👉నేనే మొదలుపెడతా -బాబు రంగంలోకి రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో కొందరు మరణిస్తే శ్రీకాకుళంలో డయేరియా కేసుల వల్ల మరికొందరు మృత్యువాత పడ్డారు. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వరుసగా రెండు ఉదంతాలు జరిగాయి. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో కొందరు మరణిస్తే శ్రీకాకుళంలో డయేరియా కేసుల వల్ల మరికొందరు మృత్యువాత పడ్డారు.ఈ విషయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు క్లాస్ తీసుకున్నారు.అధికారులు నాలుగు గోడల మధ్యన ఉండిపోతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.

⭐ గ్రౌండ్ లెవెల్ లోకి : అధికారులు గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యటిస్తే అన్ని విషయాలు అర్ధం అవుతాయని అన్నారు. అలా కాకుండా ఆఫీసులకే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలతో మమేకం కావాలని బాబు కోరారు. అలా చేసిన నాడే మంచి ఫలితాలు వస్తాయని ప్రజల సమస్యలు వారి ఇబ్బందులు కూడా అర్ధం అవుతాయని బాబు దిశా నిర్దేశం చేశారు.
⭐ఆకస్మిక తనిఖీలు : అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని బాబు కోరారు. ఈ విషయంలో రంగంలోకి అధికారులు దిగాల్సి ఉందని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇదే సరైన మార్గం అని బాబు అన్నారు. ఆ విధంగా చేయకపోతే ఎలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు అని అంటున్నారు
⭐లేకపోతే నేనే : అధికారులు కనుక ఆకస్మిక తనిఖీలకు సిద్ధం కాకపోతే తాను కచ్చితంగా జనంలోకి వెళ్ళాల్సి వస్తుందని బాబు హెచ్చరించారు. తాను కనుక జనంలోకి వెళ్తే అన్ని పరిస్థితులు చూడాల్సి ఉంటుందని అన్నారు. మొత్తం మీద బాబు అయితే అధికారులకు చురకలు అంటించడమే కాకుండా ఘాటు హెచ్చరికలు కూడా చేశారు అని అంటున్నారు.
⭐⭐ బాబు సిద్ధమేనా : ఇదిలా ఉంటే గతంలో కూడా అనేక సమావేశాలలో బాబు తాను గ్రౌండ్ లెవెల్ లో వాస్తవాలు తెలుసుకోవడానికి ఆకస్మిక పర్యటనలు చేస్తానని చెప్పారు. ఇపుడు మరో సారి బాబు నోట ఆ మాటలు వినవచ్చిన సందర్భంలో కచ్చితంగా బాబు ఏదో నాడు ముహూర్తంగా చూసుకుని ఆకస్మిక పర్యటనలు చేపడతారని అంటున్నారు. అదే కనుక జరిగితే బాబు దూకుడు వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. బాబు తొలిసారి సీఎం అయినపుడు వరసబెట్టి ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలలో ఆకస్మిక పర్యటనలు చేశారు. ఆయన క్షేత్ర స్థాయిలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. దాంతో పాలనా వ్యవస్థ గాడిలో పడింది. ప్రజలు కూడా బాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్ కి జై కొట్టారు. మళ్లీ ఇపుడు బాబు ఆకస్మిక తనిఖీలు చేస్తే కనుక ఏపీకి మేలు జరుగుతుందని పాలనాపరంగా ఉదాశీనత పోతుందని అంటున్నారు. అయితే బాబు మాత్రం అధికారులను ముందు జనంలోకి వెళ్ళమని కోరుతున్నారు. చూడాలి మరి బాబు సైతం రెడీ అవుతారేమో.
👉ప్రభుత్వ టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయ్!*
వారి జీతాలు,అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్నాయి..తగ్గించండి…ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తీసేయాలి…రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక…ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి…
వారికి పెరుగుతున్న జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయని, దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందని నివేదిక..
టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొన్న విద్యా కమిషన్ ..ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తీయాలని రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ సిఫార్సు..
👉సీఎం అనుమతితో త్వరలోనే విద్యుత్ శాఖలో నియామకాలు**ఆర్టీఎస్ఎస్ పనులతో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా**సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ*
*తుపానులను తట్టుకునేలా విశాఖలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ**ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్*
*అమరావతి:* విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం నాడు మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానం చెప్పారు. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సిబ్బంది అవసరం ఉందని మంత్రి తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, రీస్టోరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి వివిధ పద్ధతుల ద్వారా నియామకమైన 18,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రెగ్యులర్ మెయింటినెన్స్, విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతో పాటు ఓల్టేజ్ స్టెబిలిటీని పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో విద్యుత్ శాఖ ముందుకు వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 5,580 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించేకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లు విద్యుత్ శాఖకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 77 శాతం పైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే విధంగా ఏఈల నియామక ప్ర్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. లైన్ మెన్ ల నియామకం పైనా ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సభ్యులకు వివరించారు. అదే విధంగా క్షేత్ర స్థాయి విద్యుత్ అవసరాలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అందుబాటులో ఉన్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించుకుంటున్నామన్నారు.
*రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు….*
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయం విద్యుత్ సరఫరా చేయడం కోసం రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఫీడర్ లెవల్ బైఫర్కేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్లను వేరు చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా గ్రామాల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏప్రిల్ నాటికి 100 శాతం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా విశాఖపట్నం వంటి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం కలుగకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. తుపానులు, వరదలు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రాంతాలు, డిస్కంలతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు వరద ప్రభావానికి గురైనప్పుడు ఉద్యోగులందరూ రాత్రి, పగలూ కష్టపడి 24 గంటల్లోనే ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ పనురుద్ధరణ చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.
