👉ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం!!!…👉 ఎన్‌టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా వెంకట్ వకుల ఫౌండేషన్ చైర్మన్ వెంకట నరసనాయుడు కు అభినందన – సన్మానం …👉 ఇజ్రాయెల్‌పై నిమిషాల్లో 1,430 మిస్సైళ్లతో ఇరాన్ దాడి.. భీకర యుద్ధం… 👉అయిదేళ్ళ పాటు ఇరాన్ యుద్ధం? – ప్రపంచం ఏమైపోవాలి ?

👉ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు*.
130 మంది లోక్‌సభ ఎంపీలు…63 మంది రాజ్యసభ ఎంపీలు..నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసుకు కనీసం
100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు
50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి..
అంటే అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది ఎంపీలు ఈ నోటీసుకు మద్దతు ఇచ్చారు..భారత చరిత్రలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి.
👉 ఎన్‌టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా వెంకట్ వకుల ఫౌండేషన్ చైర్మన్ వెంకట నరస నాయుడు అభినందన – సన్మానం
ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా హైదేరాబద్ లో ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ప్రముఖ సామాజిక సేవకుడు వెంకట్ వకుల ఫౌండేషన్ చైర్మన్ వెంకట నరస నాయుడు ఆలం సమాజ సేవలో ఆయన చూపుతున్న విశిష్ట కృషికి అభినందించి సన్మానించారు.
స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల ప్రోత్సాహం, పేద మరియు వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం, కోవిడ్ సమయంలో చేసిన సేవా కార్యక్రమాలు, అలాగే పేదల ఉన్నతి కోసం నిరంతరం చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను సత్కరించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, సమాజ సేవను ధ్యేయంగా తీసుకుని పనిచేస్తున్న వెంకట నరస నాయుడు ఆలం వంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శమని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సహాయం చేయడం, రక్తదానంపై అవగాహన పెంచడం వంటికార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు.
సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే వ్యక్తులను ప్రోత్సహించడం ఎన్టీఆర్ ట్రస్ట్ ముఖ్య లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్పర్సన్ రాజేందర్ కుమార ఐపీఎస్ సీఈఓ అడసుమలి గోపి తదితరులు పాల్గొన్నారు.
👉 ఇజ్రాయెల్‌పై నిమిషాల్లో 1,430 మిస్సైళ్లతో ఇరాన్ దాడి.. భీకర యుద్ధం ..

ఇజ్రాయెల్‌పై ఇరాన్ అత్యంత భారీ స్థాయిలో మిస్సైల్ దాడులకు దిగడంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. నిమిషాల వ్యవధిలోనే వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇరాన్ యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చింది. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బహిరంగ ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ అత్యంత భారీ స్థాయిలో మిస్సైల్ దాడులకు దిగడంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. నిమిషాల వ్యవధిలోనే వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇరాన్ యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చింది.
⭐భయంకరమైన దాడి ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవా సంస్థ ‘మాగెన్ డేవిడ్ అడోమ్’ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇరాన్ సుమారు 1,430 క్షిపణులను ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఈలట్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని జరిగిన ఈ దాడులు.. ఆ ప్రాంత భద్రతా వ్యవస్థను పరీక్షించాయి. ఈలట్ నగరంలోని నివాస ప్రాంతాలు, కీలక మౌలిక వసతులపై క్షిపణులు పడటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పలు భవనాలు ధ్వంసమవ్వడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన పౌరులు.. అత్యవసర సేవలు దాడుల ధాటికి పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పారామెడికల్ బృందాలు, క్షతగాత్రులను యుద్ధ ప్రాతిపదికన సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. సైరన్ల మోతతో భయాందోళనకు గురైన ప్రజలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.
⭐ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ.. ప్రతిస్పందన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. తమ దేశ రక్షణ కోసం ‘ఐరన్ డోమ్’ వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాయి. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లలో అత్యధిక భాగాన్ని గాల్లోనే అడ్డుకుని నిర్వీర్యం చేసినట్లు రక్షణ అధికారులు ప్రకటించినప్పటికీ కొన్ని క్షిపణులు డిఫెన్స్‌ను ఛేదించుకుని లక్ష్యిత ప్రాంతాల్లో పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. తగిన సమయంలో బదులిస్తామని హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ ఆందోళన ఈ ఘటన మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై, భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి, పలు అగ్రరాజ్యాలు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. అయితే పరిస్థితిని బట్టి చూస్తుంటే యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కాకుండా ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉండటంతో ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తోంది.
