👉👉సమయం మారి.. సమాచారం లీకై.. ఖమేనీపై ఖచ్చిత దాడి ఎలా సాధ్యమైంది?
పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేసిన తాజా పరిణామంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై జరిగిన గురిచూసి కొట్టిన దాడి వెనుక నిఘా వ్యవస్థల పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ముదురుతున్నాయి.
సమయం మారి..సమాచారం లీకై.. ఖమేనీపై ఖచ్చిత దాడి ఎలా సాధ్యమైంది?
పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేసిన తాజా పరిణామంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై జరిగిన గురిచూసి కొట్టిన దాడి వెనుక నిఘా వ్యవస్థల పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ముదురుతున్నాయి. సమయం మారడం, అంతర్గత సమాచారం లీక్ కావడం వంటి అంశాలు ఈ దాడికి కీలక కారణాలుగా మారినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలతో కలిసి ఖమేనీ కదలికలను నెలల తరబడి నిశితంగా గమనించిందని సమాచారం.
సాధారణంగా ఇలాంటి హైప్రొఫైల్ లక్ష్యాలపై దాడులు ఒక్కసారిగా జరగవు. దీని వెనుక నెలల తరబడి సేకరించిన సమాచారం, డిజిటల్ ట్రాకింగ్, మానవ నిఘా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఖమేనీ పాల్గొనబోయే కీలక సమావేశం గురించి ముందస్తుగా సమాచారం లభించినప్పటికీ అది ఏ భవనంలో జరుగుతుందో స్పష్టత లేకపోవడం ఆపరేషన్‌ను కొంతకాలం వాయిదా వేసేలా చేసింది. ఇదే సమయంలో సమావేశ సమయం అకస్మాత్తుగా మారడం.. ఆ మార్పు వివరాలు లీక్ కావడం దాడికి మార్గం సుగమం చేసిన కీలక మలుపుగా నిలిచింది.
ఇక్కడ “సమాచారం లీక్” అనే అంశం అత్యంత ప్రాధాన్యత పొందుతోంది. ఇరాన్ వంటి కఠిన భద్రతా వ్యవస్థలున్న దేశంలో ఇలాంటి సున్నిత సమాచారం బయటకు రావడం అంతర్గత భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట లోపం, లేదా అంతర్గతంగా సహకారం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అంశం ఇరాన్ పాలనా వ్యవస్థలో నమ్మకం,భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు ఈ దాడి ఆధునిక యుద్ధ వ్యూహాలలో సాంకేతికత ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది. ఉపగ్రహ నిఘా, కమ్యూనికేషన్ ట్రాకింగ్, సైబర్ ఇంటెలిజెన్స్ ఇలా అన్నీ కలిపి ఒక ఖచ్చితమైన దాడి కోసం ఉపయోగించబడ్డాయి. సమయం, ప్రదేశం ఖచ్చితంగా తెలిసిన తర్వాతే ఆపరేషన్ అమలు చేయబడినట్లు తెలుస్తోంది. ఇది సాంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా “ఇంటెలిజెన్స్ ఆధారిత లక్ష్యిత దాడులు” అనే కొత్త ధోరణిని ప్రతిబింబిస్తోంది.
అయితే ఈ ఘటనతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున పశ్చిమాసియా మొత్తం అస్థిరతలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉంది. మొత్తం మీద సమయం మార్పు, సమాచారం లీక్, నిఘా వ్యవస్థల సమన్వయం అన్ని కలిసి ఈ దాడిని సాధ్యంచేశాయి. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, గ్లోబల్ పవర్ గేమ్‌లో కొత్త దశకు సంకేతంగా మారింది. ఇకపై యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే కాకుండా సమాచారం, నిఘా, సాంకేతికతల మేళవింపుతో సాగనున్నాయనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది.
👉 అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు ప్రకాశంజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన తెలిపే ప్రజస్వామ్య హక్కులను కాలరాస్తూ మహిళలను రాత్రి పూట పోలీస్ స్టేషన్లకు పిలవటం ఘర్హనీయమన్నారు. అంగన్వాడీలు విజయవాడ రాకూడదనుకుంటే ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలన్నారు.
👉దోమల సమస్యపై ఒంగోలు నగరంలో సిపిఎం ఆందోళన..

దోమల నివారణకు ప్రతిరోజూ ఫాగింగ్ నిర్వహించాలనీ, డ్రైనేజీ కాలవల వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీ, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలనీ డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలుమునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. దోమల వ్యాప్తిని నిలువరించే దిశగా కార్పొరేషన్ చర్యలు చేపట్టాలని దోమతెరలు, మస్కిటో బ్యాట్స్ తో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు,నాయకులు దామా శ్రీనివాసులు మాట్లాడుతూ, నగరంలో అనేక ప్రాంతాల్లో దోమల విజృంభణ తీవ్రంగా పెరిగిందని, కాలుష్యంతో నిండిన డ్రైనేజీ కాలవలు దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయని అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కాపాడటం మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ అన్ని వార్డుల్లో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టాలని, డ్రైనేజీ కాలవలను శుభ్రపరచి యాంటీ లార్వా మందులు పిచికారీ చేయాలని, దోమల నివారణ చర్యలకు ప్రత్యేక నిధులు కేటాయించి క్రమం తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్షG వహిస్తే మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న కర్లపాలెం పోలీసులు*…
*చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుల వివరాలను వెల్లడిస్తున్న బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్*.
👉నగల కోసం వృద్ధురాలు హత్య.. తిరుపతి
100 గ్రాములు పైగా బంగారు నగలు కాజేసిన దుండగులు.
వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో ఘటన.
టీటీడీలో రిటైర్డ్ అయిన కె. లక్ష్మమ్మ (67).
వృద్ధురాలిని గొంతు నులుమి ఆపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన వైనం. హత్యకు గల ఆధారాలను సేకరిస్తున్న క్లూస్ టీం, వెస్ట్ పోలీసులు.. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించే పనిలో పోలీసులు..*సొంత మనవడే హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారణ.
👉రైతులకు ఊరట… ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన – ఎమ్మెల్యే ముత్తుముల*

*మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో, ఎపి మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై శనగలు,కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు*
*రైతులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా శనగలు ఒక క్వింటా – 5875 రూపాయలు గా నిర్ణయించి ఒకరోజుకి 40 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధాన్యం సేకరణ చేసిన 15 రోజుల కే ప్రభుత్వం మద్దతు ధర ను వారి ఖాతాలో జేమచేయడం జరుగుతుంది అని ప్రాంతీయ రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఏపీవో మహాలక్ష్మి,మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య,వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి,దుత్తా బాల ఈశ్వరయ్య,ముచుగుంట్ల రామ సుబ్బయ్య,మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య,రాచర్ల మాజీ జడ్పిటిసి కుప్పా రంగసాయి,మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి,కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మరియు గిద్దలూరు,కొమరోలు,రాచర్ల మండల రైతులు,నాయకులుకార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు
👉ఖమేనీపై ఖచ్చిత దాడి ఎలా సాధ్యమైంది? …👉 అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్భందాన్ని తీవ్రంగా ఖండించిన సిఐటియు నాయకులు.. 👉 దోమల సమస్యపై ఒంగోలు నగరంలో సిపిఎం ఆందోళన .. 👉అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న కర్లపాలెం పోలీసులు*..👉నగల కోసం వృద్ధురాలు హత్య.. (తిరుపతి).. ⭐శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల*
Recent Posts