👉ఐజి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారంలో ట్విస్ట్.*
రసవత్తరంగా మారిన ఐ.జి పివి సునీల్ నాయక్ అరెస్ట్….కోర్టు ఆదేశాలను దాచిపెట్టిన ఏపీ పోలీసులు…
సెషన్స్ కోర్టు ఆదేశాలను దాచిపెట్టి…
సునీల్ నాయక్ అరెస్టు అనుమతుల కోసం స్పెషల్ మొబైల్ కోర్టుకు వెళ్లిన ఏపీ పోలీసులు.
మార్చి నెల నాలుగో తేదీ వరకు… సునీల్ నాయక్ పై ఏటువంటి చర్యలు తీసుకోవద్దని…ఈనెల 24 తేదీన పాట్నా డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు… ఆదేశాలు.
సెషన్స్ కోర్టు ఆదేశాలు దాచిపెట్టి…. నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం.మొబైల్ కోర్టులో పిటిషన్ వేసిన ఏపీ పోలీసులు…విషయాన్ని గుర్తించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ కు దేశాలు ఇవ్వని మొబైల్ కోర్ట్..న్యాయ సలహా కోసం హైకోర్టును ఆశ్రయించిన…మొబైల్ కోర్టు జడ్జి…ఏపీ పోలీసుల తీరుపై సునీల్ నాయక్ న్యాయవాదుల…. అభ్యంతరం..దేశంలో ఈ తరహా ఘటన గతంలో ఎన్నడూ చూడలేదంటూ….ఏపీ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసిన బీహార్ న్యాయవాదులు.
👉 వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర కీలకమని… రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టంచేసింది. A-1 రాజ్ కెసిరెడ్డితో కలసి కోట్ల రూపాయల లావాదేవీలు చేశారని పేర్కొంది. సిండికేట్ కు ప్రధాన వ్యూహకర్త, ఆర్థిక నియంత్రణదారుగా వ్యవహరించారని వెల్లడించింది. మద్యం కేసులో A-7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి శుక్రవారం వరకు రిమాండ్ విధించిన విజయవాడ ACB కోర్టు…. గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది.
ఏలూరు జిల్లా : 👉రైలు ప్రమాదం నుంచి మహిళను కాపాడిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్*
ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు సమీపిస్తుండగా… ఆత్మహత్యాయత్నంతో ట్రాక్‌పై దూకిన మహిళను కానిస్టేబుల్ డేవిడ్ చాకచక్యంగా కాపాడారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను పక్కకు లాగిన ఆయన ధైర్యసాహసాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విధి ముగించి స్వగ్రామానికి వెళ్లేందుకు స్టేషన్ వద్ద వేచి ఉన్న డేవిడ్‌కు రైలు సిగ్నల్ పడింది. వేగంగా ప్లాట్‌ఫాం సమీపించే రైలు దగ్గరే మహిళ ట్రాక్‌పై దూకడంతో క్షణంలో స్పందించి ఆమెను లాగి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
*అధికారుల ప్రశంసలు – మహిళకు కౌన్సిలింగ్ :*
రైల్వే అధికారులు, ప్రయాణికులు డేవిడ్ స్ఫూర్తిని ప్రశంసించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఫోన్ ద్వారా అభినందించడంతో పాటు,మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి రక్తబంధువులకు అప్పగించారు.కష్టాల్లో కుంగకుండా పోరాడాలని,ఆత్మహత్య పరిష్కారం కాదని పోలీసులు హితవు పలికారు.ఖాకీ యూనిఫామ్ వెనుక ప్రాణదాతలు ఉన్నారని డేవిడ్ నిరూపించారు.ఇలాంటి సంఘటనలు పోలీసుల సేవా మనసును ప్రతిబింబిస్తాయి.
👉 పోలీసుల అదుపులో కోడిపందాలు నిర్వహిస్తున్న14 మంది… కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్
సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.65,000/ (2 ) కోడిపుంజులు,(2) కత్తులు,6 మోటార్ సైకిళ్ళు,11 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ తెలిపారు.శనివారంవిశ్వసనీయ సమాచారంతో తెల్లవారుజామున ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో సత్తుపల్లి మండలం, గంగారం గ్రామం ప్రకాష్ నగర్ కాలనీ శివారులో గల దూదిగం కొటేశ్ కి చెందిన పామాయిల్ తోటలో తనిఖీలు నిర్వహించామన్నారు.
👉ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..!
*రూ.23 కోట్ల విలువైన 23 కిలోల విదేశీ గంజాయి సీజ్.*
*బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం.*
*ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.*
ఈ తనిఖీల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడిచేసి 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి
👉నేనే మొదలుపెడతా – రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం పై సీఎం సీరియస్…👉ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలి.. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తీసేయాలి…రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక…👉సీఎం అనుమతితో త్వరలోనే విద్యుత్ శాఖలో నియామకాలు: మంత్రి గొట్టిపాటి..👉ఐజి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారంలో ట్విస్ట్…**మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర కీలకం… రిమాండ్ రిపోర్టులో సిట్…👉ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 👉రైలు ప్రమాదం నుంచి మహిళను కాపాడిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్*..👉 పోలీసుల అదుపులో కోడిపందాలు నిర్వహిస్తున్న14 మంది( కల్లూరు)
Recent Posts