👉అయిదేళ్ళ పాటు ఇరాన్ యుద్ధం – ప్రపంచం ఏమైపోవాలి ? ఇక్కడ మరో విషయం ఉంది. యుద్ధం ఎవరు ప్రారంభించినా ముగింపు మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదు, దానికి కళ్ళ ముందు రష్యా ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్ళకు పైగా సాగుతున్న యుద్ధమే సాక్ష్యం. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని ఒక సామెత ఉంది. ఈ రోజున ప్రపంచం ఎలుక మాదిరిగా అవస్థ పడుతూ ఆందోళన చెందుతోంది. అయితే యుద్ధం సెగను రగిలించిన వారు మాత్రం చెలగాటం ఆడుతున్నారు. ఎవరి కోణంలో వారిది కరెక్ట్ అని చెబుతున్నారు. ఇజ్రాయెల్ అయితే తమ దేశం కోసం యుద్ధం అంటోంది. అమెరికా వెర్షన్ చూస్తే ఇరాన్ వల్ల అణు ముప్పు ప్రపంచానికి లేకుండా చేయడానికి అంటోంది. ఇరాన్ వాదన చూస్తే మాపైన అకారణంగా దాడి చేస్తే మేము ఊరుకోవాలా అని మండిపడుతోంది. వెరసి చూస్తే ఏవరూ తగ్గేలా లేరు. ఇక్కడ మరో విషయం ఉంది. యుద్ధం ఎవరు ప్రారంభించినా ముగింపు మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదు, దానికి కళ్ళ ముందు రష్యా ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్ళకు పైగా సాగుతున్న యుద్ధమే సాక్ష్యం. రక్తం చిందిస్తాం : చర్చలు జరుపుతామని చెబుతూనే దాడి చేశారు. అందుకే మేము కూడా యుద్ధానికి రెడీ అని ఇరాన్ అంటోంది. అంతే కాదు మా దేశాన్ని ఏ మాత్రం వదులుకోమని చెబుతోంది. భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ దేశంలోని ఒక వార్తా సంస్థకు మాట్లాడుతూ అకారణంగా అక్రమంగా తమ దేశం మీద దాడి చేసిన అమెరికాతో చర్చలు అసలు ఉండవని స్పష్టం చేశారు. అంతే కాదు దీర్ఘకాలిక యుద్ధాల అనుభవం ఇరాన్ కి మాత్రమే సొంతం అని గట్టిగా చెప్పారు. మా దారి యుద్ధానికే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు.
⭐ఇరాన్ కి చేదు అనుభవాలు.. అమెరికాతో గతంలో ఇరాన్ రెండు సార్లు చర్చలు జరిపిందని ఆయన గుర్తు చేశారు. అయినా సరే అమెరికా ఇరాన్ మీద దాడులకే తెగబడింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఒక వైపు చర్చలు జరుగుతున్నాయని అయినా అమెరికా దాడులకు దిగడం దారుణం అన్నారు. అలాంటి అమెరికాతో ఇక మీదట చర్చలు అన్నది లేనే లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ స్పష్టం చేశారు. ఎప్పటికి ముగుస్తుంది అంటే : ఇక ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది అంటే దానికి ఇరాన్ వద్ద జవాబు లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ తేల్చేశారు. ఇరాన్ లో ప్రజలు అంతా అమెరికా మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దేశం కోసం వారు రక్తం చిందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ చెప్పారు. యుద్ధం ఆపడం అంటే దేశాన్ని వదులుకోవడమే అని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇక తమ దేశం ఏకంగా ఎనిమిదేళ్ల పాటు ఇరాక్ తో యుద్ధం చేసింది అని ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం యుద్ధం చేసిన అనుభవం ఇరాన్ కి ఉందని ఆయన అన్నారు.
* నో ఆప్షన్ అంటూ : యుద్ధం చేయాలని ఇరాన్ కి అయితే లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ అన్నారు. కానీ అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మేము యుద్ధానికి వ్యతిరేకంగానే ఉంటామని అన్నారు. అంతే కాదు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరాన్ గతంలో ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసిందని అబ్దుల్ మాజిద్ గుర్తు చేశారు.ఈ ప్రాంతం యుద్ధాలను తట్టుకోలేదని ఆయన అన్నారు. తాజా యుద్ధంతో ప్రపంచం మొత్తం ఇబ్బందిలో ఉందని ఆయన చెప్పారు. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అలాగే అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయని అబ్దుల్ మాజిద్ చెప్పారు. ప్రజలు చమురు దొరకక గ్యాస్ తో ఇబ్బందులు పడుతుంటే తాము కూడా బాధగానే ఉన్నామని చెప్పారు.
* అంతా కలసి ఒత్తిడి తేవాలి : అయితే ఈ యుద్ధం ఆగాలి అంటే అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ ఒక కీలక సూచన చేశారు. అది మొత్తం ప్రపంచానికే చేశారు. ప్రపంచ పెద్దలు అంతా కలసి అమెరికాను యుద్ధం ఆపమని కోరాలని ఆయన ఒక పరిష్కార మార్గం చెప్పారు. అలా అమెరికాను అంతా కలసి కట్టడి చేసి యుద్ధం ఆపితేనే ఆగుతుంది తప్ప తమ వైపు నుంచి ఆపేది అయితే లేదని తేల్చారు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ కలసి తీసుకుని వచ్చాయని ఇపుడు వారే ఆపాలని ఆయన చెప్పడం విశేషం. అంతే కాదు ఇరాన్ కోసం తమ దేశం ఆత్మ గౌరవం కోసం తమ అస్తిత్వం కోసం స్వాతంత్రం కోసం యుద్ధం చేయక తప్పదని స్పష్టం చేశారు. దాని కోసం ఎందాకైనా వెళ్తామని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ చెప్పడం విశేషం.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్