👉 ఈ ఏడాది డిసెంబర్ లోగా భూమి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం… సి ఎం చంద్రబాబు.
నిజానికి రైతులు భూ సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్నారు. నిత్యం తహసిల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ పనులు జరగలే. సార్ రీ సర్వే గ్రామాల్లో జాయింట్ ఎల్పిఎం సమస్య, 22a, ఈనాo భూములు, ఫ్రీ హోల్డ్ భూములు ఇలా అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. నమస్కలన్ని పరిష్కరిస్తే గురువులుగా రైతులకు చాలా బాగుంటుంది.

👉రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ. 1.50 కోట్లు మంజూరు….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల నిర్వహణకు మొత్తం రూ. 1.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల కేటాయింపు వివరాలు:
మొత్తం మంజూరు: రూ. 1.50 కోట్లు. ఇందులో రూ. 1 కోటి ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.50 లక్షలు ఏపీ స్టేట్ హజ్ కమిటీ నిధుల నుండి సేకరించారు.
రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందు: విజయవాడలోని ‘A కన్వెన్షన్, లబ్బీపేట’లో మార్చి 13, 2026న ముఖ్యమంత్రి నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కోసం రూ.75 లక్షలు కేటాయించారు.
జిల్లాల వారీగా: మిగిలిన రూ.75 లక్షలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు పంపిణీ చేశారు.
👉తమిళ రాజకీయాల్లో పవన్ రాయబారం …
ఎన్డీఏకి, TVK విజయ్‌ని దగ్గర చేసే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం…ఎన్డీఏతో పొత్తుపై విజయ్‌తో పవన్ చర్చలు…
విజయతో పొత్తుకు చర్చల బాధ్యతల్ని పవన్‌కు అప్పగించిన బీజేపీ…40-50 సీట్లు ఆఫర్ చేస్తున్న బీజేపీ.. పొత్తు విషయంలో విజయ్ నిర్ణయంపై ఉత్కంఠ..
👉దానం నాగేందర్, కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ …
దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ …
8 మంది ఎమ్మెల్యేల తరహాలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్…బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ …వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, కూతురు కడియం క్యావ్యకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన కడియం శ్రీహరి
👉యూరియా పరిశ్రమల మీద పడ్డ గ్యాస్ కొరత*
ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో తగ్గిపోయిన యూరియా ఉత్పత్తి…గ్యాస్ లభ్యత తగ్గడం వల్ల కేవలం 60% సామర్థ్యంతో పనిచేస్తున్న యూరియా ప్లాంట్లు…
పరిస్థితి ఇలాగే కొనసాగితే, చివరికి దేశంలో యూరియా కొరత వస్తుందని సూచిస్తున్న పరిశ్రమ వర్గాలు…గతంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర టన్నుకు 475 డాలర్లు ఉంటే ఇప్పుడు అదీ 25% కంటే ఎక్కువ పెరిగి టన్నుకు దాదాపు 600 డాలర్లకు చేరుకున్న అంతర్జాతీయ యూరియా ధరలు..గల్ఫ్ దేశాలలో ప్రస్తుతం మూసివేయ బడిన గ్యాస్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించిన తర్వాతే ఈ పరిస్థితి చక్కబడుతుందని చెబుతున్న నిపుణులు.
👉 ఇరాన్ ఒంటరి కాదు.. ఆ దేశం వెనుక అతిపెద్ద శక్తులు !..
అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు.. ఇరాన్ మరోవైపు యుద్ధం చూస్తున్న మనకు పిక్చర్ ఇలాగే కనిపిస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు.. ఇరాన్ మరోవైపు. యుద్ధం చూస్తున్న మనకు పిక్చర్ ఇలాగే కనిపిస్తుంది. కానీ యుద్ధంలో అదృశ్య శక్తులు ఉన్నాయి. వెనక నుంచి పోరాడుతున్నాయి. కానీ నేరుగా యుద్ధరంగంలోకి దిగవు. ప్రపంచ పోలీస్ పీచమణచడమే అదృశ్య శక్తుల లక్ష్యం. యుద్ధం అనంతర పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకోవడమే అదృశ్య శక్తుల టార్గెట్. అందుకే తెర వెనుక ఉండి యుద్ధం చేస్తున్నాయి. చేయిస్తున్నాయి. అదృశ్య శక్తులెవరు ?
