల్ని విశ్లేషిస్తున్నారు
ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించిన జపాన్.. ఆస్ట్రేలియాతో పాటు.. బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాలు కొట్టిపారేశాయి. జలసంధిని తిరిగి తెరవాల్సిన అవసరం ఉందని చెప్పిన బ్రిటన్ ప్రధాని.. తమ మిత్రదేశాలతో కలిసి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లుగా చెప్పారు. చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న చైనా.. అందుకు తగ్గట్లు యుద్ధాన్నివెంటనే ఆపాలని కోరటం గమనార్హం. మొత్తంగా ట్రంప్ పిలుపునిచ్చినంతనే.. అదేపనిగా హడాువుడి చేయకుండా.. తమ దేశ ప్రయోజనాలకు ఎంత మేలు జరుగుతుందన్న అంశానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంశం తాజా ఎపిసోడ్ స్పష్టం చేస్తుందని చెప్పాలి.
⭐తండ్రి సంపాదించిన ఆస్తులపై కొడుకుకు హక్కు ఉండదు.. వారసత్వ ఆస్తులపైనే హక్కు.. హైకోర్టు కీలక తీర్పు !!!
హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఆస్తులు ఎలా వచ్చాయి అనే మూలం ఆధారంగానే కొడుకుకు హక్కులు లభిస్తాయని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. తండ్రికి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితేనే కొడుకుకు పుట్టుకతో వాటిపై హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి అయితే కొడుకుకు ఎలాంటి హక్కు ఉండదని వెల్లడించింది. వారసత్వ ఆస్తి.. తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి అనేది స్పష్టంగా గుర్తించడం ద్వారా ఇలాంటి వివాదాలను నివారించవచ్చని కోర్టు పేర్కొంది.
తండ్రి, వారసత్వ ఆస్తిపై కుమారుడికి ఉండే హక్కుల గురించి.. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక వ్యక్తి తన తండ్రి ఆస్తికి సంబంధించి దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మాత్రమే కుమారుడికి పుట్టుకతో హక్కులు ఉంటాయని తెలిపిన న్యాయస్థానం.. ఒకవేళ ఆ ఆస్తి తండ్రి కష్టార్జితం అయితే దానిపై కుమారుడికి ఎలాంటి హక్కులు ఉండవని వెల్లడించింది. తండ్రి తాను సంపాదించిన ఆస్తిని.. ఎవరికైనా ఇచ్చే వెసులుబాటు ఉంటుందని.. కచ్చితంగా కుమారుడికే ఇవ్వాలని ఎక్కడా లేదని తేల్చి చెప్పింది.
👉పోలీస్ సేవలో విశిష్టత, కళాసేవలో నిస్వార్థత మరియు సమాజానికి అంకితభావం కలిగిన వ్యక్తి పాటిల్ రాజశేఖర్…
* రిటైర్డ్ అయిన కమ్యునికేషన్ విభాగం ఎస్సై పాటిల్ రాజశేఖర్ కు ఎస్పీ చేతుల మీదుగా సన్మానం..
* పోలీసుశాఖకు, సమాజానికి ఆయన చేసిన సేవలకు అధికారుల ప్రశంసలు
అనంతపురం కమ్యూనికేషన్ ఎస్సై పాటిల్ రాజశేఖర్ ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రత్యేక జ్ఞాపికలు, శాలువాలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో సన్మానించారు. కార్యక్రమంలో కమ్యూనికేషన్ విభాగం ఇన్స్పెక్టర్ ఖాదర్ బి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పాటిల్ రాజశేఖర్ ఒక విధంగా కళాకారుడు, మరోవైపు ప్రజల సేవలో ప్రతిష్టాత్మక స్వచ్ఛంద కార్యకర్త. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం మాత్రమే కాదు, ఉరవకొండలో స్థాపించిన “అమ్మ తొలి దైవం” స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూచిపూడి నాట్యం, సంగీత కళాకారులను పశ్చిమంగా తీర్చిదిద్దుతూ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సుమారు రెండు దశాబ్దాల పాటు ప్రజల కోసం కళాసేవలో నిస్వార్థంగా సమర్పణ చూపారు.
ఎస్పీ , “రాజశేఖర్ మంచి గాయకుడు, సమర్థ స్వచ్ఛంద సేవకుడు, మరియు ప్రజలకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి” అని అభినందించారు.
👉 మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండ్ సెంటర్ లో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని సోమవారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆల్ అలీ అమానత్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించండి – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి …
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం పట్టణం ఏర్పాటు చేయటంతో ట్రాఫిక్ రద్దీ పట్టణంలో విపరీతంగా పెరిగిందని పోలీస్ శాఖ వారి రిక్వెస్ట్ మేరకు 20 లక్షల రూపాయలతో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు.
వాహనదారులు తగు జాగ్రత్తలతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఫాలో కావాలని క్రాస్ లైన్ వంటి పనులు చేయవద్దని తద్వారా పట్టణంలో ట్రాఫిక్కును నియంత్రిద్దామని వాహనదారులను కోరారు.
⭐ ముస్లిం సోదరులు మా కుటుంబ సభ్యులు- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని కంభం బస్టాండ్ లో ముస్లిం సోదరులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చిన్నప్పుడు నుంచి ముస్లిం సోదరులతోనే పెరిగానని తన ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులు తన సొంత కుటుంబ సభ్యులు లాగా చూస్తానని అన్నారు. ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించుట అత్యంత హర్షణీయమని త్వరలోనే ఈ షాదీ ఖానాను పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందుబాటులో తెస్తానని హామీ ఇచ్చారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్