👉అమెరికాకు దండం….😱 👉శవాల మధ్య రొమాన్స్ కావాలంటూ డాక్టర్ వేధింపులు..👉 పల్నాడు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అంగన్వాడీల అక్రమ అరెస్ట్ లు…..👉పేదవారికి జమాత్ ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో120 జకాత్ కిట్స్

👉అమెరికాకు దండం….😱 యూఏఈ రివర్స్ యుద్ధం ఎవరితో అన్న సందేహం కూడా వారిలో కలుగుతోంది. సాటి ముస్లిం దేశాల మీద ఇరాన్ ఈ తీరున విరుచుకుపడడం ఏంటన్న చర్చ కూడా ప్రపంచ దేశాలకు కూడా కలిగింది. నేస్తం కాస్తా నెత్తురోడిస్తున్నాడా, రక్షణ కవచం గురి తప్పుతోందా. తమ గడ్డ మీద అమెరికా యుద్ధ విన్యాసాలు చివరికి అసలుకే ఎసరు తెస్తున్నాయా. ముప్పుతో ముప్పతిప్పలు పెడుతున్నాయా. ఇవన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ దేశాల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరో విధంగా చూస్తే ఆవేదన కూడా. తమ గడ్డ మీద ఉన్న అమెరికాకు చెందిన బేస్ ల వల్ల రక్షణ మాట దేవుడెరుగు పెను ముప్పు వాటిల్లుతోందని యూఏఈ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. రక్షణ కవచం గురి తప్పిందా : ఇదిలా ఉంటే యూఏఈ గడ్డ మీద అమెరికా ఏర్పాటు చేసిన బేస్ కానీ రక్షణ కవచం కానీ ఆ దేశాలను కాపాడలేకపోతున్నాయి.
ఇరాన్ చేస్తున్న భారీ దాడులకు కకావికలమవుతున్నాయి. ఇరాను గల్ఫ్ దేశాల మీద చేస్తున్న తీవ్రమైన దాడులతో ఆ దేశాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా రక్షణ కవచం వల్ల ఏ విధంగానూ ప్రయోజనం కలగకపోగా ఇరాన్ దానిని దాటి మరీ వచ్చి చేస్తున్న ప్రతీకార దాడులకు ఈ దేశాలు విలవిలలాడుతున్నాయి. దానికి ఉదాహరణగా కువైట్, ఖతర్ మీద జరిగిన దాడులను చూపుతున్నారు.
*యూఏఈ దేశాల మీద : అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాని అన్న దేశాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేయాలని నాలుగు వైపుల నుంచి మోహరించి సాగిస్తున్న ఈ భీకర యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎదురు దాడులు చేయడం సబబు, అది యుద్ధ నీతి కూడా. కానీ ఇరాన్ మొదటి రోజు నుంచి యూఏఈ దేశాల మీద తన లక్ష్యాన్ని గురి పెడుతూ వస్తోంది. దుబాయ్, కువైట్ ఖతర్ సహా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. తమ వద్ద ఉన్న పదునైన ఆయుధాలను ఆ వైపుగా పంపిస్తూ ముప్ప తిప్పలు పెడుతోంది. దీంతో అసలు ఈ విషయం ఊహించని యూఏఈ దేశాలు షాక్ తిన్నాయి.
**ఇరాన్ వ్యూహం ఫలిస్తోంది : యుద్ధం ఎవరితో అన్న సందేహం కూడా వారిలో కలుగుతోంది. సాటి ముస్లిం దేశాల మీద ఇరాన్ ఈ తీరున విరుచుకుపడడం ఏంటన్న చర్చ కూడా ప్రపంచ దేశాలకు కూడా కలిగింది. అయితే సరిగ్గా ఇక్కడే ఇరాన్ వ్యూహం ఉంది అని అంటున్నారు ఇపుడు అమెరికా మీద యూఏఈ దేశాలే రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మూడు రోజుల యుద్ధంలోనే ఈ దేశాలు అన్నీ అమెరికాకు దండం పెడుతున్నాయి. మా దేశాలలో ఉంటూ మా గడ్డ మీద ఉంచిన అమెరికా బేస్ లను తొలగించాలని కోరుతున్నాయి. మీ పుణ్యమాని మా మీద ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కూడా మండిపడుతున్నాయి. పైగా అమెరికా రక్షణ కవచం సైతం గురి తప్పిందని తమకు ఏ విధంగా రక్షణ లేదని కూడా ఆ దేశాలు తల్లడిల్లుతున్నాయి.
**ఇరాన్ మీదకు రావాలంటే : ఇదిలా ఉంటే ఎక్కడో ఉన్న అమెరికా ఇరాన్ మీదకు రావాలి అన్నా యుద్ధాన్ని చేయాలి అన్నా సమీప ప్రాంతాలలో ల్యాండ్ చేయాలి. అందుకే యూఏఈ దేశాలను మిత్రులుగా చేసుకుని తన బేస్ ని అక్కడ ఏర్పాటు చేసుకుంది. పైగా రక్షణ కవచం ఉందని ఏమీ జరగదని కూడా పెద్దన్న చెప్పి ఉంచారని అంటారు. కానీ ఇపుడు అంతా రివర్స్ లో సాగుతోంది. ఇరాన్ ఆయుధాల ధాటికి యూఎస్ బేసులు చెదిరిపోతున్నాయి. రక్షణ మాట పక్కన పెడితే ఇరాన్ భారీ దాడులకు యూఏఈ దేశాలు అయితే ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు : మాకేంటి ఈ పరిస్థితి అన్నది కూడా వారిలో కలుగుతోంది అని అంటున్నారు. దాంతో మా దేశాలను మా ప్రాంతాలను తమ భూ భాగాలను ఇరాన్ కి ప్రతీకార వేదికలుగా చేయవద్దు అని యూఏఈ ఇండైరెక్ట్ గానే అమెరికాని కోరడం ఇపుడు అతి పెద్ద చర్చగా మారింది. యూఏఈ సాయం లేకపోతే అమెరికాకు నిలువ నీడ ఉండదు, ఇరాన్ మీద ఎటాక్స్ కూడా బేస్ దొరకదు. మరి పెద్దన్న దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. మొత్తానికి తమ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అగ్ర నాయకత్వం హతమైనా ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అన్నది స్పష్టం అవుతోంది అంటున్నారు.
👉శవాల మధ్య రొమాన్స్ కావాలంటూ డాక్టర్ వేధింపులు..మహిళ ఆవేదన*ఆంద్రప్రదేశ్
నెల్లూరు పెద్దాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినితో డాక్టర్ సురేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని…,
శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్నారని బాధితురాలు పేర్కొంది. కులం పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై విచారణ జరగాలని బాధితురాలు కోరుతున్నారు.
👉 పల్నాడు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అంగన్వాడీలు అక్రమ అరెస్ట్ లు..
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిన్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్వాడి కార్యకర్తలు..
ఆందోళన చేస్తున్న తమ పట్ల పోలీసులు పాశవికంగా ప్రవర్తించారంటూ మండిపడుతున్న అంగన్వాడీలు..
తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున్న శిబిరంలోకి బలవంతంగా వెళ్లి వేలాది మందిని మూకుమ్మడిగా అరెస్టులు చేసిన వైనం..టెంట్‌ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లోకి ఎక్కించారంటూ అంగన్వాడీలు ఆవేదన.. పోలీసుల తీరు, ప్రభుత్వ చర్యలపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం.. ఈరోజు కూడా పిలుపునివ్వడంతో ఎక్కడికి అక్కడ అరెస్టులు.
సత్తెనపల్లి,రాజుపాలెం,ముప్పాళ్ళ, చిలకలూరిపేట,రొంపిచర్లలో అంగన్వాడీలను అరెస్టులు..
అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి లను సత్తెనపల్లి స్టేషన్ లో నిర్బంధించి పోలీసులు..
⭐ నేటికీ అందని రేషన్‌ బియ్యం…
మార్కాపురం పెద్దారవీడు దోర్నాల తర్లుపాడు మండలాల్లో కొరత ఏర్పడిన రేషన్ బియ్యం …ఒకటి నుంచి 15వ తేదీ లోపు అందించాల్సిన రేషన్ బియ్యం మూడో తారీకు వచ్చిన పేదలకు అందని బియ్యం…మార్కాపురం ఎంఎల్ఎస్ పాయింట్ నుండి 80 పైగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయని అధికారులు ..రేషన్ బియ్యం సకాలంలో సక్రమంగా అందక పేదలు తీవ్ర ఇక్కట్లు…అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు విమర్శలు

