👉చర్చలు ఒట్టిమాటే🤔.. ట్రంప్‌పై అంతర్జాతీయ సమాజం ఫైర్ 😡… అయితే.. వీరిని తమ దేశానికి సురక్షితంగా తీసుకువచ్చే విషయంలో అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేతులు ఎత్తేశారు. ఇరాన్‌తో చర్చలు జరపాలని అనుకున్నామని.. కానీ, ఆ దేశం ముందుకు రాలేదని.. వచ్చినా అప్పటికే ఆలస్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది.

ట్రంప్ వాదనలో నిజం లేదని నాటి దైత్యాధికారులు.. అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉన్న విశ్లేషకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వాస్తవానికి ఇరాన్ ఆది నుంచి చర్చలకు సిద్ధమేనని చెప్పిందన్నారు.అయితే.. అమెరికా ఆధిపత్య ధోరణిని మాత్రమే ఇరాన్ వ్యతిరేకించిందన్నారు.అదేసమయంలో దొడ్డిదారిన ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి.. ఆ దేశాన్ని రెచ్చగొట్టి ఇరాన్‌పై దాడులు చేయించే దిశగా అడుగులు వేసిందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు రాసిన వ్యాసాల్లో స్పష్టం చేశారు. చివరకు గత నెల 20న కూడా ఇరాన్ చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని చెబుతున్నారు. దీనికి ఒమన్ దేశం కూడా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రాగా.. ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. కానీ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఆది నుంచి ఇజ్రాయెల్, అమెరికాలు వ్యూహం పన్నాయని.. అందుకే చర్చల పేరుతో కొన్నాళ్లు నాటకం ఆడాయని ది గార్డియన్‌లో రాసిన వ్యాసంలో ఓ అంతర్జాతీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వాదనలోనూ అర్ధం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇరాన్ అంతమే తమ లక్ష్యమని అంటున్నా.. అది సాధ్యం కాదని అంటున్నారు. ఇరాన్ బహుళ ఆయుధ వ్యవస్థ ముందు.. అమెరికా ఇప్పటికే చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే.. దీనిని ట్రంప్ తాజాగా కొట్టిపారేశారు. తమ వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని.. అవి చాలా శక్తిమంతమైనవని పేర్కొన్నారు. ఆ పత్రిక అమ్ముడు పోయిందని వ్యాఖ్యానించారు.అయితే.. దీనిని గార్డియన్ తన సైట్‌లో ఖండించింది.తాము నిష్పక్ష పాతంగా పనిచేస్తున్నామని పేర్కొంది.అమెరికాకు చెందిన గల్ఫ్ దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ పరిణామాలతో అక్కడి వివిధ దేశాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వీరిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. దుబాయ్, ఖతార్, యూఏఈలలో భారీ సంఖ్యలో అమెరికన్లు పనిచేస్తున్నారు. అయితే.. వీరిని తమ దేశానికి సురక్షితంగా తీసుకువచ్చే విషయంలో అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేతులు ఎత్తేశారు. మీ ప్రయత్నాలు మీరే చేసుకోవాలని.. మీ అంతట మీరే దేశానికి రావాలని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అంతేకాదు.. ఎవరికి ప్రాణాలను వారు రక్షించుకునేందుకు ప్రయత్నించాలని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం.
👉ఇరాన్ తన డ్రోన్ల శక్తిని మీడియాకు ప్రదర్శించడం, ఆ తర్వాత అమెరికా లక్ష్యాలపై దాడులు జరగడం ప్రస్తుతం పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఘర్షణ ముదిరినట్లు కనిపిస్తోంది.*
*ఇరాన్ డ్రోన్ శక్తి ప్రదర్శన – పరిణామాలు
మీడియా ప్రదర్శన: ఇరాన్ తన అత్యాధునిక డ్రోన్లు, ముఖ్యంగా షాహెద్ సిరీస్ మరియు మొహాజెర్ డ్రోన్లను మీడియా సాక్షిగా ప్రదర్శించింది. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగలవని ఇరాన్ ప్రకటించింది.
