👉అమెరికా మిత్రుల కంటే శత్రువులే ఈ టారీఫ్ తీర్పుతో ఎక్కువ లాభం… రక్షణవాద ధోరణితో అమెరికా వేసిన గోడలు బద్ధలవ్వడంతో ఇప్పుడు భారత్ వంటి దేశాల ముందు అటు అవకాశాలు, ఇటు సవాళ్లు సమానంగా నిలిచాయి. అమెరికా సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ప్రపంచ వాణిజ్య యవనికపై ఒక పెనుదుమారాన్ని సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో, అత్యవసర అధికారాలను (ఐఈఈపీఏ) అడ్డుపెట్టుకుని విధించిన ఏకపక్ష టారిఫ్‌లను కోర్టు కొట్టివేయడం కేవలం ఒక న్యాయపరమైన విజయం మాత్రమే కాదు.. ఇది ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఆర్థిక సమీకరణాలను పూర్తిగా మార్చివేసే పరిణామం. రక్షణవాద ధోరణితో అమెరికా వేసిన గోడలు బద్ధలవ్వడంతో ఇప్పుడు భారత్ వంటి దేశాల ముందు అటు అవకాశాలు, ఇటు సవాళ్లు సమానంగా నిలిచాయి. నిరంకుశత్వానికి న్యాయబద్ధమైన కళ్లెం ట్రంప్ ప్రభుత్వం అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించి విదేశీ వస్తువులపై భారీ సుంకాలను మోపడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలను పక్కన పెట్టింది. అయితే, సుప్రీంకోర్టు ఈ విధానాన్ని చట్టవిరుద్ధమని తేల్చడంతో అమెరికా ఇప్పుడు తన పాత పంథాను వీడి సెక్షన్ 122 కింద 15% సాధారణ టారిఫ్ విధానానికి రావాల్సి వచ్చింది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అమెరికా కస్టమ్స్ విభాగం పాత కోడ్‌లను రద్దు చేయడం అంతర్జాతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరట. చైనాకు ‘వరప్రసాదం’.. మిత్రులకు ‘వంచన’? ఈ తీర్పుతో అత్యంత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమెరికా ప్రధాన శత్రువుగా భావించే చైనాకు ఇది అనూహ్య లాభాన్ని చేకూర్చింది. గతంలో చైనా వస్తువులపై ఉన్న భారీ సుంకాలు తగ్గి అందరితో సమానంగా 15 శాతానికి చేరడంతో చైనా మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి. మరోవైపు అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు గతంలో 10% రాయితీని పొందేవి. ఇప్పుడు అవి కూడా 15% చెల్లించాల్సి రావడం ఆ దేశాలకు మింగుడుపడని అంశం. అంటే అమెరికా మిత్రుల కంటే శత్రువులే ఈ తీర్పుతో ఎక్కువ లాభపడ్డారు. భారత్ ముందున్న దౌత్య పరీక్ష భారతదేశానికి ఇది ఒక ‘ద్వంద్వ తల్వార్’ వంటిది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య చర్చల్లో భారత్‌కు ఇప్పుడు ‘నెగోషియేషన్ పవర్’ పెరిగింది. పాత సుంకాల భయం లేకపోవడంతో భారత్ తన ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్ రంగాల ప్రయోజనాల కోసం గట్టిగా పట్టుబట్టవచ్చు. అందుకే భారత్ తన ప్రతినిధుల పర్యటనను వాయిదా వేసి, ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే 150 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా కాంగ్రెస్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో అన్న అనిశ్చితి భారత ఎగుమతిదారులను కలవరపెడుతోంది. ప్రస్తుతానికి డాలర్ విలువ తగ్గడం, ఆసియా మార్కెట్లలో ఉత్సాహం కనిపించడం సానుకూల అంశాలే. కానీ ప్రపంచీకరణ యుగంలో ఏకపక్ష నిర్ణయాలు ఎంతటి గందరగోళాన్ని సృష్టిస్తాయో ఈ పరిణామం నిరూపించింది. భారత్ ఇప్పుడు భావోద్వేగాలకు పోకుండా ఈ 150 రోజుల వెసులుబాటును వాడుకుని శాశ్వత ప్రాతిపదికన అనుకూల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించాలి. అమెరికా అంతర్గత రాజకీయాలు.. న్యాయవ్యవస్థ పోరాటాల మధ్య, భారత ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇప్పుడు దౌత్యవేత్తల ముందున్న అసలైన సవాలు.
👉 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ లు
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్ష వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకెళ్లకుండా క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్ష పూర్తయ్యేవరకు సిబ్బంది అందరు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్దయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ 112/100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలన్నారు.