⭐రంజాన్ తౌఫా పంపిణీ ⭐

పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా కంభం మండల జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు నిత్యవసర వస్తువులతో కూడిన 120 జకాత్ కిట్లను అందజేశారు.. మన అందరి జీవితాలలో వెలుగును నింపడానికి దైవం నుంచి వచ్చిన పవిత్రమైన నెల రంజాన్ నెల. ఇస్లాం యొక్క ఐదు మూల స్తంబాలు ఈమన్, నమాజ్, రోజా,జకాత్ మరియు హజ్. అలాగే ఖురాన్ లో
*మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ,జకాత్ ను ఇస్తూ ఉండండి*. (Quran – 2 : 110)
ఈ రంజాన్ నెలలో రోజా మరియు జకాత్ విధిగా పాటించాలి. దానికి గాను జమాత్ ఏ ఇస్లామి-హింద్ ప్రతి సంవత్సరం దేశ నలుమూలల ధార్మిక మరియు శాంతి, అహింస కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా స్థానిక స్థాయిలో ప్రతి పేదవారి ఇంటికి వెయ్యి రూపాయల సరుకుల రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా జమాత్ 120 కిట్స్ పేదవారికి అందించడం జరిగింది. కార్యక్రమం లో జమాత్ ఏ ఇస్లామి హింద్ దక్షిణ మార్కాపురం జిల్లా అధ్యక్షులు గౌస్ ఖాన్,జమాత్ ఏ ఇస్లామి హింద్ స్థానిక అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, జమాత్ ఏ ఉలమా కంభం ముఫ్తీ యాసిన్ సాబ్, టీచర్ జలీల్(మండల వినియోగదారుల సంఘం కార్యదర్శి), నాయబ్ రసూల్(లెక్చరర్),రషీదుల్లా ఖాన్,జమాత్ ఏ ఇస్లామి హింద్ సభ్యులు అసిఫ్ ఖాన్,అబ్దుల్లా ఖాన్ , జైనుల్ ఆబిదీన్(కెన్యా,NRI),షంషీర్ బేగ్,చాంద్ బాషా( కోస్తాంధ్ర Organizer, SIO AP), వసీం అక్రమ్ (స్థానిక అధ్యక్షుడు, SIO కంభం),అబూ బకర్ సిద్దిఖ్ (స్థానిక కార్యదర్శి, కంభం), మరియు SIO సభ్యులు బాజిద్, రియాజ్, అకిబ్, సుఫియాన్,సాకిబ్, హఫీజ్ మరియు మస్జిద్ ఏ రహ్మమానియ జమాత్ పాల్గొన్నారు..

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్