👉రాహుల్‌ గాంధీ పై జీవిత కాల నిషేధం.. తీర్మానం ఆమోదిస్తే!…👉 CBI రిపోర్టుపై ఆయేషా మీరా తల్లిదండ్రుల అభ్యంతరాలు..👉ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు…👉తొర్రురు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బైట పడ్డ మోసం…👉తాండూరులో కల్తీ కోవా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడి …👉పురుగుల అన్నం పెడుతున్నారని రోడెక్కిన గురుకుల విద్యార్థినులు…👉అధిక మోతాదులో ఫెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవడం వల్ల వ్యక్తి మృతి…👉మాజీ సైనికుల ఇళ్ల స్థలాలపై నిరసన –ప్రకాశం, మార్కాపురం జిల్లా..

👉రాహుల్‌ గాంధీ పై జీవిత కాల నిషేధం.. తీర్మానం ఆమోదిస్తే!
భార‌త పార్ల‌మెంటులో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు తీర్మానాలు వ‌చ్చాయి. ఇవి కూడా ప్ర‌త్య‌క్షం గా ఎన్నికైన ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌పై లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన తీర్మానాలు.
రాహుల్‌పై జీవిత కాల నిషేధం.. తీర్మానం ఆమోదిస్తే!
భార‌త పార్ల‌మెంటులో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు తీర్మానాలు వ‌చ్చాయి. ఇవి కూడా ప్ర‌త్య‌క్షం గా ఎన్నికైన ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌పై లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన తీర్మానాలు. అంతేకాదు.. వీటి పై చ‌ర్చించేందుకు.. స‌భ్యుల ఆమోదం పొందేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ పొందిన తీర్మానాలు. ప్ర‌స్తుతం ఈ రెండు తీర్మానాల వ్య‌వ‌హారం .. జాతీయ‌స్థాయిలో రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. వ‌చ్చే నెల 9వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ రెండు తీర్మానాలు కీల‌కంగా మారానున్నాయి.
1) దేశ పార్ల‌మెంటు చ‌రిత్రలో తొలిసారి.. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసే అవిశ్వాస తీర్మానం. దీనిని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి స‌భ్యులు తాజా స‌మావేశాల్లోనే ప్ర‌వేశ పెట్టారు. దీనికి ప్ర‌ధానంగా 2 కార‌ణాలు ఉన్నాయి. 1) లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీని మాట్లాకుం డా చేస్తున్నార‌ని.. ఆయ‌న నోరు నొక్కుతున్నార‌న్న‌ది కార‌ణం. 2) ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చివ‌ర‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ లోక్‌స‌భ‌లో ప్ర‌సంగించాల్సి ఉంది.
కానీ, ఆయ‌న చివ‌రి మూడు రోజులు స‌భ‌కు రాలేదు. ఆఖ‌రు రోజు రాజ్య‌స‌భ‌లో త‌న ప్ర‌సంగాన్ని వినిపించా రు. అయితే.. లోక్‌స‌భ‌కు ప్ర‌ధాని ఎందుకు రాలేద‌న్న ప్ర‌శ్న‌కు.. స్పీక‌ర్ ఓంబిర్లా చేసిన వ్యాఖ్య‌లు మంట లు ర‌గిలించాయి. “ప్ర‌ధానికి ప్రాణ హాని ఉంది. ఆయ‌న‌పై మ‌హిళా ఎంపీలు దాడి చేస్తార‌ని మాకు సందేహంగా ఉంది. అందుకే.. ప్ర‌ధాని లోక్‌స‌భ‌కు రారు“ అని స్పీక‌ర్ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హిళా ఎంపీలు స్పీక‌ర్ తీరుపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న సభాప‌తి స్థానానికి అన‌ర్హుల‌ని.. ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి దింపేయాల‌ని డిమాండ్ చేస్తూ.. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.
