👉👉సంతృప్తికరంగా పని చేయకపోతే,పౌరులు ఆ ప్రతినిధిని తొలగించే చట్టపరమైన హక్కును కలిగి ఉండాలి:రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా…ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో రీకాల్ హక్కు అంశాన్ని లేవనెత్తారు, ప్రజాస్వామ్యం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం కంటే ఎక్కువగా విస్తరించాలని వాదించారు.
ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే ప్రజల అంచనాలను అందుకోలేకపోతే లేదా సంతృప్తికరంగా పని చేయకపోతే, పౌరులు తమ పదవీకాలం ముగిసేలోపు ఆ ప్రతినిధిని తొలగించే చట్టపరమైన హక్కును కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. చద్దా ప్రకారం, జవాబుదారీతనం ఎన్నికలకే పరిమితం కాకూడదు – అది ప్రతినిధి పదవీకాలం అంతటా చురుకుగా ఉండాలి.
ఈ ప్రతిపాదన చర్చకు దారితీసింది, మద్దతుదారులు దీనిని ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా చూస్తున్నారు, విమర్శకులు దాని సాధ్యాసాధ్యాలను మరియు సంభావ్య రాజకీయ దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తున్నారు.
[*తాను విధించిన సుంకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం*
ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలను విధిస్తూ నిర్ణయం…
అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు విధించడంపై ఓవల్ ఆఫీసులో సంతకం చేశానని, ఇవి ఫిబ్రవరి 24 నుండి అమలులోకి వస్తాయని తెలిపిన డోనాల్డ్ ట్రంప్
👉హోటల్ బిల్స్..70 వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఏఐ..ఎలాగంటే? మనం హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిని బిల్లు కడతాం కదా.. ఆ బిల్లుల్లోనే కొన్ని హోటల్స్ ‘మ్యాజిక్’ చేస్తున్నాయని ఐటీ శాఖ కనిపెట్టింది. మనం హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిని బిల్లు కడతాం కదా.. ఆ బిల్లుల్లోనే కొన్ని హోటల్స్ ‘మ్యాజిక్’ చేస్తున్నాయని ఐటీ శాఖ కనిపెట్టింది. అదీ మామూలుగా కాదు, ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి దేశవ్యాప్తంగా దాదాపు రూ. 70,000 కోట్ల ఆదాయాన్ని నొక్కేసినట్లు తేల్చింది. హైదరాబాద్ ఐటీ విభాగం చేపట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మన ప్లేటు మీది లాభాన్ని ఐటీ కన్ను ఎలా పట్టేసిందో ఇప్పుడు చూద్దాం.. పట్టిన గట్టి వేటు: హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దేశవ్యాప్తంగా 1.7 లక్షల రెస్టారెంట్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌పై గురి పెట్టింది. సుమారు 60 టెరాబైట్ల (TB) భారీ డేటాను ఏఐ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ సాయంతో జల్లెడ పట్టారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, మొత్తం రూ. 2.43 లక్షల కోట్ల బిల్లింగ్‌లో దాదాపు 70,000 కోట్ల రూపాయలు టర్నోవర్‌ను హోటల్స్ తక్కువ చేసి చూపాయని తేలింది. బిల్లులు వేసిన తర్వాత వాటిని సాఫ్ట్‌వేర్ నుంచి డిలీట్ చేయడం లేదా ఎడిట్ చేయడం ద్వారా ఈ భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్.. భారీగా డిలీషన్స్: ఈ డేటా విశ్లేషణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బిల్లులను డిలీట్ చేయడంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో అత్యధికంగా రూ.2,000 కోట్లు, తెలంగాణలో రూ. 1,500 కోట్లు, తమిళనాడులో రూ. 1,200 కోట్ల విలువైన బిల్లులను సిస్టమ్ నుండి మాయం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 3,734 పాన్ కార్డుల డేటాను పరిశీలించగా.. ఐటీ రిటర్న్స్‌లో చూపించిన దానికంటే రూ. 5,141 కోట్లు తక్కువ ఆదాయం చూపినట్లు ఏఐ స్పష్టంగా తేల్చి చెప్పింది. చిక్కుల్లో హోటల్ యజమానులు.. తప్పవు కఠిన చర్యలు: మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఈ ఎగవేత భారీగానే జరిగింది. ఇక బిల్లులు ఎడిట్ చేసి ఆర్డర్ సైజును తగ్గించడం ద్వారా టాక్స్ నుంచి తప్పించుకోవచ్చని హోటల్ యజమానులు భావించారు. కానీ, ఏఐ టెక్నాలజీ ప్రతి చిన్న మార్పును పసిగట్టేయడంతో ఇప్పుడు అందరూ చిక్కుల్లో పడ్డారు. త్వరలోనే ఈ అక్రమాలకు పాల్పడిన రెస్టారెంట్లకు ఐటీ నోటీసులు పంపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జరిమానాలతో పాటు కఠినమైన చర్యలు తప్పవని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇకపై ఐటీ కన్ను తప్పించుకోవడం అంత సులువు కాదని ఈ ఘటన నిరూపించింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ దొంగలు కొత్త దారులు వెతుకుతుంటే, అదే టెక్నాలజీతో ఐటీ శాఖ వారిని పట్టుకుంటోంది. ₹70,000 కోట్ల ఈ భారీ స్కామ్ బయటపడటం అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో స్పష్టతకు ముందడుగు.