👉కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ..హనుమకొండ జిల్లా:
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటన…ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ…చికెన్ పంపకాల మధ్యలో వచ్చిన ఘర్షణ…మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి…
👉ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు*
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 75 ఫిర్యాదులు
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, తక్షణ పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు అధికారులు భరోసా ఇచ్చారు. పోలీస్ అధికారులు అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రజలకు భరోసానిచ్చే వ్యవస్థగా, న్యాయం అందించే నిబద్ధతతో పోలీసులు వ్యవహరిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ మోసాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు, మరియు ఇతర సామాజిక సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని, చట్టపరంగా సరైన దిశలో చర్యలు చేపట్టడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, గుడ్లూరు ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సంతమాగులూరు సిఐ కె.వెంకటరావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, ప్యానల్ అడ్వకేట్ బి. బాలాజీ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) ద్వారా ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు*
ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని మార్కాపురం – తర్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ పాఠశాల ఎదుట ఈ నెల 25వ తేదీన జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌జీ అదనపు ఎస్పీ S.V.రమణ మరియు ఇతర అధికారులు కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి సమీక్షించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్‌ను పరిశీలించి, బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ గారు సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, సభా ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులకు ఆదేశించారు.
అనంతరం ఈనెల 25వ తేదీన దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లిలోని ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రదేశం,వీఐపీల వాహనాల రాక, పార్కింగ్‌ ఏరియా మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు.
అనంతరం దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లిలోని ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,SSG అడిషనల్ ఎస్పీ S.V రమణ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్ బాబు గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రదేశం, చుట్టూ బారిగేట్లు ఏర్పాట్లు, వీఐపీల వాహనాల రాక, పార్కింగ్‌ ఏరియా మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు,డీఆర్డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీఎస్పీ నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు,వై.పాలెం సిఐ అజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
👉తప్పిపోయిన చిన్నారి బాలికను అరగంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన కనిగిరి పోలీసులు*
తేదీ: 23-02-2026 ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పొదిలి మండలం తలమల్ల గ్రామానికి చెందిన మితుకుల్ల మమత వారి నాలుగేళ్ల కుమార్తె మోక్షితను హాస్పిటల్‌లో చూపించేందుకు కనిగిరి టౌన్‌లోని సుబ్బారెడ్డి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. రక్త పరీక్షల నిమిత్తం మమత లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తన కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు.
దీంతో ఆమె కనిగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కనిగిరి సీఐ యు.శ్రీనివాసులు, ఎస్సై జి. సందీప్ పై అధికారులకు తెలియజేసి, సిబ్బందితో కలిసి టౌన్‌లో మరియు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ద్వారా మరియు చుట్టుపక్కల ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలించి టౌన్‌లోని మంచినీటి దొరువు వద్ద బాలికను గుర్తించారు. తమ పాపను క్షేమంగా తమ వద్దకు చేర్చిన పోలీస్ అధికారులకు పాప తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ఎప్పటికప్పుడు వారిని తమ సమక్షంలోనే ఉంచుకోవాలని తల్లిదండ్రులకు పోలీసులు హితవు పలికారు. తప్పిపోయిన పాపను త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన కనిగిరి సీఐ మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ప్రత్యేకంగా అభినందించారు.
👉ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు*
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 43 ఫిర్యాదులు
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం డి.ఎస్.పి యు.నాగరాజు, కనిగిరి డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్ మరియు పోలీస్ అధికారులు సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో నలదిక్కుల నుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పొదిలి సీఐ యం.రాజేష్ కుమార్, త్రిపురాంతకం సీఐ అస్సాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ కడప జిల్లా సింహాద్రిపురం రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐ లను అరెస్టు చేసిన ఎసిబి డిఎస్పి
[ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ *.
*గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమ పథకాల అమలు, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సవివరంగా చర్చించారునియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు*.
*మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి* *పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అనంతరం ముస్తాక్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే గారు శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు*
[ ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
ఝార్ఖండ్‌లో కుప్పకూలిన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ విమానం
రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చత్రా జిల్లాలో ఘటన
విమానంలో పైలట్లు, రోగి సహా ఏడుగురు ప్రయాణికులు
ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడి
ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాల తర్వాత, వాతావరణం అనుకూలంగా లేనందున మార్గాన్ని మళ్లించాలని పైలట్ కోరినట్లు, ఆ తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, ఒక డాక్టర్, పారామెడిక్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం ఏడుగురూ మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
[వైద్యం వికటించి చనిపోయిందని హాస్పిటల్ వద్ద తల్లి తండ్రుల ఆందోళన…
అన్నమయ్య జిల్లా గ్యారంపల్లికి చెందిన పవిత్ర (17) రేణిగుంట నారాయణ మహిళా జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.జ్వరంతో బాధపడుతున్న పవిత్రను కాలేజీ యాజమాన్యం రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేయించారు. ఇంజెక్షన్ కారణంగా వాపు, దద్దర్లు రావడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పవిత్రను తల్లిదండ్రులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పవిత్ర ప్రాణాలు విడిచింది. దాంతో ఆస్పత్రి వద్ద కుటుంబీకులు ఆందోళన చేశారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్