👉ఎప్ స్టీన్ ఫైల్స్ : రాలుతున్న దిగ్గజాల వికెట్లు…👉ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాకు ఊరట..👉 వైసీపీ గ్రూప్ వన్ అధికారులుకు అప్పుడు హైకోర్టు.. ఇప్పుడు సుప్రీం కోర్టు షాక్ లపై షాక్ లు.. 👉ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యం- సీపీఐ…👉ఏసీబీ తనిఖీలలో చిక్కిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్..

👉ఎప్ స్టీన్ ఫైల్స్ : రాలుతున్న దిగ్గజాల వికెట్లు ఈ సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూ ఈ ఎఫ్) సీఈవో బోర్జ్ బ్రెండే రాజీనామా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.ఎప్‌స్టీన్ కేసు మళ్లీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.గతంలోనే అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసిన ఈ వ్యవహారం..ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్‌తో మరోసారి ప్రభావం చూపుతోంది. ప్రముఖ వ్యాపార, విద్యా, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తుల పేర్లు బయటకు రావడం,ఆ తర్వాత రాజీనామాల పరంపర మొదలవడం.. ఇది సాధారణ పరిణామం కాదు. ప్రపంచ స్థాయి సంస్థల విశ్వసనీయత, నైతిక ప్రమాణాలపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తే పరిణామంగా ఇది మారింది. ఈ సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూ ఈ ఎఫ్) సీఈవో బోర్జ్ బ్రెండే రాజీనామా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే ప్రముఖ వేదికకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి.. ఇలాంటి ఆరోపణల నడుమ తప్పుకోవడం సంస్థపై నేరుగా ప్రభావం చూపే అంశం. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బ్రెండే పేరు ప్రస్తావించబడడం.. ఆయన ఎప్‌స్టీన్‌తో భేటీ అయినట్లు ఆధారాలు బయటపడడం ఈ పరిణామానికి కారణమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆయన రాజీనామా చేయడం.. నైతిక బాధ్యతగా భావించవచ్చు. అయితే తన రాజీనామా లేఖలో ఈ అంశాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం సందేహాలకు తావిస్తోంది.
ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా కథ కాదు. హార్వర్డ్ మాజీ అధ్యక్షుడు లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్, గోల్డ్‌మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్‌జ్కర్,డీపీ వరల్డ్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్,నార్వే అంబాసిడర్ మోనా వంటి ప్రముఖులు కూడా ఈ వివాదంతో తమ పదవులను వదులుకోవడం ..భారత ప్రధాని మోదీతో పాటు దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. వ్యాపార దిగ్గజాలు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారుల వరకు విస్తరించిన ఈ సంబంధాల నెట్‌వర్క్, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు కారణమవుతోంది.
ఈ పరిణామాల వల్ల ప్రధానంగా మూడు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటిది ప్రపంచ ఎలైట్ వర్గాల మధ్య ఉన్న సంబంధాల స్వభావం. రెండవది నైతి ఆక బాధ్యత అనే అంశం. మూడవది సంస్థల పారదర్శకతపై ఉన్న నమ్మకం. ఎవరైనా చట్టపరంగా తప్పు చేశారనే విషయం నిరూపించబడకపోయినా.. ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాయకులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం.. నేటి ప్రపంచంలో నైతిక ప్రమాణాలు ఎంత కీలకమో చూపిస్తోంది. ప్రత్యేకంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంటి సంస్థల విషయంలో ఈ అంశం మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే వేదికగా ఉన్న ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలి. అందుకే ఏ చిన్న వివాదం కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రెండే స్థానంలో తాత్కాలికంగా అలోయిస్ జ్వింగీ బాధ్యతలు చేపట్టడం, సంస్థ కొనసాగింపుకు అవసరమైన చర్యగా కనిపిస్తున్నా, దీర్ఘకాలికంగా సంస్థ ప్రతిష్టను పునరుద్ధరించడం పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో ఈ ఫైల్స్ విడుదలలో పారదర్శకత ఎంత వరకు ఉందనే ప్రశ్న కూడా లేవనెత్తబడుతోంది. దర్యాప్తు వివరాలు పూర్తిగా బయటకు రాకపోవడం.. సమాచారం గోప్యంగా ఉంచడం ఇవి మరోవైపు అనుమానాలను పెంచే అంశాలు. ప్రజలకు పూర్తి నిజాలు తెలియజేయకపోతే, ఊహాగానాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మొత్తం మీద ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ఒక వ్యక్తి లేదా కొన్ని రాజీనామాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఎలైట్ వ్యవస్థలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తున్న సంఘటనగా చూడాలి.సంస్థల విశ్వసనీయత, నాయకుల నైతిక బాధ్యత,పారదర్శకత ఈ మూడు అంశాలు భవిష్యత్తులో మరింత కఠినంగా పరీక్షించబడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గ్లోబల్ స్థాయిలో పరిపాలనా విధానాలపై, నాయకత్వ ప్రమాణాలపై కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
👉ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాకు ఊరట.
