👉టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‎పై సీఎం చంద్రబాబు సీరియస్…⭐ప్రపంచ దేశాలకు ట్రంప్‌ తాత హుకమ్ జారీ తో పాటు విజ్ఞప్తి*..👉ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్…👉డ్రగ్స్ పరీక్షలు మన నుండే ప్రారంభిద్దాం: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి…👉 బిర్యానీ, పులావ్ షాపుల మీద ఆహార భద్రతాధికారుల తనిఖీలు… 👉సేవలోనే కాదు.. విరాళాల్లోనూ ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆదర్శం: నారా భువనేశ్వరి ప్రశంసలు*…👉ప్రజా ఉద్యమాలకు సహకరించండి.. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు…👉షాకింగ్ మర్డర్ కేసు! నాన్నను అమ్మ చంపేసిందని కూతురు బయటపెట్టిన రహస్యం.

👉 టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‎పై సీఎం చంద్రబాబు సీరియస్..డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం..
పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్‎గా తీసుకున్న సీఎం…అమరావతి

ఘటనపై పుట్టా మహేష్‎ను వివరణ కోరుతూ..నోటీసులు ఇవ్వాలని పల్లా శ్రీనివాస్‎కు సీఎం చంద్రబాబు ఆదేశం…*ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‎కు స్టేషన్ బెయిల్ మంజూరు*రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు..పుట్టా మహేష్ యాదవ్‎తో పాటు ప్రియాంక రెడ్దికి స్టేషన్ బెయిల్
⭐⭐ప్రపంచ దేశాలకు ట్రంప్‌ తాత హుకమ్ జారీ తో పాటు విజ్ఞప్తి*..!*హార్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని కోరిన ట్రంప్.**చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు విజ్ఞప్తి.*పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
*హార్మూజ్‌ను త్వరలో తెరిపిస్తాం.**అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటాం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్*..
👉ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్…*బిఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ* .. *ఫామ్‌హౌస్ వద్ద కాల్పులు*
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో జరిగిన ఫామ్ హౌస్ పార్టీపై పోలీసులు నిర్వహించిన సోదాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే పోలీసులపై కాల్పులు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 11 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం బయటపడటంతో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి…
మొయినాబాద్ ప్రాంతంలోని పంజుగుల రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో లగ్జరీ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి మద్యం సేవిస్తున్నట్లు అధికారులు దర్యాప్తులో తేలింది. పార్టీలో పాల్గొన్న వారిలో మొత్తం 10 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నయీముద్దీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు ఆధారాలు లభించాయి.
*పోలీసులపై కాల్పుల ఆరోపణ..
ఈ ఘటనలో మరో సంచలన అంశం బయటపడింది. పోలీసులు ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లిన సమయంలో కాల్పులు జరిగాయని సబ్‌ఇన్‌స్పెక్టర్ నయీముద్దీన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు ఫామ్ హౌస్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా జర్మనీకి చెందిన 32వ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ అంశం కేసును మరింత తీవ్రంగా మార్చింది.
*డ్రగ్స్ స్వాధీనం..
పార్టీలో పాల్గొన్న వ్యక్తుల నుంచి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ బరువు 0.26 గ్రాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన ఓ అడ్వకేట్ ఈ డ్రగ్స్ తీసుకువచ్చారు. అతడే పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
*డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్..పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)లో పలువురు నిందితుల పేర్లను చేర్చారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
*విదేశీ మద్యం స్వాధీనం..పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 48 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల బాటిళ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి వీటిని వినియోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
*ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు..
డ్రగ్స్ స్వాధీనం కావడం, డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం వంటి అంశాల కారణంగా పోలీసులు NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద డ్రగ్స్ వినియోగం, నిల్వ, సరఫరా వంటి అంశాలకు కఠిన శిక్షలు విధించనున్నారు.
*డ్రగ్స్‌ సరఫరాపై ఆరా..
ఈ కేసులో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు, మరెవరైనా ఇందులో భాగస్వాములు ఉన్నారా అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీ నిర్వహణ, ఆయుధం వినియోగం, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలన్నింటినీ పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.. KP
👉 బిర్యానీ, పులావ్ షాపుల మీద ఆహార భద్రతాధికారుల తనిఖీలు..విశాఖ పట్నం,
నగరంలోని జీవీఎంసీ కార్యాలయం అవుట్ గేట్ కు ఎదురుగా ఉన్న 4 ఎఎం బిర్యానీ, కాకినాడవారి కోడి పులావ్, ఫుడీ మామ బిర్యానీ, స్పైసి బిర్యానీ పాయింట్స్ లో ఆహార భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి శ్యాంపిల్స్ ను సేకరించారు. ఆయా షాపుల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించామని విశాఖ నగర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. అక్కడ పరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయాలని ఆయా షాపుల యజమానులకు నోటీస్ లను జారీచేశామన్నారు. ఫుడ్ హ్యాండలర్స్ మాస్క్, కాప్, ఏప్రాన్ తదితరమైనవి ధరించాలని, వారికి ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కరెక్ట్ గా ఉండాలని, ఫ్లోర్స్ అండ్ వాల్స్ సీలింగ్, గార్బేజ్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, వేపుళ్లు, వాటికి వాడే నూనె తదితర 14 రకాల శ్యాంపిల్స్ సేకరించి వాటి అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ ల్యాబ్ కి పంపామన్నారు. వాటి రిపోర్ట్ ల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఎఐ యాక్ట్ ప్రకారం సంబంధిత వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారులు జి.వి.అప్పారావు, సతీష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
👉సేవలోనే కాదు.. విరాళాల్లోనూ ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆదర్శం: నారా భువనేశ్వరి ప్రశంసలు*

