👉ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి???…
ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్టు వెల్లడి
దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు కూడా మృతి
40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్.మిడిల్ ఈస్ట్‌లో మంటలు: అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు, గల్ఫ్ దేశాల్లో అలర్ట్🔴🔴🔴
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
మిడిల్ ఈస్ట్‌లో మంటలు: అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు,గల్ఫ్ దేశాల్లో అలర్ట్…!!!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల అనంతరం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన భారీ మిస్సైల్ దాడులు ఇప్పుడు ఇజ్రాయెల్‌కే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాల వరకూ విస్తరించాయి. దీంతో ఈ ప్రాంతం అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా భారతీయులు, అందులోనూ పెద్ద సంఖ్యలో తెలుగువాళ్లు నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో అణు, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రదేశాలు లక్ష్యంగా మారాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఒకేసారి ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు జరిపినట్లు సమాచారం వెలువడింది. మొదటగా ఇజ్రాయెల్‌పై 35 నుంచి 70 వరకు క్షిపణులు సంధించినట్లు వార్తలు చెబుతున్నాయి.
ఇది అక్కడితో ఆగకుండా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు కొనసాగించింది. బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా మారింది. ఇరాన్ సంధించిన శక్తివంతమైన క్షిపణుల ధాటికి ఆ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. బహ్రెయిన్ అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ ఈ దాడులను ధృవీకరించి, ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగించింది.
ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అక్కడి అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎయిర్ బేస్‌ను యూఏఈ ఎయిర్ ఫోర్స్‌తో పాటు అమెరికా వైమానిక దళం కూడా ఉపయోగిస్తోంది. ఖతార్ రాజధాని దోహాలోని అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ కూడా లక్ష్యంగా మారింది. ఇది అమెరికా సెంట్రల్ కమాండ్‌కు కీలక కేంద్రంగా ఉంది. కొన్ని క్షిపణులను ఖతార్ రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నట్లు సమాచారం.
అదే సమయంలో కువైట్‌లోని అల్ సలెం ఎయిర్ బేస్, జోర్డాన్‌లోని మువఫాక్ అల్-సల్టీ ఎయిర్ బేస్‌లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ, పలు ప్రాంతాల్లో సాధారణ ప్రజల నివాసాలు, ప్రైవేటు ఆస్తులు కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది. దీంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం హై అలర్ట్‌లోకి వెళ్లింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వేల సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైతే తమ పౌరులను రక్షించేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.
మొత్తం మీద ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన ఘర్షణ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వ్యాపించి, పెద్ద స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి.
🔴*అమెరికా స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులు*
*ఇజ్రాయెల్–అమెరికా దాడులకు ప్రతీకారం.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి*
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ దాడులను “ముందస్తు చర్యలు”గా ఇజ్రాయెల్ పేర్కొనగా, ఇరాన్ మాత్రం దీనిని ఘోర ప్రేరేపణగా అభివర్ణించింది.
దీనికి ప్రతీకారంగా ఇరాన్.. బహరేన్ ఇజ్రాయిల్ యునైటెడ్ ఎమిరేట్స్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలు అలర్ట్‌లోకి వెళ్లి మిసైళ్లను తిప్పికొట్టినట్లు సమాచారం.
ఇరాన్ అధికారులు తమ స్పందన “వినాశకరంగా ఉంటుంది” అని హెచ్చరించడంతో అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి.
ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. పూర్తి స్థాయి యుద్ధం దిశగా పరిణామాలు వెళ్తాయా? లేక దౌత్య చర్చలతో ఉద్రిక్తతలు చల్లారుతాయా? అన్నది వేచి చూడాలి.
📢ఇజ్రాయెల్-అమెరికా దాడి.. ఇరాన్లోని పాఠశాలలో 40 మంది బాలికలు మృతి*
శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ దాడికి దిగాయి. ఇరాన్ వార్తా సంస్థ IRNA ప్రకారం, ఇజ్రాయెల్-అమెరికా జరిపిన ఈ దాడిలో మినాబ్లోని ఒక ప్రాథమిక పాఠశాలపై క్షిపణులు పడ్డాయి. ఈ ఘటనలో కనీసం 40 మంది విద్యార్థినులు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాలకు సమీపంలో 7 క్షిపణులు పడినట్లు సమాచారం••
📢 దుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయాలకు రావొద్దని, తమ విమాన సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచించారు. వేల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
📢.. బుర్జ్ ఖలీఫా ఖాళీ
తమ దేశంపై జరిపిన దాడులకు ప్రతీకారంగా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్
దుబాయ్ మీద కూడా మిసైళ్ళ వర్షం కురిపిస్తున్న తరుణంలో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించిన అధికారులు
సైరన్లు మోగించి అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. ఇప్పటికే మూతపడిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు…
🔊కాకినాడ పేలుడు ఘటనలో 23కు చేరిన మృతుల సంఖ్య…*
సామర్లకోట మండలం వేట్లంపాడు వద్ద బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు..కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం..
👉జీజీహెచ్ లో బాణా సంచా పేలిన ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం..కాకినాడ
•మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం.*
*స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్.*
*నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…బాణసంచా ఘటన చాలా దురదృష్టకరం. హదయ విచారకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు.
•కూలీ పని కోసం వెల్లి పూటగడవడం కోసం వెళ్లారు.
•జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది.
•ఇటీవలే ఒక సంఘటన జరిగింది.. దాని తర్వాత ఇది రెండో ఘటన.
•రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
•ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యతను ఫిక్స్ చేస్తాం.
*ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తున్నాం.•విచారణ అనంతరం సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటాం.
•కొందరు విచ్చలవిడి తనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు… వారిని అరెస్టే కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తాం..వాళ్ల ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తాం. ఇష్ట ప్రకారం చేయడానికి వీళ్లేదు.*
ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది
•తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆదుకుంటాం.
•చిన్న పిల్లలు ఉండి, చదువుకునేవారికి రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివిస్తాం..•ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తాం.
•చనిపోయిన వారిని తీసుకురాలేము…కానీ వారి కుటుంబాలను ఆదుకుంటాం..•మృతి చెందిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.•అనుమతులు వచ్చాక మనుషులను నియమించుకున్నారు తప్ప జాగ్రత్తలు తీసుకోలేదు..ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు..
•ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో సమాచారం తీసుకుంటాం..ఉన్న ప్రొసీజర్స్ కూడా సరిపోవడం లేదు. ఈ ప్రాంతాలంతా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూములకు అనుసంధానిస్తాం.బాణసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తామని అన్నారు .

