👉 ఇండియన్ ‘ఎప్‌స్టీన్’ ఫైల్స్: 33 మంది చిన్నారుల జీవితాలతో చెలగాటం.. దంపతులకు ఉరిశిక్ష! ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఏంటంటే వీరు తీసిన అశ్లీల వీడియోలను కేవలం భద్రపరుచుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేశారు.

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం.. చుట్టూ నాగరిక ప్రపంచం.. కానీ ఆ ఇంటి గోడల వెనుక సాగుతున్నది మాత్రం నరకప్రాయమైన క్రీడ. అమెరికాను వణికించిన ‘ఎప్‌స్టీన్’ లైంగిక కుంభకోణం తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పదేళ్లపాటు చిన్నారులను వేధిస్తూ ఆ దృశ్యాలను డార్క్ వెబ్‌లో విక్రయించిన కిరాతక దంపతులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అమాయకత్వమే పెట్టుబడిగా.. చీకటి వ్యాపారం .. బందా జిల్లాకు చెందిన రామ్ భవన్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. బయటకు విద్యావంతుడిగా కనిపించినా లోపల మాత్రం ఒక రాక్షసుడు దాగి ఉన్నాడని సీబీఐ విచారణలో తేలింది. ఇతనికి భార్య దుర్గావతి పూర్తిస్థాయిలో సహకరించేది. వీరిద్దరూ కలిసి 2010 నుండి 2020 వరకు ఒక పక్కా ప్రణాళికతో ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. 3 నుండి 16 ఏళ్ల వయస్సున్న పేద కుటుంబాలకు చెందిన బాలురకు చాక్లెట్లు, బిస్కెట్లు, మొబైల్ ఫోన్లు చూపి ఆశ చూపించి చిన్నారులను నిర్బంధించి లైంగిక దాడులు చేయడం, వాటిని వీడియోలు తీయడం విక్రయించి సొమ్ము చేసుకోవడం చేశారు. Also Read – తిరుమల లడ్డూ: ఏక సభ్య కమిషన్‌పై రచ్చ డార్క్ వెబ్ – గ్లోబల్ నెట్‌వర్క్ ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఏంటంటే వీరు తీసిన అశ్లీల వీడియోలను కేవలం భద్రపరుచుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేశారు. ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా విదేశీ కస్టమర్లకు లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. అమెరికా, యూరప్ దేశాల్లోని చైల్డ్ పోర్నోగ్రఫీ మాఫియాతో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు సీబీఐ గుర్తించింది. సీబీఐ దాడుల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో వేల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు లభ్యమయ్యాయి. పిల్లలు ఎవరైనా ఎదురు తిరిగితే వారి తల్లిదండ్రులను చంపేస్తామని, గొలుసులతో కట్టేసి బెల్టులతో కొట్టేవారని బాధితులు వాపోయారు. * న్యాయస్థానం ఆగ్రహం: అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది ఈ కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు, నిందితుల చర్యలను నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని అభివర్ణించింది. రామ్ భవన్ , అతని భార్య దుర్గావతికి మరణశిక్ష ఖరారు చేసి సంచలన తీర్పునిచ్చింది. బాధితులైన 33 మంది బాలురకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన చుట్టూ ఉన్న ప్రమాదంపై హెచ్చరిక ఈ ఘటన డిజిటల్ యుగంలో మన పిల్లల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో మరోసారి గుర్తుచేస్తోంది. కేవలం బయటి వ్యక్తులే కాదు.. మనకు తెలిసిన వారు, గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నవారు కూడా ఇటువంటి నేరాలకు పాల్పడవచ్చని ఈ ‘ఇండియన్ ఎప్‌స్టీన్’ కేసు నిరూపించింది.