చిలకలూరిపేట: సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ, పేద ప్రజల పాలిట ఆశాదీపంగా నిలుస్తున్న ‘ప్రత్తిపాటి ఫౌండేషన్’ మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు, మెగా జాబ్ మేళాల ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ ఫౌండేషన్ సేవలను సాక్షాత్తూ నారా భువనేశ్వరి (NTR ట్రస్ట్) కొనియాడారు.
సమాజ సేవలో కేవలం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, విరాళాలు అందించడంలోనూ ప్రత్తిపాటి ఫౌండేషన్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఫౌండేషన్ భారీ విరాళాన్ని అందజేసింది.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి ప్రత్తిపాటి శరత్ ను నారా భువనేశ్వరి గారు ప్రత్యేకంగా అభినందించి,సత్కరించడం విశేషం. నిరుద్యోగులకు ఉపాధి,రోగులకు ఉచిత వైద్యం అందిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రత్తిపాటి ఫౌండేషన్ ప్రస్థానంలో ఈ గుర్తింపు మరో మైలురాయిగా నిలిచిపోనుంది.
👉సీఎం రేవంత్‌ రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వినతి
డ్రగ్స్ పరీక్షలు మన నుండే ప్రారంభిద్దాం: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి…నేనే మొదట రక్త నమూనాలు ఇస్తా: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి…డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అనిరుధ్‌ రెడ్డి
ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలి…భయం లేకుండా పోలీసులపైనే కాల్పులా..?: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి
👉​ప్రజా ఉద్యమాలకు సహకరించండి… సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు
ప్రజా ఉద్యమాల బలోపేతం కోసం సీపీఐ చేపట్టిన ఇంటింటికి విరాళాల సేకరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు కోరారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, సాదిక్ నగర్ తదితర ప్రాంతాలలో ‘గడపగడపకు సీపీఐ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్న ‘ప్రజానిధి’ సేకరణ కార్యక్రమం ఆదివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యంతో నాయకులు పట్టణంలోని గడపగడపకూ, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా రంగనాయుడు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు నిర్వహిస్తోందని, నిరుపేదల పక్షాన నిలిచే సీపీఐని ప్రజలు ఆదరించాలని కోరారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.​అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైఫల్యాలపై మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించేందుకే ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నామని, ఈ ప్రజానిధి సేకరణకు పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.ఈ నిధుల ద్వారా పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
​కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు పి. మురళీధర్, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. హరినాథ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, సుశీలమ్మ, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

👉 ఇది షాకింగ్ మర్డర్ కేసు! నాన్నను అమ్మ చంపేసిందని కూతురు బయటపెట్టిన రహస్యం.*
*భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన భార్య – ప్రియుడి సహాయంతో దిండు పెట్టి చంపి మద్యం ఫలితంగా చూపించిన ఖతిజా* .
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లలో దారుణ హత్య కేసు*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో సెంట్రింగ్ కూలీగా పని చేస్తున్న ఎస్‌డీ. జాఫర్‌ను అతని స్వస్థలం చింతలపూడిలోనే భార్య ఖతిజా హత్య చేసింది. 13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతిజాను వివాహం చేసుకున్న జాఫర్, పదేళ్లు తిప్పనపల్లిలో నివసించి గత మూడేళ్లుగా చింతలపూడిలో ఉన్నాడు.
వీరి కుమారుడు హాస్టల్‌లో చదువుతున్నాడు. ఎనిమిదేళ్ల కూతురు తల్లిదండ్రులతోనే ఉండేది. చింతలపూడి వాసి మీరాతో ఖతిజాకు వివాహేతర సంబంధం ఏర్పడటంతో దంపతుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఆరు నెలల క్రితం తిప్పనపల్లికి తిరిగి వచ్చినప్పటికీ, ఖతిజా మీరాతో రహస్యంగా మాట్లాడుతూ ఉండటం జాఫర్‌కు తెలిసి, గత పది రోజులుగా ఆమెతో తీవ్ర గొడవలు జరిగాయి.
*అక్రమ సంబంధానికి అడ్డుకట్టిన భర్తను హత్య*
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించాలని నిర్ణయించుకున్న ఖతిజా, ప్రియుడి సహాయంతో జాఫర్ నిద్రపోతున్నప్పుడు మొహంపై దిండు పెట్టి హత్య చేసింది. “మద్యం సేవించి కింద పడి గాయపడ్డాడు, తెల్లవారుజామున చనిపోయాడు” అని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించింది.అంత్యక్రియల తర్వాత కూతురితో మాట్లాడుతుండగా, “నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి కలిసి చంపేశారు” అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు ఖతిజాను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*పోలీసుల దర్యాప్తు.. నిందితురాలి అరెస్టు*
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చింతలపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించి ఖతిజాను అరెస్టు చేశారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్