మద్యం పాలసీ కేసు నుండి అరవింద్ కేజ్రీవాల్‌ను, మనీష్ సిసోడియాను డిశ్చార్జ్ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.
ఎటువంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించారని, చార్జిషీటులో లోపాలు ఉన్నాయని సీబీఐని మందలించిన న్యాయమూర్తి.నిందితులపై అభియోగాలు మోపడం సరికాదని, వారిని కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జితేందర్ సింగ్.
👉 *కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్‌*
* దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్‌ చీట్‌ ఇవ్వడంతో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఏనాడు అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడమన్నారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని దృష్టి పెట్టారని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారని గుర్తుచేశారు.
👉ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యం- సీపీఐ…పార్టీ కార్యకర్తలే ఉద్యమాలకు బలమైన పునాదులు
* నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు*
ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలను ఉధృతం చేస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. రామాంజనేయులు స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిపిఐ జిల్లా సమితి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా సమితి సభ్యులు సోమన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కె.రామాంజనేయులు, ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ ఇటీ వల ఖమ్మం లో జరిగిన సిపిఐ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ జయప్రదం కావడం, కొత్త గూడెం లో సిపిఐ స్వంతంగా మేయర్ స్థానంను దక్కించుకోవడం సిపిఐ శ్రేణులను ఉత్తేజాన్ని నింపిందని,కమ్యూనిస్ట్ దిగ్గజం తమిళ నాడు గాంధీ గా పేరు పొందిన దివంగత కామ్రేడ్ఆర్.నల్లకన్ను జీవితం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదులను పటిష్టం చేసి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడి, దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందని నాయకులు తీవ్రంగా విమర్శించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు కనీస గౌరవం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ,ప్రజా సమస్యలను గాలికి వదిలేసి లడ్డు వంటి అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో పెరిగిపోయిన డ్రగ్స్, మెడికల్ మాఫియా కార్యకలాపాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల సందర్బంగా పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు ఇంటి స్థలం, పక్కా ఇంటికి 4లక్షల రూపాయలు ఇస్తామన్న వాగ్దానం నేటికీ అమలు చేయకుండా రాష్ట్రంలో విలువైన వేలాది ఎకరాలను భూములను,
అమరావతి రాజధాని పేరుతో మొత్తం 1లక్ష ఎకరాల భూములను సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నంద్యాల జిల్లాలో సాగు భూములను బలవంతంగా సేకరించి, పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా అప్పగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.ఇప్పటికయినా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని oడిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రఘురాం మూర్తి, రమేష్ బాబు,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సూర్య ప్రతాప్, ఎర్రిస్వామి, ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, మహానంది మండల కార్యదర్శి సామెలు, డోన్ కార్యదర్శి నారాయణ, సీనియర్ నాయకులు సంజీవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి,ఆత్మకూరు తాలూకా కార్యదర్శి ప్రతాప్, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