2) ఇక రెండో తీర్మానం.. రాహుల్‌గాంధీపైనే కావ‌డం గ‌మ‌నార్హం. జాతీయ భ‌ద్ర‌త‌కు రాహుల్ ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తిగా మారార‌ని.. విదేశాల ద‌గ్గ‌ర భార‌త్ ప‌రువు తీస్తున్నార‌ని.. ఆరోపిస్తూ.. బీజేపీ స‌భ్యుడు రుషికాంత్ దూబే.. రాహుల్‌.. స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డంతోపాటు.. ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా జీవిత‌కాల నిషేధం విధించాల‌ని కోరుతూ.. ఓ తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు. దీనికి 50 మంది బీజేపీ స‌భ్యులు మ‌ద్ద‌తు ప‌లికారు.
ఈ తీర్మానాలు కూడా.. వ‌చ్చే నెల 9 నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యే బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చ‌కు రానున్నాయి. ఈ రెండు తీర్మానాల్లో స్పీక‌ర్ కు ఎన్డీయే స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంటుంది.. కాబ‌ట్టి ఆయ‌న ప‌ద‌వి పోదు. కానీ, ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై మాత్రం ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చించేందుకు.. ఎండ‌గ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలా జ‌ర‌గ‌డం దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఇక‌, రాహుల్ పై ప్ర‌వేశ పెట్టిన తీర్మానం క‌నుక ఆమోదం పొందితే.. ఇక‌, పార్ల‌మెంటుకు ఆయ‌న పోటీ చేసే అవ‌కాశాన్నే కోల్పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో ఈ రెండు తీర్మానాలు ఇప్పుడు జాతీయ‌స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
👉ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు…
హైదరాబాద్ వరకు వెళ్లి తిరిగి వచ్చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి…ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీ ఫాం కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి…
ఢిల్లీకి రావాలని మంగళవారం ఉదయం ఫోన్ కేసీ వేణుగోపాల్ నుండి రావడంతో జగిత్యాల నుండి హుటాహుటిన బయల్దేరి ఏమైందో ఉన్నట్లుండి హైదరాబాద్ వరకు వెళ్లి మనసు మార్చుకొని తిరిగి జగిత్యాల వచ్చేసిన జీవన్ రెడ్డి ..
👉పురుగుల అన్నం పెడుతున్నారని రోడెక్కిన గురుకుల విద్యార్థినులు..
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థినులు..
ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..
పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్…విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు
👉 CBI రిపోర్టుపై ఆయేషా మీరా తల్లిదండ్రుల అభ్యంతరాలు…కేసును స్వయంగా విచారణ జరిపించుకుంటారా అని..ఆయేషా తల్లిదండ్రులను అడిగిన న్యాయమూర్తి…తమ దగ్గర డబ్బులు లేవన్న ఆయేషా తల్లిదండ్రులు..
19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగలేదని..
కోర్టుకు తెలిపిన ఆయేషా మీరా తల్లిదండ్రులు
తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన కోర్టు
సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదు-ఆయేషా తల్లిదండ్రులు
👉 జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి..
సినిమాల పైరసీ కేసులో అరెస్టై 90 రోజులకు పైగా జైల్లో ఉన్న ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అతడికి నిన్న కోర్టు 12 షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు చేసి 90 రోజులు గడిచి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దని, ఇంటర్నెట్, VPN వినియోగించవద్దని షరతులు విధించింది••
👉తాండూరులో కల్తీ కోవా తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడి వివరాలు..
తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసింది.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. తాండూరులో జరిగిన కల్తీ కోవా దాడుల వివరాలను ఆమె వెల్లడించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్స్‌పెక్టర్ మహ్మద్ అన్వర్ పాషా నాయకత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందం తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రకాష్ విష్ణు (రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి)
మహ్మద్ సల్మాన్ (చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ నివాసి)
స్వాధీనం చేసుకున్న కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
కోవా బన్ లో 50 నుండి 100 గ్రామ్స్ కోవా పెడతారు.
