👉నీ పనేదో నువ్వు చూసుకో.. ట్రంప్‌కి కమల్ హాసన్ హెచ్చరిక😱 …⭐ ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారం: సీఎం రేవంత్ …👉ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి…👉సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్‌పై ఏసీబీ అసమాన ఆస్తుల కేసు నమోదు …👉ఉమెన్స్ డే వేళ కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం!*…👉90 ఏళ్ల వృద్ధురాలిపై మధ్యప్రదేశ్లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం*

👉నీ పనేదో నువ్వు చూసుకో.. ట్రంప్‌కి కమల్ హాసన్ హెచ్చరిక😱😱😱 రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షలు.. తాజాగా ఇచ్చిన మినహాయింపులు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షలు.. తాజాగా ఇచ్చిన మినహాయింపులు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందన, భారత ఇంధన భద్రతపై విశ్లేషణాత్మక కథనంలోకి వెళితే..
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా ప్రభుత్వం భారత్‌కు 30 రోజుల పాటు తాత్కాలిక `మినహాయింపు` ఇవ్వడంపై నటుడు, `మక్కల్ నీది మయ్యం` అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి `మీ పని మీరు చూసుకోండి` అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. భారత్ ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని.. ఏ విదేశీ శక్తి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సుదూర తీరాల నుంచి వచ్చే ఆజ్ఞలకు తలొగ్గే కాలం చెల్లిపోయిందని.. భారత దేశ విధాన నిర్ణయాలను గౌరవించాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ అస్థిరంగా మారడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో.. చమురు సరఫరాలో లోటు
రాకుండా ఉండేందుకు భారత్‌కు ఈ తాత్కాలిక మినహాయింపునిచ్చినట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. భారత్ బాధ్యతాయుతమైన మిత్రదేశమని ఆయన ప్రశంసించినా కానీ.. `మినహాయింపు` అనే పదంపైనే కమల్ హాసన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం మధ్య భారత ప్రభుత్వం తన ఇంధన భద్రతపై పూర్తి ధీమా వ్యక్తం చేసింది. రష్యాపై ఆధారపడటమే కాకుండా.. భారత్ తన చమురు దిగుమతి వనరులను 27 దేశాల నుండి 40 దేశాలకు విస్తరించడం విశేషం. దేశ ప్రయోజనాలే పరమావధిగా… ఎక్కడ తక్కువ ధరలో నాణ్యమైన చమురు లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. బహుళ సరఫరా మార్గాలను సిద్ధం చేసుకోవడం వల్ల అంతర్జాతీయ యుద్ధాలు మన దేశ ఇంధన అవసరాలపై పెద్దగా ప్రభావం చూపబోవని భారత్ గట్టి సందేశాన్ని పంపింది. చమురు రాజకీయాలు-భారత‌దేశ వ్యూహాలు చమురు సంపదపై సాగుతున్న జియో పాలిటిక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నాయి. ఇంధనం అనేది కేవలం అవసరమే కాదు.. అది ఒక శక్తివంతమైన దౌత్య అస్త్రంగా మారింది. పశ్చిమ దేశాలు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి చమురును ఆయుధంగా వాడుతుంటే.. ఇరాన్ వంటి దేశాలు హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాలను నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై ఆంక్షల పేరుతో ఒత్తిడి తీసుకురావడం సర్వసాధారణమైపోయింది. కానీ భారత్ వంటి పెరుగుతున్న ఆర్థిక శక్తిని నియంత్రించడం ఇప్పుడు అమెరికా వంటి దేశాలకు సవాలుగా మారింది. భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్న `బహుముఖ దౌత్యం` దానికి గొప్ప సానుకూలతగా మారింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్ అటు రష్యాతో సన్నిహితంగా ఉంటూనే.. ఇటు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఏ ఒక్క దేశంపై లేదా కూటమిపై ఆధారపడకుండా.. తన జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ గ్లోబల్ పాలిటిక్స్‌లో ఒక కీలకమైన `బ్యాలెన్సింగ్ పవర్`గా అవతరించింది. ఈ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కారణంగానే ఇతర దేశాలు ఆంక్షలు విధించినా లేదా మినహాయింపులు ఇచ్చినా భారత్ తనదైన శైలిలో ముందుకు వెళ్ల‌గలుగుతోంది.
⭐ ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారం: సీఎం రేవంత్
రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆయుధాలతో సహా 130 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సీఎం రేవంత్ తెలిపారు. లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని నమ్మకం కల్పించిన పోలీసు ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. సమస్యలకు శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని చెప్పారు. మహాత్మ గాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
👉గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోవాలి: సీఎం రేవంత్..
తెలంగాణ : మావోయిస్టు నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు లొంగిపోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గణపతి సహా మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. గిరిజనుల హక్కులు, వారి ఆర్థిక స్థోమత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
👉ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి
ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి
తెలంగాణ : ఏప్రిల్ నెలలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద గ్రామాల్లో 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 31లోగా లక్ష యూనిట్లకు గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని సూచించారు.
👉సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కామతం శ్రవణ్ కుమార్‌పై ఏసీబీ అసమాన ఆస్తుల కేసు నమోదు చేసింది.*
ఆయన నివాసంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా సుమారు ₹4 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్లు సమాచారం.
బయటపడిన ఆస్తులు:
• 2 ఇళ్లు
• 6 ఫ్లాట్లు ఉన్న 1 అపార్ట్‌మెంట్
• కరీంనగర్‌లో 4 ఖాళీ ప్లాట్లు
• కారు, రెండు ద్విచక్ర వాహనాలు
• బంగారు ఆభరణాలు
• నగదు మరియు గృహోపకరణాలు
ఈ కేసులో కామతం శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

👉ఉమెన్స్ డే వేళ కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం!*
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కామారెడ్డి జిల్లాలో గుండె తరుక్కుపోయే ఘటన వెలుగుచూసింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలను కన్నతండ్రి ఇస్మాయిల్ చెరువులో పడేసి చంపేశాడు.

తొలుత తన బిడ్డలు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. కానీ విచారణలో అసలు నిజం ఒప్పుకున్నాడు. ₹5 లక్షల అప్పు భారం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపాడు.
ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్, కూలి పనులకు వెళ్తున్న భార్య షబీనా కష్టాన్ని కూడా చూడకుండా.. పసి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
👉90 ఏళ్ల వృద్ధురాలిపై మధ్యప్రదేశ్లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం*
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఓ 90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. రాత్రి వేళ తన పొలంలోని గుడిసెలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బాధితురాలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు••

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్