అమెరికా లక్ష్యాలపై దాడులు: ఫిబ్రవరి చివరలో మరియు మార్చి 2026 ప్రారంభంలో, ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ద్వారా **”ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4″**ను చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.దీనిలో భాగంగా పశ్చిమాసియాలోని సుమారు 27 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు,డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం.
*ప్రాంతీయ ప్రభావం* :
ఈ డ్రోన్ దాడుల ప్రభావం కేవలం అమెరికా స్థావరాలకే పరిమితం కాకుండా, యూఏఈ, ఖతార్ మరియు బహ్రెయిన్ వంటి దేశాల్లోని చమురు క్షేత్రాలు మరియు మౌలిక సదుపాయాలపై కూడా పడింది. ఇది ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మృతి మరియు దాని తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా తన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసినప్పటికీ, ఇరాన్ డ్రోన్లు రాడార్లకు దొరక్కుండా తక్కువ ఎత్తులో ప్రయాణించడం సవాలుగా మారింది.
👉ఇరాన్‌తో యుద్ధం:అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఖర్చులు.. ఒక్కరోజే రూ.7 వేల కోట్లు!*
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అగ్రరాజ్యానికి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. తాజా అంచనాల ప్రకారం, యుద్ధం మొదలైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్ డాలర్లు (దాదాపు ₹7,000 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
*నిర్వహణ భారంతో అల్లాడుతున్న ఖజానా*
కేవలం దాడులకే కాకుండా, యుద్ధ నౌకల నిర్వహణకు అమెరికా భారీగా చెల్లించాల్సి వస్తోంది. యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఒక్కో యుద్ధ విమాన వాహక నౌక నిర్వహణకే రోజుకు 6.5 మిలియన్ డాలర్లు (సుమారు ₹59 కోట్లు) ఖర్చవుతోంది. యుద్ధానికి ముందే బలగాల మోహరింపు కోసం మరో ₹5,700 కోట్లకు పైగా వెచ్చించినట్లు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
*ఆయుధాల నష్టం.. ఆందోళనలో రక్షణ శాఖ*
ఆర్థిక భారంతో పాటు సాంకేతిక నష్టం కూడా అమెరికాను కలవరపెడుతోంది.
కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోవడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
ఉక్రెయిన్, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఇప్పటికే క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరించిన నేపథ్యంలో, ఇరాన్ యుద్ధంలో ఆయుధాలను కోల్పోవడం అమెరికా రక్షణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
*మొత్తం లెక్క ₹3 లక్షల కోట్లు దాటింది!*
2023 అక్టోబరులో హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియాలో అమెరికా చేసిన మొత్తం ఖర్చు సుమారు 33.77 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹3.1 లక్షల కోట్లు) చేరినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగవచ్చని ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఆర్థిక భారం అమాంతం పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం ప్రపంచ వాణిజ్యంపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
👉ఇరాన్‌లో 787 మంది మృతి*
* ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది.మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని ఈ నెల చివరి వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
👉 అక్రమ అరెస్టులపై అంగన్వాడీల నిరసన.. ప్రకాశం మార్కాపురం జిల్లా పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విజయవాడలో తమ జీతాలు, సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను తెల్లవారుజామున అరెస్టు చేసి, వారు ఎక్కడ ఉన్నారో కుటుంబసభ్యులకు కూడా తెలియ జేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు.గతంలో తాము ధర్నాలు చేసినప్పుడు తమ వద్దకు వచ్చి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మహిళలపైనే కఠిన చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో అమరావతిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
👉 జడ్చర్ల ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు*
* జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి శవాన్ని కుక్క పీక్కుతినడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోపై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
👉 గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి..