👉 వైసీపీ గ్రూప్ వన్ అధికారులుకు అప్పుడు హైకోర్టు.. ఇప్పుడు సుప్రీం కోర్టు షాక్ లపై షాక్ లు.. 2018 లో APPSC ద్వారా ఎంపికైన గ్రూప్ వన్ అధికారులు ను, ఫోకల్ పోస్టులునుండి తప్పించి, నాన్ పోకల్ పోస్టుల లలో నియమించమని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు కెళ్లిన ఆ అధికారులు కు, అక్కడ కూడా షాక్ ల పై షాక్ లు ఎదురయ్యాయి.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సరిగానే వున్నాయని, ప్రాధాన్యత పోస్టు లు లేకపోతే ఉద్యోగాలు చేయలేరా?? అనీ సుప్రీం కోర్టు నిలదీసింది. మీరు ఎక్కడ పనిచేసినా జీతం వస్తుంది కధా! అక్కడితో సంతృప్తి పడాలని కోర్టు పేర్కొంది.. పూర్తి వివరలలోకి వెళితే వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రూప్ వన్ అధికారుల నియామకాల కోసం నిర్వహించిన ఎంటర్వ్యూ లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందన్న విషయం లో వాస్తవాలున్నాయని, అంతకు ముందు, వారు వ్రాసిన పరీక్ష పేపర్ల ను దిద్దేంచే విధానం లో కూడా అవక తవకలు జరిగాయని కూడా బయట పడింది.. ఈ కారణాలతో గ్రూప్ వన్ నియామకాలన్నింటిని హైకోర్టు కోర్టు కొట్టే వేయగా, డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది, తాజాగా డివిజన్ బెంచ్ జరిపిన విచారణ సందర్భం గా, పోకల్ పోస్టులలో వున్న గ్రూప్ వన్ అధికారులందరిని తప్పించి, నాన్ పోకల్ పోస్టులకు, పలానా తేదీ లోపు బదిలీ చేయాలని అదేశించినప్పటికి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం తో, సియస్ గారిని స్వయం గా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించటం, ఆయన గారు హాజరవ్వటం జరిగాక, కోర్టు తీర్పును సకాలంలో అమలు చేయని సియస్ గారి పై, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా, జైలుకు కు పంపుతానని హెచ్చరిస్తూ, మరు రోజుకల్లా కోర్టు తీర్పును అమలు చేయాలంది.. జైలు శిక్ష ఎక్కడ పడుతుందో అన్న భయంతో, ఆమేఘాలపై కోర్టు ఆదేశాలను సాయిత్రం కల్లా అమలు చేయటం జరిగింది.. తాము అధికారం లోకి వస్తే ఈ గ్రూప్ ఆన్ అధికారుల ఎంపికలను రద్దు చేస్తామని, ఎన్నికల ప్రచారమో చెప్పిన, చంద్రబాబు, లోకేష్ గారులే ఆ ఎంపికలను రద్దు చేయకుండా, వారందరిని పోకల్ పోస్టులైన RDO లుగా, DSP లు గా, మున్సిపల్ కమీషనర్ లగా నియమించటం జరిగింది.. తాజాగా సుప్రీం కోర్టు కూడా, గ్రూప్ వన్ అధికారులు కు అనుకూలం గా లేదనీ, స్పష్టమవ్వటం తో, తమ ఎంపికలను ఎక్కడ హైకోర్టు రద్దు చేస్తుందో అన్న టెన్షన్ లు, వారిని పట్టుకున్నాయేమో!!??.. వైసీపీ ప్రభుత్వం హయాంలో, APPSC చైర్మన్ తో పాటు సభ్యులు, అధికారులు కొందరిని అడ్డ దారిలో ఎంపిక చేసేందుకు, చేసిన అవకతవకల తో మెరిట్ లో ఎంపికైన గ్రూప్ వన్ అధికారులు కూడా బాధలు అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.. పేపర్లు దిద్ధటం లో అవకతవకలు, నిర్వహించిన ఇంటర్వ్యూ లలో అవకతవకలు, మోసాలు జరిగాయన్నది బయట పడింది.. ఎవరెవ్వరు మెరిట్ లో సెలెక్ట్ అయ్యారు.. ఎవరెవ్వరు అడ్డధారిలో సెలెక్ట్ అయ్యారో కానీ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో సెలెక్ట్ అయినవారికి, కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు కూడా పరోక్షంగా, సహకరించినా, వారికి కోర్టు రూపంలో కాలం కలిసి రాలేదు..
👉నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద క్రేన్ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తిరుమల దర్శనం చేసుకుని కర్నూలు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తె మరణించారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
👉ఏసీబీ తనిఖీలలో చిక్కిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్….. జిల్లా కలెక్టర్ కోయ హర్ష
ఏసీబీ తనిఖీల్లో చిక్కిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణి ను సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జరుగుతున్న అవకతవకల గురించి సమాచారం అందుకున్న ఏసీబీ శాఖ ఫిబ్రవరి 24న ఆకస్మిక తనిఖీలు నిర్వహించిందని,ఆ తనీఖీలలో పట్టుబడిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే. అలీవేణి ను సస్పెండ్ చేస్తున్నామని,మండల వ్యవసాయ అధికారి పై క్రమశిక్షణ చర్యలు విచారణ ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని,సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఆ ఉత్తర్వులలో కలెక్టర్ పేర్కొన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్