👉మహా పాపం చేశావ్.. జగన్!! :లోకేష్ మహాపాపం చేశావ్.. జగన్!- అంటూ టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాపాపం చేశావ్.. జగన్!- అంటూ టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దీని వెనుక జగన్ డైరెక్షన్ ఉందన్నారు. అందుకే.. వైసీపీ సభ్యులు.. శ్రీవారి చిత్రపటాలను అవమానకర రీతిలో పట్టుకుని ఆందోళనకు దిగారని.. ఇది క్షమించరాని మహా పాపమని లోకేష్ వ్యాఖ్యానించారు. హెరిటేజ్-ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు పట్టుబడుతూ.. వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ఇచ్చారు. దీనిని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే శ్రీవారి చిత్రపటాలను తీసుకుని మండలిలోకి ప్రవేశించిన వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. చిత్రపటాలను చేతిలో పట్టుకుని.. నిరసన తెలిపారు.
ఈ ఘటనపై సభలోనే ఉన్న కూటమి మంత్రులు, సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యవహారంపైనే మంత్రి లోకేష్ కూడా స్పందించారు. కలియుగ దైవం శ్రీవారి చిత్రపటాలను అవమానించారని, ఇది క్షమించరాని మహాపాపమని అన్నారు. ”జగన్‌కు దేవుడంటే భక్తి, భయం లేవు., హిందువుల మనోభావాలంటే అస్సలు లెక్కేలేదు.” అని లోకేష్ మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి చిత్రపటాలను బూట్లు, చెప్పులతోనే పట్టుకుని ప్రదర్శించారని, సభ ముగిశాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లారని లోకేశ్ పేర్కొన్నారు. “శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!” అంటూ లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు
👉ఆయేషా మీరా కేసు క్లోజ్.. అసలు నేరస్తులు ఎవరు? న్యాయం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దీర్ఘకాలంగా విచారణ సాగిన ఈ కేసును సీబీఐ కోర్టు తాజాగా క్లోజ్ చేసింది. సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ కేసును ముగించడంతో అసలు నిందితులు ఎవరు అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. 2007 డిసెంబర్‌లో విజయవాడలోని హాస్టల్‌లో ఆయేషా మీరాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు రావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
👉 జనసేన ఎమ్మెల్యేపై తిరగబడ్డ దళితులు*
తమ భూముల జోలికి వస్తే జనసేన ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక…
యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై మండిపడ్డ దళిత సంఘాల నేతలు..స్థానిక కూటమి నేతలు దళితులను చంపుతామని బెదిరించడం దుర్మార్గం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో దళితులకు సంఘీభావం తెలిపిన దళిత సంఘాల నేతలు
దళితుల భూములను లాక్కోవడానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారు.
దళితులకు అన్యాయం చేస్తే ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంటిని ముట్టడిస్తాం.. ఎన్నికలకు ముందు దళితుల ఓట్లు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుక్కున్నారు ..అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు..
👉కనిగిరి మరియు కంభం పాఠశాలల్లో ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మరియు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు.*
మార్కాపురం జిల్లా..కనిగిరి మరియు కంభం పట్టణంలో
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు మరియు వారి రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కనిగిరి మరియు కంభం పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. కనిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పోలీసులు, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అపరిచితులతో చాటింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.అదేవిధంగా, కంభంలోని రంగరాజు హైస్కూల్లో చిన్నారి విద్యార్థులకు “గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్” సురక్షితమైన మరియు అసురక్షితమైన స్పర్శ పై అవగాహన కల్పించారు. ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఎలా స్పందించాలి, వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు ఎలా తెలియజేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100, శక్తి యాప్ మరియు దిశ యాప్ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందాలో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉సంతృప్తికరంగా పని చేయకపోతే, ఆ ప్రతినిధిని తొలగించే చట్టపరమైన హక్కును కలిగి ఉండాలి : రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా…👉మహా పాపం చేశావ్.. జగన్!! : లోకేష్…👉ఆయేషా మీరా కేసు క్లోజ్.. అసలు నేరస్తులు ఎవరు?…👉 జనసేన ఎమ్మెల్యేపై తిరగబడ్డ దళితులు*…👉హోటల్ బిల్స్..70 వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఏఐ..ఎలాగంటే?…👉కనిగిరి మరియు కంభం పాఠశాలల్లో ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మరియు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన..
Recent Posts