👉అజిత్ పవార్ మరణం.. హెరిటేజ్ పై ఎన్సీపీ ఆరోపణలు – ఇదేం ట్విస్టు అజిత్ పవార్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని శరద్ పవార్ వర్గం తొలి నుంచి ఆరోపిస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్న రోహిత్ పవార్ కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదానికి గురైన విమానం యాజమాన్య సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయని, అందుకే వీఎస్ఆర్ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. దేశ రాజకీయాల్లో రోహిత్ పవార్ ఆరోపణలు సంచలన చర్చకు దారి తీస్తున్నాయి. అజిత్ పవార్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని శరద్ పవార్ వర్గం తొలి నుంచి ఆరోపిస్తోంది. ఈ విషయమై న్యాయవిచారణ జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయగా, అజిత్ పవార్ భార్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ కూడా సమర్థించారు. దీంతో మరింత గట్టిగా తన వాదన వినిపిస్తున్న రోహిత్ పవార్ శనివారం వరుసగా రెండో రోజు కూడా ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఎన్సీపీ (ఎస్) అధినేత శరద్ పవార్ నివాసంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోహిత్ పవార్ తన మేనమామ డిప్యూటీ సీఎం అజిత్ దాదా మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా, సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ తో వీఎస్ఆర్ వెంచర్స్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు కొన్నిపత్రాలను రోహిత్ పవార్ ప్రదర్శించారు. తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం భార్య భువనేశ్వరి, కోడలు భవనేశ్వరి ఫొటోలతోపాటు వీఎస్ఆర్ వెంచర్స్ అధినేత విక్రమ్ సింగ్ ఫొటోను కూడా చూపుతూ తీవ్ర ఆరోపణలు చేశారు రోహిత్ పవార్. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పెట్రోల్ ఉందని, పైలట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని ఆయన ఆరోపించాడు. విమాన ప్రమాదంలో కుట్ర ఉందని, కోట్ల రూపాయల బీమా కోసమే ఇదంతా చేసినట్లు ఉందని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ను అరెస్టు చేయకుండా డీజీసీఏలో కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అండదండలతోనే వీఎస్ఆర్ వెంచర్స్ యజమానులపై చర్యలు తీసుకోవడం లేదని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రామ్మోహన్ నాయుడును మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. విమానయాన సంస్థను కాపాడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఎన్సీపీ (ఎస్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపణలు జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్ వివాహానికి టీడీపీ ప్రముఖులు వెళ్లారని, ఆ సంస్థకు చెందిన విమానాన్ని ఏపీ మంత్రి ఒకరు రూ.160 కోట్లు పెట్టి కొన్నారని రోహిత్ పవార్ ఆరోపించారు. ఇవన్నీ అజిత్ పవార్ మరణంపై అనుమానాలు పెంచుతున్నాయని విపక్షం వ్యాఖ్యానిస్తోంది. ఈ విమర్శలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీ సైతం ఆ విమర్శలపై ఎటువంటి ప్రకటన చేయలేదని అంటున్నారు.
👉పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
మాచర్ల నుండి విజయవాడకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి ఓ మహిళ మృతి చెందింది.
ఈ ఘటన గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
మృతురాలు వీరిశెట్టి వైష్ణవి (29)గా గుర్తించారు.
ఆమె ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇది ఆత్మహత్యా? లేక మరే ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
👉ఏపీలో కల్తీ పాల మాయ….ఇద్దరు మృతి!*
ఆంద్రప్రదేశ్..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది.
కల్తీ పాలు తాగి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.
మృతులు చౌడేశ్వరి నగర్‌కు చెందిన కృష్ణవేణి (85), కనకరత్నం (70)గా గుర్తించారు.చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కోటికేశ్వరం గ్రామానికి చెందిన పాల వ్యాపారి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాలు తాగి అనారోగ్యానికి గురైన వారు రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
👉 పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రకాష్ నగర్ లో ఆక్స్ఫర్డ్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకొని కొట్టిన ప్రిన్సిపాల్ శివారెడ్డి …ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాకి దిగిన తల్లిదండ్రులు స్కూలు దగ్గర ఉధృత పరిస్థితి …
👉 ఇండియన్ ‘ఎప్‌స్టీన్’ ఫైల్స్: 33 మంది చిన్నారుల జీవితాలతో చెలగాటం.. 👉ఏపీలో కల్తీ పాల మాయ….ఇద్దరు మృతి!*…👉 నరసరావుపేటలో పదవ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకొని కొట్టిన ప్రిన్సిపాల్ శివారెడ్డి …ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా…ప్యాసింజర్ రైలు కిందపడి ఓ మహిళ మృతి
Recent Posts