అదృశ్య శక్తులెవరు ?
⭐ఇరాన్ ఒంటరిగా పోరాడుతోంది. కానీ ఖచ్చితమైన టార్గెట్లను చేధిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్ లపై దాడి చేస్తోంది. ఆయిల్ రిఫైనరీలపై దాడి చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం చేసి ప్రపంచ వాణిజ్యాన్ని షేక్ చేస్తోంది. ఇదంతా కేవలం ఇరాన్ మాత్రమే చేయడం లేదన్న చర్చ ఉంది. దీని వెనుక చైనా ఉంది. రష్యా ఉంది. చైనా ఇరాన్ ఆయిల్ కొంటోంది. టెక్నాలజీ, ఆయుధాలను అందిస్తోంది. రష్యా కూడా బహిరంగ మద్దతు ప్రకటిస్తూ కీలక ఆయుధ, సైనిక సమాచారాన్ని చేరవేస్తోంది. అందుకే ఇరాన్ టార్గెట్లు గురితప్పడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు చైనా, రష్యాలే.
⭐యుద్ధంలోకి ఎందుకు దిగవు ? :
రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. నేరుగా యూఎస్ తో తలపడితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి యుద్ధం త్వరగా ముగించే ఆలోచన చేయాలని ట్రంప్ ను కోరుతోంది. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబ ఆయతుల్లా ఎన్నికను బహిరంగంగా స్వాగతించింది. తద్వారా తాము ఇరాన్ పక్షాన ఉన్నట్టు పరోక్షంగా ప్రకటించింది. చైనా యుద్ధం చేయడం ద్వారా నష్టం తప్ప లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధానంతర పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడతో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి భవిష్యత్తులో చైనాకు కలిసొస్తుంది.
⭐చైనా ఎలా లాభపడుతుంది ?
అమెరికా గల్ఫ్ దేశాలతో మైత్రీ కొనసాగిస్తూ డాలర్ ఆధిపత్యాన్ని నిలుపుకుంటోంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై నిరంతర దాడి.. గల్ఫ్ దేశాలు అమెరికాతో స్నేహం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. యుద్ధం ముగిసిన అనంతరం అమెరికాతో స్నేహ బంధం, పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మంచిది కాదన్న అభిప్రాయానికి గల్ఫ్ దేశాలు వచ్చే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికాతో సంబంధాల కారణంగా గల్ఫ్ దేశాలు ఇరాన్ టార్గెట్ అవుతాయి. ఫలితంగా గల్ఫ్ దేశాలు విదేశీ పెట్టుబడులకు, నివాసానికి ఏమాత్రం భద్రమైన ప్రాంతం కావు. అమెరికాతో స్నేహం, ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాలపై ఇన్నాళ్లు పెట్టుబడిదారులకు ఉన్న అభిప్రాయాలను తొలగిస్తున్నాయి. దీనివల్ల గల్ఫ్ దేశాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి అమెరికాతో స్నేహం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇది చైనాకు అడ్వాంటేజ్ అవుతుంది. చైనా అమెరికా పొజిషన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో చైనా డామినెన్స్ పెరిగితే చైనాకు మరింత పట్టు దొరుకుతుంది. ఇది జియో పాలిటిక్స్ ను మార్చేస్తుంది. అందుకే చైనా యుద్ధం చేయకుండా, యుద్ధానంతర పరిణామాలను క్యాష్ చేసుకోవడానికి చూస్తోంది.