మంచి కోవా 10 గ్రా 4/-
అంటే కనీసం ఒక బన్ లో 30/- పడితే..
బన్ కాస్ట్ తో కలిపి 35/- అమ్మాలి.
బల్క్ గా అమ్మినా 20కి అమ్మాలి.
మరి 10/-కి ఇస్తుంటే జనం ఆలోచించకుండా అది
కల్తీ నా.. నిజమా అని తెలుసుకోలేకపోతున్నారు.
చీప్ గా వస్తున్నాయి అని కొని తినడం ఎందుకు?
మళ్ళా కల్తీ అని సోషల్ మీడియాలో ఊదర గొట్టడం ఎందుకు?…ఆరోగ్యం మనది అయినప్పుడు.. జాగ్రత్త కూడా మనదే అవ్వాలి.అయ్యో చిరు వ్యాపారి అని సానుభూతి చూపితే పోయేది మీ ఆరోగ్యం.. ఏదైనా సరే..
మన ఆరోగ్యం… మన చేతుల్లోనే…
👉బాపట్ల…పొన్నూరు పట్టణాలు కి చెందిన ఇరు వర్గాల గ్యాంగ్ ల వార్…ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు!*
గుంటూరు జిల్లా.. పొన్నూరు…
పట్టణంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర బాపట్ల పొన్నూరు కి చెందిన ఇరువర్గాలు ఈ ఘటనలో పొన్నూరు వాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి..స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు..గాయపడిన వారిని 108 సహాయంతో గుంటూరు జిజిహెచ్కి తరలించారు..ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
👉 మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !
పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా CSIR శాస్త్రవేత్తలు సరికొత్త ‘డిజైనర్ రైస్’ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే మూడు రెట్లు అధికంగా 22% ప్రొటీన్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా(54) ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది••
👉తొర్రురు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బైట పడ్డ మోసం😱
లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా మలిచి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన అధికారులు..
చిట్టీల సెలక్షన్లో వెతికి మరీ కాంగ్రెస్ పార్టీ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు
చైర్మన్, వైస్ చైర్మన్ రెండూ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా కుట్ర చేయడానికే ఒక రోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం..
👉మాజీ సైనికుల ఇళ్ల స్థలాలపై నిరసన –ప్రకాశం మార్కాపురం జిల్లా.. జీఓ అమలు చేయాలంటూ డిమాండ్
మార్కాపురం: మాజీ సైనికులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) ప్రకారం ఇళ్ల స్థలాలు మరియు భూములు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం పట్టణంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.స్థానిక జై జవాన్ యూనియన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సీపీఐ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ నిరసనలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశానికి సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు 175 చదరపు గజాల ఇళ్ల స్థలం, అలాగే ఐదు ఎకరాల పొడి భూమి లేదా 2.5 ఎకరాల తడి భూమి కేటాయించేందుకు నిర్ణయాలు తీసుకున్నాయని గుర్తుచేశారు.
మాజీ సైనికులు గత కొన్ని నెలలుగా తహసీల్దార్, సబ్ కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్,ఎమ్మెల్యే,ఎంపీ తదితర అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదని తెలిపారు.జీఓ అమలులో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.
ఇకపై కూడా సమస్య పరిష్కారం కాకపోతే “చలో అమరావతి” అనే నినాదంతో శాంతియుతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సైనికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, వీరనారీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.
👉 అధిక మోతాదులో ఫెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవడం వల్ల వ్యక్తి మృతి… సూర్యాపేట: కూలీగా పని చేస్తున్న పుల్లూరి కనకయ్యకు గతంలో కాలు విరిగింది.సర్జరీ చేయగా.. తర్వాత కోలుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మళ్లీ అదే కాలుకు గాయమైంది. అప్పటి నుంచి భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక ఈనెల 16న అధిక మోతాదులో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. 2 గంటల తర్వాత నీరసంగా ఉందనటంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. అధిక మోతాదులో ఫెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవడం వల్లే కనకయ్య మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు వేసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్