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఘాట్‌లలో భక్తుల రాకపోకలు, భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులపై ఆయన సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా కంట్రోల్ రూమ్, శుభ్రత, అత్యవసర సేవలతో సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఏసీపీ రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, జీడీకే-2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, అంతర్గాం ఎస్ఐ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
👉 లారీ డ్రైవర్ కోసం ప్రియుడిని చంపిన టీవీ నటి*
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ టీవీ నటి, తాను లివింగ్‌లో ఉంటున్న ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. నటి ఊర్మిలా అలియాస్ బిందు, లారీ డ్రైవర్ వినయ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన ప్రియుడు మోహన్ కృష్ణ అడ్డు వస్తున్నాడని భావించి.. వినయ్, అతని స్నేహితుడు దనుష్‌తో కలిసి ఇంట్లోనే మోహన్‌కు మద్యం తాగించి, ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. రెండు వారాల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కుళ్లిపోయిన స్థితిలో మోహన్ మృతదేహం లభ్యమైంది.
👉వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి బాలినేని రంగం సిద్ధం**ఒంగోల్ సీనియర్ రాజకీయ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉగాది రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో YSRCP లో చేరిక ఖరారైంది*
👉మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*
రక్తదానం ప్రాణదానంతో సమానం: ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు మరియు పోలీస్ అధికారులు ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా వారం రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. సమాజంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కొరత లేకుండా ఉండేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో, అలాగే మహిళలకు ప్రసవ సమయాల్లో రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని, ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని GGH బ్లడ్ బ్యాంక్‌కు రక్తాన్ని అందజేస్తున్నామని వివరించారు. పోలీస్ శాఖ పిలుపు మేరకు క్విజ్ కాలేజ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి మహిళ తగినంత శ్రద్ధ వహించాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచు కోవాలని,వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ,మెడిటేషన్ వంటివి చేయాలని సూచించారు.ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఒంగోలు తాలూకా సిఐ టి.విజయ్ కృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ యు.సుధాకర్, డాక్టర్ అశ్విని, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
👉నేరగాళ్ల గుండెల్లో నిద్రవద్దు.. ప్రజల కళ్లకు పోలీసుల ‘అభయ నిద్ర’
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో అడుగడుగునా ‘నైట్ బీట్’ పహారా – చీకటి మాటున నేరాలకు తావులేకుండా పోలీసుల నిరంతర నిఘా
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధమ కర్తవ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతా వలయాన్ని అత్యంత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఆయా జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాలు, మారుమూల గ్రామాలు మరియు కీలకమైన జాతీయ రహదారులపై పోలీసులు ముమ్మరంగా ‘నైట్ బీట్’ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో అకారణంగా రోడ్లపై తిరిగే వ్యక్తులను, అనుమానాస్పద కదలికలు ఉన్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి వేలిముద్రలను ఎప్పటికప్పుడు క్రైమ్ డేటాబేస్‌తో సరిపోల్చుతున్నారు.
ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు మరియు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగే వ్యాపార సముదాయాల వద్ద పోలీసులు’విజిబుల్ పోలీసింగ్’ లో భాగంగా నిరంతరం గస్తీ కాస్తున్నారు. దొంగతనాలకు ఆస్కారం లేకుండా బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోల్ కార్ల ద్వారా సైరన్లతో పహారా కాస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. “మీరు ప్రశాంతంగా నిద్రపోండి – మేము మీ కోసం మేల్కొని ఉంటాం” అనే నినాదంతో పోలీసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 కు సమాచారం అందించి,నేర రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ యొక్క ఈ నిరంతర పహారా పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
👉చర్చలు ఒట్టిమాటే🤔.. ట్రంప్‌పై అంతర్జాతీయ సమాజం ఫైర్ 😡…ఇరాన్ డ్రోన్ శక్తి ప్రదర్శన – పరిణామాలు…👉ఇరాన్‌తో యుద్ధం:అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఖర్చులు.. ఒక్కరోజే రూ.7 వేల కోట్లు!…👉 అక్రమ అరెస్టులపై అంగన్వాడీల నిరసన.. (ప్రకాశం మార్కాపురం).. 👉 జడ్చర్ల ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు*..👉 గోదావరి పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి…..👉 ..⭐రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*👉నేరగాళ్ల గుండెల్లో నిద్రవద్దు.. ప్రజల కళ్లకు పోలీసుల ‘అభయ నిద్ర’…
Recent Posts