👉 దుబాయ్ లో యుద్ధ భయం.. ఎడారిలో మూగజీవాల ఆక్రందన…క్షిపణి దాడుల భయంతో దుబాయ్ వీడుతున్న ప్రవాసులు…పెంపుడు జంతువులను తీసుకెళ్లలేక స్తంభాలకు కట్టేసి పోతున్న వైనం…ఒమన్ సరిహద్దుల్లో పెంపుడు జంతువులకు నో ఎంట్రీ…
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రవాసులు.. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. యజమానులు తమ కుక్కలను స్తంభాలకు కట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఆహారం, నీరు లేక అవి ఆక్రందనలు చేస్తున్నాయి. పిల్లులను అట్టపెట్టెల్లో పెట్టి, వాటిపై ‘‘మమ్మల్ని క్షమించండి.. వీటిని తీసుకెళ్లడం మా వల్ల కాదు’’ అని రాసి రోడ్ల పక్కన పడేస్తున్నారు. కొంతమంది ప్రవాసులు పెంపుడు జంతువులను తరలించే ఖర్చు భరించలేక,వాటికి విషం ఇచ్చి చంపేయాలని పశువైద్యులను కోరుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ప్రాణం కంటే ప్రేమ చిన్నదైపోయిందన్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి.
⭐ఎడారిలో మూగజీవాల హాహాకారాలు
రోడ్డు మార్గంలో ఒమన్ సరిహద్దులకు చేరుకుంటున్న వారు, అక్కడ జంతువులకు అనుమతి లేకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళుతున్నారు. భగభగమండే ఎండలో ఆహారం లేక అవి అలమటిస్తున్నాయి. అటు జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇప్పటికే నిండిపోవడంతో కొత్తగా వచ్చే జంతువులను చేర్చుకోవడం వారికి భారంగా మారింది. రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
⭐సరిపోని స్మార్ట్ మెషీన్ల సాయం..
దుబాయ్ మున్సిపాలిటీ వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘ఎహ్సాన్ స్టేషన్’ (ఆహారం అందించే స్మార్ట్ మెషీన్లు) ఇప్పుడు పెరుగుతున్న ఈ సంఖ్యకు సరిపోవడం లేదు. సంపన్న దేశంలో ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
👉 తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని పైశాచిక దందా…రూ. 45 వేల కోసం మృతదేహాన్ని ఇవ్వని యాజమాన్యం…
బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన పలమనేరుకు చెందిన శ్రీనివాస్…ఇప్పటికే రూ. 3 లక్షలు వసూలు…భార్య, తల్లి పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజు చెల్లింపు…ఎమ్మెల్యే ఫోన్ చేసినా బేఖాతర్…మానవత్వం మరచి నిర్లక్ష్యంగా మాట్లాడిన ఆసుపత్రి సిబ్బంది…వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బాధితుల ఆవేదన
👉 రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయండి..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
విజయవాడ: తిరుపతి నగరంలోని స్థానిక భవాని నగర్ లో ఉన్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ పలమనేరు మండలం జీడిమకుల పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో తొమ్మిది రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పటికీ 3 లక్ష రూపాయలు యాజమాన్యం వసూలు చేయడం జరిగిందని వివరించారు. చివరకు ఠాగూర్ తరహా వైద్యం అందించి తల్లిపుస్తుల తాకట్టు పెట్టి హాస్పిటల్లో ఫీజు చెల్లించిన కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ ఏమాత్రం మానవత్వం చెప్పుకుంటా 45 వేల రూపాయలు చెల్లించాలని మంగళవారం ఉదయం నుంచి మృతదేహాన్ని అంటిపెట్టుకొని దందా నడిపిన ఆసుపత్రి యాజమాన్యం ఏ మాత్రం మానవత్వం లేకపోవడంతో పాటు సంబంధిత ఎమ్మెల్యే ఫోన్ చేసిన స్పందించకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్ పై హాస్పిటల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వెంటనే విచారణ చేపట్టి హాస్పిటల్ పై విచారణ చేపట్టి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేదల రక్తాన్ని జలగల్లాగా రక్తం తాగుతున్న రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని సిపిఐ గా డిమాండ్ చేస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. హాస్పిటల్ పై చర్యలు తీసుకొని పక్షంలో తాము ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దానికి తోడు జిల్లా వైద్యానికి శాఖ అధికారులు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పై నిర్లక్ష్యం వహించడం బాధ్యత రహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చెప్పటాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
👉భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు.
దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹45,000గా అధికారులు తెలిపారు.
అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
👉అంతర్రాష్ట్ర దొంగ ను అరెస్ట్ చేసిన నల్గొండ వన్ టౌన్ పోలీస్: అభినందించిన ఎస్పీ..
నల్లగొండ మిర్యాలగూడ రోడ్డులో ఉన్న మహాలక్ష్మి *వైన్ షాప్ దొంగతనం* కేసును చేదించిన వన్ టౌన్ పోలీస్…
ఈ కేసులో *అంతరాష్ట్ర దొంగ* కుమ్మరి నర్సింహా రావు (35) ను అరెస్ట్…నిందితుడి వద్ద నుండి రూ.1,77,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం…డిసెంబర్ 7, 2025 రాత్రి మహాలక్ష్మి వైన్ షాప్ నుండి సుమారు రూ.5 లక్షలకు పైగా నగదు దొంగతనం జరిగినట్లు యజమాని ఫిర్యాదు…షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు…జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు,డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు చర్యలు…దేవరకొండ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…విచారణలో నిందితుడు నల్లగొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ…గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు దొంగతన కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితుడు..నల్లగొండ జిల్లాలో నేర రహిత జిల్లాగా తీర్చడమే లక్ష్యం తో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ *నేను సైతం* కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుట్టాలి…
వార్డులలో మరియు వ్యాపార సముదాయాలలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి…
*నల్లగొండ వన్ టౌన్ సిఐ–ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి*
కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సీఐ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సతీష్, లచ్చిరెడ్డి, వెంకటనారాయణ, సిబ్బంది అంజయ్య, రబ్బానీ శ్రీను లను డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.
👉 విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్‌లు…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో డ్యాన్స్‌లు చేసిన ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ వేటు…
మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్..
దీంతో విధి నిర్వహణ సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి డ్యాన్స్‌లు చేశారని వెలువెత్తిన విమర్శలు…
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.. విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ…అదే సమయంలో డ్యాన్స్‌లను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
👉హోం వర్క్ చేయలేదని స్టూడెంట్స్ ను చితకబాదిన HOD*
సంగారెడ్డి జిల్లా.. హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ శివారులోని రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.హోం వర్క్ చేయలేదన్న కారణంతో 15 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను HOD శివారెడ్డి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో విద్యార్థుల కాళ్లకు గాయాలయ్యాయి.HOD శివారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.👉హైదరాబాద్ నగరంలో హాస్టల్స్ లో ఈ ఫుడ్స్ పెట్టలేం..*
ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాల నిర్ణయం…కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్… హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాల సందేశం…
👉ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. జిల్లా ఎస్పీ ప్రశంసలు*
విజయవాడ వాసి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు…
డ్రైవర్ నాగేశ్వరరావు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్ అందజేత…నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్లను సత్కరించిన జిల్లా ఎస్పీ…
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటనతో ఆటో డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సుబ్బారావు తన కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఆటో ఎక్కి గమ్యస్థానంలో దిగారు. అయితే, హడావిడిలో రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కాసేపటికి విషయం గుర్తించిన సుబ్బారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ప్రయాణికులు దిగి వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది తన ఆటోలో ప్రయాణించిన వారిదేనని భావించి, వారి కోసం సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు.
పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి, నగలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని మెచ్చి సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్‌ను కూడా ఎస్పీ అభినందించారు.
👉 ఈ ఏడాది డిసెంబర్ లోగా భూమి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం… సి ఎం చంద్రబాబు. 👉రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ. 1.50 కోట్లు మంజూరు… 👉దానం నాగేందర్, కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ …👉తమిళ రాజకీయాల్లో పవన్ రాయబారం …👉యూరియా పరిశ్రమల మీద పడ్డ గ్యాస్ కొరత*…👉👉 తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని పైశాచిక దందా…రూ. 45 వేల కోసం మృతదేహాన్ని ఇవ్వని యాజమాన్యం… రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ వెంటనే సీజ్ చేయండి..సిపిఐ …👉భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి…👉 విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్‌లు…👉ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. జిల్లా ఎస్పీ ప్రశంసలు*..👉హోం వర్క్ చేయలేదని స్టూడెంట్స్ ను చితకబాదిన HOD* సంగారెడ్డి జిల్లా..👉 ఇరాన్ ఒంటరి కాదు.. ఆ దేశం వెనుక అతిపెద్ద శక్తులు !..
Recent Posts

